Latest

Metaపై 29 రాష్ట్రాలు ఎందుకు కేసు పెట్టాయి? 📱
International· 19 Aug 2026

Metaపై 29 రాష్ట్రాలు ఎందుకు కేసు పెట్టాయి? 📱

సోషల్ మీడియా సిగరెట్ కంపెనీల లాగే పిల్లలను ఆకర్షిస్తుందా? ఇదే ప్రశ్న అమెరికాలో కోర్టు కేసుగా మారింది. 29 రాష్ట్రాలు Metaపై దావా వేసి, Facebook, Instagramలను యువత ఎక్కువసేపు వాడేలా డిజైన్ చేశారని, పిల్లల డేటాను నిబంధనలకు విరుద్ధంగా సేకరించారని ఆరోపిస్తున్నాయి. కేసులో $200 బిలియన్ నష్టపరిహారం కోరుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. Meta ఆరోపణలను ఖండిస్తోంది. ఈ కేసు ఫలితం ఆటోమేటిక్ స్క్రోలింగ్, నోటిఫికేషన్లు వంటి ఫీచర్లలో మార్పులు తెచ్చే అవకాశం ఉండటంతో టెక్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.

లస్సీ అమ్మి ఇల్లు కట్టుకున్నాడు..! ❤️
Personal Finance· 19 Aug 2026

లస్సీ అమ్మి ఇల్లు కట్టుకున్నాడు..! ❤️

రోజుకు ₹250 సంపాదించే స్థాయి నుంచి నెలకు ₹80,000 సంపాదించే లస్సీ వ్యాపారి వరకు.. ఢిల్లీలోని ఓ వ్యక్తి ప్రయాణం ఇప్పుడు చాలామందిని ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే పని మొదలుపెట్టిన ఆయనకు ఒకప్పుడు సొంత ఇల్లు కూడా లేదు. కష్టపడి లస్సీ వ్యాపారం పెంచుకుంటూ వెళ్లడంతో ఆదాయం క్రమంగా పెరిగింది. ఇప్పుడు నెలకు సుమారు ₹80,000 సంపాదిస్తున్నానని, ఆ డబ్బుతో ఉత్తరప్రదేశ్‌లో తన కుటుంబం కోసం ఇల్లు కట్టుకున్నానని ఆయన చెబుతున్నారు. చిన్న వ్యాపారం అయినా.. ఏళ్ల పాటు పట్టుదలగా చేస్తే జీవితం ఎంత మారొచ్చో చెప్పే కథ ఇది.

ఫోటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించాలి!
Local· 19 Aug 2026

ఫోటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించాలి!

AP : ఆకివీడు ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగురే ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన విజయకుమారిని అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్లకు ప్రమాద, ఆరోగ్య బీమా, రుణ సదుపాయాలు కల్పించి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని సభ్యులు కోరారు.

దొంగే షాప్ ఓనర్‌పై $10 మిలియన్ కేసా? 😳
International· 19 Aug 2026

దొంగే షాప్ ఓనర్‌పై $10 మిలియన్ కేసా? 😳

అమెరికాలోని ఒరెగాన్‌లో 2023లో ఓ గ్రానైట్ షాప్‌లోకి దొంగతనానికి వెళ్లిన కెన్నెత్ వోయిల్స్‌ను షాప్ యజమాని కాల్చాడు. ఈ ఘటనలో వోయిల్స్‌కు మూడు గాయాలయ్యాయి. కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది. తనను కాల్చిన షాప్ యజమానిపైనే వోయిల్స్ $10 మిలియన్ నష్టపరిహారం కోరుతూ కేసు వేశాడు. కోర్టులో అతను చేసిన వాదనలతో ఈ విషయం బయటకు వచ్చింది. దొంగతనానికి వెళ్లిన వ్యక్తే.. ఇప్పుడు తనకే న్యాయం చేయాలంటూ కోర్టుకెక్కడమే ఈ కేసును ఆసక్తికరంగా మార్చింది. దీనిపై కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు.

