Latest

బురదలో చిక్కుకున్న లగ్జరీ బస్సు
TG· 4 Aug 2026

బురదలో చిక్కుకున్న లగ్జరీ బస్సు

TG: హైదరాబాద్ ఉప్పల్‌లోని నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక RTC బస్‌స్టాండ్‌లో దారుణ పరిస్థితి నెలకొంది. వర్షంతో మొత్తం ప్రాంగణం బురదమయంగా మారడంతో తొర్రూరు డిపోకు చెందిన RTC సూపర్ లగ్జరీ బస్సు టైరు బురదలో కూరుకుపోయింది. బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు JCB సాయంతో బస్సును బయటకు తీశారు. తాత్కాలిక బస్‌స్టాండ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

హాస్టల్‌లో విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి
News· 4 Aug 2026

హాస్టల్‌లో విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి

TG: జగిత్యాల జిల్లా మల్యాలలో దారుణ ఘటన జరిగింది. SC హాస్టల్‌లో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ హాస్టల్ వెనుక ఉన్న కుంటలో ఈతకు వెళ్లి మునిగి చనిపోయారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన 5th క్లాస్ స్టూడెంట్ విష్ణు(11), జగిత్యాలకు చెందిన 4th క్లాస్ స్టూడెంట్ సుశాంత్(10) ఉన్నారు. దీంతో అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బిడ్డ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న తల్లి డాల్ఫిన్
Infotainment· 4 Aug 2026

బిడ్డ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న తల్లి డాల్ఫిన్

వెస్ట్రన్ ఆస్ట్రేలియా తీరంలో చనిపోయిన తన రెండు వారాల పసికూనను మోస్తూ ఒక తల్లి డాల్ఫిన్ రోజుల తరబడి సముద్రంలో ఈదుతోంది. శీతాకాలంలో పుట్టిన ఈ పిల్ల డాల్ఫిన్ దురదృష్టవశాత్తూ కన్నుమూసింది. పరిశోధకుల సమాచారం ప్రకారం, తల్లి డాల్ఫిన్ వరుసగా తన చివరి నలుగురు పిల్లలను కోల్పోయిందని, తీవ్రమైన పురిటి శోకంతోనే బిడ్డ మృతదేహాన్ని వదలకుండా మోస్తుందని వెల్లడించారు. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి డాల్ఫిన్‌కు మద్దతుగా మరో 14 డాల్ఫిన్లు దాని వెంటే పయనిస్తుండటం చూసేవారిని తీవ్రంగా కలచివేస్తోంది.

డివైడర్‌పై బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు
Crime· 4 Aug 2026

డివైడర్‌పై బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు

AP: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద నేషనల్ హైవేపై YBM ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌పై బోల్తా పడింది. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో 26మంది ప్రయాణిస్తుండగా, 12 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బోల్తా పడిన వెంటనే వెనుక నుంచి వస్తున్న ఓ లారీ దానిని తప్పించబోయి ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రానున్న మూడు రోజులు మోస్తరు వానలు
Infotainment· 4 Aug 2026

రానున్న మూడు రోజులు మోస్తరు వానలు

పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్‌నినో' పరిస్థితుల ప్రభావం వల్ల ఆగస్టు నెలలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఒకే పేరు.. రెండు జీతాలు
TG· 4 Aug 2026

ఒకే పేరు.. రెండు జీతాలు

TG: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లి గ్రామ పంచాయతీలో డబుల్ జీతాల వ్యవహారం వెలుగుచూసింది. టి.రవి అనే వ్యక్తి పేరుతో ఒకవైపు ట్రాక్టర్ డ్రైవర్‌గా, మరోవైపు మిషన్ భగీరథ వాటర్‌మన్‌గా నమోదు చేసి గత ఐదేళ్లుగా రెండు జీతాలు డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగికి ఒక జీతం మాత్రమే ఇచ్చి, మరో జీతాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

