Latest

కొండా సురేఖ BJPలో చేరుతారా?
వరంగల్ ఈస్ట్ MLA కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశాక Next ఏంటనేది తాజా చర్చ. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఏ పార్టీలో చేరుతారు? 1999లో సాయంపేట కాంగ్రెస్ MLAగా గెలిచిన సురేఖను 2009లో YS మంత్రిని చేశారు. YS మృతితో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేసి YSRCPలో చేరారు. 2013లో YSRCPకి రాజీనామా చేసి 2014లో BRS(అప్పటి TRS)లో చేరారు. 2018లో TRS టిక్కెట్ రాలేదు. దీంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె చేరని పెద్ద పార్టీ BJP ఒక్కటే. ఈ క్రమంలో కొండా కపుల్ ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తిరేపుతోంది.

కాంగ్రెస్ చేసిన పనిపై ప్రజల్లో చర్చ
TG: తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకేసారి ఇద్దరు నేతలపై చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మంత్రి కొండా సురేఖతోపాటు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిని పదవుల నుంచి తొలగించింది. నిన్న ఢిల్లీలో సురేఖ మాట్లాడుతూ తాను, తన భర్త బీసీ వర్గానికి చెందినవాళ్లమని చెప్పారు. సురేఖను తొలగించడం ద్వారా బీసీలపై కాంగ్రెస్ కక్షగట్టిందనే చెడ్డపేరు రాకుండా ఉండటం కోసం అదే సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా చైర్‌పర్సన్ పదివి ఇచ్చినట్టు ప్రజల్లో చర్చ సాగుతోంది.

ఫ్లాష్ ఫ్లడ్స్ తర్వాత భూకంపం.. టిబెట్‌లో హై అలర్ట్!
భారీ వరదలతో అల్లాడుతున్న టిబెట్‌లో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. నేపాల్ బోర్డర్ ప్రాంతంలో ఇటీవల భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టించిన కొద్ది రోజులకే ఈ భూకంపం రావడంతో టెన్షన్ నెలకొంది. వరదలతో ఇప్పటికే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. తాజాగా భూకంపంతో అధికారులు అలర్ట్ అయ్యారు. భూకంపం వల్ల ఆస్తి, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు సిట్యుయేషన్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు.

ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ జి.చిన్నారెడ్డిపై వేటు
TG: తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జి.చిన్నారెడ్డిపై వేటు పడింది. ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ప్రకటించింది. చిన్నారెడ్డి స్థానంలో కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. వనపర్తి నియోజకవర్గంలో జరిగిన సభలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై, పార్టీ హైకమాండ్‌పై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.

బస్తీ దవాఖానాలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ
TG: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని బస్తీ దవాఖానాను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.శ్రీనివాస్ తనిఖీ చేశారు. దవాఖానాలో మందుల నిల్వను పరిశీలించడంతో పాటు ఓపీడీ రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, రికార్డుల నిర్వహణపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. దవాఖానాలో వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

టోల్ సొమ్ము మళ్లింపు..ఈడీ సోదాల్లో వెలుగులోకి
ఫాస్ట్‌ట్యాగ్ టోల్ వసూళ్లలో భారీ అవినీతిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సీరియస్ అయ్యింది. ఆరు రాష్ట్రాల పరిధిలోని 14 టోల్ ప్లాజాల్లో అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహించారు. అక్రమ సాఫ్ట్‌వేర్, యాప్‌ల ద్వారా నకిలీ బిల్స్ సృష్టించి, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన టోల్ సొమ్మును పక్కదారి పట్టించినట్లు తేల్చారు. ఈ దాడుల్లో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పంటల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి
TG: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సఖినవీడు గ్రామంలో కొనసాగుతున్న డిజిటల్ పంట సర్వేను ఏఓ బోయినపల్లి సాయి శివ గురువారం పరిశీలించారు. ప్రతి కమతంలో రైతులు సాగు చేసిన పంటలు, రకాలు, నీటి వనరుల వివరాలను త్వరగా, కచ్చితంగా నమోదు చేయాలని వాలంటీర్లకు సూచించారు. రైతులు సైతం సర్వేలో భాగస్వాములై అవసరమైన వివరాలను అందించాలని కోరారు. డిజిటల్ సర్వేలో నమోదైన పంట వివరాలు పంటల కొనుగోళ్లు, నష్టపరిహారం, రుణాల మంజూరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఉపయోగపడతాయని రైతులకు వివరించారు.