బుల్లెట్ ట్రైన్ కోసం దీక్ష..తెలంగాణ యువజన సంఘం సంఘీభావం
TG· 19 Aug 2026

బుల్లెట్ ట్రైన్ కోసం దీక్ష..తెలంగాణ యువజన సంఘం సంఘీభావం

TG: సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ సాధన కోసం చేస్తున్న దీక్షలో ఆరో రోజున సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం నాయకులు బి.రాజా, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.సురేశ్, రాష్ట్ర వైస్ చైర్మన్ తప్సీ గాంధీ తదితరులు నిరవధిక రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వాళ్లకు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు సంఘీభావం ప్రకటించారు. కేంద్రం మొదటి అలైన్‌మెంట్‌లో సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చడం ఇక్కడి అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు.

గిరిజన ఆశ్రమ పాఠశాల అకాడమీ ఇన్‌స్ట్రక్టర్ల ఆందోళన
TG· 19 Aug 2026

గిరిజన ఆశ్రమ పాఠశాల అకాడమీ ఇన్‌స్ట్రక్టర్ల ఆందోళన

TG: గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ ఉపాధ్యాయులు జీతాలు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఈనెల 17 నుండి సమ్మె చేస్తున్నారు. గత 11 సంవత్సరాల నుండి ఈ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నా జీతం రూ.10,400 మాత్రమే. సమస్య పరిష్కారం కోసం గాంధీభవన్లో నిర్వహించిన మినిస్టర్‌తో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌లో పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా
Local· 19 Aug 2026

అబ్దుల్లాపూర్‌మెట్‌లో పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా

TG: జీవో 97 రద్దుపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు. దీనికిమద్దతుగా ISP పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వై విజయబాబు వారికి మద్దతుగా నిలిచారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు చేటు చేసే జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు విద్యార్థిని విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మిర్చి ఎగుమతుల సమస్యలపై మిర్చియార్డ్ చైర్మన్ సమావేశం
Local· 19 Aug 2026

మిర్చి ఎగుమతుల సమస్యలపై మిర్చియార్డ్ చైర్మన్ సమావేశం

AP: గుంటూరు మిర్చియార్డులో చైర్మన్ కుర్రా అప్పారావు ఆధ్వర్యంలో మిర్చి ఎగుమతిదారులతో సమావేశం జరిగింది. శ్రీలంకలో అఫ్లాటాక్సిన్ సమస్యతో నిలిచిపోయిన మిర్చి కంటైనర్లపై చర్చించారు. ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు. ప్రతి మండలంలో మిర్చి ఎండబెట్టే ప్లాట్ ‌ఫారమ్‌లు ఏర్పాటు చేసి, రైతులకు నాణ్యతపై అవగాహన కల్పించాలని ఎగుమతిదారులు సూచించారు.

విద్యార్థుల మీద సీఐ దౌర్జన్యం
TG· 19 Aug 2026

విద్యార్థుల మీద సీఐ దౌర్జన్యం

TG: సీఎం రేవంత్‌ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్‌కి వ్యతిరేకంగా నిరసనకు దిగిన పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీస్ అధికారి దౌర్జన్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా సీఐ రఘుపతిరెడ్డి ఇద్దరు విద్యార్థులను గొంతు పట్టుకుని నొక్కుతూ వెనక్కి నెట్టారు. వాళ్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్లాస్టిక్‌కు చెక్.. ఉచితంగా స్టీల్ సామాన్లు!
Local· 19 Aug 2026

ప్లాస్టిక్‌కు చెక్.. ఉచితంగా స్టీల్ సామాన్లు!

TG : నిర్మల్ రూరల్ మండలం ముక్తాపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పంచాయతీ ఆధ్వర్యంలో 'స్టీల్ బ్యాంక్' ఏర్పాటు చేశారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కావాల్సిన స్టీల్ ప్లేట్లు, గ్లాసులను గ్రామస్తులు ఉచితంగా వాడుకోవచ్చని సర్పంచ్ మాన్పూరి రమేష్ తెలిపారు. గ్రామంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని అధికారుల సమక్షంలో గ్రామస్తులకు చెత్తబుట్టలు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఊరిలో జరిగే వేడుకల్లో ఇకపై ప్లాస్టిక్ వాడకూడదని నిర్ణయించారు.

