Latest

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. అడ్డొచ్చాడని దాడి
Crime· 15 Aug 2026

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. అడ్డొచ్చాడని దాడి

AP: కడప జిల్లా వల్లూరులో క్షుద్రపూజలకు అడ్డుపడుతున్నాడనే కారణంతో బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పులిచెర్లకు చెందిన విజయ్‌కుమార్, చిత్తూరుకు చెందిన హేమంత్, సుబ్రహ్మణ్యం గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేసేందుకు ఓ బాలికను డబ్బు ఆశచూపి నగ్న పూజలకు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పూజలకు అడ్డుగా ఉన్న నాగసాయి ప్రణవ్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి, విఫలమై వేటకత్తితో దాడిచేశారన్నారు.

నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవం తేవాలి: చాడ
TG· 15 Aug 2026

నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవం తేవాలి: చాడ

TG: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని నర్మాల ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని CPI నాయకుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల రైతులకు జీవనాడిగా ఉన్న ఈ ప్రాజెక్టు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. 2.2 TMCల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం భారీగా పూడిక పేరుకుపోవడంతో సుమారు 1.2 TMCలకే పరిమితమైందని తెలిపారు. గతంలో 22–23 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు ప్రస్తుతం రైతుల అవసరాలను తీర్చలేకపోతోందన్నారు.

జాతీయ జెండా Rules తెలుసా?
Current Affairs· 15 Aug 2026

జాతీయ జెండా Rules తెలుసా?

జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. జాతీయ జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి ఎప్పుడూ 3:2 లోనే ఉండాలి. రూల్స్ ప్రకారం జెండాను చేత్తో నేసిన ఖాదీ కాటన్ లేదా సిల్క్ వస్త్రంతోనే తయారు చేయాలి. ప్లాస్టిక్ జెండాలను అస్సలు వాడకూడదు. జెండాను నేలకు లేదా నీటికి తాకించకూడదు. భారత జెండా కోడ్ ప్రకారం, 2022 జూలైలో చేసిన సవరణ తర్వాత పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా జాతీయ జెండాను ఇళ్లపై ఎగురవేయవచ్చు.

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
TG· 15 Aug 2026

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

TG: వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలోని 67 పుష్కర ఘాట్లను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖల ద్వారా సుమారు రూ.1,000 కోట్లతో ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

తాగునీటికే ఫస్ట్ ప్రియారిటీ: CM
AP· 15 Aug 2026

తాగునీటికే ఫస్ట్ ప్రియారిటీ: CM

AP: రాష్ట్రంలో నీటి లభ్యత ఆధారంగానే నీటి నిర్వహణ చేపట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పారిశ్రామిక అవసరాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సచివాలయంలో జలవనరుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. లోటు వర్షపాతం నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువులు, భూగర్భజలాలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నీటినిల్వలు, నీటి విడుదల, తాగునీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక జలహారతి కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు.

AI మనల్ని Smart చేస్తుందా… లేక Lazyగానా?
Technology· 15 Aug 2026

AI మనల్ని Smart చేస్తుందా… లేక Lazyగానా?

AIకి మన పనులన్నీ అప్పగించేస్తే.. మెదడుకి పని తగ్గిపోతుందా? ఒక మెయిల్ రాయడం నుంచి ఐడియా చెప్పడం వరకు AI పనులను సెకన్లలో చేసి పెడుతోంది. దీంతో టైమ్ సేవ్ అవుతుంది. కానీ ప్రతి సందేహానికి AIనే అడిగి, ఆలోచించే పనినీ దానికి అప్పగిస్తే.. మనమే ఆలోచించి సమస్యను పరిష్కరించే అలవాటు తగ్గొచ్చు. 2025లో 319 మంది జ్ఞాన ఆధారిత ఉద్యోగులపై అధ్యయనంలో, AIపై ఎక్కువ నమ్మకం ఉన్నవాళ్లు క్రిటికల్ థింకింగ్‌కు తక్కువ శ్రమ పెట్టినట్లు కనిపించింది. అంటే AI మంచిదా చెడ్డదా అనేది కాదు.. దాన్ని ఎలా వాడుతున్నామన్నదే అసలు విషయం.