10 లక్షల మంది భారతీయులకు 179 ఏళ్ల నిరీక్షణ!
అమెరికాలో స్థిరపడాలని కలలు కనే భారతీయ నిపుణులకు Shocking News ఇది. Employment-Based గ్రీన్‌కార్డ్ కోసం అప్లై చేసుకున్న భారతీయుల నిరీక్షణ కాలం ఏకంగా 179 ఏళ్లకు చేరే ప్రమాదం ఉందని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’(NFAP) తన తాజా రిపోర్టులో హెచ్చరించింది. ప్రస్తుత అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు, కోటాలలో మార్పులు చేయకపోతే సుమారు 10 లక్షల మంది భారతీయులు జీవితకాలంలో గ్రీన్‌కార్డ్ పొందలేరని ఈ స్టడీ క్లారిటీ ఇచ్చింది.

విద్యార్థులకు హెచ్‌ఐవీపై అవగాహన
AP: కోనసీమ జిల్లా కొత్తపేట మండలం చప్పిడివారిపాలెం హైస్కూల్‌లో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ నిర్వహించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో దిశా ఆధ్వర్యంలో, లింక్ వర్కర్ స్కీం పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. హెచ్‌ఎం కె.అరుణశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొత్తపేట సామాజిక ఆరోగ్య కేంద్రం ఐసీటీసీ కౌన్సిలర్ జి.గీతాంజలి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే హెచ్‌ఐవీపై అవగాహన కలిగి, సరైన చికిత్స పొందితే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చన్నారు.

విద్యుత్ కోతలతో రైతుల ఇబ్బందులు: జీవన్‌రెడ్డి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాసమస్యలు, అవినీతి, అక్రమాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని, ప్రస్తుతం విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

డీ-17 కాల్వకు నీరు బంద్.. రైతుల ఆందోళన
TG: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ డీ-17 కాల్వ ద్వారా నీరు అందకపోవడంతో పెద్దాపురం, లక్ష్మాపురం, మామిళ్లపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. కాల్వలో మట్టి, పెద్ద బండరాళ్లు పేరుకుపోవడంతో నీరు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కరించలేదని ఆరోపించారు. నీరు అందకపోతే సుమారు 800 ఎకరాల పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల ఆందోళనకు మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొత్త రవీందర్‌రావు సంఘీభావం తెలిపారు.
జిల్లా కోర్టు ఏర్పాటుపై బార్ అసోసియేషన్ హర్షం
AP: మంగళగిరికి జిల్లా కోర్టు రావడం న్యాయవాదుల చిరకాల ఆకాంక్ష నెరవేరిన చారిత్రాత్మక ఘట్టమని మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు ఏర్పాటుతో న్యాయవాదులు, కక్షిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రజలకు న్యాయం మరింత చేరువయ్యేందుకు ఈ నిర్ణయం కీలక ముందడుగని పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుభవార్తతో న్యాయవాదులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

తన్వి.. 13 ఏళ్ల ఎదురుచూపుల విషాదం
గుండె, ఊపిరితితుల మార్పిడి కోసం 13 ఏళ్ళపాటు ఎదురుచూసింది రాజస్థాన్ రాష్ట్రం కోటకు చెందిన తన్వి(15). అయినా ఫలితం దక్కలేదు. పుట్టుకతోనే తన్వీకి Ventricular Septal Defect with Pulmonary Atresia వ్యాధి ఉంది. పుట్టుకతోనే వచ్చే అరుదైన గుండె లోపం ఇది. దీంతో గుండె, ఊపిరితితుల మార్పిడి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిందామె. ఆగస్టు 18న అవయవ మార్పిడి కోసం మరోసారి పరీక్షలు చేస్తుండగా తన్వి చనిపోయింది. రేపు, మాపు అంటూ AIIMS వైద్యులు ఆమె ప్రాణాలతో ఆటలాడారని తండ్రి ముఖేష్ పరియనీ తెలిపారు.

