Latest
చెడ్డీ గ్యాంగ్ సంచారం.. ప్రజల్లో హైటెన్షన్
AP: కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న ప్రచారం స్థానికుల్లో కలకలం రేపుతోంది. తమిళనాడు సరిహద్దులోని హోసూరు ప్రాంతంలో ఇటీవల వరుస చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు CCTV ఫుటెజ్ ఆధారంగా గుర్తించారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా కుప్పం పరిసర ప్రాంతాల్లోనూ దొంగతనాలు చోటుచేసుకోవడంతో ఆ ముఠా ఇటువైపు వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళల్లో దొంగలు తిరుగుతున్నారన్న ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో నిఘాను పెంచి ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

చేయూత పింఛన్లకు కాంగ్రెస్ సర్కార్ కొత్త రూల్స్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 'చేయూత' పింఛన్ల కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి ఉంటే పింఛన్ రాదని తెలిపింది. అలాగే సంవత్సర ఆదాయం ఊళ్లలో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు దాటితే అనర్హులు. ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్, ప్రైవేట్, కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ జాబ్ చేస్తున్నా పింఛన్ రాదని, అర్హుల ఎంపిక కోసం శనివారం ఈ రూల్స్ రిలీజ్ చేసింది.

మిడ్‌మానేరు వద్ద కార్లతో డేంజరస్ స్టంట్స్
TG: మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్ వద్ద పర్యాటకుల అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లి శివారులోని బ్యాక్‌వాటర్‌ను చూసేందుకు హైదరాబాద్ నుంచి సుమారు 50 వాహనాల్లో పర్యాటకులు తరలివచ్చారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే కొందరు పర్యాటకులు సమీపంలోని మైదానంలో కార్లతో ప్రమాదకర విన్యాసాలు చేశారు. వేగంగా కార్లు నడుపుతూ స్టంట్స్ చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు 11న NTA ఆఫీస్ ముందు నిరసన..
UGC-NET రాసిన అభ్యర్థులు మళ్లీ ప్రొటెస్ట్‌కు సిద్ధమవుతున్నారు. జూన్ 22 నుంచి జూలై 5 వరకు దాదాపు 7 లక్షల మందికి పైగా ఎగ్జామ్ రాశారు. 40 రోజులు దాటుతున్నా ఇంకా ఆన్సర్ కీ విడుదల చేయకపోవడంతో వారు మండిపడుతున్నారు. NTA గనుక స్పందించకపోతే ఈ నెల 11న ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD అడ్మిషన్ల కోసం వెయిట్ చేస్తున్న NTA పట్టించుకోవట్లేదని అంటున్నారు.

💼 డిగ్రీతో 11,403 ఉద్యోగాలు!
వివిధ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ ఉద్యోగాల కోసం IBPS <a href="https://www.ibps.in/">నోటిఫికేషన్</a> విడుదల చేసింది. ఇందులో ఏపీలో 186, తెలంగాణలో 191 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి స్థానిక భాష వచ్చిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ డేట్ ఆగస్టు 21 వరకు ఉంది.
ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు
TG: తీవ్రంగా <a href="https://www.theclearcutnews.com/n/BNi4iQK">గాయపడి</a> హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక తండ్రి వెంకటేష్ ప్రభుత్వ పెద్దలపై ఆవేదన వ్యక్తం చేశారు. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కల్యాణ్.. మీకు ఆడపిల్లలు లేరా ప్రతి నెలా హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా అంటూ మీడియా ముందు ప్రశ్నించారు. చావుబతుకుల మధ్య ఉన్న తన కుమార్తెను ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర హోంమంత్రి, జిల్లా అధికారులు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆక్రమణలపై హైడ్రా యాక్షన్.. మద్దతుగా ర్యాలీ
TG: హైడ్రా నిర్ణయాలకు మద్దతుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జనార్దన్‌హిల్స్ కాలనీ వాసులు ర్యాలీ నిర్వహించారు. HYDRAAకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాలనీలో ర్యాలీ చేపట్టారు. ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారని, అనంతరం మూడునెలల్లోనే పార్కు అభివృద్ధి పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. పార్కు స్థలం పరిరక్షణతో కాలనీ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. పార్కుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపులో చేపడుతున్న చర్యలను వారు స్వాగతించారు.

యువకుడి గొంతుపై టెస్టర్‌తో దాడి
AP: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని చిన్న వివాదం హత్యాయత్నానికి దారితీసింది. గూడూరులోని పూలతోట ప్రాంతంలో ఆటోకు వైర్లు తగులుతున్నాయని, కొంచెం పక్కకు వెళ్లాలని ఖాసీం అనే యువకుడు చెప్పడంతో గత విభేదాల నేపథ్యంలో రాయుడు టెస్టర్‌తో ఖాసీం గొంతులో పొడిచేందుకు ప్రయత్నించగా, అతను పక్కకు తప్పుకోవడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. గొంతు పైభాగంలో గాయమైన ఖాసీం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాయుడు, మరికొందరు తన ఇంటివద్దకు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని, చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు.

