Latest
ర్యాపిడో బైక్‌గా పోలీసుశాఖ వాహనం
TG: వరంగల్ నగరంలో పోలీసుల అధికారిక వాహనం ర్యాపిడో బైక్‌గా మారింది. కొందరు వ్యక్తులు ప్రైవేటుగా దీంతో వ్యాపారం నడుపుతున్నట్లు ఉన్న వీడియో వైరల్ అవుతోంది. బైక్ నంబర్ TS 09 PC 2795 కాగా, పోలీసు బైక్‌పై ప్రయాణికులను ఎక్కించుకుని నగరంలో తిరుగుతూ రైడ్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రజల రక్షణ, భద్రత కోసం కేటాయించాల్సిన వాహనాలను ఇలా ప్రైవేట్ వ్యాపారాల కోసం వాడటమేంటని జనం మండిపడుతున్నారు.

ఫోన్ లేదా gadget నీళ్లలో తడిస్తే ఏం చేయాలి?
ఫోన్, ల్యాప్‌టాప్ నీటిలో తడిస్తే కంగారు పడకుండా వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. బటన్లు నొక్కడం లేదా ఆన్ చేయడానికి ప్రయత్నించకూడదు. బ్యాక్ కవర్, సిమ్, మెమరీ కార్డ్, కేబుల్స్ తొలగించి, పొడి గుడ్డతో తుడవాలి. ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ లేదా ఎండలో పెట్టకూడదు. సిలికా జెల్ ప్యాకెట్లు ఉన్న జిప్‌లాక్ లేదా బియ్యం డబ్బాలో 24 నుండి 48 గంటలు ఉంచాలి. పూర్తిగా ఆరిపోయాకే ఆన్ చేయాలి, తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదు. పనిచేయకపోతే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.

రూ.వెయ్యి కోట్ల సైబర్ మోసాల కేసులో కీలక సూత్రధారి అరెస్టు?
TG: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాలకు చెందిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం స్పెషల్ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.వెయ్యి కోట్ల సైబర్ మోసాల కేసుల్లో ఇతనే మాస్టర్ మైండ్ అని తెలుస్తోంది. ఈ కేసుల్లో గతంలో అరెస్టయిన నిందితులను విచారిస్తుండగా ఇతని పేరు బయటికొచ్చింది. నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాద్‌లో అతణ్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫైర్ సర్వీసెస్‌లో 10,743 ఉద్యోగాలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
దిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS)లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. సుమారు 10,743 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను ఆఫిషియల్ నోటిఫికేషన్ విడుదల తరువాత DSSSB ద్వారా చేసే అవకాశం ఉంది. ఫైర్ ఆపరేటర్, లీడింగ్ ఫైర్‌మన్, స్టేషన్ ఆఫీసర్, సబ్ ఆఫీసర్, MTSతో పాటు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఆఫిషియల్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.

హెల్తీ స్నాక్స్..
క్యాన్సర్ నివారణకు రోజూవారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్నాక్స్, ప్రాసెస్ చేయని, పోషకాలు నిండిన చిరుతిళ్లు తీసుకోవాలని ఆంకాలజిస్టులు సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోస్టెడ్ బీన్స్, మసాలా పల్లీలు, రోస్టెడ్ సీడ్స్, మఖానా, వేయించిన శనగలు, ఓట్స్ అలాగే చిప్స్ కంటే పాప్‌కార్న్ తినడం చాలా మంచిదని నిపుణులు వివరిస్తున్నారు.

ఆగస్టు 8న ‘ద్రవిడ’ పుస్తకావిష్కరణ
TG: ద్రవిడ రాష్ట్రాలపై సాగుతున్న వివక్ష గురించి గొంతెత్తుతూ రచయితలు, సామాజికవేత్తలు రాసిన వ్యాసాలు ‘ద్రవిడ’ పేరుతో పుస్తకంగా రాబోతోంది. ఈ పుస్తకానికి కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయని విద్మహే సంపాదకులుగా ఉన్నారు. ‘మలుపు’ ప్రచురణలు పబ్లిష్ చేసే ఈ పుస్తకాన్ని ఈనెల 8న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరిస్తారు. సభకు అధ్యక్షులుగా తిరునగరి దేవకీదేవి ఉంటారు. ముఖ్యఅతిథిగా నటుడు, సామాజికవేత్త ప్రకాశ్‌రాజ్ హాజరవుతారు.

వర్షాకాలంలో గ్యాడ్జెట్స్ సేఫ్‌గా ఉండాలంటే..
వర్షాకాలంలో మన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, తడిసిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు వీటిని వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో పెట్టుకోవడం లేదా జిప్‌లాక్ కవర్లు వాడితే సేఫ్టీ గా నీళ్లు పడకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వర్షం చినుకులు పడేలా కిటికీల దగ్గర కానీ, తడి ఉన్న చోట కానీ ఫోన్లు పెట్టకండి. తేమ ఎక్కువగా ఉండే కిచెన్, బాత్‌రూమ్‌లకు కూడా వీటిని దూరంగా ఉంచడం మంచిది.

