Latest

10th క్లాస్ అర్హతతో ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. భారీ జీతం
Jobs· 4 Aug 2026

10th క్లాస్ అర్హతతో ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. భారీ జీతం

ఇండియా పోస్ట్ బెంగళూరులోని మెయిల్ మోటర్ సర్వీస్ (MMS) డిపార్ట్‌మెంట్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. మొత్తం 11 ఖాళీలు ఉండగా, వాటిలో 10 బెంగళూరు, ఒకటి మైసూరు సబ్‌డిపోలో ఉన్నాయి. సెలెక్టయిన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు శాలరీ ఉంటుంది. పదో తరగతితో పాటు లైట్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మూడేళ్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఏజ్ 56 ఇయర్స్ లోపుండాలి. కావాల్సిన డాకుమెంట్స్ అన్ని <a href="https://www.indiapost.gov.in/vacancies">ఆఫ్‌లైన్‌</a> ద్వారా 60 రోజుల్లో బెంగళూరులోని MMS మేనేజర్‌కు మెయిల్ పంపాలి.

మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత
India· 4 Aug 2026

మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత

విద్యావేత్త, మాజీ గవర్నర్ డి.వై.పాటిల్(90) మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కన్నుమూశారు. 1935 అక్టోబర్ 22న ఆయన జన్మించారు. 2009 నుంచి 2013 వరకు త్రిపుర గవర్నర్‌గా, 2013 నుంచి 2014 వరకు బీహార్ గవర్నర్‌గా పనిచేశారు. 2014లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. పాటిల్ గ్రూప్ సంస్థలు స్థాపించి 182కు పైగా విద్యాసంస్థలు, 7 విశ్వవిద్యాలయాలు ప్రారంభించారు.

ప్రిన్సిపల్ మాకొద్దు.. రోడ్డెక్కిన స్టూడెంట్స్
Education· 4 Aug 2026

ప్రిన్సిపల్ మాకొద్దు.. రోడ్డెక్కిన స్టూడెంట్స్

TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ మైనార్టీ గురుకుల కళాశాలలో కనీస వసతులు కల్పించాలని, ప్రిన్సిపల్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జహీరాబాద్–పొట్పల్లి రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టగా గ్రామసర్పంచ్, స్థానికులు వారికి మద్దతు తెలిపారు. కళాశాలలో వసతుల లేమితోపాటు ప్రిన్సిపల్ వేధింపులు ఎక్కువయ్యాయని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్ బదిలీపై హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

CM విజయ్, యాక్టర్ త్రిషపై కామెంట్స్.. ఉదయనిధి అరెస్ట్
Politics· 4 Aug 2026

CM విజయ్, యాక్టర్ త్రిషపై కామెంట్స్.. ఉదయనిధి అరెస్ట్

తమిళనాడు అపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు చెన్నైలోని నీలాంకరైలోని తన ఇంట్లో అరెస్ట్ చేశారు. సీఎం జోసఫ్ విజయ్, నటి త్రిషపై అభ్యంతరకర కామెంట్స్ చేశారనే కేసులో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తంజావూరులో జరిగిన నిరసన సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై కంప్లైంట్ రావడంతో పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. అరెస్ట్ తరువాత DMK కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు, ఉదయనిధి తరపు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.

170 నిమిషాల్లో..అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీర
TG· 4 Aug 2026

170 నిమిషాల్లో..అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీర

TG: ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేశారు. 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు, 175 గ్రాముల బరువు ఉన్న ఈ చీర అందరినీ ఆకట్టుకుంటోంది. హరిప్రసాద్ గతంలో ‘నారీ శక్తి’, ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వంటి ప్రత్యేక థీమ్‌లతో చీరలు నేసి ప్రశంసలు పొందారు.

గురక గాఢనిద్ర కాదు..
Health· 4 Aug 2026

గురక గాఢనిద్ర కాదు..

