Latest

శ్రీలంకపై భారత్ జోరు.. 165 పరుగుల భారీ గెలుపు!
Sports· 19 Aug 2026

శ్రీలంకపై భారత్ జోరు.. 165 పరుగుల భారీ గెలుపు!

గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే ఆలౌట్ చేసి 165 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462, రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. ఈ టెస్టులో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు.

అభివృద్ధి పనులు పరిశీలించిన డిప్యూటీ కమిషనర్‌
Local· 19 Aug 2026

అభివృద్ధి పనులు పరిశీలించిన డిప్యూటీ కమిషనర్‌

TG: నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లి గ్రామాన్ని పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌ సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫామ్‌పాండ్‌, చేపల చెరువు, స్టీల్‌ బ్యాంక్‌ను పరిశీలించారు. అనంతరం డస్ట్‌బిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామస్తులకు పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ, డీఎల్‌పీఓ, డీఆర్‌డీఓ, ఎంపీడీవో తదితర అధికారులు పాల్గొన్నారు.

స్టైఫండ్‌ కోసం రోడ్డెక్కిన డాక్టర్లు.. గుంటూరులో ర్యాలీ
Local· 19 Aug 2026

స్టైఫండ్‌ కోసం రోడ్డెక్కిన డాక్టర్లు.. గుంటూరులో ర్యాలీ

AP: స్టైఫండ్‌ పెంపు కోసం గుంటూరు జీజీహెచ్‌ జూనియర్‌ డాక్టర్లు రోడ్డెక్కారు. స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. రమేష్‌ హాస్పిటల్‌ సిగ్నల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య సేవల్లో ఎదురవుతున్న పని ఒత్తిడి, విధుల భారం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా స్టైఫండ్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

గ్రీస్‌లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి?
Entertainment· 19 Aug 2026

గ్రీస్‌లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి?

సన్ రైజర్స్ హైదరాబాద్ CEO కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ నవంబర్ 10న గ్రీస్‌లో వివాహం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల అనిరుధ్ మేనమామ వై.జి. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్‌కి త్వరలోనే పెళ్లి జరగనుందని చెప్పడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

TIMSలో ఉద్యోగాలు.. నెలకు రూ.19,500 జీతం!
Jobs· 19 Aug 2026

TIMSలో ఉద్యోగాలు.. నెలకు రూ.19,500 జీతం!

TG: సనత్‌నగర్‌ TIMS హాస్పిటల్‌లో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ డా. సాయినారాయణ గౌడ్‌ తెలిపారు. గ్రాడ్యుయేషన్‌, DCA అర్హత ఉన్నవారికి నెలకు రూ.19,500 వేతనం అందించనున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెల 21న ఉ. 11 గం. నుంచి సా. 5 గంటల వరకు సికింద్రాబాద్‌ ప్యాట్నీ దగ్గరలోని NTPC బిల్డింగ్ 4th ఫ్లోర్ DMHO ఆఫీసులో Interviewలకు హాజరుకావాలన్నారు. ఎంపిక జాబితాను ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

తెలుగు నేర్చుకుంటూ ఆనందిస్తున్నా : సొనాలి కులకర్ణి
Entertainment· 19 Aug 2026

తెలుగు నేర్చుకుంటూ ఆనందిస్తున్నా : సొనాలి కులకర్ణి

హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది పారడైజ్' సినిమాతో నటి సొనాలి కులకర్ణి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు భాష నేర్చుకుంటున్నానని, ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీ తనని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించిందని, హైదరాబాద్ సొంత ఇంటిలా అనిపిస్తోందని తెలిపారు. షూటింగ్ సమయంలో ముద్దపప్పు తన ఫేవరెట్ ఫుడ్‌గా మారిందని అన్నారు.

మరణశిక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు రియాక్షన్!
Current Affairs· 19 Aug 2026

మరణశిక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు రియాక్షన్!

ఉరిశిక్షకు బదులుగా తక్కువ టైమ్‌లో ప్రాణం తీసే ఇంజెక్షన్ ద్వారా మరణశిక్షలు వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని, ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉరికి 40Min పడుతుందని, ఇంజెక్షన్‌తో 5 నిమిషాల్లో ముగించవచ్చని పిటిషనర్ వాదించారు. అయితే, ఆల్టర్నేటివ్ పద్ధతులపై సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉంటే భవిష్యత్తులో పరిశీలించవచ్చని, ప్రత్యామ్నాయాలపై కమిటీ వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ పేర్కొంది.

నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ
Local· 19 Aug 2026

నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ

AP: సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు అధికారులు భూమిపూజ చేశారు. కన్స్ట్రక్షన్ ఈఈ శ్రీధర్, హిందూపూర్ డివిజన్ ఆపరేషన్ ఈఈ చంద్రనాయక్, డీఈఈ నాగన్న, గుండుమల సర్పంచ్ చంద్రప్పతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే గుండుమలతో పాటు పరిసర గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్ అంతరాయాలు తగ్గడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా సరఫరా సామర్థ్యం పెరుగుతుందన్నారు.

