Latest

హెల్దీ అండ్ టేస్టీ.. పనస పండు బెనిఫిట్స్!
Health· 13 Aug 2026

హెల్దీ అండ్ టేస్టీ.. పనస పండు బెనిఫిట్స్!

పనస పండు రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్లు (A, C), యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కువ ఫైబర్ ఉండటంతో జీర్ణక్రియ బాగుపడి, గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి. క్యాలరీలు తక్కువగా ఉండి కడుపు నిండిన భావనని ఇవ్వడం వల్ల వెయిట్ లాస్‌కి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే పొటాషియం ఉండటం వల్ల బీపీ, కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాల్షియం, ఐరన్ వల్ల ఎముకలు దృఢపడి రక్తహీనత తగ్గుతుంది.

AI Data Centersకి ఇంత Electricity ఎందుకు కావాలి? ⚡
Technology· 13 Aug 2026

AI Data Centersకి ఇంత Electricity ఎందుకు కావాలి? ⚡

మనకు AIతో ఒక పని చేయడానికి కొన్ని సెకన్లే పడొచ్చు.. కానీ దాని వెనుక భారీ డేటా సెంటర్లు 24/7 పనిచేస్తుంటాయి. AI మోడళ్లను నడిపే శక్తివంతమైన GPUలు భారీగా విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. ఈ కంప్యూటింగ్‌తో భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. దాన్ని తగ్గించేందుకు కూలింగ్ సిస్టమ్స్, కొన్ని చోట్ల నీటిని కూడా ఉపయోగిస్తారు. IEA ప్రకారం 2025లో ప్రపంచ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 17% పెరిగింది. 2030 నాటికి ఇది 945 TWhకు చేరొచ్చని అంచనా. AI వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్‌తో పాటు నీటి అవసరం కూడా మరింత పెరగొచ్చు.

ఓటు తొలగింపుపై మరో వీడియో చేసిన ప్రకాష్ రాజ్
National· 13 Aug 2026

ఓటు తొలగింపుపై మరో వీడియో చేసిన ప్రకాష్ రాజ్

తన ఓటు తొలగింపుపై నటుడు ప్రకాష్ రాజ్ మరో వీడియో రిలీజ్ చేశారు. ‘నా ఓటును పర్మినెంట్‌గా షిఫ్ట్ చేశామని వెబ్‌సైట్‌లో రాసింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ‘నా ఓటు తొలగించారని వీడియో చేసిన కొన్ని గంటల్లోనే అధికారులు మాట మార్చి మొదట పర్మినెంట్ షిఫ్ట్ అన్నారు, తర్వాత జస్ట్ షిఫ్ట్ చేశాం అంటున్నారు’ అని వివరించారు. బీఎల్ఓ తన పాత ఇంటి అడ్రెస్‌కి వచ్చి చేసిన హంగామాకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. ఓటు హక్కు కోసం పౌరులు లైన్లో నిలబడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు.

రైతుల కోసం 'పాము' పాఠాలు..
News· 13 Aug 2026

రైతుల కోసం 'పాము' పాఠాలు..

పాము కనిపిస్తే చాలు జనం పరుగెత్తుతారు, కానీ మహారాష్ట్ర ఎన్సీపీ నేత రోహిణి ఖడ్సే మాత్రం తన పొలంలో కనిపిస్తే భయపడకుండా ఏకంగా చేతుల్లోకి తీసుకున్నారు. అది విషం లేని 'జెర్రిపోతు' పాము అని, పంటలను నాశనం చేసే ఎలుకలను తింటూ రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆమె అంటున్నారు. భయంతో ఇలాంటి ఉపయోగపడే పాములను చంపేయొద్దని, పర్యావరణాన్ని కాపాడుకుందామని ఆమె తెలిపారు.

MLA–MLC క్వార్టర్స్‌ ఎలా ఉన్నాయంటే? CM పరిశీలన
Politics· 13 Aug 2026

MLA–MLC క్వార్టర్స్‌ ఎలా ఉన్నాయంటే? CM పరిశీలన

AP: అమరావతిలో MLA, MLCల కోసం నిర్మించిన హౌసింగ్ కాంప్లెక్స్‌లను సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలించారు. రాయపూడి ప్రాంతంలోని ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లల్లో బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సౌకర్యాలను సీఎం పరిశీలించారు. MLA–MLC క్వార్టర్స్‌ కన్‌స్ట్రక్షన్ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన కీలక ప్రాజెక్టుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

సినిమా రంగంలో 67 ఏళ్లు..నేర్చుకున్నది 20 ఏళ్లు మాత్రమే!
Cinema· 13 Aug 2026

సినిమా రంగంలో 67 ఏళ్లు..నేర్చుకున్నది 20 ఏళ్లు మాత్రమే!

