Latest

కంపెనీ ఇచ్చే ఉచిత ఇన్సూరెన్స్‌ని నమ్ముకుంటే కష్టమే!
Finance· 10 Aug 2026

కంపెనీ ఇచ్చే ఉచిత ఇన్సూరెన్స్‌ని నమ్ముకుంటే కష్టమే!

చాలామంది కంపెనీలు ఉచితంగా ఇచ్చే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (GTL) ఉంది కదా అని కూల్ అయిపోతారు. కానీ అది అసలు సరిపోదు! మీరు ఏడాదికి ₹50 లక్షలు సంపాదిస్తే, కంపెనీ కేవలం ₹30 లక్షల కవర్ ఇచ్చిందనుకోండి.. ఏమైనా రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీకి ఆ డబ్బులు దేనికి సరిపోవు. పైగా ఈ ఇన్సూరెన్స్ మీరు ఆ కంపెనీలో ఉన్నంతవరకే పనిచేస్తుంది. జాబ్ మారితే అట్టే పోతుంది! అందుకే సొంతంగా ఒక టర్మ్ ప్లాన్ ఉండటం మస్ట్. అలాగే ఆఫీస్ రికార్డ్స్‌లో మీ నామినీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి భయ్యా!

యాదాద్రి కొండల్లో 10,000 ఏళ్ల నాటి సీక్రెట్
Politics· 10 Aug 2026

యాదాద్రి కొండల్లో 10,000 ఏళ్ల నాటి సీక్రెట్

TG: యాదాద్రి ఇంద్రపాలనగరంలో 'మట్టి ఫౌండేషన్' రీసెర్చర్స్ శంకరంగుట్ట దగ్గర 10,000 ఏళ్ల కిందటి రాతి గుహలు, రెడ్ పెయింటింగ్స్, పాతకాలపు పాత్రలు, ఐవరీ గాజులను గుర్తించారు. ఓపెన్ కొండపైన ఉన్నా ఆ పెయింటింగ్స్ పాడవకుండా ఇప్పటికీ సజీవంగా ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.

పోలీసుల లాఠీచార్జ్..గాయపడ్డ విద్యార్థులు
India· 10 Aug 2026

పోలీసుల లాఠీచార్జ్..గాయపడ్డ విద్యార్థులు

జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ పరీక్షల సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్‌లో అనేకమంది నిరసనకారులు గాయపడ్డారు. వాళ్లను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

జార్ఖండ్ స్టూడెంట్స్‌‌పై పోలీసుల లాఠీఛార్జ్
India· 10 Aug 2026

జార్ఖండ్ స్టూడెంట్స్‌‌పై పోలీసుల లాఠీఛార్జ్

పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జార్ఖండ్ విద్యార్థులు నిరసన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ‘విధానసభ ఘేరావ్’ మార్చ్‌ చేపడుతున్నారు. అసెంబ్లీ సమీపంలో బారికేడ్‌లను దాటడానికి ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

RMP చేసిన తప్పు..విద్యార్థిని బలి!
News· 10 Aug 2026

RMP చేసిన తప్పు..విద్యార్థిని బలి!

TG: ఖమ్మం జిల్లా బాస్వాపురంలో కస్తూరిబా స్కూల్‌లో 8th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయికి ఫీవర్ రావడంతో పేరెంట్స్ లోకల్ RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అయితే ఆ RMP డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వగానే పాపకు ఊపిరాడక కండిషన్ సీరియస్ అయింది. వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా, ECG తీసిన డాక్టర్లు పాప చనిపోయినట్లు చెప్పారు. RMP డాక్టర్ మద్యం మత్తులో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఫ్యామిలీ ఆరోపిస్తోంది. తండ్రి కంప్లైంట్‌తో పోలీసులు కేసు బుక్ చేసి పారిపోయిన RMP డాక్టర్ కోసం వెతుకుతున్నారు.

