← Back to news

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

By Adithya D· 21 Aug 2026
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఆగిర్యాల శేఖర్(26) మృతిచెందాడు. బై‌క్‌పై షాద్‌నగర్ నుంచి గ్రామానికి వెళుతుండగా ఎల్ఎన్‌టి పరిశ్రమ వద్ద ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శేఖర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు అతని మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

More in Local