Latest

యువ నిరసనకారులకు ఇంకా బెదిరింపులు: రాహుల్ గాంధీ
యువ నిరసనకారులతో మాట్లాడామని, వాళ్లింకా బెదిరింపులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. లోక్‌సభ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థపై ఫిర్యాదు చేయడం నేరం కాదని, వారు రాజ్యాంగాన్ని, భారత భవిష్యత్తును రక్షించారని అన్నారు. 15 ఏళ్ల అమ్మాయి నుంచి బలవంతంగా క్షమాపణ చెప్పించుకోవడం దారుణమన్నారు. పరీక్ష పత్రాల లీకులు ఆగాలని, విద్యా వ్యవస్థ మారాలని డిమాండ్ చేశారు.

“Delulu is the Solulu”.. అసలు దీని అర్థం ఏంటి?🤔
“Delulu is the Solulu”.. సోషల్ మీడియాలో ఈ మాట ఎప్పుడైనా చూశారా..? అసలు డెలులు అంటే డెల్యూషనల్ నుంచి వచ్చిన జెన్ జీ స్లాంగ్. నిజంగా జరిగిందా లేదా అనేది పక్కనపెట్టి.. మనకు నచ్చినట్టు ఊహించుకుని, అదే జరుగుతుందని నమ్మేయడాన్ని సరదాగా డెలులు అంటారు. ఇక సొలులు అంటే సొల్యూషన్కి ఫన్నీ వెర్షన్. “Delusional is the solution” అంటే “ఎలాంటి కష్టపరిస్థితుల్లోనైనా మనకు నచ్చిన భ్రమలో లేదా పాజిటివ్ ఆలోచనల్లో బతకడమే సమస్యకు పరిష్కారం” అని భావించడం. కలలు కనడానికి ట్యాక్స్ ఏం లేదుగా బ్రో.. సో నచ్చినట్టు కనేద్దాం! 😂

మెటా సంస్థకు No Protection: ప్రభుత్వం
భారత్‌లో CSAM కంటెంట్, డీప్‌ఫేక్ కంటెంట్, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన తప్పులపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. ఎవరికి కంటెంట్ చూపించాలో వాళ్లే ఎంపిక చేస్తున్నారు కాబట్టి, IT చట్టం కింద వాళ్లకు ప్రొటెక్షన్ రాదని వివరించింది. కొన్ని రకాల కంటెంట్‌ను ప్రమోట్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్లు మెటా అంగీకరించిందని, ఈ తప్పుకు క్షమాపణలు చెప్పినట్టు వివరించింది.

సోనమ్ వాంగ్‌చుక్ మాటతో నీళ్లు తాగిన దేవేంద్ర నాథ్!
రాంచీలో అనిశ్చితకాల నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు <a href="https://x.com/DevendraNathMa9/status/2084885137406492917?s=20">దేవేంద్ర నాథ్</a> మహతోతో సోనమ్ వాంగ్‌చుక్ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ ఉద్యమానికి తన మద్దతు తెలుపుతూ విద్యార్థులకు అవసరమైన సలహాలు, ప్రోత్సాహాన్ని అందించారు. ఆయన మాట మేరకు దేవేంద్ర మంచి నీళ్లు తాగినప్పటికీ, తమ సత్యాగ్రహం మరియు నిరాహార దీక్ష ఆగదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాంచీకి స్వయంగా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్‌కి ధైర్యం చెప్పాలని వాంగ్‌చుక్‌ని కోరినట్లు దేవేంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అస్సాంలో ఫ్లడ్ అలర్ట్! 89 మంది మృతి!!
అస్సాంలో వర్షాలు తగ్గకపోవడంతో వరద పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. ఆగస్టు 5 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లాల్లో దాదాపు 1.22 లక్షల మంది ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడుతుండగా, ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 89కి చేరింది. గోలాఘాట్ జిల్లాలోని నుమలీగఢ్ వద్ద ధన్‌సిరి నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని ASDMA వెల్లడించింది. మరోవైపు పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

సింగరేణి ఉద్యోగులను వేధించడం అమానుషం: కల్వకుంట్ల కవిత
TG: సింగరేణి సింగరేణి ఉద్యోగులను వేధించడం అమానుషం అని మాజీ ఎంపీ కవిత అన్నారు. 2016, 2017 JMET ద్వారా ఉద్యోగంలో చేరిన 800 మంది ఉద్యోగులకు 2023 వరకు ఓవర్ మెన్‌గా ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ 200 మందికే ప్రమోషన్స్ ఇచ్చి 600 మందిని పక్కనపెట్టడం అన్యాయమని అన్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే బదిలీల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. డిమాండ్ల పరిష్కారం కోసం కొత్తగూడెంలో చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షకు తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

GenZ మాట వినండి- సుప్రీంకోర్టు ఆర్డర్
NEET-UG పేపర్ లీక్ ప్రొటెస్ట్స్ చేస్తున్న స్టూడెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 5న జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. యూత్‌ను అణచివేయడం కంటే వారితో మాట్లాడి కామ్ చేయడమే మంచి మార్గమని అన్నారు. యువత ఆందోళనలను ఓపికగా వినాలని, వారికి రీజనింగ్‌తో నచ్చజెప్పడమే పవర్‌ఫుల్ సొల్యూషన్ అని ప్రభుత్వానికి సూచించారు. ఈ సిట్యుయేషన్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో గవర్నమెంట్‌కి బాగా తెలుసని కోర్టు స్పష్టం చేసింది.

