Latest

SIR ప్రక్రియను పూర్తి చేయాలి
Local· 19 Aug 2026

SIR ప్రక్రియను పూర్తి చేయాలి

TG : ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్, వివరాల్లో తప్పుల గుర్తింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైన వారికి నోటీసులు ఇచ్చి సిటిజన్‌షిప్ సర్టిఫికెట్లు స్వీకరించాలని తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు ఫిర్యాదులను తీసుకొని, అక్టోబర్‌ 15 వరకు నోటీసులు ఇస్తామన్నారు. ప్రజలకు సహాయంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆదేశించారు.

11 రోజులు విదేశీ పర్యటనలో సీఎం రేవంత్
TG· 19 Aug 2026

11 రోజులు విదేశీ పర్యటనలో సీఎం రేవంత్

TG: CM రేవంత్‌ రెడ్డి 11 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరైన ఆయన సాయంత్రం బ్రిటన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారు. యూకే, యూఎ్‌సలో పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో పాటు వెళ్తున్నారు. ఈనెల 30న వారు హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ఆరునెలల్లో 20 కిలోల బరువు తగ్గడం..ఎలాగంటే!
Health· 19 Aug 2026

ఆరునెలల్లో 20 కిలోల బరువు తగ్గడం..ఎలాగంటే!

ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కల్రా తన ఊబకాయానికి టిర్జెపాటైడ్(GLP-1 మందు) వాడి 6 నెలల్లో 110 కిలోల నుంచి 20 కిలోలు తగ్గారు. ఆయన అనుభవాలను వివరిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఆకలి లేకపోతే తినవద్దని చిన్నచిన్న మొత్తాల్లో ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆహార పరిశుభ్రత పాటించమని సలహా ఇచ్చారు. ఈ మందులకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే డాక్టర్‌కు చెప్పాలన్నారు. ఈ మందులు ఆకలి-సంతృప్తి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయని, వ్యాయామం, మైండ్‌సెట్ మార్పు లేకుండా పని చేయవని సలహా ఇచ్చారు.

Students కోసం బస్సులివ్వండి
Local· 19 Aug 2026

Students కోసం బస్సులివ్వండి

AP: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సులు ఏర్పాటు చేయాలని రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF) రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. చదువు కోసం ప్రతిరోజు వందల మంది విద్యార్థులు ఎమ్మిగనూరు వస్తున్నారని, సరైన సమయానికి బస్సులు లేక కొందరు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. ఉన్న బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో పిల్లలు ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ప్రయాణిస్తున్నారని తెలిపారు. కాబట్టి విద్యార్థులకు, ప్రయాణికులకు విడివిడిగా బస్సులు వేయాలని కోరారు.

ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం
AP· 19 Aug 2026

ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం

AP: వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో జర్నలిస్ట్‌గా మారారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఫొటో జర్నలిస్టులు సీఎంను కలిశారు. వాళ్లను సీఎం గ్రూప్ ఫొటో తీశారు. ఫొటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. చరిత్రను నమోదు చేస్తూ, జ్ఞాపకాలను పదిలపరుస్తున్న ఫొటోగ్రాఫర్లకు అభినందనలు తెలిపారు. మానవ అనుభవాలను అద్భుతమైన చిత్రాలుగా ఆవిష్కరిస్తున్న వారికి శుభాకాంక్షలు చెప్పారు.

కర్నూలు అభివృద్ధికి నిధులివ్వాలి
Local· 19 Aug 2026

కర్నూలు అభివృద్ధికి నిధులివ్వాలి

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల ప్రకారం కర్నూలు జిల్లాకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర డిమాండ్ చేశారు. ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాను పరిశ్రమల కేంద్రంగా మార్చి యువతకు ఉపాధి కల్పించాలని, పెండింగ్ నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా హక్కుల కోసం ప్రజలంతా పోరాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొందరు నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం..రోడ్లు జలమయం!
Local· 19 Aug 2026

హైదరాబాద్‌లో భారీ వర్షం..రోడ్లు జలమయం!

