22ఏ సెక్షన్‌పై సీఎం రేవంత్ కీలక కామెంట్స్

TG: తెలంగాణలో నిషేధిత ఆస్తుల జాబితా (సెక్షన్ 22ఏ) అమలుపై CM రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ నగరం కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడారు. చట్టం ఉద్దేశం మంచిదైనా ఆచరణలో లోపాల వల్ల సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జనం కొనుక్కున్న భూమి ఎక్కడికీ పోదని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లకు ఆదేశిస్తానని తెలిపారు. ప్రజలకు తను భరోసాగా ఉంటానన్నారు.