రాజ్యాంగంపై కుట్ర జరుగుతోంది: చాడ
TG: ప్రధాని మోదీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిర్వీర్యమయ్యాయని CPI సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో CPI ప్రచార బస్సు యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రచార, పాదయాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మోదీ ఇచ్చిన ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిత్యావసర ధరల పెరుగుదల, పేపర్ లీకేజీలతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
గిరిజన వేడుకల్లో CM స్పెషల్ అట్రాక్షన్!
అంతర్జాతీయ గిరిజన దినోత్సవం (International Tribal Day) సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో AP CM చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకల్లో భాగంగా ఆయన డప్పు వాయిస్తూ, ఆదివాసీ మహిళలతో కలిసి ఉత్సాహంగా 'దింసా' నృత్యం చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ CM వారితో కలిసి స్టెప్పులేయడం పట్ల గిరిజన వర్గాలు ఆనందం వ్యక్తం చేశారు.

స్వీట్ల సీజన్..
పండగలు అనగానే పాలు, నెయ్యితో చేసే సాంప్రదాయ తీపి వంటలే గుర్తుకొస్తాయి. అయితే ఈ పండగ సీజన్‌లో సాధారణ స్వీట్లే కాకుండా మైసూర్ పాక్, శాఫ్రాన్ కళాకండ్ కాంబినేషన్‌తో సరికొత్త డెజర్ట్, హిమాలయ చిరుధాన్యాలతో చేసే 'జంగోరే కీ ఖీర్', రోల్స్ రూపంలో ఉండే 'రబ్డీ బక్లావా సిగార్' వంటి స్వీట్లు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పాలతో చేసే స్వీట్లలో ఇలాంటి కొత్త వాటిని చేసి ఈ పండగను మరింత స్పెషల్‌గా మార్చుకోండి.

స్మార్ట్ గ్లాసెస్‌తో చిక్కిన భక్తులు!
తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరాలయంలోకి కెమెరా గ్లాసెస్‌తో ఎంట్రీ ఇచ్చిన తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయగా, శనివారం ఉదయం తెలంగాణకు చెందిన పవనేశ్, మహేశ్ స్మార్ట్ కెమెరా ఉన్న కళ్లజోడు ధరించి క్యూలైన్‌లో నిల్చున్నారు. వారి మూవ్‌మెంట్‌పై డౌట్ వచ్చిన పోలీసులు చెక్ చేయగా, గ్లాసెస్‌లో ఉన్న సీక్రెట్ కెమెరా బయటపడింది. వెంటనే వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

బోనాల వేడుకల్లో KTR
TG : బోనాల పండుగ సందర్భంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హైదరాబాద్‌లోని అక్కన్న మాదన్న మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవార్లను దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, హైదరాబాద్‌లో వ్యాపారాలు బాగా జరగాలని మంచి వర్షాలు పడి రైతులంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

RSSది కులతత్వ మైండ్‌సెట్- BSP మాయావతి
రిజర్వేషన్లు వదులుకోవాలన్న RSS చీఫ్ కామెంట్స్ పై BSP అధినేత్రి <a href="https://x.com/Mayawati/status/2086296729343889504?s=20">మాయావతి</a> సీరియస్ అయ్యారు. ఇది RSS కులతత్వ మైండ్‌సెట్‌ను, అంబేడ్కర్ రాజ్యాంగానికి వ్యతిరేక వైఖరిని సూచిస్తోందని విమర్శించారు. శతాబ్దాల అణచివేతకు గురైన SC, ST, OBC వర్గాలకు రిజర్వేషన్లు ఆత్మగౌరవంతో కూడిన హక్కని, వీటిని ఎకనామిక్ గ్రోత్‌తో ముడిపెట్టలేమని స్పష్టం చేశారు. SC, ST వర్గాలకు 'క్రీమీ లేయర్' వర్తించకుండా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి, రిజర్వేషన్లను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాయావతి డిమాండ్ చేశారు.

ఈ వీకెండ్ బాక్సాఫీస్ బిగ్గెస్ట్ హిట్ ఏది?
ఆగష్టు మొదటి వారంలో విడుదలైన సినిమాలలో వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి కామెడీతో ఆకట్టుకుంటుంది. తమిళ సినిమా ‘DC’ ఊహించని విధంగా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా డీసీ సినిమా రీ-సౌండింగ్ BGMకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అలాగే దీక్షిత్ శెట్టి నటించిన ‘KJQ’ (కింగ్ జాకీ క్వీన్) క్రైమ్ డ్రామా తో ఆడియన్స్ కి నచ్చుతుంది. మొత్తానికి ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల పండగ నడుస్తోంది.