రాజేంద్రనగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానకు రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సరైన వర్షాలు లేక రైతులు దిగాలుపడుతుంటే, తెలంగాణలో మాత్రం పలుచోట్ల వర్షాలు బాగా పడుతున్నాయి.

కోతుల గోలకు చెక్!
Local· 19 Aug 2026

కోతుల గోలకు చెక్!

మెదక్‌ జిల్లాలో కోతుల సమస్యను తగ్గించేందుకు కలెక్టర్ ప్రతిమాసింగ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పంటలు నాశనం కాకుండా, ఇళ్లలో ప్రజలకు, పిల్లలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు. పట్టుకున్న కోతులను అటవీశాఖ సాయంతో నిర్మల్ జిల్లాకు తరలించి, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. ప్రజల సహాయంతో కోతుల సమస్యను దశలవారీగా తగ్గిస్తామని కలెక్టర్ చెప్పారు.

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబో మూవీ టైటిల్ రిలీస్?
Entertainment· 19 Aug 2026

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబో మూవీ టైటిల్ రిలీస్?

<a href="https://www.instagram.com/p/DcOGObszMMm/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ==">అనిల్ రావిపూడి</a> దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీకి ‘జనవరి 12 విడుదల’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఖరారు చేశారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ఓ వినోదాత్మక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.

గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్
Local· 19 Aug 2026

గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్

TG : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఇవాళ జిల్లా గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతతో ఆయన మాట్లాడి, ఎలా చదువుకుంటున్నారో తెలుసుకున్నారు. గ్రంథాలయంలోని పుస్తకాలు, ఉచిత ఆన్‌లైన్ సేవలు, దినపత్రికలను రోజూ వాడుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఎక్కువ ఉండకుండా, పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని అన్నారు. యువతకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

సుగాలి ప్రీతి తల్లి వీల్‌చేర్ యాత్రలో ఉద్రిక్తత!
AP· 19 Aug 2026

సుగాలి ప్రీతి తల్లి వీల్‌చేర్ యాత్రలో ఉద్రిక్తత!

సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె తల్లి పార్వతి చేపట్టిన వీల్‌చేర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తన కుమార్తె చనిపోయి తొమ్మిదేళ్లయినా ఇంతవరకు న్యాయం చేయలేదని, కూటమి ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. నిందితులను అరెస్ట్ చేస్తే తాము రోడ్డెక్కాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. న్యాయం కోసం ప్రశ్నిస్తుంటే వందలాది మంది పోలీసులతో తమ యాత్రను అడ్డుకోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిస్సింగ్ చిల్డ్రన్ కోసం.. సుప్రీంకోర్టు ఆదేశాలు!
Current Affairs· 19 Aug 2026

మిస్సింగ్ చిల్డ్రన్ కోసం.. సుప్రీంకోర్టు ఆదేశాలు!

తప్పిపోయిన, రక్షించబడిన పిల్లలను శాస్త్రీయంగా గుర్తించి, వారి కుటుంబాలతో త్వరగా కలిపేందుకు జాతీయ DNA, బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన PILపై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, NCPCRలకు నోటీసులు జారీ చేసింది. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు, పిల్లల పునరావాసం కోసం జాతీయ, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని పిటిషనర్ రీపక్ కన్సల్ కోరగా, కోర్టు విచారణ చేపట్టింది.

🧠 మీ Futureకి ఉపయోగపడే 6 Skills
Infotainment· 19 Aug 2026

🧠 మీ Futureకి ఉపయోగపడే 6 Skills

డిగ్రీ ఒక్కటే సరిపోదు.. లైఫ్‌లో ముందుకు వెళ్లాలంటే స్కిల్స్ అవసరం. కమ్యూనికేషన్ ఉంటే మాటను క్లియర్‌గా చెప్పడంతో పాటు, ఎదుటివాళ్లను అర్థం చేసుకోవచ్చు. టైమ్ మేనేజ్‌మెంట్‌తో ముఖ్యమైన పనులకు సమయం కేటాయించగలం. డిసిప్లిన్ ఉంటే మోటివేషన్ లేని రోజుల్లో కూడా గోల్స్ వైపు వెళ్లొచ్చు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ, ఇతరులను అర్థం చేసుకోవచ్చు. మార్పులకు అడాప్ట్ అవ్వడం, కొత్తవి నేర్చుకోవడం ముఖ్యం. ఈ ఆరు స్కిల్స్‌ను ప్రాక్టీస్ చేస్తే.. కెరీర్‌తో పాటు లైఫ్‌లో మంచి మార్పు కనిపిస్తుంది.

