Latest

కొడుకు టార్చర్ భరించలేక.. తండ్రి షాకింగ్ డెసిషన్
Crime· 9 Aug 2026

కొడుకు టార్చర్ భరించలేక.. తండ్రి షాకింగ్ డెసిషన్

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట PS పరిధిలో కొడుకుపై గొడ్డలితో దాడిచేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కపేటకు చెందిన రాఘవరెడ్డి, కుమారుడు రాజేందర్‌ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు ఎలాంటి పని చేయకుండా తండ్రిని వేధింపులకు గురిచేసేవాడని వెల్లడించారు. ఆగస్టు 8న తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరగగా రాజేందర్‌, తండ్రిపై దాడి చేయడంతో తీవ్రంగా విసిగిపోయిన రాఘవరెడ్డి, నిద్రిస్తున్న కుమారుడిపై గొడ్డలితో దాడిచేశాడు. గాయపడిన రాజేందర్‌ను వరంగల్‌ MGM ఆస్పత్రికి తరలించారు.

చావుబతుకుల పోరాటం ముగిసింది.. మెడికో మృతి
AP· 9 Aug 2026

చావుబతుకుల పోరాటం ముగిసింది.. మెడికో మృతి

AP: రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి చెందారు. బ్రెయిన్‌‌డెడ్‌ కావడంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మద్యంమత్తులో ఉన్న సూరవరపు దస్వంత్‌, ఆండ్రూ జోసెఫ్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను రాజమహేంద్రవరంలో కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో తొలుత స్థానిక ఆస్పత్రిలో, అనంతరం కిమ్స్‌లో చికిత్స అందించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సమాజానికి తిరిగి ఇవ్వాలి: హరీశ్‌ రావు
TG· 9 Aug 2026

సమాజానికి తిరిగి ఇవ్వాలి: హరీశ్‌ రావు

TG: నాకు సమాజం ఏం చేసిందని అడిగేవాళ్లే కానీ, మేము సమాజానికి ఏం చేయగలమని ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రతినెలా రూ.1,000 చొప్పున పక్కనపెట్టి రూ.10లక్షల నిధిని ఏర్పాటు చేయడం గర్వకారణమని ప్రశంసించారు. పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేశారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్న సొసైటీ సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.

లాల్ దర్వాజాలో వైభవంగా బోనాలు..
News· 9 Aug 2026

లాల్ దర్వాజాలో వైభవంగా బోనాలు..

TG : హైదరాబాద్‌లోని లాల్ దర్వాజా సింహవాహినీ మహంకాళి బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. ఉదయం నుంచే సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, సీపీ సజ్జనార్ వచ్చారు. ఒకవైపు భక్తులు క్యూ లైన్లలో రద్దీగా ఉండగా, ఇంకోవైపు పోతురాజుల డాన్సులు ఆకట్టుకున్నాయి.

భార్యను హతమార్చి.. భర్త షాకింగ్ డెసిషన్
Crime· 9 Aug 2026

భార్యను హతమార్చి.. భర్త షాకింగ్ డెసిషన్

AP: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడుకి చెందిన లక్ష్మణ్‌రావు(32)కు, శ్యామల(30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ దివ్యాంగులు. ఇంట్లో శ్యామల మృతి చెందగా, లక్ష్మణ్‌రావు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన ఫోన్‌లోని సెల్ఫీ వీడియోను గుర్తించారు. తల్లి ఇటీవల మృతి చెందడంతో ఆమెను తరచూ గుర్తు చేసుకుంటున్నానని, ఆమె వద్దకు వెళ్లాలనుకుంటున్నానని వీడియోలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తాను మరణిస్తే భార్య అనాథ అవుతుందనే హత్య చేసినట్లు వీడియోలో పేర్కొన్నాడు.

అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' టీజర్ ఫిక్స్!
Cinema· 9 Aug 2026

అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' టీజర్ ఫిక్స్!

అల్లరి నరేష్ కొత్త సినిమా 'రంభ ఊర్వశి మేనక' టీజర్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 11న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టీజర్ రిలీజ్ డేట్‌లో చిన్న చేంజ్ మాత్రమే చేశామని, ఎంటర్‌టైన్‌మెంట్‌లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని చెప్పారు. ఈ మూవీ అల్లరి నరేష్ ఓల్డ్ కామెడీ టైమింగ్‌ను గుర్తుచేసేలా ఉండబోతుందని పోస్టర్లు చూస్తేనే అర్థమవుతోంది.

