Latest

అమరావతిలో ఘనంగా 'ఇండిపెండెన్స్ డే' సెలెబ్రేషన్స్
AP: రాజధాని అమరావతిలో తొలిసారిగా 'Independence Day' సెలెబ్రేషన్స్‌ను ప్రభుత్వం ఘనంగా జరిపింది. రాయపూడి పరేడ్ గ్రౌండ్‌లో ‘స్వర్ణాంధ్ర-2047’ థీమ్‌తో సెలెబ్రేషన్స్ జరిగాయి. CM చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. తరువాత పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. APSP, CRPF, కర్ణాటక పోలీసు దళాలు, NCC క్యాడెట్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కొందరు అధికారులు ఈ సెలెబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేశారు.

‘పంజా’ మళ్లీ థియేటర్లలో!
పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ‘పంజా’ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. సెప్టెంబర్ 2న 4K క్వాలిటీలో ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు.

చెన్నారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నలుగురు అరెస్ట్
AP: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో జరిగిన నవులూరి చెన్నారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన స్కార్పియోతోపాటు మూడు గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ ఆధిపత్యం విషయంలో ఉన్న విభేదాల నేపథ్యంలో చెన్నారెడ్డిని ప్లాన్ ప్రకారం కారుతో ఢీకొట్టి, కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు వాహనంలో పరారవుతుండగా దాచేపల్లి–మాచర్ల క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం: మల్లారెడ్డి
TG: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట రైతుల భూముల విషయంలో BRS నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన 1,049 ఎకరాల భూములను 22ఏ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ రైతులు నిర్వహించిన మహాధర్నాలో మేడ్చల్ MLA మల్లారెడ్డి, BRS నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఒక్క గుంట భూమిని కూడా పోనివ్వబోమని హెచ్చరించారు. దశాబ్దాలుగా రైతులు సాగుచేస్తున్న భూములను 22ఏలో ఎలా చేర్చారని ప్రశ్నించారు.

రోజుకు 100 గ్రాముల ప్రొటీన్ ఎలా పొందాలి?
మన శరీరం బలంగా ఉండటానికి, శక్తి రావడానికి రోజుకు 100 గ్రాముల ప్రొటీన్ అవసరం. అయితే అది మనం రోజూ తినే ఆహారంలోనే ఉంటుంది. రెండు గుడ్లు తింటే 12 గ్రాములు, 100 గ్రాముల చికెన్ లో 30 గ్రాములు, ఒక కప్పు పప్పు తింటే 15 గ్రాముల ప్రొటీన్ వస్తుంది. అలాగే కప్పు పెరుగులో 10 గ్రాములు, 100 గ్రాముల పనీర్‌లో 20 గ్రాములు, కొన్ని నట్స్ తింటే 10 గ్రాములు, ఒక గ్లాస్ ప్రొటీన్ షేక్ ద్వారా 20 గ్రాముల శక్తి అందుతుంది. ఇవి సరిగ్గా తింటే కండరాలు బలంగా మారతాయి, అలసట లేకుండా రోజంతా ఆక్టివ్ గా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు.

ఇండిపెండెన్స్ డే రోజు మోదీను Gift కోరిన సోనమ్ వాంగ్‌చుక్!
ఇండిపెండెన్స్ డేకు PM నరేంద్ర మోదీ నుంచి దేశానికి ఒక స్పెషల్ గిఫ్ట్‌ను ఆశిస్తున్నానని యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. 2014లో ప్రధాని ఇచ్చిన హామీలో భాగంగా పార్లమెంట్‌ను నేరరహితంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. డెమోక్రసీని మరింత క్లీన్ అప్ చేసే ఈ అంశానికి ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీతో పాటు అన్ని పొలిటికల్ పార్టీలు సపోర్ట్ ఇవ్వాలని ఆకాంక్షించారు. సెల్ఫ్‌లెస్‌గా పనిచేసే వ్యక్తుల పేర్లను సూచించాలని, వారి నుంచి నేర్చుకునే అవకాశం కల్పించాలని కోరారు.

