Latest
CJP టీమ్‌పై దాడి..అభిజీత్ దీప్కే రియాక్షన్
‘స్కూల్ ఠీక్ కరో’ క్యాంపెయిన్‌లో భాగంగా జైపూర్ జిల్లా రాంపురా కన్వర్పురాలోని ప్రభుత్వ పాఠశాలను వెళ్లిన CJP టీమ్‌పై కొందరు దాడి చేశారు. ఇది బీజేపీ గూండాల పనే అని టీమ్ ఆరోపించింది. వాళ్లు రాళ్లు విసిరి, కారు కిటికీలు పగలగొట్టి, కొందరు వాలంటీర్లను కొట్టారని తెలిపింది. ఆశుతోష్ రాంకాపై కూడా దాడి జరిగింది. దీనిపై అభిజీత్ దీప్కే రియాక్ట్ అయ్యారు. ‘స్కూల్ రిపేర్ పనులు మొదలుకాకపోయినా, బీజేపీ గూండాలను అరెస్టు చేయకపోయినా 48 గంటల్లో నేను జైపూర్‌కు వెళ్తాను’ అని ప్రకటించారు.

జగిత్యాల జిఎంసిలో 69 అధ్యాపక పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో 69 అధ్యాపక పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ 11, అసోసియేట్ ప్రొఫెసర్ 29, అసిస్టెంట్ ప్రొఫెసర్ 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 24న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్లను చూడాలని ప్రిన్సిపల్ తెలిపారు.
గేదెల షెడ్‌లో స్కూలా?
రాజస్థాన్‌లోని రాంపురా-కన్వర్‌పురా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ భవనం పాడవ్వడంతో, కనీస ఫెసిలిటీస్ లేకుండా గేదెల షెడ్‌లోనే క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ కండిషన్‌ను క్వశ్చన్ చేస్తూ Cockroach Janata Party (CJP) ప్రారంభించిన ‘స్కూల్ ఠీక్ కరో’ క్యాంపెయిన్ టీమ్ అక్కడికి వెళ్లగా, స్థానికులు అడ్డుకోవడంతో <a href="https://www.theclearcutnews.com/n/68iggj5">ఘర్షణ జరిగింది</a>.

రోడ్డు పక్కన వాడిన సిరంజీలు.. ప్రజలకు భయం!
TG : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో హాస్పిటల్ చెత్తను రోడ్లపై పడేస్తున్నారు. నంది విగ్రహం, వాల్గొట్ బంగ్లా దగ్గర వాడిన సిరంజీలు కనిపించడంతో ప్రజలు భయపడుతున్నారు. వాడిన సిరంజీలను పద్ధతి ప్రకారం జాగ్రత్తగా పారవేయాలి. ఇలా ఇష్టమొచ్చినట్లు బహిరంగంగా పడేస్తుండటంతో రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి వీటిని పడేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూళ్లపై Complaint ఈజీ
TG: రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి కంప్లైంట్స్ చేసేందుకు ఆన్‌లైన్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోని ప్రైవేట్ స్కూళ్లపై పేరెంట్స్, స్టూడెంట్స్ తమ ప్రాబ్లమ్స్‌ను నేరుగా <a href="https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/">ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు</a> పంపవచ్చు. ఇందుకోసం ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫిషియల్ వెబ్‌సైట్‌లో ‘<a href="https://schooledu.telangana.gov.in/PSCMS/userAuthenticateByOTP.do">ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్</a>’ను అందుబాటులోకి తెచ్చారు. ఇంటి నుంచే కంప్లైంట్ చేసే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ E. నవీన్ నికోలస్ తెలిపారు.

3 రోజుల పాటు వానలే వానలు ... జర జాగ్రత్త...
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఆఫీస్ అపరిశుభ్రం.. టాయిలెట్లు క్లీన్ చేసిన మంత్రి జూపల్లి!
TG: నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి తహసీల్దార్ ఆఫీస్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు సడన్గా విసిట్ చేశారు. ఆఫీస్‌లోని టాయిలెట్లు చాలా డర్టీగా ఉండటం, పబ్లిక్ ఫైల్స్ క్లియరెన్స్‌లో బాగా ఆలస్యం జరగడంపై అధికారులు, స్టాఫ్‌పై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా మంత్రితో పాటు కలెక్టర్ స్వయంగా టాయిలెట్లను వాటర్‌తో క్లీన్ చేశారు. పబ్లిక్ వర్క్స్ విషయంలో అస్సలు కేర్‌లెస్గా ఉండొద్దని, డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన యాక్షన్ తప్పదని ఆఫీసర్లకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు.

సాగునీటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్
TG : కామారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, రైతుల పరిహారం చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.2,800 కోట్లు విడుదల చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. అధికారులు నేరుగా పొలాల వద్దకు వెళ్ళి రైతులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందించలని అన్నారు.