పెద్ది కుటుంబానికి అండగా ఉంటాం: KCR
TG· 9 Aug 2026

పెద్ది కుటుంబానికి అండగా ఉంటాం: KCR

TG: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి BRS అధినేత KCR హాజరయ్యారు. నల్లబెల్లి గ్రామానికి చేరుకున్న ఆయన‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి, భార్య, పిల్లలను ఓదార్చారు. సుదర్శన్‌రెడ్డి మరణం పార్టీకి, నియోజకవర్గానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

వైజాగ్‌తో  అనుబంధం ఉందంటున్న అల్లు అర్జున్
Cinema· 9 Aug 2026

వైజాగ్‌తో అనుబంధం ఉందంటున్న అల్లు అర్జున్

వైజాగ్‌తో తనకు చాలా కాలంగా మంచి అనుబంధం ఉందని అల్లు అర్జున్ చెప్పారు. 'గంగోత్రి' సినిమా టైమ్‌లో వైజాగ్ రోడ్ల మీద నడిచినా తనని ఎవరూ గుర్తుపట్టేవారు కాదని, కానీ ఇప్పుడు అలా నడవలేకపోతున్నానని అన్నారు. వైజాగ్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తన పేరు మీద ఒక థియేటర్ కడతారని అస్సలు ఊహించలేదని, అభిమానులు చూపిస్తున్న ఈ ప్రేమ తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు.

బిచ్చం వేసినట్లు నిధులు కేటాయించారు: బండి
TG· 9 Aug 2026

బిచ్చం వేసినట్లు నిధులు కేటాయించారు: బండి

TG: హైదరాబాద్‌లోని పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బోనాల పండుగ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, సరైన ఏర్పాట్లు చేయడంతో పాటు తగిన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. భక్తుల భావోద్వేగాలను హేళన చేస్తూ బిచ్చం వేసినట్లుగా సింహవాహిని అమ్మవారి ఆలయానికి కేవలం రూ.5.50 లక్షలు కేటాయించడం దారుణమని ఫైరయ్యారు. BJP అధికారంలోకి వస్తే ఈ ఆలయాన్ని గోల్డెన్‌ టెంపుల్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.

డిఫరెంట్ టైటిల్‌తో హన్సిక రీఎంట్రీ
Cinema· 9 Aug 2026

డిఫరెంట్ టైటిల్‌తో హన్సిక రీఎంట్రీ

నారా రోహిత్, హన్సిక కలిసి నటిస్తున్న కొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీకి 'కపాలి' అని టైటిల్ ఫిక్స్ చేస్తూ, హన్సిక పుట్టిన రోజు సందర్భంగా, ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రామ్ గన్ని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో, సూపర్ నేచురల్ కాన్సెప్ట్‌తో ఉండబోతుంది. చాలా గ్యాప్ తర్వాత హన్సిక తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుండటంతో, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్‌లో మంచి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది.

ప్రియాంక కేసులో షాకింగ్ విషయాలు
AP· 9 Aug 2026

ప్రియాంక కేసులో షాకింగ్ విషయాలు

AP: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో జిల్లా SP నరసింహ కిషోర్ కీలక విషయాలను వెల్లడించారు. మద్యంమత్తులో ఉన్న నిందితులను మాల్‌ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో వారు సిబ్బందిపై దాడిచేసి కారులో పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న ప్రియాంక, ఆమె స్నేహితుడిని నిందితులు కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు CCTV ఆధారాల్లో తేలిందన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు SP పేర్కొన్నారు.

చెడ్డీ గ్యాంగ్‌ సంచారం.. ప్రజల్లో హైటెన్షన్
Crime· 9 Aug 2026

చెడ్డీ గ్యాంగ్‌ సంచారం.. ప్రజల్లో హైటెన్షన్

AP: కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న ప్రచారం స్థానికుల్లో కలకలం రేపుతోంది. తమిళనాడు సరిహద్దులోని హోసూరు ప్రాంతంలో ఇటీవల వరుస చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు CCTV ఫుటెజ్ ఆధారంగా గుర్తించారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా కుప్పం పరిసర ప్రాంతాల్లోనూ దొంగతనాలు చోటుచేసుకోవడంతో ఆ ముఠా ఇటువైపు వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళల్లో దొంగలు తిరుగుతున్నారన్న ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో నిఘాను పెంచి ప్రత్యేక పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

చేయూత పింఛన్లకు కాంగ్రెస్ సర్కార్ కొత్త రూల్స్
News· 9 Aug 2026

చేయూత పింఛన్లకు కాంగ్రెస్ సర్కార్ కొత్త రూల్స్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 'చేయూత' పింఛన్ల కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి ఉంటే పింఛన్ రాదని తెలిపింది. అలాగే సంవత్సర ఆదాయం ఊళ్లలో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు దాటితే అనర్హులు. ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్, ప్రైవేట్, కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ జాబ్ చేస్తున్నా పింఛన్ రాదని, అర్హుల ఎంపిక కోసం శనివారం ఈ రూల్స్ రిలీజ్ చేసింది.

