Latest

రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
TG: మేడ్చల్-మల్యాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆధునిక భారత నిర్మాణానికి మార్గదర్శకుడిగా, దేశ అభివృద్ధిలో సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చిన దూరదృష్టి కలిగిన నాయకుడిగా రాజీవ్ గాంధీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

PCCకి కొండా సురేఖ వివరణ.. నోటీసుపై సురేఖ ఫైర్!
TG: PCC క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ ఆమె పర్సనల్ ఒపీనియన్ అని తెలిపారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులుగా చేయడం సరికాదన్నారు. తనను బాధ్యురాలిని చేయడం న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై తనకు పూర్తి గౌరవం ఉందన్నారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఇన్‌వాల్వ్‌మెంట్ లేదని స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన నోటీసును విత్‌డ్రా చేసుకోవాలని PCC క్రమశిక్షణ కమిటీని కోరారు.

ANUలో మెహందీ డిజైనింగ్ శిక్షణ ప్రారంభం
AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకేష నల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో CSR, EXCEL-R కలిసి నిర్వహిస్తున్న ఐదు రోజుల బ్యూటిషన్, మెహందీ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య ఆర్. శివరాం ప్రసాద్ ప్రారంభించారు. సమాజంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్ డైరెక్టర్ ఆచార్య బి. బబిత, డాక్టర్ ఎం. వెంకటరమణ, శిక్షకులు స్వప్న, శ్యామల పాల్గొన్నారు.

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటి ఎదుట విద్యార్థుల ధర్నా
TG: పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజీవ్ గాంధీ జయంతి..ఘన నివాళులు
TG: యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని, రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను స్మరించుకున్నారు.

హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
AP: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.3 వేలకు పెంచాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్ డిమాండ్ చేశారు. పలాస ఆర్డీఓ అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు ప్రస్తుత మెస్ చార్జీలు సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం పెంపు సరిపోదని, 49 శాతం పెంచాలని కోరారు. పెండింగ్ కాస్మోటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని, గిరిజన పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

ట్రంప్‌కి బిగ్ షాక్! మిసైల్స్‌తో కిమ్ వార్నింగ్!
డోనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలకు యత్నిస్తున్న వేళ కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం సాయంత్రం ఉత్తరకొరియా తన రాజధాని ప్రాంతం నుండి తూర్పు సముద్రం వైపు సుమారు 10 స్వల్పశ్రేణి బాసిలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ట్రంప్ చొరవతో అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త మిలిటరీ డ్రిల్స్‌ను కుదించినప్పటికీ, ఉత్తర కొరియా ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. కాగా ఉత్తర కొరియా వద్ద 57అణు ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ అనగా, పియోంగ్యాంగ్ వద్ద 120 వరకు అణు వార్‌హెడ్స్ ఉన్నాయని దక్షిణ కొరియా వెల్లడించింది.

సిద్దాపూర్ డంపు యార్డు మాకొద్దు
TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో డంపుయార్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 641 ను వెంటనే రద్దు చేయాలని షాద్ నగర్, కొత్తూరు మండలాల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ డంపు యార్డు ఏర్పాటయితే ఇక్కడ 10 గ్రామాలు ఇబ్బందులకు గురవుతాయని, భూముల విలువలు పడిపోతాయని తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరుతున్నారు.

30న పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలు
TG: ఈనెల 30న జరగబోయే పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహాత్మా జ్యోతిబాఫూలె వారధి కమిటీ అసెంబ్లీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యాంకె పద్మ కోరారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మందిపల్ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో పర్యావరణ పరిరక్షణ ప్రచార పత్రం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.

జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
TG : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ధరూర్ క్యాంప్‌లో కొత్త ఆఫీస్ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటలకు పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలవనున్నారు. సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో ఇళ్ల నిర్మాణం, రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహిస్తారు.

