Latest

70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
TG: నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానించనున్నట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. బోధనా ప్రతిభ, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన కృషి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీ మీటింగ్ హాల్‌లో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు.

రోజూ న్యూడుల్స్ తింటున్నారా?
తరచూ ఇంట్లోనే న్యూడుల్స్ తయారు చేసుకొని తినడం పిల్లలతోపాటు పెద్దలకూ అలవాటు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు. 75 గ్రాముల న్యూడుల్స్‌లో 750 మిల్లీగ్రామ్స్ సోడియం, 6.2 గ్రాముల స్యాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నాయి. వీటిని తరచూ తింటే స్యాచురేటెడ్ ఫ్యాట్ పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. న్యూడుల్స్‌ని విడిగా తీసుకోకుండా, కూరగాయలు, గుడ్డు వంటి పోషకమైన పదార్థాలతో కలిపి తీసుకోవడం బెటర్ అని అంటున్నారు.

గద్వాలను కరువు జిల్లాగా ప్రకటించాలి: CPM
TG: జోగులాంబ గద్వాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు ప్రత్యామ్నాయ పరిరక్షణ చర్యలు చేపట్టాలని CPM రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.శ్రీరామ్ నాయక్ డిమాండ్ చేశారు. గద్వాలలో జరిగిన CPM జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నీటిని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామని విమర్శించారు. రైతుల భూసమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులను నియంత్రించాలని కోరారు.
సంక్షేమమే మా టార్గెట్ : వినయ్‌రెడ్డి
TG : సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి అన్నారు. నందిపేట్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటివి అమలు చేస్తున్నామని చెప్పారు. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం అందిస్తున్నామని, రూ.21 వేల కోట్ల రుణమాఫీతో పాటు సన్నబియ్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు.

భారత్ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందా?
భారత GDP(Gross Domestic Product) 7.8 శాతం వృద్ధి నమోదు చేసిందని లెక్కలు చెబుతున్నా, రియాలిటీ వేరేగా ఉందని ఆర్థిక విశ్లేషకుడు వివేక్ కౌల్ అన్నారు. దేశంలో 56.2 శాతం మంది తక్కువ ఆదాయాలతో కూడిన అసంఘటిత రంగంలో ‘Self-Employed’గా ఉన్నారని చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడినవాళ్లు ఇంకా 43 శాతంగానే ఉన్నారని, Manufacutory రంగం ఉపాధి 12.1 శాతానికే పరిమితమైందని వివరించారు. కోట్లాది మంది యువత ఖాళీగా ఉండటం వల్ల హెడ్‌లైన్ వృద్ధి సంఖ్యలు సాధారణ ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిని పూర్తిగా రిఫ్లెక్ట్ కాలేదని చెప్పారు.

కర్రెగుట్టల్లో IED బ్లాస్ట్.. గిరిజనుడు మృతి
TG: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు పెట్టినట్లు అనుమానిస్తున్న IED (ప్రెషర్ బాంబు) పేలడంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. నూగూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు మరో ఐదుగురితో కలిసి వెదురుబొంగుల కోసం అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా IEDపై కాలు పడటంతో బ్లాస్ట్ జరిగింది. గాయపడిన నాగేశ్వరరావును తోటి వారు గ్రామానికి తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే చనిపోయారు. సెప్టెంబర్ 2న ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

FCRA సవరణ బిల్లు పరిశీలనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)
The Foreign Contribution (Regulation) Act (FCRA) సవరణ బిల్లు 2026ను పరిశీలించేందుకు 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ డా.సంజయ్ జైస్వాల్ నేతృత్వంలోని ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులున్నారు. విదేశీ నిధులపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం, సంస్థల రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత వాటి ఆస్తుల నిర్వహణ వంటి అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. వివిధ వర్గాల ఒపీనియన్స్ తీసుకుని శీతాకాల సమావేశాల తొలి వారంలో ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది.

షాద్‌నగర్‌లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో బాలగోకుల సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేసి ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ లక్ష్మీనారాయణ చిన్నారులను అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, వేడుకలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

బర్త్‌డే పేరుతో NRI కిడ్నాప్
AP : బర్త్‌డే గ్రాండ్‌గా చేద్దామని బ్రిటన్ నుంచి రప్పించి, ఒక NRIని స్నేహితులే కిడ్నాప్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన సుమంత్ అనే యువకుడిని తిరుపతి, హైదరాబాద్‌లలో బంధించి, అతడి టెలిగ్రామ్ ఛానెల్ అమ్మేసి రూ.1.94 కోట్లు తీసుకున్నారు. సుమంత్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి మెసేజ్ చేయడంతో సైబరాబాద్ పోలీసులు ఫ్లాట్‌పై దాడి చేసి రక్షించారు. తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని (బాలాజీ, చరణ్, వాజిద్ బాషాలను) అరెస్ట్ చేశారు.

ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోంది
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలును విస్మరించిందని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, విద్యా భరోసా, BC, SC, STలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా 1000 రోజుల పాలన అంటూ సంబరాలు చేసుకోవడం దుర్మార్గమన్నారు.