మిడ్‌మానేరు వద్ద కార్లతో డేంజరస్ స్టంట్స్
TG· 9 Aug 2026

మిడ్‌మానేరు వద్ద కార్లతో డేంజరస్ స్టంట్స్

TG: మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌ వద్ద పర్యాటకుల అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లి శివారులోని బ్యాక్‌వాటర్‌ను చూసేందుకు హైదరాబాద్‌ నుంచి సుమారు 50 వాహనాల్లో పర్యాటకులు తరలివచ్చారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే కొందరు పర్యాటకులు సమీపంలోని మైదానంలో కార్లతో ప్రమాదకర విన్యాసాలు చేశారు. వేగంగా కార్లు నడుపుతూ స్టంట్స్‌ చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు 11న NTA ఆఫీస్ ముందు నిరసన..
News· 9 Aug 2026

ఆగస్టు 11న NTA ఆఫీస్ ముందు నిరసన..

UGC-NET రాసిన అభ్యర్థులు మళ్లీ ప్రొటెస్ట్‌కు సిద్ధమవుతున్నారు. జూన్ 22 నుంచి జూలై 5 వరకు దాదాపు 7 లక్షల మందికి పైగా ఎగ్జామ్ రాశారు. 40 రోజులు దాటుతున్నా ఇంకా ఆన్సర్ కీ విడుదల చేయకపోవడంతో వారు మండిపడుతున్నారు. NTA గనుక స్పందించకపోతే ఈ నెల 11న ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD అడ్మిషన్ల కోసం వెయిట్ చేస్తున్న NTA పట్టించుకోవట్లేదని అంటున్నారు.

💼 డిగ్రీతో 11,403 ఉద్యోగాలు!
Jobs· 9 Aug 2026

💼 డిగ్రీతో 11,403 ఉద్యోగాలు!

వివిధ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ ఉద్యోగాల కోసం IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఏపీలో 186, తెలంగాణలో 191 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి స్థానిక భాష వచ్చిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ డేట్ ఆగస్టు 21 వరకు ఉంది.

ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు
TG· 9 Aug 2026

ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు

TG: తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక తండ్రి వెంకటేష్ ప్రభుత్వ పెద్దలపై ఆవేదన వ్యక్తం చేశారు. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కల్యాణ్.. మీకు ఆడపిల్లలు లేరా ప్రతి నెలా హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా అంటూ మీడియా ముందు ప్రశ్నించారు. చావుబతుకుల మధ్య ఉన్న తన కుమార్తెను ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర హోంమంత్రి, జిల్లా అధికారులు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆక్రమణలపై హైడ్రా యాక్షన్.. మద్దతుగా ర్యాలీ
TG· 9 Aug 2026

ఆక్రమణలపై హైడ్రా యాక్షన్.. మద్దతుగా ర్యాలీ

TG: హైడ్రా నిర్ణయాలకు మద్దతుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జనార్దన్‌హిల్స్‌ కాలనీ వాసులు ర్యాలీ నిర్వహించారు. HYDRAAకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాలనీలో ర్యాలీ చేపట్టారు. ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారని, అనంతరం మూడునెలల్లోనే పార్కు అభివృద్ధి పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. పార్కు స్థలం పరిరక్షణతో కాలనీ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. పార్కుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపులో చేపడుతున్న చర్యలను వారు స్వాగతించారు.

యువకుడి గొంతుపై టెస్టర్‌తో దాడి
Crime· 9 Aug 2026

యువకుడి గొంతుపై టెస్టర్‌తో దాడి

AP: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని చిన్న వివాదం హత్యాయత్నానికి దారితీసింది. గూడూరులోని పూలతోట ప్రాంతంలో ఆటోకు వైర్లు తగులుతున్నాయని, కొంచెం పక్కకు వెళ్లాలని ఖాసీం అనే యువకుడు చెప్పడంతో గత విభేదాల నేపథ్యంలో రాయుడు టెస్టర్‌తో ఖాసీం గొంతులో పొడిచేందుకు ప్రయత్నించగా, అతను పక్కకు తప్పుకోవడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. గొంతు పైభాగంలో గాయమైన ఖాసీం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాయుడు, మరికొందరు తన ఇంటివద్దకు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని, చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు.

రాజ్యాంగంపై కుట్ర జరుగుతోంది: చాడ
TG· 9 Aug 2026

రాజ్యాంగంపై కుట్ర జరుగుతోంది: చాడ

TG: ప్రధాని మోదీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిర్వీర్యమయ్యాయని CPI సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో CPI ప్రచార బస్సు యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రచార, పాదయాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మోదీ ఇచ్చిన ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిత్యావసర ధరల పెరుగుదల, పేపర్ లీకేజీలతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

గిరిజన వేడుకల్లో CM స్పెషల్ అట్రాక్షన్!
Politics· 9 Aug 2026

గిరిజన వేడుకల్లో CM స్పెషల్ అట్రాక్షన్!

అంతర్జాతీయ గిరిజన దినోత్సవం (International Tribal Day) సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో AP CM చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకల్లో భాగంగా ఆయన డప్పు వాయిస్తూ, ఆదివాసీ మహిళలతో కలిసి ఉత్సాహంగా 'దింసా' నృత్యం చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ CM వారితో కలిసి స్టెప్పులేయడం పట్ల గిరిజన వర్గాలు ఆనందం వ్యక్తం చేశారు.