Latest

ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై జంగ్
Local· 20 Aug 2026

ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై జంగ్

TG: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై జంగ్ సైరన్ మోగిస్తున్నట్లు టీజీజేఏసీ కామారెడ్డి ప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సీపీఎస్ రద్దు కోరుతూ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 27న వేలాది మంది ఉపాధ్యాయ, ఉద్యోగులతో ర్యాలీ తీస్తామన్నారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. సంఘం బాధ్యులు వెంకట్రెడ్డి, దేవేందర్, కుషాల్, అంబీర్ మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.

హామీని నెరవేర్చిన కామారెడ్డి ఎమ్మెల్యే
Local· 20 Aug 2026

హామీని నెరవేర్చిన కామారెడ్డి ఎమ్మెల్యే

TG: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫొటో, వీడియో ల్యాబ్ సంక్షేమ సంఘానికి రూ.10 లక్షల విలువైన స్థలాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించి అసోసియేషన్ సభ్యులకు పత్రాన్ని అప్పగించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా ఎమ్మెల్యేనే భరించినట్టు తెలిపారు. ఎమ్మెల్యేకు అండగా ఉంటామన్నారు.. బీజేపీ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, కౌన్సిలర్లు ప్రీతి, రేవతి, శ్రీధర్, నరేందర్రెడ్డి తదితరులున్నారు.

సరంపల్లిలో వైద్య శిబిరం..ఆరోగ్యంపై అవగాహన
Local· 20 Aug 2026

సరంపల్లిలో వైద్య శిబిరం..ఆరోగ్యంపై అవగాహన

TG: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లిలో వైద్య శిబిరం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించినట్లు హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ త్రివిక్రమాచారి తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య ఆశా అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

రేపు ప్రైవేటు స్కూల్స్ బంద్!
Local· 20 Aug 2026

రేపు ప్రైవేటు స్కూల్స్ బంద్!

TG : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసన తెలుపనున్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రేపు(శుక్రవారం) ప్రైవేటు పాఠశాలల బంద్ నిర్వహించాలని TRSM అసోసియేషన్ పిలుపునిచ్చింది. హత్యకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని Association నాయకులు డిమాండ్ చేశారు.

కంఠంరాజు కొండూరులో ఉచిత వైద్య శిబిరం
Local· 20 Aug 2026

కంఠంరాజు కొండూరులో ఉచిత వైద్య శిబిరం

AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని కారుమంచి గోవిందయ్య ఉన్నత పాఠశాలలో ఎన్నారై సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పోలవరపు రాఘవరావు పర్యవేక్షణలో జరిగిన శిబిరంలో ఈఎన్‌టీ, దంత, స్త్రీలు, చిన్నపిల్లలు, కంటి పరీక్షలతోపాటు ఈసీజీ, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగిన శిబిరంలో 500 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

రాజీవ్ గాంధీకి నివాళులు
Local· 20 Aug 2026

రాజీవ్ గాంధీకి నివాళులు

TG: జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీసులో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. దేశ ప్రగతికి, సాంకేతిక విప్లవానికి ఆయన వేసిన పునాదులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మసూద్, జనగామ జిల్లా సెక్రెటరీ దత్రపు నరేష్, బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు పాల్గొన్నారు.

దక్షిణాది అభివృద్ధికి సమన్వయమే కీలకం: చంద్రబాబు
Local· 20 Aug 2026

దక్షిణాది అభివృద్ధికి సమన్వయమే కీలకం: చంద్రబాబు

AP: సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధిపై పలు ప్రతిపాదనలు చేశారు. ఏపీ–కర్ణాటక–తమిళనాడు అనుసంధానంతో బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌, ఉమ్మడి లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాల ని సూచించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధా నం, విద్యుత్‌ గ్రిడ్‌ అనుసంధానం, విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై కేసు
TG· 20 Aug 2026

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై కేసు

TG: దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై మేడిపల్లి పోలీసులు హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేశారు. రాడ్లతో దాడి చేసినట్టు గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో అతనితోపాటు మరో ఐదుగురిపై 109 సెక్షన్ నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు జూబ్లీహిల్ప్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అధికారులపై ఒత్తిడి, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం వఆరోపణలు రావడంతో గతేడాది అతణ్ని ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది.

జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి
Local· 20 Aug 2026

జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి

AP: విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో 'విశాలాంధ్ర' విలేకరి పి.గోవిందరావుపై చేసిన దాడిని శ్రీకాకుళం జిల్లా మందస మండల జర్నలిస్టులు ఖండించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని మండల అధ్యక్షులు వి.వి.రమణమూర్తి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరుతూ తహశీల్దార్ బలివాడ శ్రీహరికి వినతిపత్రం ఇచ్చారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను కోరారు.

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు సీపీఎం ధర్నా!
Local· 20 Aug 2026

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు సీపీఎం ధర్నా!

TG : ఉద్యోగాల నియామకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణలోని 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ నెరవేర్చలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యూత్ డిక్లరేషన్, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ హామీలను పక్కనబెట్టిందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
Local· 20 Aug 2026

రాజీవ్ గాంధీకి ఘన నివాళులు

TG: మేడ్చల్-మల్యాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆధునిక భారత నిర్మాణానికి మార్గదర్శకుడిగా, దేశ అభివృద్ధిలో సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చిన దూరదృష్టి కలిగిన నాయకుడిగా రాజీవ్ గాంధీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

PCCకి కొండా సురేఖ వివరణ.. నోటీసుపై సురేఖ ఫైర్‌!
TG· 20 Aug 2026

PCCకి కొండా సురేఖ వివరణ.. నోటీసుపై సురేఖ ఫైర్‌!