ఫ్రెండ్‌షిప్ డే విషాదం.. ఇంకా దొరకని ఇద్దరు
AP: విశాఖపట్నం పాతగంగవరం బీచ్‌లో ఫ్రెండ్‌షిప్ డే రోజున అలల్లో <a href="https://www.theclearcutnews.com/n/hVd9MDU">గల్లంతైన</a> యువతి నీతూ, యువకుడు దామోదర్ కోసం మూడో రోజూ గాలింపు కొనసాగుతోంది. నేవీ, బీచ్ లైఫ్‌గార్డ్స్, హెలికాప్టర్లతో విస్తృతంగా వెతుకుతున్నప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. భారీ అలలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం ఏడుగురు స్నేహితులు బీచ్‌కు వెళ్లగా, రాయిపై ఫోటోలు దిగుతున్న సమయంలో భారీ అల తాకి నీతూ సముద్రంలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన దామోదర్ కూడా గల్లంతయ్యాడు.

గుజరాత్‌లో YSRCP మాజీ MLA అరెస్ట్
AP: గుంటూరు ఈస్ట్ మాజీ MLA, YSRCP నేత ముస్తఫాను గుజరాత్‌లో నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్, అక్రమ నిర్బంధం కేసులో ఆయన అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. టెక్నాలజీ సాయంతో గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్‌గా పొగాకు వ్యాపారితో పాటు ఇద్దరిని కిడ్నాప్ చేసిన ఘటనలో ముస్తఫా కొడుకుతో పాటు కొందరిపై కేసులు బుక్ చేశారు. ఈ కేసులో ముస్తఫా ఇన్‌వాల్వ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై కిడ్నాప్, బెదిరింపుల కేసులు పెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాగార్జునసాగర్ కాల్వలకు 60 ఏళ్లు
TG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు ఇవాళ్టితో 59 ఏళ్లు పూర్తయ్యాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితమిస్తూ కాలువలకు నీటిని విడుదల చేశారు. జలాశయo నుండి ఆనకట్టకు కుడివైపు నుండి ప్రారంభమయ్యే కాలువకు ‘జవహర్’ కాలువ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని అత్యంత పొడవైన కాలువలలో ఇదీ ఒకటి. జలాశయానికి ఎడమ వైపు నుంచి ప్రారంభమయ్యే కాలువకు ‘లాల్ బహదూర్’ కాలువ అని పేరు పెట్టారు.

బురదలో చిక్కుకున్న లగ్జరీ బస్సు
TG: హైదరాబాద్ ఉప్పల్‌లోని నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక RTC బస్‌స్టాండ్‌లో దారుణ పరిస్థితి నెలకొంది. వర్షంతో మొత్తం ప్రాంగణం బురదమయంగా మారడంతో తొర్రూరు డిపోకు చెందిన RTC సూపర్ లగ్జరీ బస్సు టైరు బురదలో కూరుకుపోయింది. బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు JCB సాయంతో బస్సును బయటకు తీశారు. తాత్కాలిక బస్‌స్టాండ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

హాస్టల్‌లో విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి
TG: జగిత్యాల జిల్లా మల్యాలలో దారుణ ఘటన జరిగింది. SC హాస్టల్‌లో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ హాస్టల్ వెనుక ఉన్న కుంటలో ఈతకు వెళ్లి మునిగి చనిపోయారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన 5th క్లాస్ స్టూడెంట్ విష్ణు(11), జగిత్యాలకు చెందిన 4th క్లాస్ స్టూడెంట్ సుశాంత్(10) ఉన్నారు. దీంతో అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బిడ్డ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న తల్లి డాల్ఫిన్
వెస్ట్రన్ ఆస్ట్రేలియా తీరంలో చనిపోయిన తన రెండు వారాల పసికూనను మోస్తూ ఒక తల్లి డాల్ఫిన్ రోజుల తరబడి సముద్రంలో ఈదుతోంది. శీతాకాలంలో పుట్టిన ఈ పిల్ల డాల్ఫిన్ దురదృష్టవశాత్తూ కన్నుమూసింది. పరిశోధకుల సమాచారం ప్రకారం, తల్లి డాల్ఫిన్ వరుసగా తన చివరి నలుగురు పిల్లలను కోల్పోయిందని, తీవ్రమైన పురిటి శోకంతోనే బిడ్డ మృతదేహాన్ని వదలకుండా మోస్తుందని వెల్లడించారు. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి డాల్ఫిన్‌కు మద్దతుగా మరో 14 డాల్ఫిన్లు దాని వెంటే పయనిస్తుండటం చూసేవారిని తీవ్రంగా కలచివేస్తోంది.

