Latest

GO 97ను రద్దు చేయాల్సిందే : RS ప్రవీణ్ కుమార్
తెలంగాణలో విద్యార్థులు GO 97కి వ్యతిరేకంగా రోడ్లపై పోరాడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నారని BRS నాయకుడు RS ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పోలీసులు విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.<br>ఎవరినీ సంప్రదించకుండా స్కిల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టారని, TASK ఉండగా మళ్లీ ఇదెందుకని అడిగారు. 1982 ఎడ్యుకేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఉన్న ఈ జీవో రద్దు చేసేవరకు BRS విద్యార్థులకు అండగా పోరాడుతుందని చెప్పారు.

ఏపీ లో ఫ్రైడే భారీ వర్షాలు...!
ఏపీ స్టేట్ లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అలెర్ట్ చేసింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. ఈ రెండు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. శుక్రవారం బయటికి వెళ్లే వారు అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు.

తన Rules లీక్ చేసిన సిద్ధార్థ్! 🎬
హీరో సిద్ధార్థ్ నటించిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా సినిమాల్లో తన రూల్స్ గురించి ఆయన మాట్లాడారు. సినిమాలో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, చెడ్డ పాత్రలను హీరోగా చూపిస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే క్యారెక్టర్లు తాను ఎప్పటికీ చేయనని చెప్పారు. ఐటెం సాంగ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, మహిళలను కించపరిచేలా ఉండే పాటల్లో ఇప్పటివరకు నటించలేదని, భవిష్యత్తులో కూడా నటించనని అన్నారు.

ఉపసర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలి
TG: కామారెడ్డిలో ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలు, ఉపసర్పంచుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాజంపేట ఉపసర్పంచ్ మీర్ ఇమ్రాన్ అలీ హాజరయ్యారు. ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఉపసర్పంచులతోపాటు వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఇమ్రాన్ అలీ కోరారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చివ్వెంల మండలంలో టీచర్ల నిరసన
TG: చివ్వెంల మండల కాంప్లెక్స్ సమావేశాల సందర్భంగా ఉదయం టీ విరామ సమయంలో చివ్వెంల ZPHSలో టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 2వ PRCని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలన విడుదల చేయాలని కోరారు. CPSని రద్దు చేసి OPSను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 27న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నిరసన తెలపాలని, సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ మహాధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

రాత్రి పూట అడవులు మెరుస్తాయని తెలుసా?
మన దేశంలోని పశ్చిమ కనుమల్లో రాత్రి పూట అడవులు మెరుస్తూ కనిపిస్తాయని మీకు తెలుసా? వీటిని ‘Glowing Forests’ అంటారు. ఇందుకు కారణం మైసెనా జాతికి చెందిన బయోలుమినిసెంట్ శిలీంధ్రాలు. వర్షాకాలంలో ఇవి మెరుస్తాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి కాంతిని విడుదల చేస్తాయి. కుళ్ళిపోతున్న కలప, ఇతర సేంద్రియ పదార్థాలపై పెరుగుతాయి. ఇవి కాంతిని పంచినప్పుడు పరిసరాలు చాలా అందంగా కనిపిస్తాయి.

దళితుల స్మశాన భూమి ఆక్రమణ..
AP : వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెం గ్రామంలోని దళితుల స్మశానవాటిక ఆక్రమణకు గురైందని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సర్వే నంబర్ 280-2లోని 299 సెంట్ల స్మశాన భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించి, కంచె వేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే సర్వే చేయించి, హద్దులు నిర్ణయించి బోర్డు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.

సెప్టెంబర్ 4న గోకులాష్టమి వేడుకలు
TG: కామారెడ్డి జిల్లా భిక్కనూరు(M) జంగంపల్లిలో వచ్చే నెల 4న బ్రహ్మజ్ఞానాశ్రమం ఆధ్వర్యంలో మురళీకృష్ణ మందిరంలో గోకులాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా ప్రభాతభేరి, ధ్వజారోహణం, గోవుపూజ, గణపతిపూజ, గౌరీపూజ, నవగ్రహపూజ, పట్టు వస్త్రాల ఊరేగింపు, క్షీరాభిషేకం, హారతి, చప్పన్ భోగ్, లక్ష పుష్పార్చన, అన్నప్రసాద వితరణ, డోలారోహణం, ఉట్టికొట్టుట, భజన నిర్వహించనున్నారు.

జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి
TG: కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జీవీఎస్, డీఎస్ఎఫ్ఎ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. కళాశాలలో సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల జిల్లా అధ్యక్షులు వినోద్, జీవన్ పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళి
TG: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా HYD నగరం సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు మెట్టు సాయి, దీపక్ జాన్, ఫెరోజ్ ఖాన్ పాల్గొన్నారు.

ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై జంగ్
TG: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై జంగ్ సైరన్ మోగిస్తున్నట్లు టీజీజేఏసీ కామారెడ్డి ప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సీపీఎస్ రద్దు కోరుతూ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 27న వేలాది మంది ఉపాధ్యాయ, ఉద్యోగులతో ర్యాలీ తీస్తామన్నారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. సంఘం బాధ్యులు వెంకట్రెడ్డి, దేవేందర్, కుషాల్, అంబీర్ మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.

హామీని నెరవేర్చిన కామారెడ్డి ఎమ్మెల్యే
TG: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫొటో, వీడియో ల్యాబ్ సంక్షేమ సంఘానికి రూ.10 లక్షల విలువైన స్థలాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించి అసోసియేషన్ సభ్యులకు పత్రాన్ని అప్పగించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా ఎమ్మెల్యేనే భరించినట్టు తెలిపారు. ఎమ్మెల్యేకు అండగా ఉంటామన్నారు.. బీజేపీ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, కౌన్సిలర్లు ప్రీతి, రేవతి, శ్రీధర్, నరేందర్రెడ్డి తదితరులున్నారు.

సరంపల్లిలో వైద్య శిబిరం..ఆరోగ్యంపై అవగాహన
TG: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లిలో వైద్య శిబిరం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించినట్లు హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ త్రివిక్రమాచారి తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య ఆశా అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

రేపు ప్రైవేటు స్కూల్స్ బంద్!
TG : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసన తెలుపనున్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రేపు(శుక్రవారం) ప్రైవేటు పాఠశాలల బంద్ నిర్వహించాలని TRSM అసోసియేషన్ పిలుపునిచ్చింది. హత్యకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని Association నాయకులు డిమాండ్ చేశారు.

కంఠంరాజు కొండూరులో ఉచిత వైద్య శిబిరం
AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని కారుమంచి గోవిందయ్య ఉన్నత పాఠశాలలో ఎన్నారై సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పోలవరపు రాఘవరావు పర్యవేక్షణలో జరిగిన శిబిరంలో ఈఎన్‌టీ, దంత, స్త్రీలు, చిన్నపిల్లలు, కంటి పరీక్షలతోపాటు ఈసీజీ, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగిన శిబిరంలో 500 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

రాజీవ్ గాంధీకి నివాళులు
TG: జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీసులో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. దేశ ప్రగతికి, సాంకేతిక విప్లవానికి ఆయన వేసిన పునాదులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మసూద్, జనగామ జిల్లా సెక్రెటరీ దత్రపు నరేష్, బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు పాల్గొన్నారు.

దక్షిణాది అభివృద్ధికి సమన్వయమే కీలకం: చంద్రబాబు
AP: సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధిపై పలు ప్రతిపాదనలు చేశారు. ఏపీ–కర్ణాటక–తమిళనాడు అనుసంధానంతో బుల్లెట్ ట్రైన్ కారిడార్, ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాల ని సూచించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధా నం, విద్యుత్ గ్రిడ్ అనుసంధానం, విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై కేసు
TG: దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై మేడిపల్లి పోలీసులు హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేశారు. రాడ్లతో దాడి చేసినట్టు గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో అతనితోపాటు మరో ఐదుగురిపై 109 సెక్షన్ నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు జూబ్లీహిల్ప్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అధికారులపై ఒత్తిడి, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం వఆరోపణలు రావడంతో గతేడాది అతణ్ని ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది.

జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి
AP: విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో 'విశాలాంధ్ర' విలేకరి పి.గోవిందరావుపై చేసిన దాడిని శ్రీకాకుళం జిల్లా మందస మండల జర్నలిస్టులు ఖండించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని మండల అధ్యక్షులు వి.వి.రమణమూర్తి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరుతూ తహశీల్దార్ బలివాడ శ్రీహరికి వినతిపత్రం ఇచ్చారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను కోరారు.

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు సీపీఎం ధర్నా!
TG : ఉద్యోగాల నియామకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణలోని 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ నెరవేర్చలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యూత్ డిక్లరేషన్, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ హామీలను పక్కనబెట్టిందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
TG: మేడ్చల్-మల్యాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆధునిక భారత నిర్మాణానికి మార్గదర్శకుడిగా, దేశ అభివృద్ధిలో సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చిన దూరదృష్టి కలిగిన నాయకుడిగా రాజీవ్ గాంధీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.