Latest

‘మీరు చేయకపోతే మేమే చేస్తాం’.. సుప్రీంకోర్టు సీరియస్
హై షుగర్, సాల్ట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌పై వార్నింగ్ లేబుల్స్ ఏర్పాటు చేసే అంశంలో కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. ‘‘మీరు చేయకపోతే మేమే ఆదేశాలు ఇస్తాం’’ అని స్పష్టం చేసింది. జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్ బెంచ్.. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశంలో కార్పొరేట్ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని పేర్కొంది. ఫైనల్ డెసిషన్‌ను రెండు వారాల్లోగా కోర్టులో సబ్మిట్ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
వరద ఉద్ధృతిలో వాగు దాటేందుకు యత్నం
TG: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరద ఉద్ధృతి ప్రమాదకరంగా మారింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్‌వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కొందరు బైకర్లు వాగును దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అదుపుతప్పిన రెండు బైక్‌లు ప్రవాహంలో పడిపోయాయి. స్థానికులు వెంటనే బైకర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం వాగులో పడిపోయిన రెండు బైకులను కూడా స్థానికుల సహాయంతో బయటకు తీశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే కాజ్‌వేలు దాటొద్దని అధికారులు సూచించారు.

NO Advance Tip అంటున్న కేంద్రం!
క్యాబ్, ఆటో బుకింగ్ యాప్‌లలో 'Advance Tip' ఇస్తేనే రైడ్ త్వరగా కన్‌ఫర్మ్ అవుతుందనే దాన్ని కేంద్ర రవాణా శాఖ నిలిపివేయనుంది. బుకింగ్ టైంలో 'Advance Tip' లేదా 'Add-on'ల పేరుతో ప్రయాణికుల నుంచి Extra Charges తీసుకునే ఆప్షన్లను తొలగించాలని యాప్ సంస్థలను ఆదేశించింది. రైడ్ పూర్తయ్యాక మాత్రమే ఇష్టంతో టిప్ ఇచ్చేలా మార్పులు చేయాలని చెప్పింది.

బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిందా?
బలూచిస్థాన్ పాకిస్థాన్ దేశంలో ఒక ప్రాంతం. బలూచ్ జాతీయవాదులు, వేర్పాటువాదులు ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇది పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం అయిన ఆగస్టు 14కు మూడు రోజుల ముందు వస్తుంది. అయితే దీనికి అధికారిక గుర్తింపు లేదు. పాక్‌లో ఆగస్టు 14నే స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1947 ఆగస్టు 11న కలాత్(బలూచిస్థాన్) ముస్లిం లీగ్ మధ్య ఒప్పందం ద్వారా కలాత్‌ను స్వతంత్ర రాజ్యంగా గుర్తించారు. 1948లో మార్చిలో అది పాకిస్థాన్‌లో కలిసిపోయింది.

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చడంపై ఆగ్రహం.. భారీ ర్యాలీ
TG: సూర్యాపేటకు రైల్వే కారిడార్ సాధించాలనే డిమాండ్‌తో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్-అమరావతి బుల్లెట్ రైలు అలైన్‌మెంట్‌ను మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేటలో విద్యార్థులు, అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హైవే 65కు సమాంతరంగా కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్ మీదుగా రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థులు కొత్త బస్టాండ్ నుంచి 60ఫీట్ల రోడ్డు, వాణిజ్య భవన్ సెంటర్ మీదుగా ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.

వన్యప్రాణుల రక్షణకు ‘హనుమాన్’.. పవన్ కల్యాణ్
AP: ఏనుగుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో జరిగిన International Elephant Day ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతో ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి రిజల్ట్స్ వచ్చాయన్నారు. మానవ–వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని, ప్రతి సంవత్సరం రెండు కుంకీ ఏనుగులకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్లాన్ సిద్ధం చేశామని అన్నారు. ‘హనుమాన్’ ప్రాజెక్టుతో వన్యప్రాణుల ప్రొటెక్షన్‌కు వేగంగా పనులు చేస్తున్నట్లు వెల్లడించారు.

రన్నింగ్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు
TG: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమైకుంట గ్రామశివారులో జూపిటర్ స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన పడ్వాల్ నిద్యాన్ సింగ్ స్కూటీపై ఇంద్రవెల్లి మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జిరిగింది. గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో స్కూటీ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో వెంటనే వాహనాన్ని ఆపి పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

హాలీవుడ్ లెవల్ టాలెంట్‌తో సుకుమార్ కూతురు
దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి నటిగానే కాకుండా సింగర్‌గానూ ఇంటర్నేషనల్ లెవెల్లో తన టాలెంట్ నిరూపించుకుంటోంది. 'గాంధీ తాత చెట్టు' సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న ఆమె, ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఆకట్టుకుంది. తాజాగా అమెరికాలోని బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ సమ్మర్ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. 272 మంది పోటీపడగా ఫుల్ స్కాలర్‌షిప్ సాధించి ఎంపికైన 14 మందిలో సుకృతి సెలెక్ట్ అయింది.