దళిత భూములకు మాత్రమే హెచ్చరిక బోర్డులా?
Local· 19 Aug 2026

దళిత భూములకు మాత్రమే హెచ్చరిక బోర్డులా?

AP: తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం సాదువారిపల్లెలోని సర్వేనెంబర్ 67లో ఉండే 173.04 సెంట్లు సాధువారిపల్లె దళితుల అధీనంలో ఉండగా పుల్లంపేట మండలం రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం దారుణమని అఖిల భారత అంబేద్కర్ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ పెంచలయ్య అన్నారు. ఆ సర్వే నెంబర్‌లో ఉండే భూములను కొందరు అగ్రవర్ణానికి చెందినవారు ఆక్రమించి సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారన్నారు. దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.

క్యాన్సర్‌పై కొత్త CRISPR ప్రయోగం! 🧬
Technology· 19 Aug 2026

క్యాన్సర్‌పై కొత్త CRISPR ప్రయోగం! 🧬

క్యాన్సర్ కణాల్లో కనిపించే ప్రత్యేక మార్పులను టార్గెట్ చేసే కొత్త CRISPR ఎంజైమ్‌పై రీసెర్చ్ జరుగుతోంది. ఈ ఎంజైమ్ క్యాన్సర్ కణాల DNAను దెబ్బతీయగల సామర్థ్యాన్ని చూపించినట్లు రీసెర్చర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉంది. అయినా, క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసే కొత్త ట్రీట్‌మెంట్‌లకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇది మనుషుల్లో ఎంతవరకు పనిచేస్తుంది, ఎంత సేఫ్ అనేది తెలియాలంటే ఇంకా రీసెర్చ్ అవసరం.

ఆటోలు, క్యాబ్‌లు రోడ్డెక్కవు.. ఆగస్టు 24 నుంచి సమ్మె!
Current Affairs· 19 Aug 2026

ఆటోలు, క్యాబ్‌లు రోడ్డెక్కవు.. ఆగస్టు 24 నుంచి సమ్మె!

TG: రాష్ట్రంలో ఆటో, యాప్‌ ఆధారిత క్యాబ్‌లు, స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్లు ఆగస్టు 24న సమ్మెకు సిద్ధమయ్యారు. రవాణా కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని తెలంగాణ స్టేట్‌ ఆటో, యాప్‌ బేస్డ్‌ యూనియన్స్‌ JAC ఆరోపించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఆటో డ్రైవర్ల ఇన్‌కమ్ తగ్గిందని తెలిపింది. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు JAC ప్రకటించింది. డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 12 వేలు అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డబ్బాలు తీశారు.. దుకాణాలు వదిలేశారు
Local· 19 Aug 2026

డబ్బాలు తీశారు.. దుకాణాలు వదిలేశారు

TG: చిరు వ్యాపారుల డబ్బాలు తొలగించి.. పెద్ద దుకాణ సముదాయాలను మాత్రం వదిలేయడంపై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ కూడలి విస్తరణలో భాగంగా రహదారులపై ఆక్రమణలను జేసీబీలతో తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించినా, పెద్ద వ్యాపారుల దుకాణ సముదాయాల వద్ద మార్కింగ్‌ చేసి వదిలేయడంపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దయనీయ స్థితిలో మెదక్ జిల్లా తండాలు
Local· 19 Aug 2026

దయనీయ స్థితిలో మెదక్ జిల్లా తండాలు

TG: మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ సదాశివనగర్ తండా, పర్వతాపూర్ గ్రామపంచాయతీ బాపనయ్య తండా, కాట్రియాల గ్రామపంచాయతీ పనియా తండా, కిషన్ తండా, కాట్రియాల తండా నుంచి కిషన్ తండాకు వెళ్లే దారి, జెమ్ల తండా గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్ర తండా, బిల్య తండా, సుభాష్ తండా, బిక్షపతి తండాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. రహదారులు లేక ప్రజలు బురదలోనే రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. టూవీలర్స్, ఆటోలు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

యాప్ వచ్చినా..యూరియా కష్టాలు తీరలేదన్నా!
Agriculture· 19 Aug 2026

యాప్ వచ్చినా..యూరియా కష్టాలు తీరలేదన్నా!

TG: యూరియా కోసం యాప్‌లో బుక్‌ చేసుకున్నారు. బుకింగ్‌ సక్సెస్‌ అంటూ చూపించింది. తీరా యూరియా తీసుకునేందుకు దుకాణానికి వెళ్తే స్టాక్‌ లేదు అంటూ సమాధానం వస్తోంది. దీంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. యూరియా సరఫరాను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం ఒకవైపు యాప్‌లో బుకింగ్‌ చేసుకోవడం, మరోవైపు దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెయ్యి పేరుతో పామాయిల్.. హైదరాబాద్‌లో భారీ దందా!
TG· 19 Aug 2026

నెయ్యి పేరుతో పామాయిల్.. హైదరాబాద్‌లో భారీ దందా!

TG: హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, అమ్మకాలపై H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. సిటీలోని 130 సెంటర్లలో తనిఖీ చేయగా, పామాయిల్, వనస్పతి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లతో కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. 36 టన్నుల కల్తీ నెయ్యి, రా మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 10-40 శాతం కల్తీతో తయారైన నెయ్యిని రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులకు సప్లై చేస్తున్నట్లు తేలింది. DCP గైక్వాడ్ వైభవ్, హైదరాబాద్ CP సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

శీర్ష గ్రామంలో పెద్దపులి సంచారం..  హైఅలర్ట్‌
Local· 19 Aug 2026

శీర్ష గ్రామంలో పెద్దపులి సంచారం.. హైఅలర్ట్‌

TG: కొమురంభీమ్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. చెరువు వద్ద, పత్తి చేనుల్లో పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించి పులి పాదముద్రలను గుర్తించారు. పులి ప్రస్తుతం కంకాలమ్మ గుట్ట వైపు వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో కంకాలమ్మ ఆలయం వైపు ప్రజలు, భక్తులు వెళ్లవద్దని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

గుమ్మరేగుల భూములకు పట్టాలు ఇప్పించండి
Local· 19 Aug 2026

గుమ్మరేగుల భూములకు పట్టాలు ఇప్పించండి

AP: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామపంచాయతీ పరిధిలోని భూములకు సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాలు ఇప్పించాలని రైతులు జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ను కోరారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు రౌతులపూడి టీడీపీ యువ నాయకుడు పైల వేణు రైతులతో కలిసి జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. రైతుల సమస్యను సానుకూలంగా విన్న జాయింట్‌ కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌‌ను ఆదేశించినట్లు తెలిపారు.

కల్తీ కోవా అక్రమ రవాణా.. 174 కిలోల పదార్థాలు స్వాధీనం
Local· 19 Aug 2026

కల్తీ కోవా అక్రమ రవాణా.. 174 కిలోల పదార్థాలు స్వాధీనం

TG: వికారాబాద్ జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. కల్తీ కోవాను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా టీమ్ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 174 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కల్తీ ఆహార పదార్థాలను తయారు చేయడం, రవాణా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చక్కెర ధర కట్టడికి కేంద్రం బిగ్ ప్లాన్!
Current Affairs· 19 Aug 2026

చక్కెర ధర కట్టడికి కేంద్రం బిగ్ ప్లాన్!

పండుగల సీజన్ ముందర దేశంలో చక్కెర ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో క్వింటాల్ హోల్‌సేల్ ధర రూ.5,350కి చేరగా, రిటైల్ ప్రైస్ కిలో రూ.52.30 దాటింది. దీంతో కేంద్రం రేట్లను కంట్రోల్ చేయడానికి టాక్స్ (ఇంపోర్ట్ డ్యూటీ) లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల షుగర్ దిగుమతికి పర్మిషన్ ఇవ్వడం, పెద్ద వ్యాపారుల నిల్వలపై లిమిట్స్ విధించడం, మిల్లుల నెలవారీ సేల్స్‌లో మార్పులు చేయడం లాంటి పలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ICU రోగులకు  CRRTతో ప్రాణరక్షణ
Local· 19 Aug 2026

ICU రోగులకు CRRTతో ప్రాణరక్షణ

TG: ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు CRRT (కంటిన్యూస్ రీనల్ రీప్లేస్‌మెంట్ ట్రీట్‌మెంట్) ఆధునిక ప్రాణరక్షక చికిత్సగా నిలుస్తోందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సీఆర్ఆర్‌టీ యంత్రం పనితీరు, వినియోగం, ప్రయోజనాలపై మాట్లాడారు. నెఫ్రాలజిస్టు డాక్టర్‌ రాంచందర్‌, క్రిటికల్‌ కేర్‌ నిపుణుడు ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం సాధారణమేనని, అలాంటి సమయంలో సీఆర్ఆర్‌టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఉన్నత చదువులకు స్టూడెంట్స్ దూరం!
Education· 19 Aug 2026

ఉన్నత చదువులకు స్టూడెంట్స్ దూరం!

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.7,000 కోట్లకు చేరడంతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ ప్రమాదంలో పడింది. ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు టిసి, బోనఫైడ్, మెమోలు ఇచ్చేందుకు అస్సలు ఒప్పుకోవట్లేదు. దీంతో మంచి ర్యాంకులు వచ్చినా పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో అప్లై చేసుకోలేక స్టూడెంట్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి రీయింబర్స్‌మెంట్ పెండింగ్ క్లియర్ చేయాలని, తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోరుతున్నారు.