ఆగస్టు 9న తెలంగాణ అస్తిత్వ నిర్మాతలపై తొలి ప్రసంగ సమావేశం
TG: తెలంగాణ పరిరక్షణ సమితి(TPC) ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30కు తెలంగాణ అస్తిత్వ నిర్మాతలపై తొలి ప్రసంగ సమావేశం నిర్వహిస్తున్నారు. సుందరయ్య భవన్‌లో జరిగే ఈ సమావేశంలో వక్తలుగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీరామోజు హరగోపాల్, కాసుల ప్రతాపరెడ్డి, గోగు శ్యామల, సంగిశెట్టి శ్రీనివాస్, కందుకూరి రమేశ్‌బాబు పాల్గొంటారు. తెలంగాణ అస్తిత్వ గురించి ప్రసంగిస్తారు. వారి జీవన విశేషాలు వివరిస్తారు.

తమిళనాడు బడ్జెట్ నిరాశపరిచింది: తమిళిసై సౌందరరాజన్
తమిళనాడు 2026-27 బడ్జెట్‌పై బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ విమర్శలు చేశారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో వాటి అమలుకు తగిన ప్రయారిటీ ఇవ్వలేదన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్‌మెంట్‌కు ఫండ్స్ సరిపోవని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM SHRI పథకాన్ని రాష్ట్రం స్వీకరించాలని సూచించారు. మహిళలకు ఇచ్చే ఇన్సెంటివ్స్ పెంచలేదని, క్యాన్సర్ సేవల అభివృద్ధికి ఇచ్చిన రూ.10 కోట్లు కూడా సరిపోవని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ప్రజలను డిసప్పాయింట్ చేసిందని ఆమె అన్నారు.

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ పొలిటికల్ హీట్!
ఆర్టికల్ 370 రద్దై ఏడేళ్లు.. కానీ పొలిటికల్ డిబేట్ మాత్రం ఇంకా కొనసాగుతోంది! 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ 370 మార్పులు జరిగాయి. ఏడో వార్షికోత్సవం సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్, PDP నిరసన కార్యక్రమాలు ప్రకటించగా, BJP మాత్రం ఈ రోజును సెలబ్రేట్ చేసేందుకు కార్యక్రమాలు ప్లాన్ చేసింది. దీంతో జమ్మూ కశ్మీర్‌లో మరోసారి రెండు భిన్న రాజకీయ అభిప్రాయాలు ఎదురెదురుగా కనిపిస్తున్నాయి.

బిలియన్ డాలర్ల మార్కును దాటిన సినిమా
మార్వెల్ సూపర్ హీరో 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 10,925 కోట్ల ($1 బిలియన్) భారీ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. హాలీవుడ్ చరిత్రలోనే 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత తక్కువ సమయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటిన రెండో సినిమాగా నిలిచింది. భారతదేశంలోనూ రూ. 360 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.

ఒక్క నంబర్‌తో 18 ఎమర్జెన్సీ సేవలు!
తెలంగాణలో ఎమర్జెన్సీ సేవల కోసం 'డయల్ 112' వర్షన్ 3.0ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ప్రారంభించారు. పోలీస్, ఫైర్, అంబులెన్స్, సైబర్ సెక్యూరిటీ సహా మొత్తం 18 రకాల అత్యవసర సేవలను ఈ సింగిల్ నంబర్ పరిధిలోకి తెచ్చారు. కాలర్ లొకేషన్‌ను వేగంగా ట్రాక్ చేసేందుకు అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్, ఏఐ టెక్నాలజీతో పాటు త్వరలోనే డ్రోన్ టీమ్‌ను కూడా రంగంలోకి దించనున్నారు. అత్యవసర సమయంలో ప్రజలకు క్విక్ రెస్పాన్స్ అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.

సీఎం చంద్రబాబు ఘనాపాటి: YS షర్మిల
AP: అబద్ధాలను అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు ఘనాపాటి అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రెండేళ్ల పాలనపై కుటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని ‘ఎక్స్’లో రాశారు. అది పూర్తిగా గతి తప్పిన నివేదిక అన్నారు. నాలుగు సూత్రాల పాలన అపహాస్యమని, అభివృద్ధి బూటకం, సంపద సృష్టి మోసం, సమతుల్యత పచ్చి అబద్ధం అంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. రెండేళ్ల కూటమి పాలన 24 మోసాలమయం అని పేర్కొన్నారు.