AIపై యువతకు డౌట్ ఎందుకు?
Gen Z· 19 Aug 2026

AIపై యువతకు డౌట్ ఎందుకు?

AIతో చదువు, పని, రోజువారీ పనులు ఈజీ అవుతున్నాయి. అయినా దాన్ని పూర్తిగా నమ్మడానికి యువత మాత్రం అంతగా రెడీగా లేదు. అమెరికాలో 18–29 ఏళ్ల వారిలో దాదాపు సగం మంది AI వల్ల రాబోయే రోజుల్లో సమాజానికి ఇబ్బందులు రావొచ్చని అనుకుంటున్నారు. ముఖ్యంగా “AI వల్ల నా ఉద్యోగం ఏమవుతుంది?” అనే భయం ఒకవైపు ఉంటే, “దీన్ని ఎక్కువగా వాడితే మనమే ఆలోచించడం తగ్గిపోతుందా?” అనే డౌట్ మరోవైపు ఉంది. AIని వాడటం మాత్రం ఆపడం లేదు… కానీ దానిపై నమ్మకం మాత్రం అంత ఈజీగా ఇవ్వడం లేదు.

నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా రాజా గౌడ్‌
Local· 19 Aug 2026

నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా రాజా గౌడ్‌

TG: నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా రాజా గౌడ్‌ బదిలీపై రానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు G.O జారీ చేశారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌)గా ఉన్న రాజా గౌడ్‌ను నిజామాబాద్ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా ప్రభుత్వం నియమించింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజా గౌడ్‌కు నిజామాబాద్‌ జిల్లాతో గతంలోనే పరిచయం ఉంది. ఆయన గతంలో బోధన్‌ ఆర్డీవోగా పనిచేశారు.

తల్లి, బిడ్డల రక్షణకు ప్రత్యేక చర్యలు
Local· 19 Aug 2026

తల్లి, బిడ్డల రక్షణకు ప్రత్యేక చర్యలు

TG : గర్భిణులు, బాలింతలు, పసిపిల్లల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు చెప్పారు. ఇవాళ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘అంకురం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆడవారికి గర్భధారణ నుంచి ప్రసవం అయ్యే వరకు ఆరోగ్య తనిఖీలు చేయాలని, ఆరోగ్య సమస్యలు ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు.

త్వరలో సోనియా గాంధీ జీవితంపై పుస్తకం
Arts/Literature· 19 Aug 2026

త్వరలో సోనియా గాంధీ జీవితంపై పుస్తకం

కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ తన జీవితంపై రాస్తున్న పుస్తకం త్వరలో విడుదల కానుంది. అల్‌ఫ్రెడ్ ఎ.నాప్ ప్రచురణ సంస్థ ద్వారా వస్తున్న ఈ పుస్తకం పేరు ‘Belonging: A Journey of Love’. ఇందులో సోనియా వివాహం నుంచి జరిగిన విషయాలు, ఆమె రాజకీయ జీవితం గురించి రాశారు. “నా గురించి చాలామంది రాశారు. కానీ లోతుగా రాసిన కథనాలు చాలా తక్కువ” అని సోనియా గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు దశాబ్దాలుగా తను చూసిన సామాజిక, రాజకీయ మార్పులపై పాఠకులకు కొత్త కోణం అందించడం కోసమే ఈ పుస్తకం రాసినట్టు ఆమె తెలిపారు.

బురదగా మారిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు!
Local· 19 Aug 2026

బురదగా మారిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు!

TG: ఖమ్మం జిల్లాలోని ఏదిలాపురం ప్రజలు రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఊరి నుంచి బయటకు రావాలంటే బురదగా ఉన్న రోడ్డుపైనే వెళ్లాల్సి వస్తోంది. బైక్‌లపై వెళ్లేవారు స్కిడ్ అయ్యి కింద పడుతున్నారు. స్కూల్ పిల్లల దుస్తులపై బురద పడి ఇబ్బందులు పడుతున్నారు. అదే దారిలో చెత్తను తీసుకెళ్లే డంపింగ్ యార్డ్ వాహనాలు తిరగడంతో రోడ్డు మరింత పాడైంది. అధికారులకు ఎన్నిసార్లు అడిగిన పట్టించుకోవడం లేదని, వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