భిన్నత్వంలో ఏకత్వానికి జెండా గుర్తు
Current Affairs· 15 Aug 2026

భిన్నత్వంలో ఏకత్వానికి జెండా గుర్తు

1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే, అంటే 1947 జూలై 22న జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని మన అధికారిక జాతీయ జెండాగా ఆమోదించారు. నాటి నుంచి ఈ జెండా మన స్వేచ్ఛకు, సార్వభౌమత్వానికి గుర్తుగా నిలిచింది. మన దేశంలో ఎన్ని మతాలు, భాషలు ఉన్నా, ఈ జెండాను చూడగానే మనమంతా 'భారతీయులం' అని గర్వంగా చెప్పుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ జెండానే గొప్ప గుర్తు.

చదువు ఒక్కటే కాదు.. స్కిల్ కూడా ఉండాలి: CM
TG· 15 Aug 2026

చదువు ఒక్కటే కాదు.. స్కిల్ కూడా ఉండాలి: CM

తెలంగాణలో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని CM రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువుతో తలరాత మారుతుందని, అన్ని వర్గాలు కలిసి చదువుకోవడం ద్వారా కులవ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఏటా రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ముందుగానే జమ చేస్తున్నామని వెల్లడించారు.

జైశ్రీరామ్‌ నినాదాలపై అనసూయ సంచలన కామెంట్స్
Viral· 14 Aug 2026

జైశ్రీరామ్‌ నినాదాలపై అనసూయ సంచలన కామెంట్స్

జైశ్రీరామ్‌ నినాదాలపై అనసూయ సంచలన కామెంట్స్ చేశారు. ‘జైశ్రీరామ్‌’ అనేవాళ్లలో కొందరు ఆ ముసుగులో దాడులు చేస్తున్నారని చెప్పారు. జైశ్రీరామ్‌ అంటేనే విలువలు ఉన్నట్లు కాదని, నినాదాలు కాదు, వ్యక్తుల ప్రవర్తనే ముఖ్యమని అన్నారు. ఈ కామెంట్స్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని NSF పిలుపు
National· 14 Aug 2026

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని NSF పిలుపు

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు పాల్గొనకూడదని నాగాలాండ్ రాష్ట్రంలోని నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్(NSF) అన్ని పాఠశాలలు, కళాశాలలకు సూచనలిచ్చింది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ‘నాగా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం, జాతీయ జెండా, జాతీయ గీతానికి వ్యతిరేకం కాదని’ తెలిపింది. పూర్తి వెర్షన్ వందేమాతరం(ఆరు స్టాంజాలు)ను బలవంతంగా పాడించడం మాత్రం అంగీకరించమని తెలిపింది. ఇది మతపరమైన భక్తితో ఉండటం వల్ల క్రైస్తవ మెజారిటీ నాగా సమాజానికి ఇది విరుద్ధమని అంటున్నారు.

పోలీస్ జాబ్స్‌కు Age Limit పెంపు
TG· 14 Aug 2026

పోలీస్ జాబ్స్‌కు Age Limit పెంపు

TG: రాష్ట్రంలో యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు ఏజ్ లిమిట్ రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఏజ్ రిలాక్సేషన్‌కు అదనంగా ఈ రెండేళ్ల వయోపరిమితి పెంపుతో జీవో జారీ చేసింది. యువత రిక్వెస్ట్‌లు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

యోగి ఆదిత్యనాథ్‌పై కెనడా హక్కుల సంఘాల పిటీషన్
Current Affairs· 14 Aug 2026

యోగి ఆదిత్యనాథ్‌పై కెనడా హక్కుల సంఘాల పిటీషన్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తోపాటు ఏడుగురు ఇతర భారతీయ అధికారులపై ఆంక్షలు విధించాలని కెనడాలోని Justice For All Canada, Canadian Forum for Human Rights and Democracy in India(CFHRDI) గ్లోబల్ అఫైర్స్ కెనడాకు పిటీషన్ ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలను ఇందులో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లు, పోలీసు హింస, టార్చర్, బుల్డోజర్ చర్యలు, అరెస్టులు ఉన్నాయని ఈ సంఘాలు ఆరోపించాయి.