రష్యాకు 50 వేల కిమ్ సైన్యం!
ఉక్రెయిన్‌తో జరుగుతున్న వార్‌లో రష్యాకు హెల్ప్ చేయడానికి నార్త్ కొరియా ఏకంగా 50 వేల మంది సైనికులను పంపుతోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కామెంట్స్ చేశారు. నార్త్ కొరియా వేస్తున్న క్షిపణులు తమ దేశంపై పడుతున్నాయని, ఈ రష్యా దాడిని తట్టుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చి సపోర్ట్ చేయాలని సౌత్ కొరియాను రెక్వెస్ట్ చేశారు. మరోవైపు ఇంటర్నేషనల్ సపోర్ట్ కోసం సెర్బియా టూర్ వెళ్లిన జెలెన్స్కీ, అక్కడ హ్యుమానిటేరియన్ ఎయిడ్ మరియు పవర్ సెెక్టార్ సాయం పొందేలా ఒప్పందం చేసుకున్నారు.

ఫ్రైడ్ చికెన్ క్రేజ్..
మన దేశంలో అత్యధికంగా తినే నాన్-వెజ్ ఐటమ్స్‌లో చికెన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అమెరికాలో మొదలైన KFC లాంటి ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్లకు ఇండియా, చైనాల్లో భారీగా క్రేజ్ పెరిగింది. వరల్డ్ వైడ్‌గా కొరియన్ ఫ్రైడ్ చికెన్, మెక్‌డోనాల్డ్స్ చికెన్ నగ్గెట్స్ ఫుల్ ట్రెండ్ అవుతుండగా, ఇండియన్ చెఫ్‌లు మన మసాలా రుచులకు తగినట్టుగా స్పెషల్ ఫ్రైడ్ చికెన్ వెరైటీలను తీసుకొస్తున్నారు.

జియో కొత్త ఓటీటీ పాస్ ప్లాన్లు
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త ఓటీటీ పాస్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో రూ.200 (28 రోజులకు 30GB డేటా), రూ.550 (84 రోజులకు 90GB డేటా), రూ.2,000 (365 రోజులకు 365GB డేటా) ప్లాన్లు ఉన్నాయి. ఈ రీఛార్జ్‌లతో ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీతో పాటు యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్ వంటి 15కి పైగా ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. జియోటీవీ ద్వారా 1000కి పైగా టీవీ ఛానళ్లను చూడవచ్చు. ఈ ఆఫర్ మైజియో యాప్, జియో వెబ్‌సైట్, ఆథరైజ్డ్ రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా తీసుకోవచ్చు

హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదు- ఇరాన్
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇస్తూ కొత్త కండిషన్స్ పెట్టింది. తమ భూభాగం నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని, ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేసి నిధులను విడుదల చేయాలని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ డిమాండ్ చేశారు. దాడుల నష్ట పరిహారంతో పాటు నౌకాశ్రయాలపై ఆంక్షలు తొలగించే వరకు జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కఠిన డిమాండ్లపై అమెరికా స్పందన రావాల్సి ఉంది.

లక్షణాలు లేవని నిర్లక్ష్యం వద్దు..
బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హెల్త్ ప్రాబ్లం మాత్రమే కాదు, అదొక సోషల్ ఇష్యూ అని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ రీసెర్చ్‌లో తేలింది. సరైన అవగాహన లేకపోవడం, భయాలు, అపోహల వల్లే మహిళలు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడానికి ముందుకు రావట్లేదు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా ముందుగానే టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం. మొదట్లోనే గుర్తిస్తే క్యాన్సర్‌ని పూర్తిగా నయం చేయొచ్చు. దీనిపై ఉన్న అపోహలు తొలగించడానికి తెలుగుతో సహా 12 భాషల్లో ఒక యాప్ కూడా తీసుకొచ్చారని నిపుణులు తెలిపారు.

జార్ఖండ్‌లో 16 రోజులుగా దీక్ష?
జార్ఖండ్‌లో JPSC, JSSC నియామక పరీక్షల్లో అక్రమాలపై అభ్యర్థులు చేపట్టిన నిరసనలు 16వ రోజుకు చేరాయి. ప్రభుత్వం జరిపిన సమావేశాలు ఫలించకపోవడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆగస్టు 9న మరోసారి చర్చలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించగా.. ఇది కేవలం రాజకీయ స్వార్థమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.