సినిమా రంగంలో 67 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ నటుడు, ఎంపీ కమల్‌హాసన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ 67 ఏళ్లలో నిజంగా నేర్చుకున్నది 20 ఏళ్లు మాత్రమేనని అనుకుంటున్నానని అన్నారు. మిగతాది వ్యర్థమైన ప్రవాహంలో కొట్టుకుపోవడమే అని వివరించారు. 1895 డిసెంబర్‌లో లూమియర్ బ్రదర్స్ మొదటి ప్రజా ప్రదర్శన ఇచ్చినప్పటి నుంచి సినిమా పరిశ్రమకు 130 సంవత్సరాల 8 నెలలైందన్నారు. మొత్తం చరిత్రలో సగానికి పైగా, అంటే 67 సంవత్సరాలు తాను ఈ రంగంలో ఉండటం ఆశ్చర్యం అని చెప్పారు.

🎬 ఈ వారం సినిమాల సందడి!
Cinema· 13 Aug 2026

🎬 ఈ వారం సినిమాల సందడి!

సినీ ప్రేక్షకులకు ఈ వారం థియేటర్లలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరకనుంది. పలు భాషల్లో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విశాల్ ‘మకుటం’, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'పళ్ళ బురుసు', ‘అగధ’, ‘ఆవారాపన్-2’, ‘బట్వారా 1947’ లాంటి సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు ‘హుషార్ పిట్టలు ’ కూడా థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమాల్లో మీరు ఏది చూడాలని వెయిట్ చేస్తున్నారు?

దొంగతనం చేసి ఆ ఇంట్లోనే నిద్రపోయిండు!
News· 13 Aug 2026

దొంగతనం చేసి ఆ ఇంట్లోనే నిద్రపోయిండు!

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఫైజల్ భాయ్ అనే పర్సన్ ఇంట్లోకి రాత్రి ఓ దొంగ దూరాడు. ఆల్మారీ ఓపెన్ చేసి గోల్డ్, ఫోన్స్, క్యాష్ కొట్టేశాడు. ఆ తర్వాత మధ్యం మత్తు ఎక్కువ కావడంతో అక్కడే ఉన్న బెడ్‌పై ప్రశాంతంగా నిద్రపోయాడు. మార్నింగ్ అతన్ని చూసి షాక్ అయిన ఓనర్లు పట్టుకుని నిలదీశారు. దొంగ తన తప్పు ఒప్పుకోవడంతో వాళ్లు అతన్ని కొట్టకుండా, ఇంకోసారి ఇలా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

టైర్‌ పంచర్‌తో ఆగిన బస్సు.. క్షణాల్లో ఘోరం
Crime· 13 Aug 2026

టైర్‌ పంచర్‌తో ఆగిన బస్సు.. క్షణాల్లో ఘోరం

TG: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్‌ పంచర్‌ కావడంతో రోడ్డుపై ఆగి ఉన్న ప్రైవేట్‌ బస్సును కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, డివైడర్‌ పక్కన కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. గాయాలయిన వారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

రాత్రివేళ వాహనం పంచరైతే నో ప్రాబ్లమ్?
News· 13 Aug 2026

రాత్రివేళ వాహనం పంచరైతే నో ప్రాబ్లమ్?

జయశంకర్ భూపాలపల్లికి చెందిన మెకానిక్ సయ్యద్ రహీమ్ పాషా గొప్ప మనసు చూపిస్తున్నారు. అర్ధరాత్రి దారి మధ్యలో కార్లు, బైక్‌లు, ఆటోలు పంచర్ అయి ఇబ్బంది పడేవారికి హెల్ప్ చేస్తున్నారు. మీ దగ్గర క్యాష్ లేకపోయినా పర్లేదు, 8179932177 నంబర్‌కి ఒక కాల్ చేస్తే చాలు.. స్పాట్‌కి వచ్చి పంచర్ వేసి పంపిస్తున్నారు. మనీ కంటే మనుషులకి హెల్ప్ చేయడమే ముఖ్యమని చెప్తున్న ఈ మెకానిక్ వర్క్‌కి అందరూ ఒక లైక్ కొట్టండి.

