← Back to news

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న నేతలు

By saraswathi rao· 29 Aug 2026· Ambedkar Konaseema
విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న నేతలు

AP: కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాజోలు నియోజకవర్గ SC సంక్షేమ సంఘం నాయకులు పరిశీలించారు. తాత్కాలిక హాస్టల్‌లో విద్యార్థుల వసతి పరిస్థితులు, ఇబ్బందులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన 54 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నూతన హాస్టల్ భవనం నిర్మించేలా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. అప్పటివరకు విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న నేతలు

More in Local