46% మైండ్ పవర్ పెరిగే సీక్రెట్ ఇదే!
Health· 19 Aug 2026

46% మైండ్ పవర్ పెరిగే సీక్రెట్ ఇదే!

వయసు పైబడిన వారు వేగంగా నడవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని రీసెంట్ రీసెర్చ్‌లో తేలింది. వయసున్న వారితో సమానంగా స్పీడ్‌గా నడిచే వారిని 'సూపర్ మూవర్స్' అంటారు.' ఇలా ఫాస్ట్ నడవడం వల్ల మెదడులో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, జ్ఞాపకశక్తి క్షీణించే ముప్పు 46% తగ్గుతుంది. మెదడులోని 'హిప్పోక్యాంపస్' పరిమాణం పెరగడమే కాకుండా, నడుస్తున్నప్పుడు దారిలోని గుంతలు, జనాన్ని గమనించడం బ్రెయిన్‌కి మంచి పజిల్‌లా పనిచేస్తుందని డాక్టర్ జో వెర్గీస్ చెప్పారు. వీరికి గుండె జబ్బులు, డిప్రెషన్ రిస్క్ చాలాతక్కువగా ఉంటుంది.

మాసాయిపేట మండలంలో విషాదం
Local· 19 Aug 2026

మాసాయిపేట మండలంలో విషాదం

TG : మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో విషాదం నెలకొంది. ఎడ్ల ప్రవీణ్(32) పొలం వద్ద గ్రాస్ కట్టింగ్ చేస్తుండగా విద్యుత్తు లైను తగిలి కరెంట్ షాక్ కొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయినట్టు చేగుంట పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఆస్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రవీణ్ తల్లి రెండు నెలల కిందటే మరణించింది. రెండు నెలల్లోనే తల్లి, కొడుకు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మండలి డిప్యూటీ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం
AP· 19 Aug 2026

మండలి డిప్యూటీ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం

AP: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన ఘటన జరిగింది. మండలిలో టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యుల కంటే వైసీపీ సభ్యులు మెజార్టీ సంఖ్యలో ఉండడంతో కూటమి తరుఫున ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. దీంతో వైఎస్సార్సీపీ నుండి తూమాటి మాధవరావు డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు.

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ ఎన్నికలపై టెన్షన్
AP· 19 Aug 2026

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ ఎన్నికలపై టెన్షన్

AP: మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెరుగుతోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేగం పుంజుకోవడంతో ఎంటీఎంసీపై ప్రధాన పార్టీల దృష్టి పడింది. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాపై స్పష్టత కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, ట్రాఫిక్, సానిటేషన్ వంటి సమస్యలు ఎన్నికల్లో కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే ఎన్నికల తేదీలు, వార్డులు, రిజర్వేషన్లపై పూర్తి స్పష్టత వస్తుంది.

AI చేసిన చిన్న తప్పు.. కస్టమర్‌కి ఘోర అవమానం!
International· 19 Aug 2026

AI చేసిన చిన్న తప్పు.. కస్టమర్‌కి ఘోర అవమానం!