షాద్‌నగర్‌కు చేరిన బద్లావ్ జరూరి హై పాదయాత్ర
TG· 19 Aug 2026

షాద్‌నగర్‌కు చేరిన బద్లావ్ జరూరి హై పాదయాత్ర

TG: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు వెంటనే తీసుకువచ్చి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బద్లావ్ జరూరి హై పేరిట పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర షాద్‌నగర్‌కు చేరుకుంది. పట్టణ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పట్ల బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సు యాత్ర చేపట్టినట్లు వివరించారు.

మహదేవునిపేటలో మొసలి కలకలం
Local· 19 Aug 2026

మహదేవునిపేటలో మొసలి కలకలం

TG: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో మొసలి కలకలం రేపింది. KLI కాలువ నుంచి ఓ మొసలి గ్రామంలోని వ్యవసాయ బావిలోకి వచ్చినట్లు సమాచారం. అనంతరం బావి నుంచి బయటకు వచ్చి, పక్కనే ఉన్న గ్రామ చెరువులోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ గ్రామ చెరువు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు సూచిస్తున్నారు.

ప్రభుత్వ ప్రకటనపై జూడాల అసంతృప్తి
AP· 19 Aug 2026

ప్రభుత్వ ప్రకటనపై జూడాల అసంతృప్తి

AP: ఇంటర్నీలకు 5 శాతం, పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 3 శాతం పెంచుతామంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనపై జూనియర్ డాకర్ట్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 15 శాతం స్లైపెండ్ పెంచాలని కోరుతూ కొన్ని రోజులుగా రాష్ట్రంలో జూడాలు ఆందోళన చేస్తున్నారు. విధులకు వెళ్లకుండా సమ్మె చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఈ ప్రకటన ఇచ్చింది. కానీ దాని వాళ్లు అంగీకరించడం లేదు. పాత ప్రకటనే ప్రభుత్వం కొత్తగా చేసిందని, తమ సమ్మె కొనసాగుతుందని జూడాల జేఏసీ తెలిపింది.

చదువుల తల్లికి ఆర్థిక చేయూత
Local· 19 Aug 2026

చదువుల తల్లికి ఆర్థిక చేయూత

AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని సరిపెళ్ళ దివ్యశ్రీకి గుజరాత్ యూనివర్సిటీలో మెరిట్ పైన M.Sc ఫ్రీ సీట్ వచ్చింది. హాస్టల్ ఖర్చుల కోసం ఆ కుటుంబం ఇబ్బంది పడుతుండగా జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బి.శ్రీకాంత్ దంపతులు రూ.10 వేలు అందించారు. తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు రామిశెట్టి జగన్ రూ.5 వేలు అందించారు.

జూడాలకు 5 శాతం స్టైపెండ్ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం
AP· 19 Aug 2026

జూడాలకు 5 శాతం స్టైపెండ్ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం

AP: ప్రభుత్వం 15 శాతం స్టైపెండ్ పెంచాలని కోరుతూ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. విధులకు వెళ్లకుండా సమ్మె చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఇంటర్నీలకు 5 శాతం, పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 3 శాతం పెంచేందుకు నిర్ణయించింది. తక్షణం విధుల్లో చేరాలని ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేసింది. జనవరి 1 నుంచి ఇంటర్నీలకు ఇది వర్తిస్తుందని, ఆ తర్వాత ఏటా 3 శాతం పెంచుతామని తెలిపింది.

SIR ప్రక్రియను పూర్తి చేయాలి
Local· 19 Aug 2026

SIR ప్రక్రియను పూర్తి చేయాలి

TG : ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్, వివరాల్లో తప్పుల గుర్తింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైన వారికి నోటీసులు ఇచ్చి సిటిజన్‌షిప్ సర్టిఫికెట్లు స్వీకరించాలని తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు ఫిర్యాదులను తీసుకొని, అక్టోబర్‌ 15 వరకు నోటీసులు ఇస్తామన్నారు. ప్రజలకు సహాయంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆదేశించారు.