Latest

భూములు అమ్మే అధికారం ఎవరిచ్చారు?: హరీశ్‌రావు
Politics· 14 Aug 2026

భూములు అమ్మే అధికారం ఎవరిచ్చారు?: హరీశ్‌రావు

TG: ప్రభుత్వానికి చెందిన విలువైన వారసత్వ భూములను భవిష్యత్‌ తరాలకు కాపాడాల్సిన బాధ్యత CM రేవంత్‌రెడ్డిపై ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని BRS తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ భూములను జాతి సంపదగా పేర్కొన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు వాటిని ఎందుకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.

తెల్లవారుజామున షాకింగ్‌ యాక్సిడెంట్‌
TG· 14 Aug 2026

తెల్లవారుజామున షాకింగ్‌ యాక్సిడెంట్‌

TG: హైదరాబాద్‌ నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ సమీపంలో నేషనల్ హైవేపై అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులు నిద్రలో ఉండటంతో కేకలు, ఆర్తనాదాలతో భయానక పరిస్థితి నెలకొంది. స్థానికులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది వెంటనే బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన 21 మందిని 108 అంబులెన్సుల్లో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

పోలీసులపై దాడి.. పైనుంచి దూకేందుకు డ్రామా
TG· 14 Aug 2026

పోలీసులపై దాడి.. పైనుంచి దూకేందుకు డ్రామా

TG: వాట్సాప్‌ గ్రూపుల ద్వారా హైదరాబాద్‌లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బేగంపేట ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద అనుమానితుడిని అదుపులోకి తీసుకోగా 50గ్రాముల గంజాయి లభించింది. విచారణలో బాలానగర్‌ రాజీవ్‌‌కాలనీలో ఉంటున్న కిరణ్‌, దుర్గాప్రసాద్‌, కమలాకర్‌ ఈ దందా వెనుక ఉన్నట్లు గుర్తించారు. నార్కోటిక్స్‌ బృందాలు దాడిచేసి ముగ్గురిని అరెస్ట్‌ చేశాయి. కిరణ్‌ ఓ ఇన్‌స్పెక్టర్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడికి యత్నించి అనంతరం నాల్గో అంతస్తు నుంచి దూకేందుకు డ్రామా చేసినట్లు పోలీసులు తెలిపారు.

స్కూల్‌ ఫీజుల నియంత్రణపై రౌండ్‌టేబుల్‌
Education· 14 Aug 2026

స్కూల్‌ ఫీజుల నియంత్రణపై రౌండ్‌టేబుల్‌

తెలంగాణలో ప్రైవేట్‌ స్కూల్‌ ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ పీపుల్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ (ఈ నెల 14) హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సమావేశం జరగనుంది. మాజీ IAS అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రైవేట్‌ స్కూల్‌ ఫీజుల నియంత్రణ కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్దమయ్యారు.

నకిలీ DAPపై మంత్రి తుమ్మల సీరియస్‌
TG· 14 Aug 2026

నకిలీ DAPపై మంత్రి తుమ్మల సీరియస్‌

TG: రాష్ట్రంలో నకిలీ DAP ఎరువుల తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. నకిలీ ఎరువులతో నష్టపోయిన రైతులకు సంబంధిత వ్యక్తుల నుంచే పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. ఇప్పటికే నకిలీ DAP తయారీకి సంబంధించి 8మందిపై కేసులు నమోదు చేసి, ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నకిలీ ఎరువులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.

పాత రోజులు ఎందుకు అంత బాగున్నట్టు అనిపిస్తాయి?
Nostalgia· 14 Aug 2026

పాత రోజులు ఎందుకు అంత బాగున్నట్టు అనిపిస్తాయి?

“అప్పట్లోనే జీవితం బాగుండేది.. ఇప్పుడు ఏదీ అంత బాగా అనిపించట్లేదు” అని ఎప్పుడైనా అనిపించిందా? చిన్నప్పటి ఫ్రెండ్స్, స్కూల్ రోజులు, ఫ్యామిలీతో గడిపిన క్షణాలు గుర్తొస్తే.. అప్పటి రోజులే బెటర్ అనిపిస్తాయి. కానీ నిజంగా అప్పటి రోజులే బెటర్ అని కాదు. మన మెమరీ మంచి జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తుంచుకుని, చెడు అనుభవాలను కాస్త వెనక్కి నెట్టేస్తుంది. అందుకే గతం మరింత అందంగా కనిపిస్తుంది. దీన్నే రీసెర్చర్లు ‘రోజీ వ్యూ’ అంటారు. అంటే పాత రోజులు పర్ఫెక్ట్ అని కాదు.. మన మెమరీ వాటిని అందంగా చూపిస్తుందన్నమాట.

ఓటర్‌ లిస్ట్‌పై 4 రోజులు స్పెషల్‌ క్యాంపెయిన్‌
AP· 14 Aug 2026

ఓటర్‌ లిస్ట్‌పై 4 రోజులు స్పెషల్‌ క్యాంపెయిన్‌

AP: ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌ డేస్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రోజుల్లో BLOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అందుబాటులో ఉండి ఓటర్ల నమోదు, దరఖాస్తుల పూర్తి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఆదివాసీల మనసు గెలిచిన కలెక్టర్‌
TG· 14 Aug 2026

ఆదివాసీల మనసు గెలిచిన కలెక్టర్‌

TG: ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పిప్పలేరి పంచాయతీ పరిధిలోని దహిగూడ గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా, స్థలాల కొరత కారణంగా ఇళ్ల నిర్మాణం సాధ్యం కాలేదు. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ భూమిని కేటాయించి 17మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. మౌలిక సదుపాయాలు త్వరగా కల్పించేలా చర్యలు చేపట్టారు. దీంతో కలెక్టర్‌పై గౌరవం, కృతజ్ఞతతో గ్రామస్థులు తమ గ్రామానికి రాజర్షిషా గూడగా పేరు పెట్టారు. కలెక్టర్‌ రాజర్షిషా తన పేరుతో ఏర్పాటు చేసిన గ్రామ బోర్డుకు ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

ఖేలో ఇండియా క్రీడలకు తెలంగాణ రెడీ: వాకిటి
Sports· 14 Aug 2026

ఖేలో ఇండియా క్రీడలకు తెలంగాణ రెడీ: వాకిటి

తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలను డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన ఆయన.. CM రేవంత్‌రెడ్డి రాసిన ఆహ్వాన లేఖను అందజేశారు. ఖేలో ఇండియా క్రీడల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారని చెప్పారు. పోటీలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. తెలంగాణలో నూతన క్రీడా విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.

అమరావతి అభివృద్ధికి బిగ్‌ బూస్ట్‌
AP· 14 Aug 2026

అమరావతి అభివృద్ధికి బిగ్‌ బూస్ట్‌

AP: అమరావతి నిర్మాణంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మొదటి మెట్టు అని CM చంద్రబాబు అన్నారు. ఉండవల్లి వద్ద అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరుతో అనుసంధానించే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఈ-3ను ఆయన ప్రారంభించారు. ఈ రహదారికి అనుసంధానంగా బకింగ్‌హామ్‌ కాలువపై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిలను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘట్టాన్ని స్వర్ణాంధ్ర విజన్‌‌కు తొలి విజయంగా అభివర్ణించారు.

పేదల సొంతింటి కల.. నెరవేర్చే బాధ్యత మాదే: CM
TG· 14 Aug 2026

పేదల సొంతింటి కల.. నెరవేర్చే బాధ్యత మాదే: CM

TG: పదేళ్ల BRS పాలన.. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని CM రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌ KPHB కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలకు అదనంగా తమ ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని వివరించారు.

ప్రైవేట్ పార్ట్స్‌కు కరెంట్ షాక్ ఇచ్చి భర్త హత్య
Crime· 13 Aug 2026

ప్రైవేట్ పార్ట్స్‌కు కరెంట్ షాక్ ఇచ్చి భర్త హత్య

దిల్లీలోని రతియా మార్గ్‌లో మున్నాలాల్(55)ను అతని భార్య మంజూ, ఆమె ప్రియుడు చమన్ కలిసి హత్య చేశారు. దొంగలు చోరీ చేయడానికి వచ్చి హత్య చేసినట్టు పోలీసులు అనుమానించారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల్లో మాత్రం మందు ఇచ్చి, గొంతు కోసి, తల, ముఖం మీద దెబ్బలు కొట్టి, ప్రైవేట్ భాగాలపై విద్యుత్ షాక్ ఇచ్చి చంపినట్లు తేలింది. సీసీ కెమెరా ఫుటేజీ చూడటంతో నిజం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

📸 Photos ఎక్కువైతే Memories తక్కువవుతున్నాయా?
Education· 13 Aug 2026

📸 Photos ఎక్కువైతే Memories తక్కువవుతున్నాయా?