RTC డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల
Jobs· 4 Aug 2026

RTC డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

TG: RTCలో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు రిజల్ట్స్ విడుదలయ్యాయి. మొత్తం 1,604 మంది కాండిడేట్లు సెలెక్ట్ అవ్వగా, అర్హులు లేకపోవడంతో 139 పోస్టులు ఖాళీగా మిగిలాయి. కాండిడేట్ రిజల్ట్స్, కటాఫ్ డీటెయిల్స్‌ను ఆఫిషియల్ <a href="https://www.tgprb.in/">వెబ్‌సైట్‌లో</a> చెక్ చేసుకోవచ్చు. సెలెక్టయిన వారు ఆగస్టు 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసి, గెజిటెడ్ ఆఫీసర్ అప్రూవ్ చేసిన మూడు సెట్ల ఫామ్స్, సర్టిఫికెట్లను ఆగస్టు 17న సంబంధిత ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి.

ఆవలింతలు ఎందుకు వస్తాయి?
Health· 4 Aug 2026

ఆవలింతలు ఎందుకు వస్తాయి?

మనం అలసిపోయినప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు ఆవలింతలు రావడం వెనుక ఆసక్తికరమైన సైన్స్ ఉంది. మన మెదడు బాగా పనిచేసి వేడెక్కినప్పుడు దాన్ని తగ్గిచడానికి ఆవలింత 'కూలింగ్ మెకానిజమ్' లా పనిచేస్తుంది. ఊపిరితిత్తులలోకి ఒకేసారి ఎక్కువ గాలిని తీసుకెళ్లి శరీరానికి కావలసిన ఆక్సిజన్ ను అందిస్తుంది. సరైన నిద్ర లేకపోయినా లేదా ఆసక్తి లేని పని చేస్తున్నప్పుడు మెదడును మళ్లీ అలర్ట్‌గా మార్చడానికి ఆవలింతలు వస్తాయి. ఎదుటివారు ఆవలిస్తే మనకి కూడా ఆవలింత రావడం అనేది మన మెదడులోని 'మిర్రర్ న్యూరాన్స్' వల్ల జరుగుతుంది.

విద్యార్థినులను వేధించిన ఐదుగురు అరెస్ట్
Crime· 4 Aug 2026

విద్యార్థినులను వేధించిన ఐదుగురు అరెస్ట్

AP: విశాఖపట్నం జిల్లా భీమిలి గవర్నమెంట్ కాలేజీ వద్ద విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేసిన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే CI దివాకర్ యాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు స్పాట్‌కి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఇక నుంచి కాలేజీలు, పాఠశాలల చుట్టూ ప్రత్యేక నిఘా ఉంటుందని సీఐ తెలిపారు.

పాలిటిక్స్ కూడా Reel అయిపోయిందా?
Politics· 4 Aug 2026

పాలిటిక్స్ కూడా Reel అయిపోయిందా?

ఒకప్పుడు పాలిటిక్స్ అంటే సభలు, స్పీచెస్.. ఇప్పుడు రీల్స్, మీమ్స్ కూడా పొలిటికల్ వెపన్స్‌గా మారుతున్నాయి.📱👀 ఇండియాలో Gen Z రాజకీయ విషయాలు మాట్లాడటానికి ఇన్‌స్టాగ్రామ్ను కీలక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగిస్తున్నట్లు Economic Times రిపోర్ట్ చేసింది. ఇటీవల స్టూడెంట్ ప్రొటెస్ట్స్‌కు సంబంధించిన షార్ట్ వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో భారీగా సర్క్యులేట్ అయ్యాయి. పొడవైన స్పీచ్ కంటే కొన్ని సెకన్ల రీల్‌తోనే లక్షల మందికి మెసేజ్ చేరుతోంది.

