పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

TG: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తాండూర్ నియోజకవర్గ యువతకు BMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌కు చెందిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో 90రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

