Latest

కాంగోను వణికిస్తున్న ఎబోలా!
కాంగోలో ఎబోలా వైరస్ చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతోంది. హెల్త్ మినిస్ట్రీ డేటా ప్రకారం ఇప్పటివరకు 5,021 కేస్‌లు రిజిస్టర్ అవ్వగా, 2,378 మంది చనిపోయారు. రెస్పాన్స్ టీమ్స్ ఆపేందుకు ట్రై చేస్తున్నా, అక్కడి ఇన్‌సెక్యూరిటీ, మైగ్రేషన్ వల్ల వైరస్ ఊహించని రేంజ్‌లో పెరుగుతోంది. ముఖ్యంగా రిమోట్ ఏరియాస్‌లో సిట్యుయేషన్ కంట్రోల్ తప్పడంతో ఆందోళన ఎక్కువైంది. దీంతో అఫీషియల్స్ హై అలర్ట్ డిక్లేర్ చేసి ఎమర్జెన్సీ మెజర్స్ తీవ్రం చేస్తున్నారు.

OTTలోకి ‘శ్రీనివాస మంగాపురం’!
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా OTT డేట్ వచ్చేసింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా రేపటి నుంచే (ఆగస్టు 20) అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ఇందులో రాషా తడానీ హీరోయిన్‌గా నటించగా, మోహన్ బాబు ముఖ్య పాత్రలో కనిపించారు. జి.వి. ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించింది.

150 ఏళ్ల తర్వాత పుస్తకం రిటర్న్..😯
ఆస్ట్రేలియాలో ఓ లైబ్రరీకి చెందిన పుస్తకం ఏకంగా 150 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది. 1858లో ప్రచురితమైన ‘Antiquities of Athens’ పుస్తకం ఓ ఇంటి ఫైర్‌ప్లేస్ వెనుక టీ చెస్ట్‌లో దొరికింది. అప్పటి లెక్కల ప్రకారం ఓవర్‌డ్యూ ఫైన్ ఇప్పుడు దాదాపు ₹19 లక్షలు! అయితే లైబ్రరీ మాత్రం ఫైన్ కట్టమని అడగడం లేదు. 1870ల బోరోయర్ రికార్డులు కూడా ఇప్పుడు అందుబాటులో లేవట!

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు(22) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. యువకుడు కొంతకాలంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం. చేతికొచ్చిన కొడుకును కోల్పోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఆగస్టు 21 నుంచి బుక్ బ్రహ్మ సాహిత్యోత్సవం
బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్(Book Brahma Literature Festival) మూడో ఎడిషన్ ఆగస్టు 21, 22, 23వ** తేదీల్లో బెంగళూరు కోరమంగలలోని సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో జరగనుంది. దీనికి ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈ ఏడాది ఉత్సవానికి ‘Linguistic Hegemony’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. వివిధ భాషలు, సంస్కృతులు, కథల మధ్య ఉన్న సంబంధాలు, భాషా ప్రాబల్యం అంశాలపై దృష్టి సారించనున్నారు. ఈ ఉత్సవంలో కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఇంగ్లిష్, బెంగాలీ వంటి భాషల్లో సాహిత్య చర్చలు, సెషన్లు జరుగుతాయి. పూర్తి వివరాలకు <a href="https://www.bookbrahmalitfest.com/">వెబ్‌సైట్</a> చూడొచ్చు.

ఒక్కో ఊరు.. ఒక్కో రకం బిర్యానీ!
బిర్యానీ అనగానే మనకు రకరకాల రుచులు గుర్తొస్తాయి. హైదరాబాదీ దమ్ బిర్యానీ, కలకత్తాలో బంగాళాదుంప వేసే బిర్యానీ, లక్నో అవధీ, చెట్టినాడు బిర్యానీ.. ఇలా దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకమైన రుచి ఉంది. ఏ ప్రాంతంలో చేసుకున్నా, ఏ పద్ధతిలో వండినా బిర్యానీ అంటే భారతీయులందరికీ ఎంతో ఇష్టం. వేర్వేరు రుచులు ఉన్నప్పటికీ.. 'బిర్యానీ' ప్రేమ మాత్రం మనందరినీ ఒక్కటిగా కలిపి ఉంచుతుంది.

CM రేవంత్‌రెడ్డి మాట ఇచ్చి మోసం చేశారు: సుష్మితా పటేల్
TG: కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ అన్నారు. మంత్రి పుట్టినరోజు వేడుకల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం కావడంలో తన తండ్రి కొండా మురళీ సహకరించారని చెప్పారు. తన తండ్రికి MLC పదవి ఇస్తానని హామీ ఇచ్చినా నెరవేర్చలేదని ఆరోపించారు.