జర్నలిస్టుపై నోరు పారేసుకున్న ధర్మపురి అరవింద్
TG· 14 Aug 2026

జర్నలిస్టుపై నోరు పారేసుకున్న ధర్మపురి అరవింద్

TG: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ జర్నలిస్టుపై నోరుపారేసుకున్నాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ "ఇప్పుడే చెప్పిన కదా బేవకూఫ్" అంటూ ప్రశ్న అడిగిన విలేకరిపై మండిపడ్డారు. దీనిపై విలేకరులు మండిపడుతున్నారు. జర్నలిస్టుకు కనీస మర్యాద ఇవ్వడం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

అద్దంలో Left-Right మారుతుంది.. Up-Down ఎందుకు మారదు?
Education· 14 Aug 2026

అద్దంలో Left-Right మారుతుంది.. Up-Down ఎందుకు మారదు?

అద్దంలో మన ఎడమ-కుడి వైపులు మారిపోయినట్టు ఎందుకు కనిపిస్తాయి కానీ పై-కింద మాత్రం మారవు? 👀 నిజానికి అద్దం Left-Rightను నేరుగా మార్చదు. అది మన ముందు-వెనుక దిశను తిప్పుతుంది. మనం అద్దంలో చూసేటప్పుడు, అద్దం మన ముందున్న వస్తువును వెనుకకు తిరిగినట్టుగా ప్రతిబింబిస్తుంది. అదే మార్పును మన మెదడు ఎడమ-కుడి మార్పుగా అర్థం చేసుకుంటుంది. కానీ పై-కింద దిశలో అద్దం ఎలాంటి మార్పు చేయదు. అందుకే తల పైకెత్తితే ప్రతిబింబం కూడా పైకే చూస్తుంది. అంటే అద్దం నిజంగా Left-Rightను మార్చదు.. మనం దాన్ని అలా అర్థం చేసుకుంటాం.

ఉజ్జయినిలో 2,200 ఏళ్ల నాటి బౌద్ధ స్తూపం కోసం తవ్వకాలు
Current Affairs· 14 Aug 2026

ఉజ్జయినిలో 2,200 ఏళ్ల నాటి బౌద్ధ స్తూపం కోసం తవ్వకాలు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని వైశ్య టెక్రీ దగ్గర 2,200 సంవత్సరాల నాటి భారీ బౌద్ధ స్తూపం ఉండవచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ప్రసిద్ధ సాంచీ స్తూపం కంటే చాలా పెద్దదని అంటున్నారు. ఈ రహస్యాన్ని వెలికితీయేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ (ASI) కలిసి తవ్వకాలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. 1938-39లో బ్రిటిష్ పాలన టైంలో ఇక్కడ తవ్వకాలు జరిగాయి. అప్పటి నివేదిక ప్రకారం ఈ స్తూపం వ్యాసం సుమారు 350 అడుగులు, ఎత్తు కనీసం 100 అడుగులు ఉండవచ్చని అంచనా.

వాజ్‌పేయికి గొడుగు పట్టిన ఇందిరాగాంధీ
Current Affairs· 14 Aug 2026

వాజ్‌పేయికి గొడుగు పట్టిన ఇందిరాగాంధీ

ఈ ఫొటో వెనుక ఉన్న చరిత్రేమిటో తెలుసా? 1972 జూలైలో భారత్-పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. అప్పటి జనసంఘ్ ప్రముఖ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి సిమ్లాకు వెళ్లి తన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ వాజ్‌పేయిని ఆహ్వానించి లాన్‌లో ఆయనతో మాట్లాడారు. ఆ టైంలో వాన మొదలైంది. అధికారి ఒకరు ప్రధానమంత్రికి గొడుగు ఇవ్వగా, ఇందిరాగాంధీ ఆ గొడుగు వాజపేయి తలపై పట్టారు. వారిద్దరూ అలాగే మాట్లాడుకున్నారు.

ఇదే నా లాస్ట్ వరల్డ్ కప్- మన్‌ప్రీత్ సింగ్
Sports· 14 Aug 2026

ఇదే నా లాస్ట్ వరల్డ్ కప్- మన్‌ప్రీత్ సింగ్

ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్ వేదికగా Hockey World Cup 2026 ప్రారంభం కానుంది. 1975 తర్వాత మళ్లీ కప్ గెలవడమే టార్గెట్‌గా టీమ్‌ఇండియా బరిలోకి దిగుతోంది. తనకిది లాస్ట్ వరల్డ్ కప్ కావచ్చు అని, అందుకే ఎలాగైనా మెడల్ గెలిచి తీరుతామని సీనియర్ మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. పూల్-D లో ఉన్న భారత్.. ఆగస్టు 15న వేల్స్‌తో, 17న ఇంగ్లాండ్‌తో, 19న పాకిస్థాన్‌తో ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌ల్లో ఆడనుంది.

