Latest

సిద్దాపూర్ డంపు యార్డు మాకొద్దు
Local· 20 Aug 2026

సిద్దాపూర్ డంపు యార్డు మాకొద్దు

TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో డంపుయార్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 641 ను వెంటనే రద్దు చేయాలని షాద్ నగర్, కొత్తూరు మండలాల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ డంపు యార్డు ఏర్పాటయితే ఇక్కడ 10 గ్రామాలు ఇబ్బందులకు గురవుతాయని, భూముల విలువలు పడిపోతాయని తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరుతున్నారు.

30న పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలు
Local· 20 Aug 2026

30న పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలు

TG: ఈనెల 30న జరగబోయే పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహాత్మా జ్యోతిబాఫూలె వారధి కమిటీ అసెంబ్లీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యాంకె పద్మ కోరారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మందిపల్ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో పర్యావరణ పరిరక్షణ ప్రచార పత్రం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.

జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
Local· 20 Aug 2026

జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

TG : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ధరూర్ క్యాంప్‌లో కొత్త ఆఫీస్ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటలకు పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలవనున్నారు. సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో ఇళ్ల నిర్మాణం, రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహిస్తారు.

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో హాట్‌ హాట్‌గా దక్షిణాది అంశాలు!
Current Affairs· 20 Aug 2026

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో హాట్‌ హాట్‌గా దక్షిణాది అంశాలు!

తమిళనాడులో జరిగిన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. కేంద్ర హోం మినిస్టర్ అమిత్‌ షా సమక్షంలో ఈ భేటీ నిర్వహించారు. డీలిమిటేషన్‌, సౌత్ ఇండియా పొలిటికల్ రెప్రజెంటేషన్, NEET, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ గురించి ప్రధానంగా చర్చకు వచ్చాయి. AP సీఎం చంద్రబాబు గోదావరి-కావేరీ కనెక్టివిటీతో 500 TMCకి పైగా నీటిని మళ్లించే ప్రపోజల్‌ను ప్రస్తావించారు. 2047 నాటికి సౌత్ ఇండియా $10 ట్రిలియన్‌ ఎకానమీగా ఎదగగలదని అన్నారు.

జర్నలిజం డిప్లమా కోర్సు దరఖాస్తు గడువు పొడిగింపు
Education· 20 Aug 2026

జర్నలిజం డిప్లమా కోర్సు దరఖాస్తు గడువు పొడిగింపు

AP: ఏపీ సి.ఆర్. మీడియా అకాడమీ–ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజంలో డిప్లమా కోర్సు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5వరకు పొడిగించినట్లు మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్‌కుమార్ తెలిపారు. జర్నలిస్టులకు ఇంటర్మీడియట్, ఇతర అభ్యర్థులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. జర్నలిస్టులకు రూ.2 వేలు, ఇతరులకు రూ.2,500 ఫీజుగా చెల్లించాలి.

ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ‘మోదీ చాలీసా’
National· 20 Aug 2026

ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ‘మోదీ చాలీసా’

ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కొందరు ‘మోదీ చాలీసా’ను పఠించారు. బ్యానర్‌పై ‘భగవాన్ శ్రీ నరేంద్ర మోదీ చాలీసా’ అని రాశారు. అక్కడున్నవారు “జై జై మోదీ..హర్ హర్ మోదీ” అని నినాదాలు చేశారు. విల్లు పట్టుకున్న రాముడి రూపంలో ఉన్న మోదీ చిత్రానికి హారతి ఇచ్చారు. డాక్టర్ రాజన్ సింగ్, మహామండలేశ్వర్ వైభవి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా చెప్పింది. హాల్‌ను ఒక సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం తీసుకుందని, కానీ విషయం తెలిసి ఆ ప్రోగ్రామ్‌ను ఆపేశామంది.

మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ -అభిజీత్ దిప్కే
Education· 20 Aug 2026

మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ -అభిజీత్ దిప్కే

మహారాష్ట్రలోని ప్రభుత్వ స్కూళ్ల అధ్వాన పరిస్థితిపై CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే ఫైర్ అయ్యారు. స్కూళ్లలో కనీస ఫెసిలిటీస్, టాయిలెట్స్ లేవని, లీక్ అయ్యే రూఫ్‌ల కిందే స్టూడెంట్స్ చదువుకుంటున్నారని ఆరోపించారు. మంత్రుల కుక్కలకు ఉన్న సౌకర్యాలు కూడా విద్యార్థులకు దక్కడం లేదని, ఎడ్యుకేషన్ మినిస్టర్ దాదా భూసే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేతలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తేనే అసలు ప్రాబ్లమ్స్ అర్థమవుతాయని, లేకపోతే రాబోయే 2029 ఎలక్షన్స్‌లో Gen Z యువత తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

డాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటున్న ఆశా వర్కర్లు
Local· 20 Aug 2026

డాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటున్న ఆశా వర్కర్లు

TG : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. డాక్టర్ తమ దుస్తులు, వ్యక్తిగత విషయాలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఆందోళనను ఆపమని హెచ్చరించారు.

