Latest

📸 Photos ఎక్కువైతే Memories తక్కువవుతున్నాయా?
Education· 13 Aug 2026

📸 Photos ఎక్కువైతే Memories తక్కువవుతున్నాయా?

ఒకప్పుడు ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఫోటోలు తీసేవాళ్లం. ఇప్పుడు ప్రతి చిన్న క్షణాన్ని ఫోన్‌లో దాచుకుంటున్నాం. కానీ ప్రతి క్షణాన్ని ఫోటో తీయడంపై ఎక్కువ దృష్టి పెడితే, ఆ సమయంలో జరుగుతున్న విషయాన్ని పూర్తిగా ఆస్వాదించడం తగ్గొచ్చని రీసెర్చ్ సూచిస్తోంది. అయితే ఫోటోలు తీయడం వల్ల జ్ఞాపకాలు తగ్గిపోతాయని నేరుగా చెప్పలేం. మనం ఫోటో తీసే విధానం, ఆ క్షణంలో ఎంతగా పాల్గొంటున్నామన్నదే ముఖ్యం. మీరు ఒక జ్ఞాపకాన్ని ఫోటోగా దాచుకుంటారా, లేక కళ్లతోనే గుర్తుంచుకుంటారా? కామెంట్‌లో చెప్పండి.

తెలంగాణలో తగ్గనున్న వర్షాలు
TG· 13 Aug 2026

తెలంగాణలో తగ్గనున్న వర్షాలు

TG: తెలంగాణలో వర్షాలు తగ్గనున్నాయి. జూలైలో మంచి వర్షాలు కురిసిన రాష్ట్రంలో ఇక భారీ వర్షాలు రావడం కష్టమేనని వాతావరణ నిపుణులు అంటున్నారు. రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండియన్ ఓషన్ డైపోల్ న్యూట్రల్ దశలో ఉండటం, మాడెన్-జూలియన్ ఆసిలేషన్ కూడా వర్షాలకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని వివరించారు.

Imposter Syndrome అంటే ఏంటో తెలుసా?
General· 13 Aug 2026

Imposter Syndrome అంటే ఏంటో తెలుసా?

మంచి ఉద్యోగం వచ్చింది. మంచి పని చేశాం. ప్రశంసలు కూడా వచ్చాయి. అయినా “నేను నిజంగా దీనికి అర్హుడినేనా?” అని మీలో ఎవరికైనా అనిపించిందా? దాన్నే ‘Imposter Syndrome’ అంటారు. మన విజయాలు మన ప్రతిభ వల్ల కాదు, ఏదో అదృష్టం వల్ల వచ్చాయని అనిపించడం దీని ప్రధాన లక్షణం. ఆశ్చర్యంగా అనిపించినా సక్సెస్ అయిన చాలామందికి కూడా ఇలా అనిపిస్తుంది. 1978లో దీన్ని psychologists Pauline Clance, Suzanne Imes తొలిసారి అధ్యయనం చేశారు. ఇది వ్యాధి కాదు కానీ, self-doubt ఎక్కువైతే మంచి అవకాశాలను మనమే వదులుకోవచ్చు.

బెంగళూరులో రేపు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్
News· 13 Aug 2026

బెంగళూరులో రేపు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్

నటుడు ప్రకాశ్ రాజ్ రేపు (ఆగస్టు 14) బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ ఉంటుందని తెలిపారు. SIR ప్రక్రియకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను మీడియాతో పంచుకోనున్నట్లు పేర్కొంటూ.. “డియర్ మీడియా ఫ్రెండ్స్.. రేపు ప్రెస్‌మీట్‌కు రండి. థ్యాంక్యూ” అంటూ జర్నలిస్టులను ఇన్వైట్ చేశారు.

తల్లిదండ్రులు గొడవపడితే.. పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
parenting· 13 Aug 2026

తల్లిదండ్రులు గొడవపడితే.. పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

తల్లిదండ్రులు గొడవపడితే.. “పిల్లలే కదా, వాళ్లకేం అర్థం అవుతుంది?” అని అనుకుంటాం. కానీ వాళ్లకు చాలా విషయాలు అర్థమవుతాయి.😕 ఇంట్లో తరచూ అరుపులు, తిట్టుకోవడం, గొడవలు జరిగితే వాళ్లలో భయం, టెన్షన్ పెరగొచ్చు. కొందరైతే “నా వల్లే ఇలా జరుగుతుందా?” అని కూడా ఫీల్ అవుతారు. దాని ప్రభావం నిద్ర, చదువు, ప్రవర్తనపైనా పడొచ్చు. ప్రతి డిసగ్రీమెంట్ సమస్య కాదు.. కానీ తరచూ, తీవ్రంగా ఉంటే మాత్రం పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే వాళ్ల ముందు గొడవపడకుండా.. సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం.❤️

