Latest

కనజిగూడలో బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్ అల్వాల్ పరిధిలోని కనజిగూడ టెలికాం కాలనీ పార్కులో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేసినట్లు టెలికాం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు. మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. ఇలాంటి వేడుకలు కాలనీ వాసుల మధ్య ఐక్యత, ఆనందాన్ని పెంచుతాయని కమిటీ సభ్యులు తెలిపారు.

పండుగ వేళ ఆర్మీ జవాన్ సూసైడ్
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మినారాయణపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బోయిని మల్లేశం సోమవారం ఉదయం మృతి చెందారు. దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చిన ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో విధులు నిర్వహిస్తున్న మల్లేశం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. జవాన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఏపీలో Rare Earth కార్పొరేషన్?
AP: రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధి, వ్యాపారం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గనుల శాఖ ప్రతిపాదించింది. ప్రతిపాదిత ‘AP TIRAM’ పాలసీ ప్రకారం.. 2030 నాటికి ఈ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులు, 20 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. 2035 నాటికి పెట్టుబడులు రెట్టింపవుతాయని, 2040 నాటికి లక్ష కోట్లకు చేరడంతో పాటు 65 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. మరోవైపు, భవిష్యత్ ప్రాజెక్టుల నేపథ్యంలో APMDCని IPOకు తీసుకెళ్లే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం.

శారీల్లో మగవాళ్లు.. శాపమా?
గుజరాత్, షాపూర్ ప్రాంతంలో.. ఏటా నవరాత్రుల్లోని 8వ రాత్రి బరోట్ సమాజ మగవారు చీరలు కట్టుకొని సాధు మాతా గౌరవార్థం గర్బా చేస్తారు. ఇది దాదాపు 200 ఏళ్ల నాటి సంప్రదాయం. అప్పట్లో సాధు మాతపై కన్నేసిన పాలకుడు ఆమెను తెమ్మని సైనికుల్ని పంపాడు. దాంతో సాధు మాత ఫ్యామిలీ ఆత్మార్పణ చేసుకుంది. తర్వాత బారోట్ తెగలో పురుషుల మరణాలు పెరగడానికి సాధు మాత శాపమే కారణం అని భావించారు. మగవారు చీరలతో ప్రార్థనలు చెయ్యడంతో మరణాలు తగ్గాయని చెబుతున్నారు. ఇప్పటికీ ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు.

రూల్స్ మరిచి ముసుగు వేశారు..జనం ఫైర్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో ఎలక్షన్ కోడ్ రూల్స్ పేరుతో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి ముసుగు వేయకూడదనే రూల్స్ ఉన్నా, పంచాయతీ సిబ్బంది కావాలనే ఇలా చేశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పంచాయతీ సెక్రటరీ స్పందిస్తూ, మిగతా విగ్రహాలతో పాటు పొరపాటున వేశామని, వెంటనే తొలగిస్తామని చెప్పారు. భవిష్యత్తులో అంబేడ్కర్ విగ్రహాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సింగిల్‌గా ఉంటున్నారా? మీ ఆయుష్షు తగ్గిపోతున్నట్లే!
ఒంటరితనం, సామాజిక దూరం వల్ల మనుషుల ఆయుష్షు ఏళ్ల తరబడి తగ్గిపోతుందని తులేన్ యూనివర్సిటీ రీసెర్చ్‌లో తేలింది. ఇది ముఖ్యంగా మెంటల్ హెల్త్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒంటరితనంతో బాధపడే Men దాదాపు 5.8 ఏళ్లు, Women 3.7 ఏళ్ల ఆయువు కోల్పోతున్నట్లు గుర్తించారు. ఒంటరితనం, సోషల్ ఐసోలేషన్ ఒకటి కాదని సైంటిస్ట్‌లు చెప్తున్నారు. సమాజంతో కనెక్షన్స్ లేకపోవడాన్ని సామాజిక దూరం అంటారని, ఉన్న రిలేషన్స్ క్వాలిటీ పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒంటరితనంగా క్లారిటీ ఇచ్చారు.