చిన్న హోటళ్లు.. పెద్ద డిమాండ్!
దేశంలో ఇప్పుడు 20 కంటే తక్కువ సీట్లు ఉండే చిన్న హోటళ్ల (మైక్రో డైనర్స్)కు ఎక్కువగా డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ తినడానికి జనాలు ఆన్‌లైన్‌లో పోటీపడి ముందే సీట్లు బుక్ చేసుకుంటున్నారు. హంగులు, ఆడంబరాలు లేకపోయినా, టేస్టీ ఫుడ్ అందించడమే ఈ హోటళ్ల ప్రత్యేకత. ప్రశాంతమైన వాతావరణం ఉండటం, డైరెక్ట్ గా చెఫ్‌తో మాట్లాడే అవకాశం లభించడంతో ప్రజలు వీటిని ఎంతగానో ఇష్టపడుతున్నారు. బెంగళూరు, ముంబై, కోల్‌కతా వంటి సిటీల్లో ఈ కొత్త హోటళ్ల ట్రెండ్ బాగా పెరుగుతుంది.

CM విజయ్ నిర్ణయంపై నెటిజన్లు ఫైర్!
తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ కొత్త కార్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూయల్, డ్రైవర్ జీతాల కోసం నెలకు ₹75 వేలు, అసిస్టెంట్ కోసం మరో ₹25 వేల అలవెన్స్ ప్రకటించారు. VCK ఎమ్మెల్యే జోతిమణి అడిగిన వెంటనే సీఎం ఈ నిర్ణయం తీసుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బాగా ఆస్తులున్న ఎమ్మెల్యేలకు ఉచిత కార్లు, డబ్బులు ఎందుకని ట్రోల్ చేస్తున్నారు. సామాన్యుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం, ఎమ్మెల్యేలకు మాత్రం అడగనివి కూడా ఇస్తోందని సటైర్లు వేస్తున్నారు.

టికెట్ ధరలు పెంచితే 20శాతం సర్కారుకే!
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే వసూళ్లలో 20 శాతాన్ని సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు ఇవ్వాలని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. పెద్ది, రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, అఖండ 2 సినిమాల టికెట్ ధరల పెంపుతో వచ్చిన కలెక్షన్‌లో 20శాతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్, టీజీఎఫ్‌డీసీ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. థియేటర్ల యజమానుల నుంచి వసూలు చేసి అందించే బాధ్యతను ప్రభుత్వం నిర్మాతలకు అప్పగించింది.

7,967 SBI ఉద్యోగాలు.. ఆగస్టు 31తో అప్లికేషన్స్ క్లోజ్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకు <a href="https://sbi.bank.in/web/careers/current-openings">నోటిఫికేషన్</a> విడుదలైంది. మొత్తం 7,967 పోస్టులు ఉండగా, 7,680 రెగ్యులర్ వేకెన్సీస్, 287 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈనెల 11 నుంచి అప్లికేషన్స్ మొదలవగా, 31న ముగుస్తాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తిచేసిన వారు అర్హులు. 20 నుంచి 28 ఏళ్ల అభ్యర్థులు <a href="https://ibpsreg.ibps.in/sbijajul26/">ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.</a> జనరల్, OBC, EWS కాండిడేట్స్‌కు ఫీజు రూ.750 ఉంటుంది. SC/ST/PwBD వారికి ఎటువంటి ఫీజు లేదు.

హైదరాబాద్ ఇరానీ చాయ్ ఇక జ్ఞాపకమేనా?
హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇరానీ ఛాయ్, ఇరానీ కేఫ్‌లే. కానీ, ఇప్పుడు ఆ కేఫ్‌లు ఒక్కొక్కటిగా కనిపించకుండా పోతున్నాయి. పాలు, టీ పొడి, గ్యాస్ ధరలు పెరగడం, మరోవైపు కొత్త కాఫీ షాప్‌ల పోటీ వల్ల వీటిని నడపడం కష్టంగా మారింది. టీ తయారు చేసే సరైన మనుషులు దొరక్కపోవడం, లాభాలు తగ్గడంతో యజమానులు కేఫ్‌లను మూసేస్తున్నారు. కొత్త తరం కూడా ఈ వ్యాపారంలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. మన సంస్కృతిలో భాగమైన ఈ పాత కేఫ్‌లు ఇలా తగ్గిపోవడం బాధాకరం.
నర్సంపేటలో బంద్‌కు బీఆర్‌ఎస్ బైక్ ర్యాలీ
TG: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా బుధవారం నర్సంపేట పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. తెరిచి ఉన్న వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి బంద్ పాటించాలని వ్యాపారులను కోరారు. ర్యాలీ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ పట్టణంలో పర్యటించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