‘గురక పెడుతున్నారంటే గాఢంగా నిద్రపోతున్నట్లే’ అనుకుంటే పొరపాటే! అది 'స్లీప్ ఆప్నియా' (శ్వాస పూర్తిగా 10 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఆగిపోవచ్చు) అనే తీవ్రమైన నిద్ర సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. మన దేశంలో లక్షలాది మందికి ఈ వ్యాధి ఉందనే విషయమే తెలియదు. చికిత్స తీసుకోకపోతే గుండె జబ్బులు, బిపి, స్ట్రోక్, మధుమేహం, డిప్రెషన్, ఆకస్మిక మరణం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్లీప్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌లు తెలిపారు. కుటుంబ సభ్యులే ఈ లక్షణాలను మొదట గుర్తించగలరు. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.

తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా విదేశీ ఉద్యోగాల మోసాలు
AP· 4 Aug 2026

తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా విదేశీ ఉద్యోగాల మోసాలు

AP: గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా వచ్చిన విదేశీ ఉద్యోగ మోసాల కంప్లైంట్లలో తెలుగు రాష్ట్రాలే టాప్‌లో ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,495 ఫిర్యాదులతో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉండగా, 339 ఫిర్యాదులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 625తో కేరళ రెండు, 357తో తమిళనాడు మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 4,000 ఫిర్యాదుల్లో ఏపీ వాటా దాదాపు 37 శాతం.

భద్రత కరువు.. భయం నీడలో కాలనీలు
AP· 4 Aug 2026

భద్రత కరువు.. భయం నీడలో కాలనీలు

AP: విశాఖపట్నం భీమునిపట్నం పరిధిలోని మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ, బక్కన్నపాలెం ప్రాంతాల్లో భద్రతా సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 5,200కుపైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో వీధి దీపాలు, CC కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలు, వాహనాల నుంచి పెట్రోల్ చోరీలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళల్లో మద్యం మత్తులో అల్లర్లు, రాష్ డ్రైవింగ్ కారణంగా మహిళలు, వృద్ధులు భయంతో బయటకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రంగుల రాజకీయం.. ముస్తాబాద్‌లో ఉద్రిక్తత
Politics· 4 Aug 2026

రంగుల రాజకీయం.. ముస్తాబాద్‌లో ఉద్రిక్తత

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామపంచాయతీ భవనం రంగుల వివాదం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. భవనానికి పార్టీ రంగులు వేస్తున్నారని BJP, కాంగ్రెస్, BRS నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పిల్లర్లకు తమ పార్టీ రంగులు వేయడానికి ప్రయత్నించగా, BJP, BRS నేతలు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సోషల్ మీడియా పోస్టులపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్
Cinema· 4 Aug 2026

సోషల్ మీడియా పోస్టులపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్

నటుడు ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్ అయిందంటూ వస్తున్న పుకార్లపై నటి అనుపమ పరమేశ్వరన్ క్లారిటీ ఇచ్చారు. ఈమధ్య ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవ్వడంతోనే ఈ రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై స్పందిస్తూ, నా సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయాలో నిర్ణయించుకునేది నేనే. నేను ఎవరిపైనా కోపం చూపించలేదు, ఒక మహిళలో వచ్చే మార్పుల గురించే మాట్లాడాను. నా జీవితం గురించి ఇతరులకు ఏం తెలుసని నిందిస్తున్నారు? 'మా ఇన్స్టాగ్రామ్‌లో మాకు నచ్చింది పోస్ట్ చేస్తాం' అని స్పష్టం చేశారు.

హైడ్రా ప్రజలను వేధించే సంస్థ: ఈటల
Politics· 4 Aug 2026

హైడ్రా ప్రజలను వేధించే సంస్థ: ఈటల

TG: BJP MP ఈటల రాజేందర్ మరోసారి హైడ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారిందని, ఇళ్లు కూల్చివేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హిట్లర్ పాలనను ఉదాహరణగా తీసుకున్న CM రేవంత్ రెడ్డి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫైరయ్యారు. పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నారని, హైడ్రాను రాజకీయ కక్ష సాధింపునకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఆ సంస్థ చర్యలతో హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు

ర్యాపిడో బైక్‌గా పోలీసుశాఖ వాహనం
TG· 4 Aug 2026

ర్యాపిడో బైక్‌గా పోలీసుశాఖ వాహనం

TG: వరంగల్ నగరంలో పోలీసుల అధికారిక వాహనం ర్యాపిడో బైక్‌గా మారింది. కొందరు వ్యక్తులు ప్రైవేటుగా దీంతో వ్యాపారం నడుపుతున్నట్లు ఉన్న వీడియో వైరల్‌ అవుతోంది. బైక్ నంబర్ TS 09 PC 2795 కాగా, పోలీసు బైక్‌పై ప్రయాణికులను ఎక్కించుకుని నగరంలో తిరుగుతూ రైడ్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రజల రక్షణ, భద్రత కోసం కేటాయించాల్సిన వాహనాలను ఇలా ప్రైవేట్ వ్యాపారాల కోసం వాడటమేంటని జనం మండిపడుతున్నారు.

ఫోన్ లేదా gadget నీళ్లలో తడిస్తే ఏం చేయాలి?
Infotainment· 4 Aug 2026

ఫోన్ లేదా gadget నీళ్లలో తడిస్తే ఏం చేయాలి?

ఫోన్, ల్యాప్‌టాప్ నీటిలో తడిస్తే కంగారు పడకుండా వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. బటన్లు నొక్కడం లేదా ఆన్ చేయడానికి ప్రయత్నించకూడదు. బ్యాక్ కవర్, సిమ్, మెమరీ కార్డ్, కేబుల్స్ తొలగించి, పొడి గుడ్డతో తుడవాలి. ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ లేదా ఎండలో పెట్టకూడదు. సిలికా జెల్ ప్యాకెట్లు ఉన్న జిప్‌లాక్ లేదా బియ్యం డబ్బాలో 24 నుండి 48 గంటలు ఉంచాలి. పూర్తిగా ఆరిపోయాకే ఆన్ చేయాలి, తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదు. పనిచేయకపోతే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.

రూ.వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల కేసులో కీలక సూత్రధారి అరెస్టు?
Crime· 4 Aug 2026

రూ.వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల కేసులో కీలక సూత్రధారి అరెస్టు?

TG: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాలకు చెందిన వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం స్పెషల్‌ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల కేసుల్లో ఇతనే మాస్టర్ మైండ్ అని తెలుస్తోంది. ఈ కేసుల్లో గతంలో అరెస్టయిన నిందితులను విచారిస్తుండగా ఇతని పేరు బయటికొచ్చింది. నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాద్‌లో అతణ్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫైర్ సర్వీసెస్‌లో 10,743 ఉద్యోగాలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
Jobs· 4 Aug 2026

ఫైర్ సర్వీసెస్‌లో 10,743 ఉద్యోగాలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

దిల్లీ ఫైర్ సర్వీసెస్‌ (DFS)లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. సుమారు 10,743 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను ఆఫిషియల్ నోటిఫికేషన్ విడుదల తరువాత DSSSB ద్వారా చేసే అవకాశం ఉంది. ఫైర్ ఆపరేటర్, లీడింగ్ ఫైర్‌మన్, స్టేషన్ ఆఫీసర్, సబ్ ఆఫీసర్, MTSతో పాటు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఆఫిషియల్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.

హెల్తీ స్నాక్స్..
Health· 4 Aug 2026

హెల్తీ స్నాక్స్..

క్యాన్సర్ నివారణకు రోజూవారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్నాక్స్, ప్రాసెస్ చేయని, పోషకాలు నిండిన చిరుతిళ్లు తీసుకోవాలని ఆంకాలజిస్టులు సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోస్టెడ్ బీన్స్, మసాలా పల్లీలు, రోస్టెడ్ సీడ్స్, మఖానా, వేయించిన శనగలు, ఓట్స్ అలాగే చిప్స్ కంటే పాప్‌కార్న్ తినడం చాలా మంచిదని నిపుణులు వివరిస్తున్నారు.