‘నా స్మృతిలో చేగువేరా’ - పుస్తకం
క్యూబా విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో రాసిన ప్రసిద్ధ పుస్తకానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. చేగువేరా జీవితంలాగే ఆయన మరణంపై అనేక కథలు, వదంతులు వ్యాపించాయి. వాటికి సమాధానంగా కాస్ట్రో చేసిన ప్రసంగాలు, రచనలు, ఇంటర్వూల సంకలనం ఇది. చేగువేరాతో తన అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, విప్లవ ప్రయాణాన్ని, ఆయన మరణం తాలూకు నిజాలను ఈ పుస్తకంలో కాస్ట్రో కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రజాశక్తి బుక్ హౌస్, నవతెలంగాణ బుక్‌హౌస్ సంస్థలు దీన్ని తెలుగులో ప్రచురించాయి. ధర రూ.200. కొనేందుకు <a href="https://www.amazon.in/-/hi/Fidel-Castro/dp/B078LCJCCN">లింక్</a>.

వాట్సాప్‌లోనే ఆధార్.. నిమిషాల్లో ఈ-ఆధార్ డౌన్‌లోడ్
ఆధార్ కార్డు అవసరమైనప్పుడు ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా +919013151515 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని వాట్సాప్‌లో ‘Hi’ లేదా ‘నమస్తే’ అని మెసేజ్ పంపాలి. తరువాత DigiLocker సర్వీసెస్ సెలెక్ట్ చేసి లాగిన్ అవ్వాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, లింక్ అయిన మొబైల్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. తర్వాత <a href="https://www.digilocker.gov.in/">DigiLocker</a>లో ఆధార్‌ను ఎంచుకుంటే PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఖర్గే ప్రసంగించిన మైదానాన్ని శుద్ధి చేసిన బీజేపీ
ఆగస్టు 8న ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లా హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే విజయ శంఖనాద్ ర్యాలీలో ప్రసంగం చేశారు. 2027 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా నిర్వహించిన కార్యక్రమం ఇది. తను ప్రసంగించిన తర్వాత బీజేపీ వర్గాలు ఆ మైదానాన్ని ‘శుద్ధి’ చేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఆరోపించారు. తాను అక్కడ ప్రజల సమస్యల గురించి మాట్లాడారని, ఏ మతం లేదా కులం పేరు తీసుకోలేదని చెప్పారు.

‘నాకు నచ్చిన నా తెలుగు’ – రచనల ఆహ్వానం
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం 125వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సాహిత్య సంకలనం రానుంది. ఇందులో ‘నాకు నచ్చిన నా తెలుగు’ కోసం యువ కవులు, రచయితల నుంచి రచనలు ఆహ్వానిస్తున్నారు. తెలుగు భాషా వైభవం, ఔన్నత్యాన్ని ప్రతిబింబించే రచనలు లేదా తెలుగు కావ్యాలు, గద్యాలు, ఇతర సాహిత్య ప్రక్రియల విశిష్టతను విశ్లేషించే రచనలు పంపవచ్చు. రచనలు, రచయితల వివరాలను యూనికోడ్ తెలుగు (Unicode Telugu Text) ఫార్మాట్‌లో మాత్రమే పంపాలి. చివరి తేదీ: 15 ఆగస్టు 2026. రచనలు పంపాల్సిన ఇ-మెయిల్: sktbn.org@gmail.com.

శిరోమణి అకాలీ దళ్(SAD) జాతీయ అధ్యక్షుడిపై దాడి
మహారాష్ట్రలోని నాందేడ్‌లో శిరోమణి అకాలీ దళ్(SAD) జాతీయ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి గురుద్వారా మాతా సాహిబ్ కౌర్‌లో పూజలు చేసేందుకు వెళ్లారు. ఆ టైంలో ఓ నిహంగ్ సిక్కు కిర్పాన్‌తో బాదల్‌పై దాడికి ప్రయత్నించారు. బాదల్ సెక్యూరిటీ సిబ్బంది అతణ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాడిలో బాదల్ చేతికి గాయం కాగా, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