ఉచిత బస్సుల కోసం రూ.12 వేల కోట్లు
Politics· 13 Aug 2026

ఉచిత బస్సుల కోసం రూ.12 వేల కోట్లు

TG: RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. KPHB కాలనీలో జరిగిన ‘ఇందిరమ్మ ఇండ్లు’ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదీ ఉచితంగా ఇవ్వడం లేదని అన్నారు. మహిళల టికెట్ చార్జీల కోసం RTCకి రూ.12 వేల కోట్లు ప్రభుత్వం స్పెండ్ చేస్తుందని తెలిపారు. మహిళలు ఫ్రీగా ప్రయాణించడం వెనుక ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు.

‘‌ఫంక్షన్‌లో బండి భగీరథ్ డ్యాన్స్’ అంటూ వీడియో వైరల్
TG· 13 Aug 2026

‘‌ఫంక్షన్‌లో బండి భగీరథ్ డ్యాన్స్’ అంటూ వీడియో వైరల్

TG: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ జూలైలో షరతులతో కూడిన బెయిల్‌ మీద బయటకొచ్చాడు. ఇన్నాళ్లూ అతనికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. తాజాగా తన కజిన్ పెళ్లిలో అతను డ్యాన్స్ చేస్తున్నాడంటూ రెండు సెకండ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది భగీరథే అయినా, ఇది పాత వీడియోనా లేక లేటెస్ట్ వీడియోనా అనేది తెలియడం లేదు.

AI వీడియో నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి? 🤖
Technology· 13 Aug 2026

AI వీడియో నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి? 🤖

AIతో తయారైన వీడియోలు నిజమైనవిగా కనిపించడంతో వాటిని గుర్తించడం అంత ఈజీ కాదు. ముఖం, పెదవుల కదలికలు, చేతులు, నీడలు, వెలుతురు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా వింతగా ఉందా చూడాలి. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో, మొదట ఎవరు పోస్ట్ చేశారో చెక్ చేయాలి. రివర్స్ సెర్చ్‌తో వీడియో పాతదా, వేరే సందర్భంలోనిదా తెలుసుకోవచ్చు. కంటెంట్ క్రెడెన్షియల్స్ లేదా SynthID ఉంటే వీడియో మూలం, ఎలా రూపొందిందనే వివరాలను కూడా చెక్ చేయొచ్చు. అయితే ఏ ఒక్క టూల్ కూడా 100% ఖచ్చితంగా చెప్పదు. అందుకే నమ్మకమైన సోర్సెస్‌తో క్రాస్‌చెక్ చేయడం మంచిది.

22ఏ సెక్షన్‌పై సీఎం రేవంత్ కీలక కామెంట్స్
TG· 13 Aug 2026

22ఏ సెక్షన్‌పై సీఎం రేవంత్ కీలక కామెంట్స్

TG: తెలంగాణలో నిషేధిత ఆస్తుల జాబితా (సెక్షన్ 22ఏ) అమలుపై CM రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ నగరం కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడారు. చట్టం ఉద్దేశం మంచిదైనా ఆచరణలో లోపాల వల్ల సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జనం కొనుక్కున్న భూమి ఎక్కడికీ పోదని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లకు ఆదేశిస్తానని తెలిపారు. ప్రజలకు తను భరోసాగా ఉంటానన్నారు.

సీఎం చంద్రబాబుకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్?
Politics· 13 Aug 2026

సీఎం చంద్రబాబుకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్?

AP: సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారా అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అమరావతి భవనాల ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్న పవన్ ఇవాళ ఉదయం విశాఖపట్నం వెళ్లారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ ఆహ్వానించినా పవన్ హాజరుకాలేదని సమాచారం. ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంలో భారీ అవినీతి ఆరోపణలు రావడం, డిప్యూటీ సీఎం పవన్ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో ఇద్దరు నేతల మధ్య దూరం పెరుగుతోందనే చర్చ సాగుతోంది.

ఫ్యాషన్ షోలో మాజీ నక్సలైట్లు
News· 13 Aug 2026

ఫ్యాషన్ షోలో మాజీ నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరిగింది. నేషనల్ హ్యాండ్‌లూమ్ డే సందర్భంగా బస్తర్‌కి చెందిన మాజీ ఉమెన్ నక్సల్స్, ప్రొఫెషనల్ మోడల్స్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ముంబై ట్రైనర్ దగ్గర వారం రోజులు మోడలింగ్ ప్రాక్టీస్ చేసిన వీళ్ళు, కోసా సిల్క్ డ్రెస్సులు వేసుకుని ఎంట్రీ ఇచ్చారు. CM విష్ణు దేవ్ సాయ్ కూడా వీరి కాన్ఫిడెన్స్‌ని అప్రిషియేట్ చేశారు. గన్స్ వదిలేసి వచ్చిన వీళ్ళకి పబ్లిక్ నుంచి క్లాప్స్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది.

