Local

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో వన్‌వేలు..వాహనదారులకు కష్టాలు
Local· 18 Aug 2026

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో వన్‌వేలు..వాహనదారులకు కష్టాలు

TG: హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో నేటి నుంచి అమల్లోకి వచ్చిన వన్‌వే నిబంధనలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వాహనదారులు, బస్సు ప్రయాణికులకు గందరగోళంగా మారింది. కొత్త మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. సాధారణంగా వెళ్లే దారులు మూసివేయడంతో గల్లీ రోడ్లలోకి వాహనాలు మళ్లుతున్నాయి. చిన్నచిన్న రహదారుల్లోనూ భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయి.

పాలిటెక్నిక్‌లను అనుసంధానం చేయొద్దని MLAకు వినతి
Local· 18 Aug 2026

పాలిటెక్నిక్‌లను అనుసంధానం చేయొద్దని MLAకు వినతి

TG: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంఎస్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆకాశ్ నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య అందిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ వ్యవస్థను పటిష్టం చేయాల్సింది పోయి పీపీపీ విధానం తీసుకురావడం ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.