Latest

స్కూల్ డాబాపై యువకుడి దారుణ హత్య
AP: నెల్లూరు జిల్లా గూడూరు పక్కన ఉన్న విందూరులో ప్రైమరీ స్కూల్ డాబా మీద షాహుల్(21) అనే కుర్రాడు రక్తమడుగులో చనిపోయి వున్నాడు. ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే పోలీసులకు చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి. రక్తం ఎక్కువగా పోవడం వల్లే అతడు చనిపోయాడని చెప్పారు. అక్కడ ఉన్న ఆధారాలు చూస్తుంటే ఎవరో గొంతు కోసి చంపినట్లు అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

'కొరియన్ కనకరాజు' ట్రైలర్ : ఫన్ అండ్ హారర్ హంగామా!
వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. థ్రిల్, హాస్యం, హారర్ అంశాలతో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ రితికా నాయక్, కామెడీ నటుడు సత్య తమ పాత్రలతో అలరించానున్నారు . తమన్ అందించిన మ్యూజిక్ హారర్, ఫన్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లింది.

OUలో 'జెన్ జీ పోరుబాట' ప్రారంభం
TG: ఉస్మానియా యూనివర్సిటీ(OU)లో జెన్ జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో "జెన్ జీ పోరుబాట" పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. సంఘం ఫౌండర్, ప్రెసిడెంట్ శివాజీ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, BPL ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ISROలో 410 అప్రెంటిస్ జాబ్స్
ISROలో జాబ్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బెంగళూరులోని U.R రావు శాటిలైట్ సెంటర్‌లో 410 అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్స్ మొదలయ్యాయి. ఈ నోటిఫికేషన్‌లో గ్రాడ్యుయేట్స్‌కు 220, టెక్నీషియన్స్‌కు 120, కమర్షియల్ అప్రెంటిస్‌కు 70 పోస్టులున్నాయి. డిగ్రీ, డిప్లొమా, కామర్స్ అర్హత కలిగిన కాండిడేట్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశముంది. కాండిడేట్లు NATS వెబ్‌సైట్‌లో ఆగస్ట్ 28 వరకు ఆన్‌లైన్‌లో <a href="https://nats.education.gov.in/">అప్లై </a>చేసుకోవచ్చు.

జొన్న రొట్టెలతో జీవితాన్నే మార్చేశారు
మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్లకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, కవిత దంపతులు 50 పెట్టుబడితో ప్రారంభించిన జొన్నరొట్టెల వ్యాపారాన్ని విజయవంతమైన బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. స్టార్టింగ్‌ల సైకిల్‌పై రొట్టెలు అమ్మిన వీరు, తర్వాత మిషిన్ కొనుగోలు చేసి వ్యాపారాన్ని విస్తరించారు. కరోనా టైమ్‌లో వ్యాపారం దెబ్బతిన్నా, కుమార్తె ఇషిక సలహాతో 'మన ఇంటి రోటీస్' పేరుతో ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభించారు. రోజుకు 3వేల రొట్టెలు విక్రయిస్తూ తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరుకు సరఫరా చేస్తున్నారు. నెలకు రూ.60వేల ఆదాయం పొందుతున్నారు.

గ్రీన్ స్క్రీన్ లేని రోజుల్లోనే అద్భుతం..
రామానంద్ సాగర్ 1987లో చేసిన ఐకానిక్ సీరియల్ 'రామాయణ్' మేకింగ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్‌తో ఒక డాక్యుమెంటరీ రాబోతుంది. నితేష్ తివారీ తీస్తున్న కొత్త 'రామాయణ్' మూవీ రాకముందే, రామానంద్ సాగర్ మనవడు శివ్ సాగర్ దీన్ని మన ముందుకు తెస్తున్నారు. ఆ రోజుల్లో గ్రీన్ స్క్రీన్లు, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లేకపోయినా, పరిమిత టెక్నాలజీతోనే రామానంద్ సాగర్ విజువల్ మ్యాజిక్ ఎలా చేశారో ఇందులో చూపించబోతున్నారు. 36 ఏళ్లు దాటినా ఈ సీరియల్ క్రేజ్ ఇప్పటికీ తగ్గకపోవడం విశేషం.
నా సపోర్టర్స్‌పై EDని ఉసిగొల్పుతారు- అభిజిత్ దీప్కే
ఫుల్ టైమ్ పొలిటీషియన్ కావడం వల్ల ఉపయోగం లేదంటూ CJP లీడర్ అభిజిత్ దీప్కే ఇండియా టుడే ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. "నేను పోటీ చేస్తే ఓట్లు డిలీట్ చేస్తారు, నా వెనుక నిలిచే సపోర్టర్స్‌పై EDని ఉసిగొల్పుతారు. మన దేశంలో ఇదే రియాలిటీ. అందుకే పొలిటిక్స్ ద్వారా కాకుండా.. కేవలం పబ్లిక్ మూవ్‌మెంట్ (ప్రజా ఉద్యమం) ద్వారానే కంట్రీలో ఛేంజ్ సాధ్యమని, దానిపైనే వర్క్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