హెల్దీ అండ్ టేస్టీ.. పనస పండు బెనిఫిట్స్!
Health· 13 Aug 2026

హెల్దీ అండ్ టేస్టీ.. పనస పండు బెనిఫిట్స్!

పనస పండు రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్లు (A, C), యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కువ ఫైబర్ ఉండటంతో జీర్ణక్రియ బాగుపడి, గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి. క్యాలరీలు తక్కువగా ఉండి కడుపు నిండిన భావనని ఇవ్వడం వల్ల వెయిట్ లాస్‌కి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే పొటాషియం ఉండటం వల్ల బీపీ, కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాల్షియం, ఐరన్ వల్ల ఎముకలు దృఢపడి రక్తహీనత తగ్గుతుంది.

AI Data Centersకి ఇంత Electricity ఎందుకు కావాలి? ⚡
Technology· 13 Aug 2026

AI Data Centersకి ఇంత Electricity ఎందుకు కావాలి? ⚡

మనకు AIతో ఒక పని చేయడానికి కొన్ని సెకన్లే పడొచ్చు.. కానీ దాని వెనుక భారీ డేటా సెంటర్లు 24/7 పనిచేస్తుంటాయి. AI మోడళ్లను నడిపే శక్తివంతమైన GPUలు భారీగా విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. ఈ కంప్యూటింగ్‌తో భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. దాన్ని తగ్గించేందుకు కూలింగ్ సిస్టమ్స్, కొన్ని చోట్ల నీటిని కూడా ఉపయోగిస్తారు. IEA ప్రకారం 2025లో ప్రపంచ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 17% పెరిగింది. 2030 నాటికి ఇది 945 TWhకు చేరొచ్చని అంచనా. AI వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్‌తో పాటు నీటి అవసరం కూడా మరింత పెరగొచ్చు.

ఓటు తొలగింపుపై మరో వీడియో చేసిన ప్రకాష్ రాజ్
National· 13 Aug 2026

ఓటు తొలగింపుపై మరో వీడియో చేసిన ప్రకాష్ రాజ్

తన ఓటు తొలగింపుపై నటుడు ప్రకాష్ రాజ్ మరో వీడియో రిలీజ్ చేశారు. ‘నా ఓటును పర్మినెంట్‌గా షిఫ్ట్ చేశామని వెబ్‌సైట్‌లో రాసింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ‘నా ఓటు తొలగించారని వీడియో చేసిన కొన్ని గంటల్లోనే అధికారులు మాట మార్చి మొదట పర్మినెంట్ షిఫ్ట్ అన్నారు, తర్వాత జస్ట్ షిఫ్ట్ చేశాం అంటున్నారు’ అని వివరించారు. బీఎల్ఓ తన పాత ఇంటి అడ్రెస్‌కి వచ్చి చేసిన హంగామాకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. ఓటు హక్కు కోసం పౌరులు లైన్లో నిలబడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు.

రైతుల కోసం 'పాము' పాఠాలు..
News· 13 Aug 2026

రైతుల కోసం 'పాము' పాఠాలు..

పాము కనిపిస్తే చాలు జనం పరుగెత్తుతారు, కానీ మహారాష్ట్ర ఎన్సీపీ నేత రోహిణి ఖడ్సే మాత్రం తన పొలంలో కనిపిస్తే భయపడకుండా ఏకంగా చేతుల్లోకి తీసుకున్నారు. అది విషం లేని 'జెర్రిపోతు' పాము అని, పంటలను నాశనం చేసే ఎలుకలను తింటూ రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆమె అంటున్నారు. భయంతో ఇలాంటి ఉపయోగపడే పాములను చంపేయొద్దని, పర్యావరణాన్ని కాపాడుకుందామని ఆమె తెలిపారు.