డివైడర్‌పై బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు
AP: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద నేషనల్ హైవేపై YBM ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌పై బోల్తా పడింది. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో 26మంది ప్రయాణిస్తుండగా, 12 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బోల్తా పడిన వెంటనే వెనుక నుంచి వస్తున్న ఓ లారీ దానిని తప్పించబోయి ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రానున్న మూడు రోజులు మోస్తరు వానలు
పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్‌నినో' పరిస్థితుల ప్రభావం వల్ల ఆగస్టు నెలలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఒకే పేరు.. రెండు జీతాలు
TG: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లి గ్రామ పంచాయతీలో డబుల్ జీతాల వ్యవహారం వెలుగుచూసింది. టి.రవి అనే వ్యక్తి పేరుతో ఒకవైపు ట్రాక్టర్ డ్రైవర్‌గా, మరోవైపు మిషన్ భగీరథ వాటర్‌మన్‌గా నమోదు చేసి గత ఐదేళ్లుగా రెండు జీతాలు డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగికి ఒక జీతం మాత్రమే ఇచ్చి, మరో జీతాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

RTC డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల
TG: RTCలో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు రిజల్ట్స్ విడుదలయ్యాయి. మొత్తం 1,604 మంది కాండిడేట్లు సెలెక్ట్ అవ్వగా, అర్హులు లేకపోవడంతో 139 పోస్టులు ఖాళీగా మిగిలాయి. కాండిడేట్ రిజల్ట్స్, కటాఫ్ డీటెయిల్స్‌ను ఆఫిషియల్ <a href="https://www.tgprb.in/">వెబ్‌సైట్‌లో</a> చెక్ చేసుకోవచ్చు. సెలెక్టయిన వారు ఆగస్టు 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసి, గెజిటెడ్ ఆఫీసర్ అప్రూవ్ చేసిన మూడు సెట్ల ఫామ్స్, సర్టిఫికెట్లను ఆగస్టు 17న సంబంధిత ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి.

ఆవలింతలు ఎందుకు వస్తాయి?
మనం అలసిపోయినప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు ఆవలింతలు రావడం వెనుక ఆసక్తికరమైన సైన్స్ ఉంది. మన మెదడు బాగా పనిచేసి వేడెక్కినప్పుడు దాన్ని తగ్గిచడానికి ఆవలింత 'కూలింగ్ మెకానిజమ్' లా పనిచేస్తుంది. ఊపిరితిత్తులలోకి ఒకేసారి ఎక్కువ గాలిని తీసుకెళ్లి శరీరానికి కావలసిన ఆక్సిజన్ ను అందిస్తుంది. సరైన నిద్ర లేకపోయినా లేదా ఆసక్తి లేని పని చేస్తున్నప్పుడు మెదడును మళ్లీ అలర్ట్‌గా మార్చడానికి ఆవలింతలు వస్తాయి. ఎదుటివారు ఆవలిస్తే మనకి కూడా ఆవలింత రావడం అనేది మన మెదడులోని 'మిర్రర్ న్యూరాన్స్' వల్ల జరుగుతుంది.

విద్యార్థినులను వేధించిన ఐదుగురు అరెస్ట్
AP: విశాఖపట్నం జిల్లా భీమిలి గవర్నమెంట్ కాలేజీ వద్ద విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేసిన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే CI దివాకర్ యాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు స్పాట్‌కి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఇక నుంచి కాలేజీలు, పాఠశాలల చుట్టూ ప్రత్యేక నిఘా ఉంటుందని సీఐ తెలిపారు.

పాలిటిక్స్ కూడా Reel అయిపోయిందా?
ఒకప్పుడు పాలిటిక్స్ అంటే సభలు, స్పీచెస్.. ఇప్పుడు రీల్స్, మీమ్స్ కూడా పొలిటికల్ వెపన్స్‌గా మారుతున్నాయి.📱👀 ఇండియాలో Gen Z రాజకీయ విషయాలు మాట్లాడటానికి ఇన్‌స్టాగ్రామ్ను కీలక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగిస్తున్నట్లు Economic Times రిపోర్ట్ చేసింది. ఇటీవల స్టూడెంట్ ప్రొటెస్ట్స్‌కు సంబంధించిన షార్ట్ వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో భారీగా సర్క్యులేట్ అయ్యాయి. పొడవైన స్పీచ్ కంటే కొన్ని సెకన్ల రీల్‌తోనే లక్షల మందికి మెసేజ్ చేరుతోంది.
రష్యాలో బీచ్‌పై డ్రోన్ దాడి.. పిల్లలతో సహా ఏడుగురు మృతి
సౌత్ రష్యాలోని ఓ బీచ్‌పై డ్రోన్ ఎటాక్ జరగడంతో ముగ్గురు పిల్లలతోపాటు ఏడుగురు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం 40 మంది గాయపడగా, వారిలో 17 మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. దాడి వెనుక ఉక్రెయిన్ ఉందని క్రాస్నోడార్ ప్రాంత గవర్నర్ వెనియామిన్ కొండ్రాత్యేవ్ ఆరోపించారు. అయితే ఈ ఘటనపై ఉక్రెయిన్ ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. పౌరులపై కావాలనే దాడులు చేయడం లేదని ఇరు దేశాలు చెబుతున్నాయి. దాడికి ముందు ఎలాంటి సైరన్లు మోగలేదని స్థానికులు, టూరిస్టులు మీడియాకు తెలిపారు.