ఒకప్పుడు ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఫోటోలు తీసేవాళ్లం. ఇప్పుడు ప్రతి చిన్న క్షణాన్ని ఫోన్‌లో దాచుకుంటున్నాం. కానీ ప్రతి క్షణాన్ని ఫోటో తీయడంపై ఎక్కువ దృష్టి పెడితే, ఆ సమయంలో జరుగుతున్న విషయాన్ని పూర్తిగా ఆస్వాదించడం తగ్గొచ్చని రీసెర్చ్ సూచిస్తోంది. అయితే ఫోటోలు తీయడం వల్ల జ్ఞాపకాలు తగ్గిపోతాయని నేరుగా చెప్పలేం. మనం ఫోటో తీసే విధానం, ఆ క్షణంలో ఎంతగా పాల్గొంటున్నామన్నదే ముఖ్యం. మీరు ఒక జ్ఞాపకాన్ని ఫోటోగా దాచుకుంటారా, లేక కళ్లతోనే గుర్తుంచుకుంటారా? కామెంట్‌లో చెప్పండి.

తెలంగాణలో తగ్గనున్న వర్షాలు
TG· 13 Aug 2026

తెలంగాణలో తగ్గనున్న వర్షాలు

TG: తెలంగాణలో వర్షాలు తగ్గనున్నాయి. జూలైలో మంచి వర్షాలు కురిసిన రాష్ట్రంలో ఇక భారీ వర్షాలు రావడం కష్టమేనని వాతావరణ నిపుణులు అంటున్నారు. రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండియన్ ఓషన్ డైపోల్ న్యూట్రల్ దశలో ఉండటం, మాడెన్-జూలియన్ ఆసిలేషన్ కూడా వర్షాలకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని వివరించారు.

Imposter Syndrome అంటే ఏంటో తెలుసా?
General· 13 Aug 2026

Imposter Syndrome అంటే ఏంటో తెలుసా?

మంచి ఉద్యోగం వచ్చింది. మంచి పని చేశాం. ప్రశంసలు కూడా వచ్చాయి. అయినా “నేను నిజంగా దీనికి అర్హుడినేనా?” అని మీలో ఎవరికైనా అనిపించిందా? దాన్నే ‘Imposter Syndrome’ అంటారు. మన విజయాలు మన ప్రతిభ వల్ల కాదు, ఏదో అదృష్టం వల్ల వచ్చాయని అనిపించడం దీని ప్రధాన లక్షణం. ఆశ్చర్యంగా అనిపించినా సక్సెస్ అయిన చాలామందికి కూడా ఇలా అనిపిస్తుంది. 1978లో దీన్ని psychologists Pauline Clance, Suzanne Imes తొలిసారి అధ్యయనం చేశారు. ఇది వ్యాధి కాదు కానీ, self-doubt ఎక్కువైతే మంచి అవకాశాలను మనమే వదులుకోవచ్చు.

బెంగళూరులో రేపు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్
News· 13 Aug 2026

బెంగళూరులో రేపు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్

నటుడు ప్రకాశ్ రాజ్ రేపు (ఆగస్టు 14) బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ ఉంటుందని తెలిపారు. SIR ప్రక్రియకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను మీడియాతో పంచుకోనున్నట్లు పేర్కొంటూ.. “డియర్ మీడియా ఫ్రెండ్స్.. రేపు ప్రెస్‌మీట్‌కు రండి. థ్యాంక్యూ” అంటూ జర్నలిస్టులను ఇన్వైట్ చేశారు.

