← Back to news

జియో కొత్త ఓటీటీ పాస్ ప్లాన్లు

By BK· 9 Aug 2026
జియో కొత్త ఓటీటీ పాస్ ప్లాన్లు

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త ఓటీటీ పాస్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో రూ.200 (28 రోజులకు 30GB డేటా), రూ.550 (84 రోజులకు 90GB డేటా), రూ.2,000 (365 రోజులకు 365GB డేటా) ప్లాన్లు ఉన్నాయి. ఈ రీఛార్జ్‌లతో ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీతో పాటు యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్ వంటి 15కి పైగా ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. జియోటీవీ ద్వారా 1000కి పైగా టీవీ ఛానళ్లను చూడవచ్చు. ఈ ఆఫర్ మైజియో యాప్, జియో వెబ్‌సైట్, ఆథరైజ్డ్‌ రిటైల్‌ ఔట్‌లెట్ల ద్వారా తీసుకోవచ్చు

More in News