ఆగస్టు 8న ‘ద్రవిడ’ పుస్తకావిష్కరణ
TG· 4 Aug 2026

ఆగస్టు 8న ‘ద్రవిడ’ పుస్తకావిష్కరణ

TG: ద్రవిడ రాష్ట్రాలపై సాగుతున్న వివక్ష గురించి గొంతెత్తుతూ రచయితలు, సామాజికవేత్తలు రాసిన వ్యాసాలు ‘ద్రవిడ’ పేరుతో పుస్తకంగా రాబోతోంది. ఈ పుస్తకానికి కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయని విద్మహే సంపాదకులుగా ఉన్నారు. ‘మలుపు’ ప్రచురణలు పబ్లిష్ చేసే ఈ పుస్తకాన్ని ఈనెల 8న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరిస్తారు. సభకు అధ్యక్షులుగా తిరునగరి దేవకీదేవి ఉంటారు. ముఖ్యఅతిథిగా నటుడు, సామాజికవేత్త ప్రకాశ్‌రాజ్ హాజరవుతారు.

వర్షాకాలంలో గ్యాడ్జెట్స్ సేఫ్‌గా ఉండాలంటే..
Infotainment· 4 Aug 2026

వర్షాకాలంలో గ్యాడ్జెట్స్ సేఫ్‌గా ఉండాలంటే..

వర్షాకాలంలో మన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, తడిసిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు వీటిని వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో పెట్టుకోవడం లేదా జిప్‌లాక్ కవర్లు వాడితే సేఫ్టీ గా నీళ్లు పడకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వర్షం చినుకులు పడేలా కిటికీల దగ్గర కానీ, తడి ఉన్న చోట కానీ ఫోన్లు పెట్టకండి. తేమ ఎక్కువగా ఉండే కిచెన్, బాత్‌రూమ్‌లకు కూడా వీటిని దూరంగా ఉంచడం మంచిది.

ఫ్రెండ్‌షిప్ డే విషాదం.. ఇంకా దొరకని ఇద్దరు
Crime· 4 Aug 2026

ఫ్రెండ్‌షిప్ డే విషాదం.. ఇంకా దొరకని ఇద్దరు

AP: విశాఖపట్నం పాతగంగవరం బీచ్‌లో ఫ్రెండ్‌షిప్ డే రోజున అలల్లో <a href="https://www.theclearcutnews.com/n/hVd9MDU">గల్లంతైన</a> యువతి నీతూ, యువకుడు దామోదర్ కోసం మూడో రోజూ గాలింపు కొనసాగుతోంది. నేవీ, బీచ్ లైఫ్‌గార్డ్స్, హెలికాప్టర్లతో విస్తృతంగా వెతుకుతున్నప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. భారీ అలలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం ఏడుగురు స్నేహితులు బీచ్‌కు వెళ్లగా, రాయిపై ఫోటోలు దిగుతున్న సమయంలో భారీ అల తాకి నీతూ సముద్రంలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన దామోదర్ కూడా గల్లంతయ్యాడు.

గుజరాత్‌లో YSRCP మాజీ MLA అరెస్ట్
Politics· 4 Aug 2026

గుజరాత్‌లో YSRCP మాజీ MLA అరెస్ట్

AP: గుంటూరు ఈస్ట్ మాజీ MLA, YSRCP నేత ముస్తఫాను గుజరాత్‌లో నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్, అక్రమ నిర్బంధం కేసులో ఆయన అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. టెక్నాలజీ సాయంతో గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్‌గా పొగాకు వ్యాపారితో పాటు ఇద్దరిని కిడ్నాప్ చేసిన ఘటనలో ముస్తఫా కొడుకుతో పాటు కొందరిపై కేసులు బుక్ చేశారు. ఈ కేసులో ముస్తఫా ఇన్‌వాల్వ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై కిడ్నాప్, బెదిరింపుల కేసులు పెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాగార్జునసాగర్ కాల్వలకు 60 ఏళ్లు
TG· 4 Aug 2026

నాగార్జునసాగర్ కాల్వలకు 60 ఏళ్లు

TG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు ఇవాళ్టితో 59 ఏళ్లు పూర్తయ్యాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితమిస్తూ కాలువలకు నీటిని విడుదల చేశారు. జలాశయo నుండి ఆనకట్టకు కుడివైపు నుండి ప్రారంభమయ్యే కాలువకు ‘జవహర్’ కాలువ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని అత్యంత పొడవైన కాలువలలో ఇదీ ఒకటి. జలాశయానికి ఎడమ వైపు నుంచి ప్రారంభమయ్యే కాలువకు ‘లాల్ బహదూర్’ కాలువ అని పేరు పెట్టారు.