అల్లీపూర్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం
TG: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, కంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కన్వీనర్ తంగెళ్ల రమేష్, అధ్యక్షులు వాసం ప్రసాద్, సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్, ట్రెజరర్ సుధావేణి మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
AP: గుంటూరు జిల్లా మంగళగిరి బ్యాంక్ కాలనీలోని ANTMC యూపీ స్కూల్‌లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బొగి వినోద్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు ఎండీ ఆరిఫ్, పట్టణ యువత ప్రధాన కార్యదర్శి బుల్లా కోటి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండీ ఇబ్రహీం, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఏఐ టూత్ బ్రష్.. ధర రూ.47 వేలు!
దంతాలను శుభ్రం చేసేందుకు ‘ఏఐ టూత్ బ్రష్’ మార్కెట్లోకి వచ్చింది. డైసన్ సంస్థ రూపొందించిన CameraJet టూత్ బ్రష్‌లో 100కే పిక్సెల్ కెమెరా, ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని వాడారు. ఇది దంతాలను స్కాన్ చేస్తూ, క్లీన్ చేయాల్సిన ప్రాంతాలను గుర్తిస్తుంది. దీని ధర 499 డాలర్లు (సుమారు రూ.47 వేలు). ఇతర ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లతో పోలిస్తే ఇది 69 శాతం మెరుగ్గా దంతాలను శుభ్రం చేస్తుందని కంపెనీ తెలిపింది.

మంత్రి కొండా సురేఖ బర్తరఫ్
TG: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను ప్రభుత్వం కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసింది. బర్తరఫ్ లేఖను ఇప్పటికే గవర్నకు పంపినట్టు సమాచారం. లోక్‌భవన్ నుంచి మరికొద్దిసేపట్లో ఈ ఆర్డర్స్ రానున్నాయి. ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌పై చేసిన కామెంట్స్ రాష్ట్రంలో తీవ్ర వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నిన్న ఢిల్లీ వెళ్లిన సురేఖ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంపై కామెంట్స్ చేశారు. చర్యలు తీసుకోవాలంటే ముందుగా పార్టీలో చాలా మంది మీద చర్యలు తీసుకోవాలని అన్నారు.

అనపర్తి ఆసుపత్రికి కొత్త సూపరింటెండెంట్
AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా. పద్మశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ రామగురెడ్డి పదోన్నతిపై రాజమహేంద్రవరం బదిలీ కావడంతో, ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా విధులు నిర్వహిస్తున్న డా. పద్మశ్రీకి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
అవినీతి, అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం: అడ్లూరి
TG: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవినీతి, అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిస్తానన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రూ.141 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

విద్యాభవన్ ముట్టడి.. పలువురు UTF నాయకుల అరెస్ట్
AP: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని విద్యాభవన్ ముట్టడికి యూటీఎఫ్ నాయకులు భారీగా తరలివచ్చారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకుని పలువురు UTF నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

వెల్గటూర్‌లో SGF క్రీడా పోటీలు
TG: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో క్రీడా పోటీలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 10, 11, 15 తేదీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి బి. ప్రభాకర్, మండల కన్వీనర్ పి. రాజ్‌కుమార్ తెలిపారు. 10న అండర్-14, అండర్-17 బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 11న బాలురకు ఇదే క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. 15న బాల, బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో మండల పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.