క్లాస్‌రూమ్ లేదు.. రేకుల షెడ్‌లో విద్యాభ్యాసం
TG: వనపర్తి జిల్లా పెబ్బేరులోని చెంచువాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రీప్రైమరీ నుంచి ఐదోతరగతి వరకు 136 మంది విద్యార్థులు ఉండగా, కేవలం రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. స్థానికులు, దాతల సహకారంతో రేకుల షెడ్లు ఏర్పాటుచేసి తరగతులు నిర్వహిస్తున్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు బ్లాక్‌బోర్డులు లేకుండానే పాఠాలు బోధిస్తున్నారు. ఎండ, వర్షాల సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వర్షం కురిస్తే తరగతులు నిర్వహించలేకపోతున్నారు.

FIRST DAY కలెక్షన్లు!
హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి తీసిన 'విశ్వనాథ్ & సన్స్' సినిమా థియేటర్లలో బాగా ఆడుతోంది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రూ. 3.66 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అన్ని భాషల్లో కలిపి తొలిరోజే రూ.10.03 కోట్లు వసూలు అయింది. సినిమా స్టోరీ నచ్చడంతో జనం థియేటర్లకు బాగా వెళ్తున్నారు.

చీపురుపల్లిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్
AP: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. MLA కిమిడి కళా వెంకటరావు, MP కలిశెట్టి అప్పలనాయుడు కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు. అత్యవసర సమయంలో రక్తం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు.

OTT లోకి 'చెన్నై లవ్ స్టోరీ'
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓటీటీ సంస్థ 'సోనీ లివ్' దక్కించుకుంది. ఆగస్టు 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో ఈరోజు ఉదయం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదైనట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. దాదాపు గంటన్నరలో ఐదుసార్లు ఎర్త్‌క్వేక్ ట్రెమర్స్ వచ్చాయి. దీంతో ఈస్ట్ నుసా తెంగారా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర, నదీ దగ్గర ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా వివరాలు ప్రకటించలేదు.

రాష్ట్రంలో రైతు బీమా పథకానికి బ్రేక్
TG: రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అమలవుతున్న రైతు బీమా పథకం నిలిచిపోయింది. ప్రతి ఆగస్ట్ 14న రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించే ప్రీమియాన్ని ఈసారి నిలిపివేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి ఇన్సూరెన్స్ రెన్యూవల్ జరగలేదు. ఈ స్కీమ్ కింద 18-59 ఏళ్ల పట్టాదారు రైతులు సహజంగా లేదా యాక్సిడెంటల్‌గా చనిపోతే వారి ఫ్యామిలీకు రూ.5 లక్షలు అందేవి. రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు బెనిఫిషరీస్‌గా ఉన్నారు. రైతులతోపాటు అన్ని కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ అమలు చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పేదల ఇళ్లకు డబ్బులు ఎందుకు? : తలసాని
TG: పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిందని గుర్తుచేశారు. GHMC పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టి, 69 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేయడం సరికాదని విమర్శించారు. లబ్ధిదారుల నుంచి రూ.10 వేలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

BCలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: శ్రీనివాస్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం BCలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మంచిర్యాల నుంచి హాజీపూర్ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా BC డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలపై స్పష్టమైన చర్యలు కనిపించడంలేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు, BC సబ్‌ప్లాన్, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు, రుణాలు, బీసీ భవనాల నిర్మాణం, తదితర హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ గిరిజనుల నిరసన..
AP: స్వాతంత్య్ర దినోత్సవ వేళ అనకాపల్లి జిల్లా గిరిజనులు నిరసన ర్యాలీ చేపట్టారు. రావికమతం, వి.మాడుగుల మండలాల పరిధిలోని సమలమ్మ కొండపై ఉంటున్న 22 గిరిజన కుటుంబాలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నేషనల్ ఫ్లాగ్స్‌తో గుర్రాలపై మూడు కి.మీ. ర్యాలీ చేశారు. ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్‌తో పాటు కనీస వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. “ఏ సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నాం.. మమ్మల్ని కనీసం మనుషులుగా గుర్తించండి” అంటూ నినాదాలు చేశారు.