సంఘంగా ఏర్పడిన జగదాంబ ఫేస్ టు ప్లాట్ల స్కీమ్ బాధితులు
TG· 20 Aug 2026

సంఘంగా ఏర్పడిన జగదాంబ ఫేస్ టు ప్లాట్ల స్కీమ్ బాధితులు

TG: డబ్బులు చెల్లించి ప్లాట్లను పొందినా అవి దక్కకపోవడంతో బాధితులంతా సంఘంగా ఏర్పడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లిలో 2013లో జగదాంబ ఫేస్ టు పేరిట ప్లాట్ల స్కీమ్ ఏర్పాటు చేశారు. 6.11 ఎకరాల వెంచర్‌లో వాయిదాల ద్వారా రూ.1.30 లక్షలిచ్చిన వారికి ప్లాట్లు రాసి ఇచ్చారు. గత ఏడాది నుంచి ప్లాట్ల యజమానుల వారసులం అంటూ కొందరు వచ్చి చుట్టూ ప్రహరీ నిర్మించారు. 250 మంది బాధితులు సంఘంగా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. మిగతా బాధితులు తమతో కలిసి రావాలని కోరుతూ బోర్డును ఏర్పాటు చేశారు.

టీచర్ కొట్టడంతో స్టూడెంట్ మృతి.. స్కూల్ బయట పేరెంట్స్‌ ఆవేదన
AP· 20 Aug 2026

టీచర్ కొట్టడంతో స్టూడెంట్ మృతి.. స్కూల్ బయట పేరెంట్స్‌ ఆవేదన

AP: విశాఖపట్నం వన్‌టౌన్‌లోని కొత్తరోడ్‌ లిటిల్‌ గార్డెన్‌ స్కూల్‌లో దారుణ ఘటన జరిగింది. ప్రణయ్‌ తేజ్‌ అనే స్టూడెంట్ క్లాస్‌రూమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. హోమ్‌వర్క్‌ చేయలేదని టీచర్‌ కొట్టడంతో గుక్కపెట్టి ఏడుస్తూ టీచర్‌ వద్దే కుప్పకూలి పడిపోయాడు. దీంతో పేరెంట్స్‌ స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ టీచర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

40 ఏళ్ల తర్వాత దళితులకు ఆలయ ప్రవేశం
Local· 20 Aug 2026

40 ఏళ్ల తర్వాత దళితులకు ఆలయ ప్రవేశం

TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో 40 ఏళ్ల తర్వాత దళితులకు హనుమాన్ ఆలయంలోకి ప్రవేశం కల్పించారు. స్వామీజీలు, గ్రామ పెద్దలు, వివిధ సంఘాల నాయకుల సమక్షంలో దళిత యువకులను భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, చందూరావు, వామనరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల కోసం అర్ధనగ్న ప్రదర్శన.. గిరిజనుల నిరసన
Local· 20 Aug 2026

విద్యార్థుల కోసం అర్ధనగ్న ప్రదర్శన.. గిరిజనుల నిరసన

AP : విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాలను కొనసాగించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలు తెలిపారు. జగదంబ నుంచి కలెక్టరేట్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కు విన్నతి పత్రం ఇచ్చారు. GO 69 సాకుతో 5, 6, 7 తరగతుల పిల్లలను స్కూల్ నుంచి టిసి ఇచ్చి తొలగిస్తూ, వెళ్లి వేరేచోట చదువుకోండని భయపెడుతున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి, తమ పిల్లల చదువులు ఇక్కడే కొనసాగేలా న్యాయం చేయాలని గిరిజన నాయకులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

'నా టార్గెట్ మీరే'.. కేజ్రీవాల్‌కి సుకేష్ ఓపెన్ ఛాలెంజ్!
Current Affairs· 20 Aug 2026

'నా టార్గెట్ మీరే'.. కేజ్రీవాల్‌కి సుకేష్ ఓపెన్ ఛాలెంజ్!

ఢిల్లీ లిక్కర్ స్కామ్, జల్ బోర్డ్ వివాదాల తర్వాత AAPపై మరో 3 కొత్త స్కామ్‌లను బయటపెడతానని జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశాడు. అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌లను ఉద్దేశిస్తూ "నేను మీ వర్స్ట్ నైట్‌మేర్" అని హెచ్చరించాడు. దేశంలో ఉన్న Gen-Z యూత్‌ను రెచ్చగొట్టడానికి AAP 'ప్రాక్సీల'ను ఉపయోగిస్తోందని, త్వరలోనే వారి అసలు రూపాన్ని ఎక్స్‌పోజ్ చేస్తానని చెప్పాడు. AAP అంటే "ఎనీటైమ్ ఆల్వేస్ పార్టీ ఆఫ్ స్కామ్" అని కామెంట్ చేస్తూ, పంజాబ్ ఓటర్లను మోసం చేయలేరని సుకేష్ లేఖలో పేర్కొన్నాడు.