యుద్ధ వీరుడిగా సందీప్ కిషన్
హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. విభిన్న కథలతో అలరించే ఆయన, ఫస్ట్ టైమ్ ఒక పీరియాడిక్ యాక్షన్ ఫాంటసీ మూవీ చేస్తున్నారు. రీసెంట్‌గా 'కరికాల' అనే మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారి సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.రాజుల హిస్టరీ, వార్ బ్యాక్‌డ్రాప్‌తో రెండు పార్ట్‌లుగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది.

BCలకు దేశంలో ఎక్కడ స్పెషల్ యాక్ట్ లేదు: అచ్చెన్నాయుడు
AP: బీసీల కోసం ప్రత్యేక చట్టం దేశంలో ఎక్కడా లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. BC ప్రొటెక్షన్ యాక్ట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ చట్టం కోసం రెండేళ్లుగా వర్క్ చేసినట్లు చెప్పారు. 2019-24 మధ్య బలహీనవర్గాలపై అణచివేత జరిగిందన్నారు. బలహీన వర్గాల ప్రొటెక్షన్ కోసం స్పెషల్ యాక్ట్ తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, సమస్యల పరిశీలన కోసం సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. బాగా చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Rupee ₹95 దగ్గరే ఉండొచ్చా..?
ఇండియాలోకి బిలియన్ల డాలర్లు వస్తున్నా.. రూపాయి ఎందుకు స్ట్రాంగ్ అవ్వట్లేదు..? 👀 జూలైలో విదేశీ ఇన్వెస్టర్లు ఐదు నెలల తర్వాత ఇండియన్ షేర్లలో నెట్ బయ్యర్స్‌గా మారారు. RBI తీసుకున్న చర్యలతో $40 బిలియన్లకు పైగా ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చినా, రూపాయి ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6% బలహీనపడింది. 36 మంది స్ట్రాటజిస్టులతో చేసిన Reuters పోల్ ప్రకారం మూడు నెలల్లో డాలర్‌కు రూపాయి సుమారు ₹95.25 వద్ద ఉండొచ్చని అంచనా.

8 మంది స్టార్ హీరోల కేమియోలు!
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పార్ట్ వన్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌లతో సందడి చేసిన నెల్సన్, ఈసారి సీక్వెల్‌లో కేమియోల సంఖ్యను పెంచబోతున్నారట. మొదట్లో నలుగురు స్టార్లు కనిపిస్తారనే టాక్ రాగా, ఆ సంఖ్య ఏకంగా ఎనిమిదికి చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ కోసం ఎనిమిది మంది స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారనే వార్తలతో, ఆ స్టార్లు ఎవరై ఉంటారని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

నాలుగేళ్ల కొడుకుపై తండ్రి అమానుషం
TG: హైదరాబాద్ నగరం గుడిమల్కాపూర్‌కు చెందిన సల్మాన్‌కు కొంతకాలంగా తన భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలో నాలుగేళ్ల కుమారుడు అర్మాన్ తలను పిల్లర్‌కు బలంగా కొట్టి, పైకి ఎత్తి నేలపై పడేసి, లారీ కిందకు నెట్టేందుకు ప్రయత్నించాడు. ఉదయం 7:29 గంటలకు సమాచారం ఇచ్చినా పోలీసులు గంట తర్వాత అక్కడికి వచ్చినట్టు స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమిపూజ.. హాజరైన నారా లోకేశ్
AP: విశాఖపట్నంలోని ఆరిలోవ ఏరియాలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రెస్టీజియస్‌గా ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. అకాడమీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి, 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది బాలికలు క్రీడల్లో సత్తా చాటుతూ రాష్ట్రం, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

షేక్ హసీనా ఢిల్లీ స్పీచ్‌తో మాకు సంబంధం లేదు: భారత ప్రభుత్వం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో వర్చువల్‌గా మాట్లాడబోతున్నారు.. కానీ భారత ప్రభుత్వం మాత్రం “మాకు సంబంధం లేదు” అంటోంది! 👀 ఈరోజు (ఆగస్టు 5) జరిగే ఈ కార్యక్రమాన్ని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. హసీనా పాల్గొనడంపై బంగ్లాదేశ్ ఇండియాను వివరణ కోరగా, ఈ ఈవెంట్‌కు ప్రభుత్వం స్పాన్సర్ కాదని, అధికారిక సంస్థలతో కూడా సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
మిడ్‌డే మీల్స్‌లో నాసిరకం ఫుడ్.. నెటిజన్స్ విమర్శలు!
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో మిడ్‌డే మీల్స్‌లో పిల్లలకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో నీళ్లలా పలుచగా ఉన్న కూరతో పాటు కాలిపోయిన చపాతీలు వడ్డిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఫుడ్ క్వాలిటీ, పరిశుభ్రతపై విమర్శలు వస్తున్నాయి. వైరల్ వీడియో ఆథెంటిసిటీని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఘటనపై విచారణ జరిపి, వాస్తవాలు తేలిన తర్వాత అధికారులు యాక్షన్ తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.