వంటగ్యాస్‌ కొరత..ఇండక్షన్‌ స్టవ్‌ల వైపు జనం
India· 10 Aug 2026

వంటగ్యాస్‌ కొరత..ఇండక్షన్‌ స్టవ్‌ల వైపు జనం

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధ ప్రభావంతో దేశంలో వంటగ్యాస్‌ కొరత తీవ్రమైంది. సిలిండర్ల ధరలు పెరగడం, సప్లై ఆలస్యం కారణంగా చాలామంది ఇండక్షన్‌ స్టవ్‌ల వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇండక్షన్‌ స్టవ్‌ల డిమాండ్‌ పెరగడంతో ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌లో కూడా స్టాక్‌ అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్రకారం ఇండక్షన్‌ కుక్‌టాప్‌ల విక్రయాలు నాలుగు రెట్లు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్‌ స్టవ్‌లను ప్రోత్సహించాలని యోచిస్తోంది.

పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ!
News· 10 Aug 2026

పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ!

TG:దివంగత లీడర్ పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో ఆయన వైఫ్ పెద్ది స్వప్న చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ మీటింగ్‌కి KTR, హరీష్ రావులతో పాటు పలువురు పొలిటికల్ లీడర్స్, కేడర్ అటెండ్ అయి ఆయన పిక్చర్‌కి నివాళులు అర్పించారు. సుదర్శన్ రెడ్డితో ఉన్న మెమొరీస్‌ని రీకాల్ చేసుకుంటూ, ఈ కష్టసమయంలో వారి ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో లీడర్స్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్, ఫాలోవర్స్ పార్టిసిపేట్ చేశారు.

రాంచీ ప్రొటెస్ట్ సిట్యువేషన్ హీటెక్కింది!
Politics· 10 Aug 2026

రాంచీ ప్రొటెస్ట్ సిట్యువేషన్ హీటెక్కింది!

జార్ఖండ్ రాజధాని రాంచీలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఉద్రిక్తంగా మారింది. ఎగ్జామ్స్ లో జరిగిన అక్రమాలపై ఆగ్రహంతో అసెంబ్లీ ముట్టడికి వేలాది మంది స్టూడెంట్స్ బయలుదేరారు. పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను నెట్టేసి మరీ అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. గత 17 రోజులుగా JSSC-CGL ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి, CBI ఎంక్వైరీ వేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ వైపు వస్తున్న క్రౌడ్‌ని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ క్యానన్లు వాడటంతో సిట్యువేషన్ ఇంకా హీటెక్కింది. దీంతో అక్కడ భారీగా సెక్యూరిటీ పెంచారు.

నటిపై బాలీవుడ్ డైరెక్టర్ అత్యాచారం
Cinema· 10 Aug 2026

నటిపై బాలీవుడ్ డైరెక్టర్ అత్యాచారం

73 ఏళ్ల బాలీవుడ్ సీనియర్ ఫిల్మ్‌మేకర్ షకీల్ నూరానీని ముంబైలోని మాల్వాణి పోలీసులు అరెస్టు చేశారు. 2016లో సినిమా అవకాశం కోసం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు, మందు కలిపిన డ్రింక్ ఇచ్చి లైంగికంగా వేధించారని 33 ఏళ్ల నటి కంప్లైంట్ చేసింది. ఆ ఇన్సిడెంట్‌ను వీడియో తీసి, అది చూపించి బెదిరించి మళ్లీ మళ్లీ దాడి చేశారని ఆరోపించింది. పోలీసులు ఆయన్ని కస్టడీలో ఉంచారు.

వరల్డ్ నెంబర్ వన్‌ని ఓడించిన ఇండియన్ గర్ల్ 🏸
Politics· 10 Aug 2026

వరల్డ్ నెంబర్ వన్‌ని ఓడించిన ఇండియన్ గర్ల్ 🏸

అస్సాం రాష్ట్రం గౌహతికి చెందిన 26 ఏళ్ల అష్మిత చలిహ కొరియా మాస్టర్స్ సూపర్ 300 టైటిల్ గెలుచుకుని రికార్డ్ సృష్టించింది! ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ ఈమెనే. కొన్ని నెలల క్రితమే తీవ్ర గాయం నుంచి కోలుకుని గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన అష్మిత.. ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ చైనా ప్లేయర్ హాన్ కియాన్ జిపై 21-14, 21-24, 21-14తో సూపర్ విక్టరీ కొట్టింది. ఈ రేంజ్ ఫైట్ ఇచ్చి మన ఇండియన్ బ్యాడ్మింటన్‌కి కొత్త హోప్‌గా మారింది!

ఒంగోలులో TDP vs జనసేన!
Politics· 10 Aug 2026

ఒంగోలులో TDP vs జనసేన!