సదరన్ జోనల్ కౌన్సిల్‌లో హాట్ హాట్‌గా దక్షిణాది అంశాలు!
తమిళనాడులో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా సమక్షంలో ఈ భేటీ నిర్వహించారు. డీలిమిటేషన్, సౌత్ ఇండియా పొలిటికల్ రెప్రజెంటేషన్, NEET, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ గురించి ప్రధానంగా చర్చకు వచ్చాయి. AP సీఎం చంద్రబాబు గోదావరి-కావేరీ కనెక్టివిటీతో 500 TMCకి పైగా నీటిని మళ్లించే ప్రపోజల్‌ను ప్రస్తావించారు. 2047 నాటికి సౌత్ ఇండియా $10 ట్రిలియన్ ఎకానమీగా ఎదగగలదని అన్నారు.

జర్నలిజం డిప్లమా కోర్సు దరఖాస్తు గడువు పొడిగింపు
AP: ఏపీ సి.ఆర్. మీడియా అకాడమీ–ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజంలో డిప్లమా కోర్సు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5వరకు పొడిగించినట్లు మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్‌కుమార్ తెలిపారు. జర్నలిస్టులకు ఇంటర్మీడియట్, ఇతర అభ్యర్థులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. జర్నలిస్టులకు రూ.2 వేలు, ఇతరులకు రూ.2,500 ఫీజుగా చెల్లించాలి.
ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ‘మోదీ చాలీసా’
ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కొందరు ‘మోదీ చాలీసా’ను పఠించారు. బ్యానర్‌పై ‘భగవాన్ శ్రీ నరేంద్ర మోదీ చాలీసా’ అని రాశారు. అక్కడున్నవారు “జై జై మోదీ..హర్ హర్ మోదీ” అని నినాదాలు చేశారు. విల్లు పట్టుకున్న రాముడి రూపంలో ఉన్న మోదీ చిత్రానికి హారతి ఇచ్చారు. డాక్టర్ రాజన్ సింగ్, మహామండలేశ్వర్ వైభవి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా చెప్పింది. హాల్‌ను ఒక సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం తీసుకుందని, కానీ విషయం తెలిసి ఆ ప్రోగ్రామ్‌ను ఆపేశామంది.

మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ -అభిజీత్ దిప్కే
మహారాష్ట్రలోని ప్రభుత్వ స్కూళ్ల అధ్వాన పరిస్థితిపై CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే ఫైర్ అయ్యారు. స్కూళ్లలో కనీస ఫెసిలిటీస్, టాయిలెట్స్ లేవని, లీక్ అయ్యే రూఫ్‌ల కిందే స్టూడెంట్స్ చదువుకుంటున్నారని ఆరోపించారు. మంత్రుల కుక్కలకు ఉన్న సౌకర్యాలు కూడా విద్యార్థులకు దక్కడం లేదని, ఎడ్యుకేషన్ మినిస్టర్ దాదా భూసే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేతలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తేనే అసలు ప్రాబ్లమ్స్ అర్థమవుతాయని, లేకపోతే రాబోయే 2029 ఎలక్షన్స్‌లో Gen Z యువత తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

డాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటున్న ఆశా వర్కర్లు
TG : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. డాక్టర్ తమ దుస్తులు, వ్యక్తిగత విషయాలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఆందోళనను ఆపమని హెచ్చరించారు.

సంఘంగా ఏర్పడిన జగదాంబ ఫేస్ టు ప్లాట్ల స్కీమ్ బాధితులు
TG: డబ్బులు చెల్లించి ప్లాట్లను పొందినా అవి దక్కకపోవడంతో బాధితులంతా సంఘంగా ఏర్పడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లిలో 2013లో జగదాంబ ఫేస్ టు పేరిట ప్లాట్ల స్కీమ్ ఏర్పాటు చేశారు. 6.11 ఎకరాల వెంచర్‌లో వాయిదాల ద్వారా రూ.1.30 లక్షలిచ్చిన వారికి ప్లాట్లు రాసి ఇచ్చారు. గత ఏడాది నుంచి ప్లాట్ల యజమానుల వారసులం అంటూ కొందరు వచ్చి చుట్టూ ప్రహరీ నిర్మించారు. 250 మంది బాధితులు సంఘంగా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. మిగతా బాధితులు తమతో కలిసి రావాలని కోరుతూ బోర్డును ఏర్పాటు చేశారు.