పోలవరం కాలువలో బాలుడు గల్లంతు
AP: కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం వద్ద సైకిల్‌పై వెళ్తున్న 12ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పోలవరం కుడి కాలువలో పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన ఆరుమళ్ల లీలామోహన్‌రెడ్డి స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కాల్వలో జారిపడి నీటిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ శివయ్య తెలిపారు.
ఇరుముడి వెనుక 3 కారణాలు
హీరో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో వస్తున్న నెక్స్ట్ మూవీ 'ఇరుముడి'. yesterday ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి 'ఇరుముడి' అని టైటిల్ ఎందుకు పెట్టారో డైరెక్టర్ రివీల్ చేశారు. సినిమాలో ఇద్దరి మధ్య ఉండే బంధం లేదా రెండు ముడులు అనే కాన్సెప్ట్‌తో ఈ పేరు పెట్టామన్నారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్, అయ్యప్ప భక్తి, ఒక క్రైమ్ మిస్టరీ అనే మూడు లేయర్స్ సినిమాలో ఉంటాయని, థియేటర్లలో ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పారు.

మియాపూర్ సర్కిల్–48లో జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యటన
TG: మియాపూర్ సర్కిల్–48 డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి రోడ్డుపై క్లీనింగ్ పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. యుబిడి బృందంతో కలిసి హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి, మైత్రీనగర్ పార్కులను చెక్ చేసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. స్థానికులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో మాట్లాడి, పౌర సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సంకల్పం ముందు..వైకల్యం ఎంత!
సంకల్పం అనే బలం ముందు వైకల్యం ఎంత అని నిరూపించింది బిహార్‌లోని కటిహార్‌కు చెందిన 13 ఏళ్ల లక్ష్మి. రెండు చేతులు లేని తను తన కాలి వేళ్ల మధ్య పెన్ను పట్టుకొని రాయడం నేర్చుకుంది. చదువు మీద ఇష్టంతో హసన్‌గంజ్ ప్రఖండంలోని స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. తనే తన పనులు సొంతంగా చేసుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు కూలీ పని చేసి ఆమెను చదివిస్తున్నారు. టీచర్ కావాలన్నది లక్ష్మి కల. ఆరోగ్య శాఖ ఆమెకు 100% దివ్యాంగత్వ సర్టిఫికెట్ ఇచ్చింది. సామాజిక సంక్షేమ శాఖ తనకు సాయం అందించేందుకు ముందుకొచ్చింది.
జంతర్ మంతర్ సీజన్–2
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించిన CJP మరో నిరసనకు సిద్ధమవుతోంది. విద్య, ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూ దేశవ్యాప్తంగా ‘ప్రజల మాట విందాం యాత్ర’ చేపట్టనున్నట్లు తెలిపారు. దీనినే ‘జంతర్ మంతర్ సీజన్–2’గా తెలియజేశారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు.

US సిటిజన్‌షిప్ కష్టమే.. ట్రంప్ కొత్త ఆర్డర్!
US ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బర్త్ సిటిజన్‌షిప్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. బర్త్ టూరిజమ్‌ను ఆపడానికి మరియు అమెరికాలో పుట్టే పిల్లలకు ఇచ్చే పౌరసత్వాన్ని తగ్గించడానికి రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సైన్ చేశారు. ముఖ్యంగా డెలివరీ కోసం అమెరికా వెళ్లే వాళ్లను కంట్రీలోకి రాకుండా బ్యాన్ చేసేలా రూల్స్ పెట్టారు. రీసెంట్‌గా సుప్రీంకోర్ట్ రిజెక్ట్ చేసినా, ట్రంప్ మళ్లీ ఈ రూల్స్ తీసుకొచ్చారు. దీనివల్ల ఫారిన్ కంట్రీస్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే వాళ్లు షాక్ లో ఉన్నారు.

గ్రామంలో షాకింగ్ సీన్.. వాగులో క్షుద్రపూజలు
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. నల్లకోడి, నిమ్మకాయలు, కోడిగుడ్డు, పసుపు, కుంకుమ వంటి వస్తువులు అక్కడ కనిపించాయి. గురువారం ఉదయం వాగువద్దకు వెళ్లిన స్థానికులు విషయాన్ని గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో వారిలో భయాందోళన నెలకొంది. అదేవిధంగా కాటారం మండలం మద్దులపల్లి గ్రామంలోనూ రోడ్డుపై ముగ్గు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు.
జేబులో కొత్త ఫోన్.. ఒక్కసారిగా బ్లాస్ట్!
గ్రేటర్ నోయిడాలో జేబులో ఉన్న కొత్త మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అవ్వడంతో యువకుడికి పెద్ద గాయాలయ్యాయి. ఫోన్ ఒక్కసారిగా పేలడంతో అక్కడ భయాందోళన నెలకొంది. పేలుడుకి గాయపడిన యువకుడిని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, మొబైల్ పేలడానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొత్త మొబైల్ ఫోన్ కొన్నపుడు బ్యాటరీ, ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి. Be Careful!