HYD స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి మూడేళ్లుగా రిపేర్లు
TG· 13 Aug 2026

HYD స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి మూడేళ్లుగా రిపేర్లు

TG: HYD స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి గత మూడేళ్లుగా రిపేర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. “పనులు సరిగా జరగడం లేదు. కొన్నిసార్లు స్పీడ్‌గా జరుగుతున్నాయి, మరికొన్నిసార్లు స్లోగా” అక్కడున్నవాళ్లు అంటున్నారు. ఇంగ్లిష్ బుక్స్ సెక్షన్ మూసేశారు. విద్యార్థులు చాలామంది తమ సొంత పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంటున్నారు. ఇక్కడ సిబ్బంది సమస్య తీవ్రంగా ఉంది. 104 శాంక్షన్డ్ పోస్టులున్నా, 33 మంది రెగ్యులర్ సిబ్బంది(అధికారులతో సహా) మాత్రమే ఉన్నారు.

‘మీరు చేయకపోతే మేమే చేస్తాం’.. సుప్రీంకోర్టు సీరియస్
Legal· 13 Aug 2026

‘మీరు చేయకపోతే మేమే చేస్తాం’.. సుప్రీంకోర్టు సీరియస్

హై షుగర్, సాల్ట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ప్యాకేజ్డ్‌ ఫుడ్ ఐటమ్స్‌పై వార్నింగ్‌ లేబుల్స్‌ ఏర్పాటు చేసే అంశంలో కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. ‘‘మీరు చేయకపోతే మేమే ఆదేశాలు ఇస్తాం’’ అని స్పష్టం చేసింది. జస్టిస్‌ జేబీ పర్దీవాలా, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌ బెంచ్.. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశంలో కార్పొరేట్‌ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని పేర్కొంది. ఫైనల్ డెసిషన్‌ను రెండు వారాల్లోగా కోర్టులో సబ్మిట్ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

వరద ఉద్ధృతిలో వాగు దాటేందుకు యత్నం
TG· 13 Aug 2026

వరద ఉద్ధృతిలో వాగు దాటేందుకు యత్నం

TG: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరద ఉద్ధృతి ప్రమాదకరంగా మారింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్‌వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కొందరు బైకర్లు వాగును దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అదుపుతప్పిన రెండు బైక్‌లు ప్రవాహంలో పడిపోయాయి. స్థానికులు వెంటనే బైకర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం వాగులో పడిపోయిన రెండు బైకులను కూడా స్థానికుల సహాయంతో బయటకు తీశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే కాజ్‌వేలు దాటొద్దని అధికారులు సూచించారు.

NO Advance Tip అంటున్న కేంద్రం!
News· 13 Aug 2026

NO Advance Tip అంటున్న కేంద్రం!

క్యాబ్, ఆటో బుకింగ్ యాప్‌లలో 'Advance Tip' ఇస్తేనే రైడ్ త్వరగా కన్‌ఫర్మ్ అవుతుందనే దాన్ని కేంద్ర రవాణా శాఖ నిలిపివేయనుంది. బుకింగ్ టైంలో 'Advance Tip' లేదా 'Add-on'ల పేరుతో ప్రయాణికుల నుంచి Extra Charges తీసుకునే ఆప్షన్లను తొలగించాలని యాప్ సంస్థలను ఆదేశించింది. రైడ్ పూర్తయ్యాక మాత్రమే ఇష్టంతో టిప్ ఇచ్చేలా మార్పులు చేయాలని చెప్పింది.

బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిందా?
World· 13 Aug 2026

బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిందా?

బలూచిస్థాన్‌ పాకిస్థాన్ దేశంలో ఒక ప్రాంతం. బలూచ్ జాతీయవాదులు, వేర్పాటువాదులు ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇది పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం అయిన ఆగస్టు 14కు మూడు రోజుల ముందు వస్తుంది. అయితే దీనికి అధికారిక గుర్తింపు లేదు. పాక్‌లో ఆగస్టు 14నే స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1947 ఆగస్టు 11న కలాత్(బలూచిస్థాన్) ముస్లిం లీగ్ మధ్య ఒప్పందం ద్వారా కలాత్‌ను స్వతంత్ర రాజ్యంగా గుర్తించారు. 1948లో మార్చిలో అది పాకిస్థాన్‌లో కలిసిపోయింది.

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చడంపై ఆగ్రహం.. భారీ ర్యాలీ
TG· 13 Aug 2026

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చడంపై ఆగ్రహం.. భారీ ర్యాలీ

TG: సూర్యాపేటకు రైల్వే కారిడార్‌ సాధించాలనే డిమాండ్‌తో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌-అమరావతి బుల్లెట్‌ రైలు అలైన్‌మెంట్‌ను మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేటలో విద్యార్థులు, అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హైవే 65కు సమాంతరంగా కోదాడ, సూర్యాపేట, నకిరేకల్‌, నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్‌ మీదుగా రైల్వే కారిడార్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వేలాది మంది విద్యార్థులు కొత్త బస్టాండ్‌ నుంచి 60ఫీట్ల రోడ్డు, వాణిజ్య భవన్‌ సెంటర్‌ మీదుగా ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.