రష్యాలో బీచ్‌పై డ్రోన్ దాడి.. పిల్లలతో సహా ఏడుగురు మృతి
World· 4 Aug 2026

రష్యాలో బీచ్‌పై డ్రోన్ దాడి.. పిల్లలతో సహా ఏడుగురు మృతి

సౌత్ రష్యాలోని ఓ బీచ్‌పై డ్రోన్ ఎటాక్ జరగడంతో ముగ్గురు పిల్లలతోపాటు ఏడుగురు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం 40 మంది గాయపడగా, వారిలో 17 మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. దాడి వెనుక ఉక్రెయిన్‌ ఉందని క్రాస్నోడార్ ప్రాంత గవర్నర్ వెనియామిన్ కొండ్రాత్యేవ్ ఆరోపించారు. అయితే ఈ ఘటనపై ఉక్రెయిన్ ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. పౌరులపై కావాలనే దాడులు చేయడం లేదని ఇరు దేశాలు చెబుతున్నాయి. దాడికి ముందు ఎలాంటి సైరన్లు మోగలేదని స్థానికులు, టూరిస్టులు మీడియాకు తెలిపారు.

ఫైబర్ : జీర్ణక్రియ నుంచి బరువు తగ్గడం వరకు
Health· 4 Aug 2026

ఫైబర్ : జీర్ణక్రియ నుంచి బరువు తగ్గడం వరకు

ఆరోగ్యంగా ఉండడానికి పీచు పదార్థం (ఫైబర్) ఎంతో అవసరం. ఓట్స్, చియా సీడ్స్, పప్పు ధాన్యాలు, నల్ల శనగలు, పెసర్లు, బ్రాకోలీతో పాటు జామ, యాపిల్, బేరి వంటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, బరువును అదుపులో ఉంచడానికి, కడుపు నిండినట్లు అనిపించి అతిగా తినకుండా సహాయపడుతుంది. ఫైబర్ ఉన్న ఆహారాన్ని రోజువారీ ఆహారంలో తీసుకోని ఆరోగ్యంగా ఉండండి.

పంట దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక
AP· 4 Aug 2026

పంట దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక

AP: మార్కాపురం జిల్లా పెద్దకందుకూరు గ్రామంలో అప్పుల భారంతో మనస్తాపానికి గురైన రైతు కోడావత్ పెద్ద రామయ్య (46) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు ఎకరాల సొంత భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన ఆయనకు గత కొన్నేళ్లుగా పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధరలు లేక తీవ్ర అప్పులు అయ్యాయి. మనస్తాపంతో గత నెల 23న పొలం వద్ద పురుగుల మందు తాగగా, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఎంత సమయం నిద్రపోతున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి!
Health· 4 Aug 2026

ఎంత సమయం నిద్రపోతున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి!

రోజుకు కేవలం 5 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల శరీరంలో శక్తి, సహనం తగ్గిపోతాయి. అంతేకాకుండా ఏకాగ్రత తగ్గడం, కండరాల రికవరీ మందగించడం, గాయపడే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 8 గంటలు నిద్రపోతే శరీరానికి కావాల్సినంత బలం, పూర్తి ఎనర్జీ లభిస్తాయి. ఇది కండరాల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా రోగనిరోధక శక్తిని శక్తివంతంగా మారుస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకి 8 గంటల నిద్ర చాలా అవసరం.

విన్‌ఫాస్ట్ కారులో లోపాలు.. రీఫండ్ కోసం కస్టమర్ డిమాండ్
General· 4 Aug 2026

విన్‌ఫాస్ట్ కారులో లోపాలు.. రీఫండ్ కోసం కస్టమర్ డిమాండ్

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని షోరూంలో రూ.25 లక్షలకు కొన్న విన్‌ఫాస్ట్ VF7 ఎలక్ట్రిక్ కారులో లోపాలున్నాయని కస్టమర్ నల్లం ఫణి కుమార్ రాజా ఆరోపించారు. ఏసీ డ్రెయిన్ పైపు డిజైన్ లోపం వల్ల నీరు కార్పెట్ కింద నిలిచి ఫ్లోర్ తడిసిపోయిందని తెలిపారు. సర్వీస్ సెంటర్ ఇష్యూను పూర్తిగా సాల్వ్ చేయలేదని, కంపెనీకి చాలాసార్లు కంప్లైంట్ చేసినా రెస్పాండ్ కాలేదన్నారు.. కారును వెనక్కి తీసుకుని డబ్బును రీఫండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే చట్టపరంగా పోరాటం చేస్తానని అన్నారు.