పుట్టిన బిడ్డను వదిలేసిన కన్న తల్లి
బెంగళూరు దగ్గరలోని దేవనహళ్లి ఆసుపత్రిలో అనారోగ్యంతో పుట్టిన బాబును వదిలేసి ఓ తల్లి వెళ్లిపోయింది. వైద్యానికి డబ్బులు తెస్తానని చెప్పి ఆమె తిరిగి రాలేదు. ప్రస్తుతం బాబుకు చిక్కబళ్లాపూర్‌లో ఓ నర్సు సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఐడీ కార్డు ఆధారంగా ఆ మహిళది హవేరి జిల్లాగా గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి ఆమె కోసం వెతుకుతున్నారు.

బస్సు నడుపుతూ ఫోన్.. డ్రైవర్‌పై వేటు
AP: చిత్తూరు జిల్లా పలమనేరు-మదనపల్లె మార్గంలో బస్సు నడుపుతూ సెల్‌ఫోన్ చూస్తున్న డ్రైవర్‌పై RTC యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యాన్ని బస్సులోని ఓ ప్రయాణికుడు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి చేరగా, ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ తక్షణ చర్యలకు ఆదేశించారు. విచారణ అనంతరం పలమనేరు డిపోకు చెందిన హైర్ సర్వీస్ బస్సు డ్రైవర్ కె. గణేష్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించారు.

ఎర్రబస్సు కాదు.. ఎయిర్‌బస్సునే తెచ్చాం: రాంమోహన్ నాయుడు
AP: భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం తరువాత జరిగిన సభలో కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు. ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని, 'ఎర్రబస్సు కాదు.. ఎయిర్‌బస్సు తిరిగే ప్రాంతంగా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దామని' అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు సింహద్వారంలా మారుతుందని, దీని ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని విజన్–2047తో రాష్ట్రం ముందుకు వెళ్తుందని రాంమోహన్ నాయుడు తెలిపారు.
2028 నాటికి అమరావతి పనులు పూర్తి: చంద్రబాబు
AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2028 కల్లా అమరావతి పనుల్లో మొదటి దశ పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రధాని మోదీతో పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేయిస్తానని ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలో 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.

మూన్‌కి గ్రాండ్ స్మాష్: ఖగోళంలో అల్టిమేట్ క్రాష్ అలర్ట్!
అమెరికాకు చెందిన 'స్పేస్‌ఎక్స్' రాకెట్ శకలం ఐదు రోజుల్లో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టబోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్ శకలం 4,500 కేజీల బరువు, 12 మీటర్ల పొడవు ఉంటుందని చెబుతున్నారు. గంటకు 8,700 కిలోమీటర్ల తీవ్ర వేగంతో చంద్రుడిని తాకే అవకాశం ఉందని వెల్లడించారు. బలమైన తాకిడి వల్ల చంద్రుడిపై గుంత ఏర్పడటంతో పాటు భారీగా ధూళి, శకలాలు పైకి ఎగిసిపడనున్నాయి. అంతరిక్షంలో జరగబోయే ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ పరిశోధకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కార్యాలయంలోనే మాయమైన పింఛన్ డబ్బు
AP: కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ పంచాయతీలో పింఛన్ల పంపిణీకి ఉంచిన రూ.60 వేల నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. సచివాలయం-1 పరిధిలో పింఛన్ల పంపిణీ కోసం అధికారులు బ్యాంకు నుంచి రూ.10.70 లక్షలు డ్రా చేసి కార్యాలయ బీరువాలో భద్రపరిచారు. శనివారం ఉదయం పంపిణీకి ముందు నగదు లెక్కించగా రూ.60 వేల తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్యాలయ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సచివాలయ సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి నగదు ఎలా మాయమైందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బంగారం ధరలు ఈరోజు ఎంత తగ్గాయంటే?
గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,44,220కి చేరింది. అలాగే ఆర్నమెంటల్ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.350 తగ్గి రూ.1,32,200గా ఉంది. అయితే బంగారం రేట్లు ఎప్పటికప్పుడు ఛేంజ్ అవుతుంటాయి కాబట్టి షాపింగ్ చేసేముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