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
TG : పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. మేకల వినయ్ (18) అనే కుర్రాడు ఈత కొడదామని చెరువులోకి వెళ్లి నీళ్లలో కొట్టుకుపోయాడు. సమాచారం తెలియగానే ఊరి జనం చెరువు దగ్గరికి వెళ్లి ఎంత వెతికినా వినయ్ ఆచూకీ దొరకలేదు. దాంతో వెంటనే రెస్క్యూ టీమ్‌కి తెలియజేయడంతో చెరువులో వెతుకుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నలుగురు సీఎంలతో స్క్రీన్ షేర్ చేసుకున్న జానకి
ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి నలుగురు సీఎంలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సీనియర్ నటిగా షావుకారు జానకి నిలిచారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలలో 400 పైగా సినిమాలలో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. ప్రముఖ నటి కృష్ణకుమారి ఆమె చెల్లెలే. అక్కాచెల్లెళ్లు హీరోయిన్లు అయ్యే ట్రెండ్‌ను వాళ్లే స్టార్ట్ చేశారు.
ఆరు ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు
TG: జగిత్యాల జిల్లాలో రూ.11.80 కోట్ల అంచనా వ్యయంతో ఆరు ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. ధరూర్ క్యాంప్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు.

సీనియర్ నటి షావుకారు జానకి.. ఇకలేరు
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం 1.59 గం.కు చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో మరణించినట్లు నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఆమె ఎన్నో పాత్రలు పోషించారు. 1955లో వచ్చిన ‘షావుకారు’ చిత్రంతో ఆమెకు 'షావుకారు' జానకి అనే పేరు వచ్చింది. చెన్నైలోని తేనాంపేటలో సాయంత్రం 5 గంటల నుంచి ఆమె భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.

వీధి దీపాలు వేయండి.. ప్రజల ప్రాణాలు కాపాడండి!
AP : ఆదోని మండలం కపటి గ్రామంలో వీధి దీపాలు లేక ప్రజలు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలని బీజేపీ మండల అధ్యక్షుడు ఉషారాజు మండిపడ్డారు. వర్షాకాలం కావడంతో చీకట్లో విషపురుగులు, పాముల భయం ఎక్కువైంది. రాత్రి పూట చిన్న పిల్లలు, పెద్దవాళ్లు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పాడైన వీధి దీపాలను బాగు చేయించాలి. కొత్త దీపాలు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థులకు సేఫ్ ఎడ్యుకేషన్ కావాలి: ట్రస్మా
TG: విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పాఠశాలల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ట్రస్మా కామారెడ్డి జిల్లా ప్రతినిధులు పోలీసులను కోరారు. కామారెడ్డి జిల్లాలో ట్రస్మా ప్రతినిధులు సీఐ నరహరిని కలిసి విద్యార్థుల సంక్షేమం, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందించారు. పాఠశాలలకు సమీపంలో విద్యార్థులు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెంచాలని కోరారు. విద్యార్థుల్లో సమస్యాత్మక ప్రవర్తన కనిపిస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించి సరైన మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: TSUTF
నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TSUTF) సంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అత్యంత బాధాకరమైనది, ఆందోళనకరమైనదని పేర్కొంది. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని లోపాలను సరిదిద్దుతూ, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తారని, వారి పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం గౌరవభావంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. విద్యాసంస్థల్లో భద్రతను పెంపొందించడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

రూ.2.70 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
TG: సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారం, పాశం మైలారం, చిట్కుల్ ప్రాంతాల్లో సుమారు రూ.2.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఆయా వార్డుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, ప్రజలకు రాకపోకలు, పారిశుధ్య సమస్యలు లేకుండా చూడటమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద కూరగాయల వాహనం బోల్తా
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి NH61 పై కూరగాయల వాహనం బోల్తా పడింది. మహారాష్ట్ర బిలోలి నుండి నిర్మల్ వైపు వస్తున్న ఈ వాహనం మార్గమధ్యలో బోల్తా పడటంతో కూరగాయలు రోడ్డుపై పడ్డాయి. డ్రైవర్‌తోపాటు మరొకరికి గాయాలు కాగా స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఆగిర్యాల శేఖర్(26) మృతిచెందాడు. బైక్‌పై షాద్‌నగర్ నుంచి గ్రామానికి వెళుతుండగా ఎల్ఎన్‌టి పరిశ్రమ వద్ద ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శేఖర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు అతని మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

మాసాయిపేట్‌లో బోనాల వైభవం
TG: మెదక్ జిల్లా మాసాయిపేట్ మండల కేంద్రంలో ఆదిశంభవంతులు(మాదిగ) వైభవంగా నల్ల పోచమ్మకు బోనాలు సమర్పించారు. మాసాయిపేట గ్రామ పెద్దలు మాట్లాడుతూ తరతరాల నుండి వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నామని, కులమత భేదాలు లేకుండా అందరూ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు సర్పంచ్ కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

రూ.30 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

MCF జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలి
TG: మాల కోఆర్డినేషన్ ఫోరం (MCF) జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో నిర్వహించనున్న సమావేశానికి సంబంధించి శుక్రవారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో మాల సంఘం నాయకులతో కలిసి ఎంసీఎఫ్ జేఏసీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని మాల సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.