AP: ఒంగోలులో TDP, జనసేన నాయకుల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. TDP MLA దామచర్ల జనార్దన్‌రావుకు మాజీ మంత్రి, జనసేన లీడర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. "ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు" అని తేల్చి చెప్పారు. "TDPకి కేవలం ఓట్లు వేయడానికే మా జనసేన కార్యకర్తలు పనికొస్తారా?" అని ప్రశ్నించిన ఆయన, వారి కోసం దేనికైనా సిద్ధమని మాట్లాడారు. పొత్తులో ఉన్నా అన్యాయం జరుగుతోందని, జనసేన కార్యకర్తలకు తాను ఎల్లవేళలా సపోర్ట్‌గా ఉంటానని జనసేన లీడర్ బాలినేని ప్రకటించారు.

చంద్రగిరి అటవీ ప్రాంతంలో 22 ఏనుగులు
AP· 10 Aug 2026

చంద్రగిరి అటవీ ప్రాంతంలో 22 ఏనుగులు

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో 22 ఏనుగులు సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సిద్ధలగండి చెరువు సమీపంలో ఏనుగులున్నాయని, వీఆర్‌ కాలనీ, వేములవాడ, కోటకడపల్లి గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయ్యగారిపల్లి, పులిగోనపల్లి, నెరబైలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త తీర్మానం
India· 10 Aug 2026

తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త తీర్మానం

తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా సరికొత్త తీర్మానాన్ని ఆమోదించింది. ఇకపై విద్యాసంస్థలు, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, పబ్లిక్ సంస్థలు తమ అధికారిక కార్యక్రమాల్లో మొదట రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ పాడాలని రూల్ ఫ్రేమ్ చేశారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టారు. 1970 నుంచి తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ పాటనే మొదటగా పాడే సంప్రదాయం ఉందని గుర్తు చేశారు.

పాక్ బాక్సర్‌ను ఓడించిన కథ- మోదీ రియాక్షన్?
News· 10 Aug 2026

పాక్ బాక్సర్‌ను ఓడించిన కథ- మోదీ రియాక్షన్?

పాకిస్థాన్ బాక్సర్‌ను ఓడించినప్పటి సరదా ఎక్స్ పీరియన్స్ ని ఇండియన్ హెవీవేట్ బాక్సర్ నరేందర్ బెర్వాల్ ప్రధాని మోదీతో పంచుకున్నారు. "నీ పేరు నరేందర్, నీ కోచ్ పేరు నరేందర్, నీ ప్రధాని పేరు కూడా నరేంద్రనే నాకు ఈ నరేంద్ర అనే పేరు వింటేనే భయమేస్తోంది" అని ఆ పాక్ బాక్సర్ తనతో అన్నట్లు చెప్పడంతో మోదీ ఒక్కసారిగా నవ్వేశారు. ఈ మధ్య 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెడల్స్ సాధించిన అథ్లెట్లకు ప్రధాని మోదీ తన ఇంట్లో ఆతిథ్యమిచ్చి ప్రత్యేకంగా అభినందించారు.

జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనల్లో Spider Man
India· 10 Aug 2026

జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనల్లో Spider Man

‘రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మాటలు వినడం లేదు. అందుకే నేను ఝార్ఖండ్‌కు వచ్చాను. ప్రభుత్వం విద్యార్థులకు ఏమీ చేయాలని అనుకోవడం లేదు’. స్పైడర్‌మ్యాన్ మీడియాతో చెప్పిన మాటలివి. జార్ఖండ్‌లో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా నిరసనకారులు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్‌ చేపడుతున్నారు. ఇందులో Spider Man మాస్క్ ధరించిన ఒక నిరసనకారుడు మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.

వర్షం..మీ కాళ్లకు శత్రువు అవుతోంది! 🦠
Politics· 10 Aug 2026

వర్షం..మీ కాళ్లకు శత్రువు అవుతోంది! 🦠

తెలంగాణలో గత రెండేళ్లలో లెప్టోస్పైరోసిస్ కేసులు ఏకంగా 125 రెట్లు పెరిగాయ్! వర్షం నీళ్లలో, బురదలో ఉండే బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పైరోసిస్ వస్తుంది. కాలికి చిన్న గాయం ఉన్నా, పగుళ్లున్నా ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఎక్కువవుతుంది. ఫీవర్, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలని నిపుణులు అంటున్నారు. లేకపోతే కిడ్నీ, లివర్ దెబ్బతినే సీరియస్ ప్రమాదం ఉంది. వర్షంలో తడిచిన కాళ్లను వెంటనే క్లీన్‌గా, డ్రైగా ఉంచుకోవాలంటున్నారు.