కత్తిపోట్లకు గురై యువకుడు మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బొంత సంతోష్ (19) కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. సంతోష్ కుటుంబం ధర్మారంలో అద్దెకు ఉంటుండగా, అనిల్ కుటుంబం రాజారాంపల్లిలో నివసిస్తోంది. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. బతుకమ్మ వేడుకల అనంతరం సంతోష్, అనిల్‌తో గొడవ పడటడంతో అనిల్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వెల్గటూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Form-6లో మూడు మార్పులకు ప్రతిపాదన!
SIRలో ఓటు కోల్పోయిన వారు తిరిగి అప్లై చేసుకునేందుకు Form-6లో మార్పులు చేయాలని మహారాష్ట్ర CEO, ECIని కోరారు. . ప్రస్తుతం తొలిసారి ఓటరుగా దరఖాస్తు చేస్తున్నట్లు ధ్రువీకరించాల్సి రావడంతో పాత ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘New Voter’ కాలమ్ తొలగించడం, ప్రత్యామ్నాయ డిక్లరేషన్‌కు అవకాశం కల్పించడం, పాత EPIC నెంబర్ నమోదు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని ప్రతిపాదించారు. ECI ఆమోదిస్తే ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.

AP ZPTC, MPTC ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళే!
AP: ZPTC, MPTC ఎన్నికలకు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ప్రతి మండలానికీ ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 661 ZPTCలు, 9,983 MPTCలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ తర్వాత రిటర్నింగ్ అధికారులు అక్టోబర్ 21న ఎన్నికల నోటీస్ జారీ చేసి నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 23 చివరి తేదీ. 24న పరిశీలన, 25, 26న అప్పీళ్లు, 27వరకూ ఉపసంహరణకు వీలుంటుంది. నవంబర్ 3న పోలింగ్, 5న ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

ఆటపాటలతో సాయిపూర్లో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు తాండూరు పట్టణంలోని సాయిపూర్లో ఘనంగా జరిగాయి. మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్, ఫ్లోర్ లీడర్ దీపా నర్సిములు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సతీమణి ఆర్తి రెడ్డి, తల్లి ప్రమోదినితో కలిసి హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.

నర్సంపేటలో ప్రశాంతంగా ముగిసిన వేడుకలు
వరంగల్ జిల్లా నర్సంపేటలో సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది సమష్టి కృషితో వేడుకలు విజయవంతమయ్యాయి. మహిళలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు చేపట్టారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ముందస్తు ఏర్పాట్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేడుకలు ముగిశాయి.

అగ్నిప్రమాదంతో కాలిపోయిన 6 షాపులు
నంద్యాల జిల్లా దిగువ అహోబిలంలో నిన్న అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. బీగాల ఆంజనేయస్వామి గుడి వైపు ఉన్న 3 బొమ్మల షాపులు, ఒక కూల్ డ్రింక్ షాప్, 2 హోటళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. టైమ్‌కి స్పందించిన పోలీసులు సిలిండర్లను పక్కకు మార్చడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు ₹50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వెండి బతుకమ్మపై ట్రోల్స్.. PV సింధు కౌంటర్
TG: గతేడాది తెలంగాణ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బాడ్మింటన్ ప్లేయర్ PV సింధు.. వెండి బతుకమ్మ పట్టుకున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈసారి మిస్సయ్యానని చెప్పారు. ఐతే.. "పూలు పేర్చితేనే బతుకమ్మ అంటారు. మీ పైత్యాన్ని పండుగపై రుద్దకండి" అని ఓ నెటిజన్ ట్రోల్ చేశారు. దీనికి ఆమె కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోడలిని అయినందుకు అత్తగారు ప్రేమతో తనకు బహుమతిగా ఇచ్చారనీ, వెనక ఉన్న పెద్ద పూల బతుకమ్మను తానే పేర్చానని తెలిపారు.

ఆస్తి వివాదమే ఐదుగురి మృతికి కారణమా?
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో <a href="https://www.theclearcutnews.com/n/otocCeQ">ఐదుగురు కుటుంబ సభ్యుల</a> మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నూడుల్స్‌లో తండ్రి మహేశ్ విషం కలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మహేశ్, ఆయన భార్య లలిత, కుమార్తె మిష్టి, కుమారులు లడ్డు, సాక్షిత్ మరణించారు. మొదట ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చనిపోయినటట్లు అనుమానించినప్పటికీ.. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆస్తి తగాదాలే కుటుంబ మరణాలకు కారణమని పోలీసులు తెలిపారు.