పురుష ఫ్యాకల్టీని తొలగించాలి: జిలుకర రవికుమార్
తెలంగాణలోని బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మహిళా ఫ్యాకల్టీని మాత్రమే నియమించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ (TPRP) రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఉషారాణికి వినతిపత్రాన్ని అందజేసి మాట్లాడారు. జనగామ జిల్లా కొడకండ్ల బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో పురుష ఫ్యాకల్టీ కారణంగా విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, విద్యార్థినుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు.

చరిత్రలో తొలిసారి వందేమాతరం..ఎర్రకోట ముస్తాబు
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమైంది. శనివారం ఆగస్టు 15న న్యూదిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. తరువాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి వేడుకల్లో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు. మరోవైపు ఎర్రకోట పరిసరాల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వెయ్యి సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో నిఘా పెంచారు.

జాతీయ జెండాలోని అశోక చక్రం విశేషాలు
మన జాతీయ జెండా మధ్యలోని తెల్లని పట్టీపై ముదురు నీలం రంగులో ఉండే అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి. దీన్ని క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన అశోకుడి సారనాథ్ సింహ స్తంభం(ధర్మచక్రం) నుండి తీసుకున్నారు. అశోకచక్రం న్యాయానికి, ధర్మానికి సంకేతంగా నిలుస్తుంది. స్వాతంత్ర్యానికి ముందు ఆ స్థానంలో రాట్నం(చర్ఖా) ఉండేది. 1947 జూలై 22న రాజ్యాంగ సభ చర్ఖా స్థానంలో ఈ అశోక చక్రాన్ని చేర్చి అధికారికంగా ఆమోదించింది.

కేంద్ర మంత్రికి కంప్లైంట్.. టీచర్లపై వేటు
AP: కడప జిల్లా విద్యాశాఖలో మెగా DSC వ్యవహారం కలకలం రేపింది. DSC నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన వేంపల్లి మండలంలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా, శాఖాపరమైన ముందస్తు అనుమతి లేకుండా ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారన్న కారణంతో సంగమేశ్వరరెడ్డి, అమర్నాథరెడ్డి, వెంకటనాథరెడ్డిలను సస్పెండ్ చేస్తూ కడప జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు.

21 తుపాకుల మోత వెనుక ఉన్న రహస్యం తెలుసా?
స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట దగ్గర 21 తుపాకుల మోత వినిపిస్తుంది. ఇది కేవలం శబ్దం కోసం చేసేది కాదు. జాతీయ గీతం(జనగణమన) స్టార్ట్ అయిన మొదటి సెకను నుంచి చివరి సెకను వరకు, అంటే 52 సెకన్ల లోనే ఈ 21 రౌండ్లు పూర్తి కావాలి. మనదేశంలో తయారుచేసిన 105 mm లైట్ ఫీల్డ్ గన్ల ద్వారా జరిపే ఈ ప్రత్యేక గౌరవ వందనాన్ని ఏడాదికి కేవలం రెండుసార్లు(ఆగస్టు 15, జనవరి 26న) మాత్రమే ఇస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతికి దక్కే ఈ సైనిక గౌరవం, స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని సమక్షంలో జాతీయ జెండాకు దక్కుతుంది.

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. అడ్డొచ్చాడని దాడి
AP: కడప జిల్లా వల్లూరులో క్షుద్రపూజలకు అడ్డుపడుతున్నాడనే కారణంతో బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పులిచెర్లకు చెందిన విజయ్‌కుమార్, చిత్తూరుకు చెందిన హేమంత్, సుబ్రహ్మణ్యం గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేసేందుకు ఓ బాలికను డబ్బు ఆశచూపి నగ్న పూజలకు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పూజలకు అడ్డుగా ఉన్న నాగసాయి ప్రణవ్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి, విఫలమై వేటకత్తితో దాడిచేశారన్నారు.