‘విక్టోరియా మెమోరియల్’..చరిత్ర తెలుసా?
Current Affairs· 14 Aug 2026

‘విక్టోరియా మెమోరియల్’..చరిత్ర తెలుసా?

హైదరాబాద్ మెట్రో మార్గంలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ ఒకటి. చైతన్యపురి, ఎల్బీనగర్ స్టేషన్ల మధ్యలో ఉండే స్టేషన్ ఇది. ‘విక్టోరియా మెమోరియల్’ చరిత్రేమిటో తెలుసా? 1901లో హైదరాబాద్ నిజాం మహబూబ్ అలీ ఖాన్ సరూర్‌నగర్‌లో ‘మహల్-ఎ-సరూర్‌నగర్’ అనే భవన నిర్మాణం మొదలుపెట్టి, అసంపూర్తిగా వదిలేశారు. 1901 జనవరిలో క్వీన్ విక్టోరియా మరణించారు. అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్ బార్ నిజాంను కోరి, ఆ భవనాన్ని పూర్తి చేసి ‘Victoria Memorial Orphange’గా మార్చారు. ఇప్పటికీ అది విక్టోరియా మెమోరియల్ హోమ్‌గా కొనసాగుతోంది.

Incognitoలో కూడా మిమ్మల్ని ఎవరు చూడగలరో తెలుసా? 🕵️‍♂️
Technology· 14 Aug 2026

Incognitoలో కూడా మిమ్మల్ని ఎవరు చూడగలరో తెలుసా? 🕵️‍♂️

ఇంకాగ్నిటో ఓపెన్ చేశామంటే ఇక మనం ఇంటర్నెట్‌లో Invisible అనుకుంటే అది తప్పే! ఈ మోడ్‌లో మన బ్రౌజింగ్ హిస్టరీ, కుకీలు, సైట్ డేటా లాంటివి మన డివైస్‌లో సాధారణంగా సేవ్ కావు. కానీ మనం ఏ వెబ్‌సైట్లకు వెళ్తున్నామో ఆ వెబ్‌సైట్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఆఫీస్ లేదా కాలేజ్ నెట్‌వర్క్ నిర్వాహకులకు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్, సేవ్ చేసిన బుక్‌మార్క్స్ మాత్రం ఉంటాయి. అంటే ఇంకాగ్నిటో అనేది పూర్తిగా దాక్కునే మోడ్ కాదు.. మన డివైస్‌లో బ్రౌజింగ్ జాడలను తగ్గించే ఫీచర్ మాత్రమే.

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా
National· 14 Aug 2026

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు అనేక రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం జేపీ నద్దా ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్డియాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రివర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

📞 మొదటి Phone Call ఎవరికి చేశారు?
Technology· 14 Aug 2026

📞 మొదటి Phone Call ఎవరికి చేశారు?

ఇప్పుడు రోజుకు ఎన్నో Calls చేస్తుంటాం.. కానీ మొబైల్ చరిత్రలో మొదటి కాల్ ఎవరికి చేశారో తెలుసా? 😏 1973 ఏప్రిల్ 3న Motorola ఇంజనీర్ మార్టిన్ కూపర్ న్యూయార్క్‌లోని ఓ వీధి నుంచి ప్రపంచంలోనే తొలి హ్యాండ్‌హెల్డ్ మొబైల్ కాల్ చేశారు. ఆశ్చర్యంగా.. ఆయన కాల్ చేసింది తన ప్రత్యర్థి సంస్థ Bell Labs ఇంజనీర్ జోయెల్ ఎంగెల్‌కే! అప్పటి Motorola DynaTAC ప్రోటోటైప్ దాదాపు 1 కిలో బరువు ఉండేది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 20–30 నిమిషాలే మాట్లాడగలిగేది. ఆ ఒక్క కాల్‌తో మొబైల్ కమ్యూనికేషన్‌లో కొత్త శకం మొదలైంది.📱