Local· 29 Aug 2026
బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ
TG: వికారాబాద్‌లో బహుజన్ ముక్తి పార్టీ 6వ తెలంగాణ రాష్ట్ర మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న వికారాబాద్‌లోని KNR ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాసభలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థిక హక్కులు తదితర కీలక అంశాలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.