← Back to news

పండుగ వేళ ఆర్మీ జవాన్ సూసైడ్

By Naresh Kumar· 20h ago· Vikarabad
పండుగ వేళ ఆర్మీ జవాన్ సూసైడ్

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మినారాయణపూర్‌ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బోయిని మల్లేశం సోమవారం ఉదయం మృతి చెందారు. దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చిన ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో విధులు నిర్వహిస్తున్న మల్లేశం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. జవాన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

More in Local