తల్లిదండ్రులు గొడవపడితే.. పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
parenting· 13 Aug 2026

తల్లిదండ్రులు గొడవపడితే.. పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

తల్లిదండ్రులు గొడవపడితే.. “పిల్లలే కదా, వాళ్లకేం అర్థం అవుతుంది?” అని అనుకుంటాం. కానీ వాళ్లకు చాలా విషయాలు అర్థమవుతాయి.😕 ఇంట్లో తరచూ అరుపులు, తిట్టుకోవడం, గొడవలు జరిగితే వాళ్లలో భయం, టెన్షన్ పెరగొచ్చు. కొందరైతే “నా వల్లే ఇలా జరుగుతుందా?” అని కూడా ఫీల్ అవుతారు. దాని ప్రభావం నిద్ర, చదువు, ప్రవర్తనపైనా పడొచ్చు. ప్రతి డిసగ్రీమెంట్ సమస్య కాదు.. కానీ తరచూ, తీవ్రంగా ఉంటే మాత్రం పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే వాళ్ల ముందు గొడవపడకుండా.. సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం.❤️

ఉచిత బస్సుల కోసం రూ.12 వేల కోట్లు
Politics· 13 Aug 2026

ఉచిత బస్సుల కోసం రూ.12 వేల కోట్లు

TG: RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. KPHB కాలనీలో జరిగిన ‘ఇందిరమ్మ ఇండ్లు’ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదీ ఉచితంగా ఇవ్వడం లేదని అన్నారు. మహిళల టికెట్ చార్జీల కోసం RTCకి రూ.12 వేల కోట్లు ప్రభుత్వం స్పెండ్ చేస్తుందని తెలిపారు. మహిళలు ఫ్రీగా ప్రయాణించడం వెనుక ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు.

‘‌ఫంక్షన్‌లో బండి భగీరథ్ డ్యాన్స్’ అంటూ వీడియో వైరల్
TG· 13 Aug 2026

‘‌ఫంక్షన్‌లో బండి భగీరథ్ డ్యాన్స్’ అంటూ వీడియో వైరల్

TG: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ జూలైలో షరతులతో కూడిన బెయిల్‌ మీద బయటకొచ్చాడు. ఇన్నాళ్లూ అతనికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. తాజాగా తన కజిన్ పెళ్లిలో అతను డ్యాన్స్ చేస్తున్నాడంటూ రెండు సెకండ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది భగీరథే అయినా, ఇది పాత వీడియోనా లేక లేటెస్ట్ వీడియోనా అనేది తెలియడం లేదు.

AI వీడియో నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి? 🤖
Technology· 13 Aug 2026

AI వీడియో నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి? 🤖

AIతో తయారైన వీడియోలు నిజమైనవిగా కనిపించడంతో వాటిని గుర్తించడం అంత ఈజీ కాదు. ముఖం, పెదవుల కదలికలు, చేతులు, నీడలు, వెలుతురు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా వింతగా ఉందా చూడాలి. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో, మొదట ఎవరు పోస్ట్ చేశారో చెక్ చేయాలి. రివర్స్ సెర్చ్‌తో వీడియో పాతదా, వేరే సందర్భంలోనిదా తెలుసుకోవచ్చు. కంటెంట్ క్రెడెన్షియల్స్ లేదా SynthID ఉంటే వీడియో మూలం, ఎలా రూపొందిందనే వివరాలను కూడా చెక్ చేయొచ్చు. అయితే ఏ ఒక్క టూల్ కూడా 100% ఖచ్చితంగా చెప్పదు. అందుకే నమ్మకమైన సోర్సెస్‌తో క్రాస్‌చెక్ చేయడం మంచిది.

22ఏ సెక్షన్‌పై సీఎం రేవంత్ కీలక కామెంట్స్
TG· 13 Aug 2026

22ఏ సెక్షన్‌పై సీఎం రేవంత్ కీలక కామెంట్స్

TG: తెలంగాణలో నిషేధిత ఆస్తుల జాబితా (సెక్షన్ 22ఏ) అమలుపై CM రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ నగరం కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడారు. చట్టం ఉద్దేశం మంచిదైనా ఆచరణలో లోపాల వల్ల సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జనం కొనుక్కున్న భూమి ఎక్కడికీ పోదని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లకు ఆదేశిస్తానని తెలిపారు. ప్రజలకు తను భరోసాగా ఉంటానన్నారు.