TG: PCC క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ ఆమె పర్సనల్ ఒపీనియన్ అని తెలిపారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులుగా చేయడం సరికాదన్నారు. తనను బాధ్యురాలిని చేయడం న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై తనకు పూర్తి గౌరవం ఉందన్నారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఇన్‌వాల్వ్‌మెంట్ లేదని స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన నోటీసును విత్‌డ్రా చేసుకోవాలని PCC క్రమశిక్షణ కమిటీని కోరారు.

ANUలో మెహందీ డిజైనింగ్ శిక్షణ ప్రారంభం
Local· 20 Aug 2026

ANUలో మెహందీ డిజైనింగ్ శిక్షణ ప్రారంభం

AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకేష నల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో CSR, EXCEL-R కలిసి నిర్వహిస్తున్న ఐదు రోజుల బ్యూటిష‌న్, మెహందీ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య ఆర్. శివరాం ప్రసాద్ ప్రారంభించారు. సమాజంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్ డైరెక్టర్ ఆచార్య బి. బబిత, డాక్టర్ ఎం. వెంకటరమణ, శిక్షకులు స్వప్న, శ్యామల పాల్గొన్నారు.

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటి ఎదుట విద్యార్థుల ధర్నా
Local· 20 Aug 2026

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటి ఎదుట విద్యార్థుల ధర్నా

TG: పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజీవ్ గాంధీ జయంతి..ఘన నివాళులు
Local· 20 Aug 2026

రాజీవ్ గాంధీ జయంతి..ఘన నివాళులు

TG: యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని, రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను స్మరించుకున్నారు.

హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
Local· 20 Aug 2026

హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి

AP: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్‌ చార్జీలను నెలకు రూ.3 వేలకు పెంచాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్‌ డిమాండ్ చేశారు. పలాస ఆర్డీఓ అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు ప్రస్తుత మెస్‌ చార్జీలు సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం పెంపు సరిపోదని, 49 శాతం పెంచాలని కోరారు. పెండింగ్‌ కాస్మోటిక్‌ చార్జీలు వెంటనే విడుదల చేయాలని, గిరిజన పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లలో రెగ్యులర్‌ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

ట్రంప్‌కి బిగ్ షాక్! మిసైల్స్‌తో కిమ్ వార్నింగ్!
International· 20 Aug 2026

ట్రంప్‌కి బిగ్ షాక్! మిసైల్స్‌తో కిమ్ వార్నింగ్!

డోనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలకు యత్నిస్తున్న వేళ కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం సాయంత్రం ఉత్తరకొరియా తన రాజధాని ప్రాంతం నుండి తూర్పు సముద్రం వైపు సుమారు 10 స్వల్పశ్రేణి బాసిలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ట్రంప్ చొరవతో అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త మిలిటరీ డ్రిల్స్‌ను కుదించినప్పటికీ, ఉత్తర కొరియా ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. కాగా ఉత్తర కొరియా వద్ద 57అణు ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ అనగా, పియోంగ్యాంగ్ వద్ద 120 వరకు అణు వార్‌హెడ్స్ ఉన్నాయని దక్షిణ కొరియా వెల్లడించింది.

సిద్దాపూర్ డంపు యార్డు మాకొద్దు
Local· 20 Aug 2026

సిద్దాపూర్ డంపు యార్డు మాకొద్దు

TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో డంపుయార్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 641 ను వెంటనే రద్దు చేయాలని షాద్ నగర్, కొత్తూరు మండలాల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ డంపు యార్డు ఏర్పాటయితే ఇక్కడ 10 గ్రామాలు ఇబ్బందులకు గురవుతాయని, భూముల విలువలు పడిపోతాయని తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరుతున్నారు.

30న పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలు
Local· 20 Aug 2026

30న పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలు

TG: ఈనెల 30న జరగబోయే పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహాత్మా జ్యోతిబాఫూలె వారధి కమిటీ అసెంబ్లీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యాంకె పద్మ కోరారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మందిపల్ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో పర్యావరణ పరిరక్షణ ప్రచార పత్రం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.

జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
Local· 20 Aug 2026

జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

TG : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ధరూర్ క్యాంప్‌లో కొత్త ఆఫీస్ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటలకు పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలవనున్నారు. సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో ఇళ్ల నిర్మాణం, రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహిస్తారు.

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో హాట్‌ హాట్‌గా దక్షిణాది అంశాలు!
Current Affairs· 20 Aug 2026

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో హాట్‌ హాట్‌గా దక్షిణాది అంశాలు!

తమిళనాడులో జరిగిన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. కేంద్ర హోం మినిస్టర్ అమిత్‌ షా సమక్షంలో ఈ భేటీ నిర్వహించారు. డీలిమిటేషన్‌, సౌత్ ఇండియా పొలిటికల్ రెప్రజెంటేషన్, NEET, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ గురించి ప్రధానంగా చర్చకు వచ్చాయి. AP సీఎం చంద్రబాబు గోదావరి-కావేరీ కనెక్టివిటీతో 500 TMCకి పైగా నీటిని మళ్లించే ప్రపోజల్‌ను ప్రస్తావించారు. 2047 నాటికి సౌత్ ఇండియా $10 ట్రిలియన్‌ ఎకానమీగా ఎదగగలదని అన్నారు.