Local

చెన్నారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నలుగురు అరెస్ట్
Local· 15 Aug 2026

చెన్నారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నలుగురు అరెస్ట్

AP: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో జరిగిన నవులూరి చెన్నారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన స్కార్పియోతోపాటు మూడు గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ ఆధిపత్యం విషయంలో ఉన్న విభేదాల నేపథ్యంలో చెన్నారెడ్డిని ప్లాన్ ప్రకారం కారుతో ఢీకొట్టి, కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు వాహనంలో పరారవుతుండగా దాచేపల్లి–మాచర్ల క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

తాగి స్కూల్ వ్యాన్ డ్రైవింగ్.. జస్ట్ మిస్
Local· 9 Jul 2026

తాగి స్కూల్ వ్యాన్ డ్రైవింగ్.. జస్ట్ మిస్

TG: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని మంగపేట గ్రామం నుంచి సుమారు 40మంది విద్యార్థులతో పెగడపల్లిలోని సన్‌షైన్ స్కూల్‌కు బయలుదేరిన స్కూల్ వ్యాన్, మంగపేట ఎల్లమ్మ గుడి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న సిమెంటు గద్దెను ఢీకొట్టి అంతటితో ఆగకుండా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవర్ అతిగా మద్యం సేవించి వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఫైరయ్యారు. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో స్టూడెంట్ మిస్సింగ్
Local· 5 Jul 2026

ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో స్టూడెంట్ మిస్సింగ్

TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనర్ విద్యార్థిని మిస్సింగ్ ఘటన విద్యార్థుల భద్రతపై ఆందోళనకు దారితీసింది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో అధికారులు పాఠశాలలో విస్తృతంగా విచారణ నిర్వహించారు. విద్యార్థులను పంపించే విషయంలో పాటించాల్సిన నిబంధనలను అమలు చేయకపోవడం, పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణమని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు విద్యార్థిని ఆచూకీ గుర్తించి భరోసా కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పెళ్లి అయిన నెలకే విషాదం
Local· 3 Jul 2026

పెళ్లి అయిన నెలకే విషాదం

TG: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలానికి చెందిన దినేష్(26) గురువారం స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చేపల వేటకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం దినేష్ డెడ్‌బాడీ లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దినేష్‌కు ఈ ఏడాది మే 26న లింగిగూడ గ్రామ ఉపసర్పంచ్ కవితతో మ్యారేజ్ అయింది. పెళ్లయి నెల రోజులకే ఈ విషాదం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

దోచుకుని బావిలో తోసేశాడు.. 21గంటలు బావిలోనే
Local· 3 Jul 2026

దోచుకుని బావిలో తోసేశాడు.. 21గంటలు బావిలోనే

TG: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌ కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి కూలి పని చేసుకుంటూ జీవిస్తుంది. స్థానిక లేబర్ అడ్డా వద్ద ఓ వ్యక్తి కూలి పని ఉందని ఆమెతో ఒప్పందం చేసుకున్నాడు. మార్గమధ్యలో ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలు, రూ.4వేలు లాక్కుని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. ఆమె బావిలో ఉన్న తాడును పట్టుకోగా, గమనించిన ఆగంతకుడు ఆ తాడును కూడా కోసేసి వెళ్లిపోయాడు. ఆమె ఈత కొడుతూ మోటారుకున్న పైప్‌ను పట్టుకుని రాత్రంతా ఉండిపోయారు. 21గంటలపాటు బావిలో ఉన్న ఆమెను తెల్లవారుజామున బావి యజమానికి కేకలు వినిపించగా మహిళను బయటకు తీశాడు.