19 ఏళ్ల స్టూడెంట్ దారుణ హత్య
TG : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తెల్లవారుజామున 19 ఏళ్ల బొంత సంతోష్‌ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. సంతోష్ జనగామకు చెందిన వ్యక్తి కాగా, అతని కుటుంబం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి వలస వెళ్ళింది. అక్కడ సంతోష్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మృతదేహాన్ని జగిత్యాల హాస్పిటల్‌కు తరలించారు. ఈ హత్యకు సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బైక్ రైడర్స్ ఈ తప్పులు చేయకండి!
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే బైక్ రైడర్లు జర భద్రంగా ఉండాలి. హైదరాబాద్‌లో Sunday జరిగిన యాక్సిడెంట్స్ మనల్ని అలర్ట్ చేస్తున్నాయి. అతివేగం, అలసట, అజాగ్రత్తలతో మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. బస్సులు, ట్రైన్లలో సీట్లు దొరక్క చాలామంది బైక్‌లపై జర్నీలు చేస్తున్నారు. బైకర్స్ కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. 40-50 కిలోమీటర్ల స్పీడ్ మెయింటైన్ చేస్తూ, టైర్డ్ అయినప్పుడు బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. నైట్ టైమ్ ట్రావెలింగ్ తగ్గించుకోవడం సేఫ్.

లారెన్స్ బిష్ణోయ్‌కి సల్మాన్‌తో గొడవేంటి?
1998లో రాజస్థాన్‌లో black buckని వేటాడాడు సల్మాన్ ఖాన్. బిష్ణోయ్ సొసైటీకి కృష్ణ జింక అనేది పవిత్రమైన ప్రాణి. అందువల్ల సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలని లారెన్స్ బిష్ణోయ్ డిమాండ్ చేశాడు. సల్మాన్ ఆ పని చెయ్యకపోవడంతో.. 2018 నుంచి బెదిరించడం మొదలుపెట్టాడు. 2024లో సల్మాన్ ఇంటి ముందు కాల్పులు, సల్మాన్ సపోర్టర్ల హత్యలు, తాజాగా టైగర్ ష్రాఫ్‌పై దాడి వరకు నేరాల పరంపర సాగుతోంది. సల్మాన్ సన్నిహితులను కూడా లారెన్స్ టార్గెట్ చేస్తున్నాడు.

దసరాకు పల్లెబాట పట్టిన హైదరాబాదీలు
దసరా పండుగ కోసం హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నేషనల్ హైవేస్ రద్దీగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్గేట్ వద్ద సాధారణంగా రోజుకు 38 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, నిన్న ఈ సంఖ్య 51 వేలు దాటింది. రద్దీతో వెయ్యికి పైగా ప్రత్యేక బస్సులు నడిపినా, పల్లెలకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

లారెన్స్ బిష్ణోయ్ ఎవరు?
లారెన్స్ బిష్ణోయ్ అసలు పేరు బల్కరన్ బ్రార్. 1993లో పంజాబ్‌లో పుట్టాడు. బిష్ణోయ్ గ్యాంగ్ అనే ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్‌కు ఇతను హెడ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం గుజరాత్ లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అయినప్పటికీ 700 మంది షూటర్లతో.. బయట హత్యలు, ఎక్స్టార్షన్, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి ఘోరమైన నేరాలు చేయిస్తున్నాడు. సిద్ధు మూసేవాలా, బాబా సిద్దికీ, కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యల వెనక లారెన్స్ బిషోయ్ ఉన్నాడనే ఆరోపణలున్నాయి. ఇతన్ని దావూద్ ఇబ్రహీంతో పోల్చుతున్నారు.

గ్రామంలో ప్రమాదకరంగా బావి
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం రంగసముద్రం గ్రామం నడిబొడ్డున ఉన్న బావి ప్రమాదకర స్థితిలో ఉండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో చిన్నారులు, స్థానికులకు ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే బావి పరిస్థితిని పరిశీలించి, చుట్టూ పటిష్టమైన రక్షణ గోడ నిర్మించాలని, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

సుబ్లేడ్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ గ్రామంలో శివ భక్తురాలు పోలేపొంగు సైదమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, ప్రకృతి సంప్రదాయాలు, బతుకమ్మ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా సంబరాలు జరిపారు. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కొండ్రు కవిత, టి. నాగమణి, ఉమ, కె. నాగేశ్వరి, ఉప్పమ్మ, రజిని, వినోద, రోహిణి తదితరులు పాల్గొన్నారు.