← Back to news

MCF జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలి

By Ravula Purushotham· 21 Aug 2026· Dilawarpur, Dilawarpur, Nirmal
MCF జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలి

TG: మాల కోఆర్డినేషన్ ఫోరం (MCF) జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో నిర్వహించనున్న సమావేశానికి సంబంధించి శుక్రవారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో మాల సంఘం నాయకులతో కలిసి ఎంసీఎఫ్ జేఏసీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని మాల సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

More in Local