బాలాపూర్ మర్డర్ మిస్టరీ క్లోజ్!
TG· 20 Aug 2026

బాలాపూర్ మర్డర్ మిస్టరీ క్లోజ్!

HYD బాలాపూర్ PS పరిధిలో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు సాల్వ్ చేశారు. బిస్మిల్లా కాలనీకి చెందిన సలాం, బీహార్‌కి చెందిన రెహానా లవ్‌లో ఉంటూ లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. రెహానా ప్రెగ్నెంట్ అవ్వడంతో మ్యారేజ్ చేసుకోమని ప్రెజర్ చేసింది. దీంతో సలామ్ ఈ నెల 17న ఆమెను కత్తితో పొడిచి, తాడుతో మెడ బిగించి హత్య చేశాడు. ఈ క్రైమ్‌లో సలామ్ మదర్ ఆయేషా బేగం హెల్ప్ చేసింది. డెడ్‌బాడీని సంచిలో దాచే క్రమంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల బస్సుకు యాక్సిడెంట్‌.. 10 మందికి గాయాలు!
AP· 20 Aug 2026

పోలీసుల బస్సుకు యాక్సిడెంట్‌.. 10 మందికి గాయాలు!

AP: విశాఖపట్నంలోని జూ పార్క్‌ దగ్గరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ఎస్కార్ట్‌ పోలీసులతో వెళ్తున్న స్కైలైన్‌ బస్సు. జూ పార్క్‌ వద్ద కారును తప్పిస్తుండగా అదుపుతప్పింది. డివైడర్‌ను దాటి మధురవాడ నుంచి విశాఖ వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఓ కానిస్టేబుల్‌ కాలు విరిగినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై అధికారులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మా Sports స్థలం మాకివ్వండి!
Local· 20 Aug 2026

మా Sports స్థలం మాకివ్వండి!

AP : రాజమహేంద్రవరంలోని 'పోతుల వీరాస్వామి వ్యాయామ కళాశాల' స్థలాన్ని YMVA సంస్థ ఆక్రమించుకుందని, దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని మేనేజ్‌మెంట్ డిమాండ్ చేస్తుంది. 1952 నుంచి యువతకు కుస్తీ, బాక్సింగ్ శిక్షణ ఇస్తున్న సంస్థను కాపాడాలని మేనేజ్‌మెంట్ సభ్యులు కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ మీటింగ్‌లో మాట్లాడుతూ, తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తెలిపారు. యంగ్ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఫ్యూచర్ కోసం ప్రభుత్వం సరైన ఎంక్వైరీ చేసి, ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి ఇప్పించాలని రెక్వెస్ట్ చేస్తున్నారు.

ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
Local· 20 Aug 2026

ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

TG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ దశరథ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వస్తే ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్న రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేశాయని మండిపడ్డారు.

నిరుద్యోగుల సమస్యలపై CPM ధర్నా
Local· 20 Aug 2026

నిరుద్యోగుల సమస్యలపై CPM ధర్నా

TG: నిరుద్యోగుల సమస్యలపై CPM వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో 10 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని అన్నారు.

డా.విశారదన్ మహారాజ్ మహా ధర్నా ఫలితం..కదిలిన యంత్రాంగం
Local· 20 Aug 2026

డా.విశారదన్ మహారాజ్ మహా ధర్నా ఫలితం..కదిలిన యంత్రాంగం

TG: జగిత్యాలలోని డబుల్ బెడ్రూం కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో జూలై 29న డా. విశారదన్ మహారాజ్ మహా ధర్నా చేపట్టారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డబుల్ బెడ్రూం కాలనీని సందర్శించారు. కాలనీలోని సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బుగ్గారంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
Local· 20 Aug 2026

బుగ్గారంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి (సద్భావన దివస్) వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశాన్ని సాంకేతిక రంగానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశంలో కంప్యూటర్, టెలికాం విప్లవాన్ని తీసుకువచ్చి, నేటి యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా పునాది వేసిన విజేత ఆయనేనని గుర్తుచేశారు.

జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ
Local· 20 Aug 2026

జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ

AP: విజయనగరం జిల్లా పూసపాటిరేగ విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందపై జరిగిన దాడిని ఖండిస్తూ రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజాం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి, అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.