← Back to news

రాంచీ ప్రొటెస్ట్ సిట్యువేషన్ హీటెక్కింది!

By sahani· 10 Aug 2026· Jharkhand

జార్ఖండ్ రాజధాని రాంచీలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఉద్రిక్తంగా మారింది. ఎగ్జామ్స్ లో జరిగిన అక్రమాలపై ఆగ్రహంతో అసెంబ్లీ ముట్టడికి వేలాది మంది స్టూడెంట్స్ బయలుదేరారు. పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను నెట్టేసి మరీ అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. గత 17 రోజులుగా JSSC-CGL ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి, CBI ఎంక్వైరీ వేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ వైపు వస్తున్న క్రౌడ్‌ని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ క్యానన్లు వాడటంతో సిట్యువేషన్ ఇంకా హీటెక్కింది. దీంతో అక్కడ భారీగా సెక్యూరిటీ పెంచారు.

More in Politics