జార్ఖండ్‌లో విద్యార్థులపై వాటర్‌ కేనాన్ల ప్రయోగం
India· 10 Aug 2026

జార్ఖండ్‌లో విద్యార్థులపై వాటర్‌ కేనాన్ల ప్రయోగం

జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ-జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్‌ చేస్తున్నారు. అసెంబ్లీ వైపు ర్యాలీగా కదిలిన వారు బారికేడ్లు దాటి ముట్టడి చేయాలని ప్రయత్నించగా, పోలీసులు వాటర్‌ కేనాన్లు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. జాతీయ జెండాలు పట్టుకుని బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లాలని విద్యార్థులు యత్నించారు. పోలీసులు-విద్యార్థుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

CJIని రావొద్దంటూ లా స్టూడెంట్స్ షాకింగ్ డెసిషన్!
News· 10 Aug 2026

CJIని రావొద్దంటూ లా స్టూడెంట్స్ షాకింగ్ డెసిషన్!

హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ డేకి CJI సూర్య కాంత్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలవవద్దంటూ 450 మంది స్టూడెంట్స్ విసికి లేఖ రాశారు. ఇటీవల నీట్ ప్రొటెస్ట్‌లో పోలీస్ దాడులపై పిటిషన్ విచారిస్తూ "వీడియోలు చూపిస్తూ మా టైమ్ వేస్ట్ చేయకండి" అని CJI చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. విద్యార్థుల హక్కులను పట్టించుకోని వారి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోలేమని చెప్పారు. వివాదం నేపథ్యంలో ఈసారి అసలు గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది.

‘విధానసభ ఘేరావ్’లో పాల్గొన్న దేవేంద్ర నాథ్ మహ్తో
India· 10 Aug 2026

‘విధానసభ ఘేరావ్’లో పాల్గొన్న దేవేంద్ర నాథ్ మహ్తో

జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ-జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల నిరసన కొనసాగుతోంది. జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి కొత్త అసెంబ్లీ భవనం వైపు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్‌ చేస్తున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహ్తో మాట్లాడుతూ ‘నేను నిరాహారదీక్షలో ఉన్నా ఇక్కడికి వచ్చాను. వాళ్లు మమ్మల్ని ఆపలేరు’ అని చెప్పారు. 9 రోజులుగా దీక్ష చేస్తున్నానని, ప్రభుత్వం తమ డిమాండ్లను తప్పక అంగీకరించాలని’ అన్నారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు రాజేశ్వరరావు కన్నుమూత
TG· 10 Aug 2026

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు రాజేశ్వరరావు కన్నుమూత

TG: హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజేశ్వరరావు(75) మున్సూరాబాద్‌లోని స్వగృహంలో అకస్మాత్తుగా మృతి చెందారు. 1951లో తాడిపత్రి సమీపంలో జన్మించిన ఆయన 1976 నుంచి విశాలాంధ్ర ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసి జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో తొలి కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారిగా 36 ఎగ్జిబిషన్లకు సేవలందించారు. ప్రగతి పబ్లికేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రైలు ప్రమాదంలో కాలు, చేయి కోల్పోయినా సాహితీ సేవలు కొనసాగించారు.

తెలంగాణపై ఫరియా ఎమోషనల్ కామెంట్స్!
Cinema· 10 Aug 2026

తెలంగాణపై ఫరియా ఎమోషనల్ కామెంట్స్!

జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. 'తెలంగాణ ప్రజలు అందరినీ ఆప్యాయంగా ఆదరిస్తారు, అందరితో కలిసిమెలిసి జీవిస్తారు. ఇది నిజంగా చాలా గ్రేట్' ఇలానే ఉండాలి అంటూ ఆమె ఎమోషనల్ అయింది. ఈ స్టేట్‌మెంట్ తెలంగాణ మనుషుల లవింగ్ నేచర్ మరియు కల్చర్‌కి ఉన్న యూనిక్‌నెస్ ప్రతిబింబిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.