ChatGPT Phone వస్తుందా..?
Technology· 4 Aug 2026

ChatGPT Phone వస్తుందా..?

చాట్‌జీపీటీని ఫోన్‌లో వాడుతున్నాం... రేపు చాట్‌జీపీటీ కోసమే ప్రత్యేక డివైస్ వస్తుందా..? 👀🤖 OpenAI తన ఏఐ మోడల్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు “ఫ్యామిలీ ఆఫ్ డివైసెస్” తయారు చేస్తోందని కంపెనీ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ చెప్పారు. అది స్మార్ట్ స్పీకరా, వేరబుల్ డివైసా అనే విషయాన్ని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. కానీ కొత్త డివైసెస్ త్వరలో వస్తాయని చెప్పారు. భవిష్యత్తులో కంప్యూటర్లతో చేసే చాలా పనులు టైపింగ్ కంటే వాయిస్ ద్వారానే జరుగుతాయని ఆయన భావిస్తున్నారు.

బెండకాయతో ఆరోగ్యానికి లాభాలు..
Health· 4 Aug 2026

బెండకాయతో ఆరోగ్యానికి లాభాలు..

బెండకాయ రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, పోషకాల నిలయం కూడా. ఇందులో విటమిన్ A, C, ఫైబర్ ఉండటంతో కంటి చూపు, చర్మ ఆరోగ్యం మెరుగుపడతాయి. జీర్ణక్రియకు తోడ్పడి మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని వ్యాధులకు చికిత్స కాదని, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని సూచిస్తున్నారు.

అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలి: ఉత్తమ్
TG· 4 Aug 2026

అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలి: ఉత్తమ్

తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా సాధించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరునెలల్లో అనుమతులు పొందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు రాష్ట్ర ప్రాజెక్టులకు అనుకూల అవకాశాలు కల్పించిందన్నారు. గతంలో తిరస్కరణకు గురైన ప్రతిపాదనలను సరిదిద్ది మళ్లీ సమర్పించాలని తెలిపారు.

డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్
AP· 4 Aug 2026

డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ డ్వాక్రా మహిళలకు భారీ ఊరటనిచ్చింది. CM ఆదేశాల మేరకు జూలై 1 నుంచి తీసుకున్న రుణాలపై ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ ఫీజులతో పాటు డాక్యుమెంటేషన్, లెడ్జర్ ఫోలియో, పాస్‌బుక్ అప్‌డేషన్, ఏసీహెచ్ స్టేట్‌మెంట్ ప్రింటింగ్, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలను రద్దు చేసింది. అలాగే రూ.5లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీ రేటును 13శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. రాష్ట్రంలో ఈ బ్యాంకు పరిధిలో సుమారు 3 లక్షల డ్వాక్రా సంఘాలు, 30లక్షల మంది మహిళలు ఉండగా, ఈ నిర్ణయంతో వారికి ఆర్థిక ఉపశమనం లభించనుంది.

పుట్టినగడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి
TG· 4 Aug 2026

పుట్టినగడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి

తెలంగాణ అభివృద్ధిలో NRIలు భాగస్వాములు కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన 19వ ఆట మహాసభల్లో ఆయన ప్రసంగించారు. ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని, పెట్టుబడులు పెట్టేందుకు సింగిల్ విండో విధానం అందుబాటులో ఉందన్నారు. ప్రవాసులు తమ విజ్ఞానం, అనుభవాన్ని సొంత రాష్ట్రం, పుట్టిన గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజలకు మరింత వేగంగా డిజిటల్ సేవలు
TG· 4 Aug 2026

ప్రజలకు మరింత వేగంగా డిజిటల్ సేవలు

తెలంగాణలో ప్రజలకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు మీ సేవ కేంద్రాలను ఆధునీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో డిజిటల్ ఇండియా–వికసిత్ భారత్ 2047 లక్ష్యాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు, కృత్రిమ మేధస్సు (AI), సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై సమీక్షించారు.