వరంగల్ జాతీయ సదస్సుకు భారీగా తరలిరావాలి
AP: సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్ జాతీయ స్థాయి సదస్సును విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బాపట్ల మండలంలోని ప్యాట్సిన్‌పేటలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు. నూతన మండల కమిటీల నిర్మాణం చేపట్టారు. మహాజన సోషలిస్టు పార్టీ బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు బుడంగుంట్ల లక్ష్మీనరసయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మల్లవరపు గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో MRPS, MSP, MSF నూతన మండల కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
TG: అదుపుతప్పిన కారు ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని ముత్తజిపేటలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా గంధంపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు కారులో మేడారం వెళ్తుండగా ముత్తజిపేట సమీపంలో కారు అదుపుతప్పింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది నాగరాజు, పాషా ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
TG: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం శివారులోని బాలు తండాకు చెందిన తేజావత్ వెంకటేష్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్ వైనాల నాగరాజు, ఈఎంటీ పాషా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మాటలు లేకుండానే మాట్లాడుకోగలిగితే..?
ఇప్పటివరకు ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే మాటలు కావాలి, మెసేజ్ కావాలి. కానీ ఇవేవీ చేయకుండా… మనసులో అనుకున్నదే అవతలి వ్యక్తికి చేరితే? ఇదే ఆలోచనతో శాస్త్రవేత్తలు మెదడు నుంచి వచ్చే సంకేతాలను గుర్తించి, వాటిని సమాచారంగా మార్చే టెక్నాలజీపై పని చేస్తున్నారు. అంటే మనసులో ఉన్న ప్రతి ఆలోచనను చదివేయడం కాదు… మెదడు పంపే సంకేతాల్లో అర్థం చేసుకోగల సమాచారాన్ని గుర్తించే ప్రయత్నం. ఇది ఇంకా మొదటి దశలోనే ఉంది.ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే… “చెప్పడం” కంటే “ఆలోచించడం”తోనే కమ్యూనికేట్ చేసే రోజులు రావచ్చు.

గ్రామాల్లో దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన
TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు అర్హతే ప్రామాణికంగా లబ్ధి చేకూర్చేలా క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని అలురు, బోరేగావ్, సాయినగర్ తండా గ్రామాల్లో గెజిటెడ్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించారు. హెచ్‌వో మౌనిక గ్రామాల్లో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలురు గ్రామానికి చెందిన కుమ్మరి చంద్రకళ పరమేష్ తదితరుల దరఖాస్తులను తనిఖీ చేశారు.

కార్లలో డేంజరస్ కెమికల్స్!
కార్ల లోపల ఉన్న గాలిలో క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకర కెమికల్స్ ఉన్నాయన్న వార్తలపై ICMR రీసెర్చ్ చేస్తోంది. 2015-2022 మోడల్ కార్లలో జరిపిన అధ్యయనంలో 99% వెహికల్స్‌లో 'TCIPP' అనే డెంజరస్ రసాయనాన్ని గుర్తించారు. డ్రైవర్లపై వీటి ప్రభావం తెలుసుకునేందుకు 3 ప్రాంతాల నుంచి 180 శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ అధ్యయనంపై లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ICMRను NGT ఆదేశిస్తూ, విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.

ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపు
TG: ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 20న సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు తెలిపారు. సత్తుపల్లి, వేంసూరు ప్రాంతాల నుంచి రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

డ్రాగ్ ఆర్టిస్టులు తీసుకొస్తున్న ఒక గొప్ప మార్పు!
మన దేశంలోని డ్రాగ్ ఆర్టిస్టులు విదేశీ పాటలను పక్కనపెట్టి, మన ప్రాంతీయ సంగీతం, జానపద కళలతో వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఒక వేడుకలో 'ట్రిక్సీ ప్రేమా' అనే కళాకారుడు 'బాహుబలి' పాటకి డ్యాన్స్ చేశారు. మన పద్ధతిలో ఇస్తున్న ఈ ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. జానపద కళల్లో పురుషులు స్త్రీ పాత్రలు, స్త్రీలు పురుష పాత్రలు వేయడం మన సంస్కృతిలో భాగమే. అదే పరంపరను వీరు కొనసాగిస్తూ, తమ డ్యాన్స్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే మంచి సందేశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.