బ్రిటన్‌లోని సైన్స్‌బరీస్ సూపర్‌మార్కెట్‌లో AI ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ పెద్ద కలకలం సృష్టించింది. షాపింగ్ చేస్తున్న మ్యాట్ ఆర్నాల్డ్ అనే కస్టమర్‌ను AI తప్పుగా దొంగగా గుర్తించడంతో, స్టాఫ్ అతన్ని బయటకు పంపేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల తను చాలా అవమానపడ్డానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ ఇలాంటి మిస్టేక్స్ జరగడంతో కంప్లైంట్ అందుకున్న మేనేజ్‌మెంట్, సదరు స్టోర్‌లో AI స్కానింగ్‌ను టెంపరరీగా స్టాప్ చేసింది. ఇది టెక్నాలజీ ప్రాబ్లమ్ కాదని, స్టాఫ్ చేసిన హ్యూమన్ ఎర్రర్ అని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

ఎక్కువగా నమిలి తింటే మెదడు షార్ప్?
Health· 19 Aug 2026

ఎక్కువగా నమిలి తింటే మెదడు షార్ప్?

ఆహారాన్ని నమలడం కేవలం డైజెషన్ కోసమే అనుకుంటే పొరపాటే. నమలడం వల్ల బ్రెయిన్‌కి కూడా మంచి వర్కౌట్ అవుతుందని రీసెంట్ రీసెర్చ్ చెప్తోంది. ఎక్కువగా నమిలి తినడం వల్ల మెదడులో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జ్ఞాపకశక్తి, కాన్సంట్రేషన్ బాగా మెరుగవుతాయట. ఒక నిమిషం పాటు ఆహారాన్ని బాగా నమిలినా బ్రెయిన్ పెర్ఫార్మెన్స్‌లో మార్పు వస్తుందని 2025 స్టడీలో తేలింది. అందుకే తొందరపడి వేగంగా తినకుండా పండ్లు, నట్స్ వంటి ఫుడ్‌ని నెమ్మదిగా నమిలి తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

AI బాస్‌కి లేట్‌ అంటే లేటే
Gen Z· 19 Aug 2026

AI బాస్‌కి లేట్‌ అంటే లేటే

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ స్టోర్‌లో ఏఐ మేనేజర్‌ లూనా 23 షిఫ్టుల్లో 17 సార్లు లేట్‌గా వచ్చిన ఉద్యోగిని ఫైర్‌ చేయాలని రెకమెండ్ చేసింది. ట్విస్ట్ ఏంటంటే..లేట్‌గా వస్తున్న ఉద్యోగిని నెలల తరబడి పట్టించుకోకుండా వదిలేసింది కూడా ఆ ఏఐనే! చివరికి పాత రూల్స్‌ గుర్తొచ్చి, “అయ్యా.. ఇక నీకు ఉద్యోగం వద్దు. ఇంట్లో ఉండటమే ముద్దు” అంటూ టెర్మినేషన్‌ రికమండ్‌ చేసింది. ఇలా జరగడం ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్. ఏఐ బాస్‌కి మెమరీ లాస్‌ అయినా ఫైర్‌ చేసే టైమ్‌కి మాత్రం ఫుల్‌ మెమరీ వచ్చేసింది.

AI వచ్చేసింది.. బ్యాంక్ ఇంటర్న్‌షిప్ రూటే మారింది!
Current Affairs· 19 Aug 2026

AI వచ్చేసింది.. బ్యాంక్ ఇంటర్న్‌షిప్ రూటే మారింది!

బ్యాంకింగ్ ఇంటర్న్‌షిప్‌లలో AI టూల్స్ రావడంతో పెద్ద మార్పు వచ్చింది. గతంలో రాత్రి వరకు ఆఫీస్‌లోనే ఉండి పనిచేసే ఇంటర్న్‌లు, ఇప్పుడు రీసెర్చ్, డేటా విశ్లేషణ, రిపోర్ట్‌ల తయారీ వంటి పనులను AI సాయంతో చాలా ఈజీగా పూర్తి చేస్తున్నారు. దీనివల్ల టైమ్ సేవ్ అయ్యి డైరెక్ట్ క్లయింట్ మీటింగ్స్, మెయిన్ టాస్క్స్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అయితే AIపై పూర్తిగా డిపెండ్ అయితే సొంతంగా ఆలోచించే కెపాసిటీ తగ్గొచ్చని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అయినా బ్యాంకులు మాత్రం AI యూజ్ చేయడాన్ని ఫ్యూచర్ స్కిల్‌గా చూస్తున్నాయి.