టీచర్ కొట్టడంతో స్టూడెంట్ మృతి.. స్కూల్ బయట పేరెంట్స్ ఆవేదన
AP: విశాఖపట్నం వన్‌టౌన్‌లోని కొత్తరోడ్ లిటిల్ గార్డెన్ స్కూల్‌లో దారుణ ఘటన జరిగింది. ప్రణయ్ తేజ్ అనే స్టూడెంట్ క్లాస్‌రూమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో గుక్కపెట్టి ఏడుస్తూ టీచర్ వద్దే కుప్పకూలి పడిపోయాడు. దీంతో పేరెంట్స్ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ టీచర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
40 ఏళ్ల తర్వాత దళితులకు ఆలయ ప్రవేశం
TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో 40 ఏళ్ల తర్వాత దళితులకు హనుమాన్ ఆలయంలోకి ప్రవేశం కల్పించారు. స్వామీజీలు, గ్రామ పెద్దలు, వివిధ సంఘాల నాయకుల సమక్షంలో దళిత యువకులను భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, చందూరావు, వామనరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల కోసం అర్ధనగ్న ప్రదర్శన.. గిరిజనుల నిరసన
AP : విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాలను కొనసాగించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలు తెలిపారు. జగదంబ నుంచి కలెక్టరేట్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కు విన్నతి పత్రం ఇచ్చారు. GO 69 సాకుతో 5, 6, 7 తరగతుల పిల్లలను స్కూల్ నుంచి టిసి ఇచ్చి తొలగిస్తూ, వెళ్లి వేరేచోట చదువుకోండని భయపెడుతున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి, తమ పిల్లల చదువులు ఇక్కడే కొనసాగేలా న్యాయం చేయాలని గిరిజన నాయకులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

'నా టార్గెట్ మీరే'.. కేజ్రీవాల్‌కి సుకేష్ ఓపెన్ ఛాలెంజ్!
ఢిల్లీ లిక్కర్ స్కామ్, జల్ బోర్డ్ వివాదాల తర్వాత AAPపై మరో 3 కొత్త స్కామ్‌లను బయటపెడతానని జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశాడు. అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌లను ఉద్దేశిస్తూ "నేను మీ వర్స్ట్ నైట్‌మేర్" అని హెచ్చరించాడు. దేశంలో ఉన్న Gen-Z యూత్‌ను రెచ్చగొట్టడానికి AAP 'ప్రాక్సీల'ను ఉపయోగిస్తోందని, త్వరలోనే వారి అసలు రూపాన్ని ఎక్స్‌పోజ్ చేస్తానని చెప్పాడు. AAP అంటే "ఎనీటైమ్ ఆల్వేస్ పార్టీ ఆఫ్ స్కామ్" అని కామెంట్ చేస్తూ, పంజాబ్ ఓటర్లను మోసం చేయలేరని సుకేష్ లేఖలో పేర్కొన్నాడు.

బాలాపూర్ మర్డర్ మిస్టరీ క్లోజ్!
HYD బాలాపూర్ PS పరిధిలో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు సాల్వ్ చేశారు. బిస్మిల్లా కాలనీకి చెందిన సలాం, బీహార్‌కి చెందిన రెహానా లవ్‌లో ఉంటూ లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. రెహానా ప్రెగ్నెంట్ అవ్వడంతో మ్యారేజ్ చేసుకోమని ప్రెజర్ చేసింది. దీంతో సలామ్ ఈ నెల 17న ఆమెను కత్తితో పొడిచి, తాడుతో మెడ బిగించి హత్య చేశాడు. ఈ క్రైమ్‌లో సలామ్ మదర్ ఆయేషా బేగం హెల్ప్ చేసింది. డెడ్‌బాడీని సంచిలో దాచే క్రమంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.