వన్యప్రాణుల రక్షణకు ‘హనుమాన్‌’.. పవన్‌ కల్యాణ్‌
Politics· 13 Aug 2026

వన్యప్రాణుల రక్షణకు ‘హనుమాన్‌’.. పవన్‌ కల్యాణ్‌

AP: ఏనుగుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ CM పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విశాఖలో జరిగిన International Elephant Day ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతో ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి రిజల్ట్స్ వచ్చాయన్నారు. మానవ–వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని, ప్రతి సంవత్సరం రెండు కుంకీ ఏనుగులకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్లాన్ సిద్ధం చేశామని అన్నారు. ‘హనుమాన్‌’ ప్రాజెక్టుతో వన్యప్రాణుల ప్రొటెక్షన్‌కు వేగంగా పనులు చేస్తున్నట్లు వెల్లడించారు.

రన్నింగ్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు
TG· 13 Aug 2026

రన్నింగ్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు

TG: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమైకుంట గ్రామశివారులో జూపిటర్ స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన పడ్వాల్ నిద్యాన్ సింగ్ స్కూటీపై ఇంద్రవెల్లి మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జిరిగింది. గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో స్కూటీ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో వెంటనే వాహనాన్ని ఆపి పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

హాలీవుడ్ లెవల్ టాలెంట్‌తో సుకుమార్ కూతురు
News· 13 Aug 2026

హాలీవుడ్ లెవల్ టాలెంట్‌తో సుకుమార్ కూతురు

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి నటిగానే కాకుండా సింగర్‌గానూ ఇంటర్నేషనల్ లెవెల్లో తన టాలెంట్ నిరూపించుకుంటోంది. 'గాంధీ తాత చెట్టు' సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న ఆమె, ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఆకట్టుకుంది. తాజాగా అమెరికాలోని బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ సమ్మర్ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. 272 మంది పోటీపడగా ఫుల్ స్కాలర్‌షిప్ సాధించి ఎంపికైన 14 మందిలో సుకృతి సెలెక్ట్ అయింది.

‘నా స్మృతిలో చేగువేరా’ - పుస్తకం
Books· 13 Aug 2026

‘నా స్మృతిలో చేగువేరా’ - పుస్తకం

క్యూబా విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో రాసిన ప్రసిద్ధ పుస్తకానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. చేగువేరా జీవితంలాగే ఆయన మరణంపై అనేక కథలు, వదంతులు వ్యాపించాయి. వాటికి సమాధానంగా కాస్ట్రో చేసిన ప్రసంగాలు, రచనలు, ఇంటర్వూల సంకలనం ఇది. చేగువేరాతో తన అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, విప్లవ ప్రయాణాన్ని, ఆయన మరణం తాలూకు నిజాలను ఈ పుస్తకంలో కాస్ట్రో కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రజాశక్తి బుక్ హౌస్, నవతెలంగాణ బుక్‌హౌస్ సంస్థలు దీన్ని తెలుగులో ప్రచురించాయి. ధర రూ.200. కొనేందుకు <a href="https://www.amazon.in/-/hi/Fidel-Castro/dp/B078LCJCCN">లింక్</a>.

వాట్సాప్‌లోనే ఆధార్‌.. నిమిషాల్లో ఈ-ఆధార్‌ డౌన్‌లోడ్‌
Infotainment· 13 Aug 2026

వాట్సాప్‌లోనే ఆధార్‌.. నిమిషాల్లో ఈ-ఆధార్‌ డౌన్‌లోడ్‌

ఆధార్‌ కార్డు అవసరమైనప్పుడు ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్‌ ద్వారా ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా +919013151515 నంబర్‌ను ఫోన్‌లో సేవ్‌ చేసుకుని వాట్సాప్‌లో ‘Hi’ లేదా ‘నమస్తే’ అని మెసేజ్‌ పంపాలి. తరువాత DigiLocker సర్వీసెస్ సెలెక్ట్ చేసి లాగిన్‌ అవ్వాలి. ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చేసి, లింక్‌ అయిన మొబైల్‌కు వచ్చిన OTPని ఎంటర్‌ చేయాలి. తర్వాత <a href="https://www.digilocker.gov.in/">DigiLocker</a>లో ఆధార్‌ను ఎంచుకుంటే PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.