జాబ్ మారేటప్పుడు.. EPFO చెక్ చేసుకోండి!
Job మారే టైంలో ఈపీఎఫ్‌వో(EPFO) రూల్స్‌పై ఎంప్లాయిస్ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొత్త కంపెనీలో చేరే ముందు UAN యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోవడంతోపాటు Bank, PAN వివరాలు అప్‌డేట్ అయ్యాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. పాత కంపెనీకి సంబంధించిన 'Date of exit ' నమోదైతేనే పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కొత్త జాబ్‌లో చేరాక పాత నిధులను కొత్త అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వల్ల పెన్షన్ సర్వీస్ కంటిన్యూటీతోపాటు వడ్డీ నష్టం జరగకుండా ఉంటుంది.

అసెంబ్లీలో మా సమస్యలు చర్చించండి
TG: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని తెలంగాణ మెడికల్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కోరారు. శుక్రవారం చిట్యాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించాలని, లేదా Direct Benefit Transfer ద్వారా నేరుగా వేతనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

CM ప్రకటనలు చూస్తే తుగ్లక్ కూడా సిగ్గుపడతాడు: కవిత
TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ కూడా సిగ్గుపడతాడని తెలంగాణ రక్షణ సేన నేత కవిత హాట్ కామెంట్స్ చేశారు. CM అనౌన్స్‌మెంట్స్‌కి, Govt. డిపార్ట్‌మెంట్స్ డెసిషన్స్‌కి పొంతన లేకుండా పోయిందన్నారు. ఇంటర్ అడ్మిషన్లు ఈ ఏడాది నుంచి ఉండవని CM చెబుతుంటే.. రెండు రోజుల్లో అడ్మిషన్లు అంటూ ఇంటర్ బోర్డు ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రంలోని మేధావులు, స్టేక్‌హోల్డర్స్‌తో చర్చించాలని సూచించారు. అలా చేస్తేనే డిగ్నిటీ ఉన్న నాయకుడిగా సీఎం నిలుస్తారని అన్నారు.

‘మీ కోసమే తీస్తున్నాం’.. మేకర్స్ కామెంట్స్‌పై తాప్సీ ఫైర్!
‘పెద్ది’, ‘టాక్సిక్’ లాంటి సినిమాల్లో హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించడంపై నటి తాప్సీ మాట్లాడారు. ‘ఆడియన్స్ ఇదే చూస్తున్నారు’ అంటూ మేకర్స్ తప్పును జనాలపై నెట్టేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేవలం కలెక్షన్ల కోసమే చూస్తూ కంటెంట్‌ను పక్కన పెట్టేస్తున్నారని అన్నారు. జనాలు సపోర్ట్ చేస్తేనే మార్పు వస్తుందని, ఒకవైపు ట్రోల్ చేస్తూనే ఇంకోవైపు ఆ సీన్లను కట్ చేసి వైరల్ చేసే బ్యాచ్ కూడా ఉందని తాప్సీ తెలిపారు.

అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన
AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ గోశాలలో గోవులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిత్యకళ్యాణ మండపంలో సుమారు 1,500 మంది ముత్తైదువులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని పూజించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ చుంచు రమేష్‌బాబు, సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మేళ్లగూడలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన
TG: ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం మేళ్లగూడలో నిర్వహించిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందితే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి నాయక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

SIR న్యాయబద్ధం కాదు: అశోక్ లవాసా
Election Commission చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లవాసా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు చట్టం పేరుతో ‘బలవంతుడిదే రాజ్యం’(Might is right) అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, దాని స్ఫూర్తిని కాపాడటం ముఖ్యమన్నారు. ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది పేర్లను తొలగించడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. ఇది న్యాయబద్ధంగా లేదని, దీని వల్ల ప్రజలకు ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోయే ప్రమాదముందని హెచ్చరించారు.
CJP సౌరవ్ దాస్ స్ట్రాంగ్ డిమాండ్!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రొటెస్ట్‌లో ఒక దళిత కుటుంబానికి చెందిన మైనర్ బాలిక తండ్రి సంజయ్‌పై కొంతమంది క్రిమినల్స్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై FIR ఫైల్ చేసినా, హత్యాయత్నం మరియు SC/ST యాక్ట్ కింద కేసులు పెట్టకుండా పోలీస్‌లు నిర్లక్ష్యం వహించారని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిందితులు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా బెదిరిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో, వెంటనే వారిపై కఠిన సెక్షన్లతో అరెస్ట్ చేయాలని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద డిమాండ్ చేశారు.

తెలంగాణలో రేపు మంత్రివర్గ విస్తరణ?
TG: తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్‌లో ఖాళీ అయిన మూడు స్థానాలను భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు(ఆదివారం) మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన రానుందని, విజయశాంతి, మహేష్ గౌడ్, ప్రసాద్ కుమార్‌లకు కేబినెట్‌లో అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది.

బస్సు బోల్తా.. డ్రైవర్ స్పాట్ డెడ్
AP: కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలో జాతీయ రహదారి 161పై శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి బిచ్కుందకు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్ ఆంజనేయులు (50) అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.

ఎయిర్‌లైన్స్‌కు ఇంధన కష్టాలు..విమాన టికెట్లపై ప్రభావం?
విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు మరోసారి పెరిగాయి. సెప్టెంబర్ 1 నుంచి లీటర్‌పై ₹6.28(5.46%) పెరగడంతో ధర ₹121.28కి చేరింది. ఆగస్టులోనూ ATF ధర పెరిగింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఖర్చుల్లో ఇంధన ఖర్చే 35–40 శాతం వాటా ఉంటుంది. దీంతో విమానయాన సంస్థలపై ఖర్చుల భారం పెరిగి, ఆ ప్రభావం టికెట్ ధరలపై పడే అవకాశం ఉంది.