← Back to news

RSSది కులతత్వ మైండ్‌సెట్- BSP మాయావతి

By sahani· 9 Aug 2026· X· India
RSSది కులతత్వ మైండ్‌సెట్- BSP మాయావతి

రిజర్వేషన్లు వదులుకోవాలన్న RSS చీఫ్ కామెంట్స్ పై BSP అధినేత్రి <a href="https://x.com/Mayawati/status/2086296729343889504?s=20">మాయావతి</a> సీరియస్ అయ్యారు. ఇది RSS కులతత్వ మైండ్‌సెట్‌ను, అంబేడ్కర్ రాజ్యాంగానికి వ్యతిరేక వైఖరిని సూచిస్తోందని విమర్శించారు. శతాబ్దాల అణచివేతకు గురైన SC, ST, OBC వర్గాలకు రిజర్వేషన్లు ఆత్మగౌరవంతో కూడిన హక్కని, వీటిని ఎకనామిక్ గ్రోత్‌తో ముడిపెట్టలేమని స్పష్టం చేశారు. SC, ST వర్గాలకు 'క్రీమీ లేయర్' వర్తించకుండా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి, రిజర్వేషన్లను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాయావతి డిమాండ్ చేశారు.

More in Politics