MLA–MLC క్వార్టర్స్‌ ఎలా ఉన్నాయంటే? CM పరిశీలన
Politics· 13 Aug 2026

MLA–MLC క్వార్టర్స్‌ ఎలా ఉన్నాయంటే? CM పరిశీలన

AP: అమరావతిలో MLA, MLCల కోసం నిర్మించిన హౌసింగ్ కాంప్లెక్స్‌లను సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలించారు. రాయపూడి ప్రాంతంలోని ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లల్లో బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సౌకర్యాలను సీఎం పరిశీలించారు. MLA–MLC క్వార్టర్స్‌ కన్‌స్ట్రక్షన్ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన కీలక ప్రాజెక్టుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

సినిమా రంగంలో 67 ఏళ్లు..నేర్చుకున్నది 20 ఏళ్లు మాత్రమే!
Cinema· 13 Aug 2026

సినిమా రంగంలో 67 ఏళ్లు..నేర్చుకున్నది 20 ఏళ్లు మాత్రమే!

సినిమా రంగంలో 67 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ నటుడు, ఎంపీ కమల్‌హాసన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ 67 ఏళ్లలో నిజంగా నేర్చుకున్నది 20 ఏళ్లు మాత్రమేనని అనుకుంటున్నానని అన్నారు. మిగతాది వ్యర్థమైన ప్రవాహంలో కొట్టుకుపోవడమే అని వివరించారు. 1895 డిసెంబర్‌లో లూమియర్ బ్రదర్స్ మొదటి ప్రజా ప్రదర్శన ఇచ్చినప్పటి నుంచి సినిమా పరిశ్రమకు 130 సంవత్సరాల 8 నెలలైందన్నారు. మొత్తం చరిత్రలో సగానికి పైగా, అంటే 67 సంవత్సరాలు తాను ఈ రంగంలో ఉండటం ఆశ్చర్యం అని చెప్పారు.

🎬 ఈ వారం సినిమాల సందడి!
Cinema· 13 Aug 2026

🎬 ఈ వారం సినిమాల సందడి!

సినీ ప్రేక్షకులకు ఈ వారం థియేటర్లలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరకనుంది. పలు భాషల్లో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విశాల్ ‘మకుటం’, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'పళ్ళ బురుసు', ‘అగధ’, ‘ఆవారాపన్-2’, ‘బట్వారా 1947’ లాంటి సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు ‘హుషార్ పిట్టలు ’ కూడా థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమాల్లో మీరు ఏది చూడాలని వెయిట్ చేస్తున్నారు?

దొంగతనం చేసి ఆ ఇంట్లోనే నిద్రపోయిండు!
News· 13 Aug 2026

దొంగతనం చేసి ఆ ఇంట్లోనే నిద్రపోయిండు!

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఫైజల్ భాయ్ అనే పర్సన్ ఇంట్లోకి రాత్రి ఓ దొంగ దూరాడు. ఆల్మారీ ఓపెన్ చేసి గోల్డ్, ఫోన్స్, క్యాష్ కొట్టేశాడు. ఆ తర్వాత మధ్యం మత్తు ఎక్కువ కావడంతో అక్కడే ఉన్న బెడ్‌పై ప్రశాంతంగా నిద్రపోయాడు. మార్నింగ్ అతన్ని చూసి షాక్ అయిన ఓనర్లు పట్టుకుని నిలదీశారు. దొంగ తన తప్పు ఒప్పుకోవడంతో వాళ్లు అతన్ని కొట్టకుండా, ఇంకోసారి ఇలా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

టైర్‌ పంచర్‌తో ఆగిన బస్సు.. క్షణాల్లో ఘోరం
Crime· 13 Aug 2026

టైర్‌ పంచర్‌తో ఆగిన బస్సు.. క్షణాల్లో ఘోరం

TG: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్‌ పంచర్‌ కావడంతో రోడ్డుపై ఆగి ఉన్న ప్రైవేట్‌ బస్సును కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, డివైడర్‌ పక్కన కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. గాయాలయిన వారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

రాత్రివేళ వాహనం పంచరైతే నో ప్రాబ్లమ్?
News· 13 Aug 2026

రాత్రివేళ వాహనం పంచరైతే నో ప్రాబ్లమ్?

జయశంకర్ భూపాలపల్లికి చెందిన మెకానిక్ సయ్యద్ రహీమ్ పాషా గొప్ప మనసు చూపిస్తున్నారు. అర్ధరాత్రి దారి మధ్యలో కార్లు, బైక్‌లు, ఆటోలు పంచర్ అయి ఇబ్బంది పడేవారికి హెల్ప్ చేస్తున్నారు. మీ దగ్గర క్యాష్ లేకపోయినా పర్లేదు, 8179932177 నంబర్‌కి ఒక కాల్ చేస్తే చాలు.. స్పాట్‌కి వచ్చి పంచర్ వేసి పంపిస్తున్నారు. మనీ కంటే మనుషులకి హెల్ప్ చేయడమే ముఖ్యమని చెప్తున్న ఈ మెకానిక్ వర్క్‌కి అందరూ ఒక లైక్ కొట్టండి.