అతివేగంతో షాప్‌లోకి దూసుకెళ్లిన కారు
TG: నల్గొండ పట్టణంలోని రహమత్‌నగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. దుకాణం మూసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు.

పాకిస్థాన్‌పై భారత్ ఫైర్!🔥
PoKలో అసలు ఏం జరుగుతోంది..? ఇప్పుడు పాకిస్థాన్‌పై ప్రపంచం ఫోకస్ పెట్టాలని భారత్ అంటోంది. 🇮🇳 పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనలు చేస్తున్న ప్రజలపై అక్కడి అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని భారత్ ఫైర్ అయింది. ప్రజల వాయిస్‌ను బలవంతంగా ఆపేస్తున్నారని, వారి హక్కులను కూడా పట్టించుకోవడం లేదని భారత్ అంటోంది. PoKలో పాకిస్థాన్ చేస్తున్న చర్యలను ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా గమనించాలని కోరింది. దీంతో ఇప్పటికే హీట్‌లో ఉన్న PoK ఇష్యూ ఇప్పుడు మరోసారి ఇంటర్నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంట్లోని బాత్రూమ్‌లే ప్రమాదకరమా?
ఫ్రీ-స్టాండింగ్ బాత్‌టబ్‌లు, జారే మెరిసే టైల్స్, ఎత్తుగా ఉండే టాయిలెట్ సీట్ల వంటి తప్పుడు డిజైన్లతో, 65 ఏళ్లు దాటిన పెద్దవాళ్లు కిందపడి గాయపడటమే వాళ్ల మరణాలకి కారణమని నిపుణులు చెప్తున్నారు. ఇవి ఎక్కువగా ఇంట్లోని బాత్రూమ్‌లలోనే జరుగుతున్నాయి. వీటి నుండి వృద్ధులను కాపాడుకోవడానికి బాత్రూమ్‌లలో పట్టుకోవడానికి 'గ్రాబ్ బార్స్' ఏర్పాటు చేయడం, జారకుండా ఉండే మ్యాట్ టైల్స్ వాడటం మంచిది. శరీరానికి తగినట్లుగా ఉండే టాయిలెట్లను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం.

అంబేద్కర్ వారసత్వం అందరిది: అభిజీత్ దిప్కే
నేషనల్ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే మాట్లాడుతూ.. డాక్టర్ అంబేద్కర్ వారసత్వం ఏ ఒక్క వర్గానికే పరిమితం కాదన్నారు. ప్రస్తుత భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మహిళలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచి, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే ప్రతి ఒక్కరికీ "జై భీమ్" నినాదం చెందుతుందని అభిజీత్ దిప్కే అన్నారు.

లంచం తీసుకుంటూ బుక్కైన ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి
TG: హైదరాబాద్ గచ్చిబౌలి ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేసే రంజీత్ కుమార్, అతడి భార్యపై CBI లంచం కేసు నమోదు చేసింది. మంచిరేవులకు చెందిన రాఘవేంద్ర అనే టీచర్ బ్యాంకు లోన్ కోసం తన పేరుపై ఉన్న నకిలీ పాన్ కార్డును తీసేయాలని దరఖాస్తు చేశాడు. ఆ పని పూర్తి కావాలంటే 4 వేల రూపాయలు ఇవ్వాలని రంజీత్ డిమాండ్ చేశాడు. ఫోన్‌పే ద్వారా తన భార్య అకౌంట్‌కు ఆ డబ్బులు వేయించుకున్నాడు. ఇలాగే ఇతను వేరే వాళ్ల దగ్గర కూడా ఆన్‌లైన్‌లో లంచాలు తీసుకుని ఉంటాడని CBI అధికారులు అనుమానిస్తున్నారు.

'రష్మిక'కు ఏమైంది!
సినిమా షూటింగ్‌లతో పాటు వరుస అడ్వర్టైజ్మెంట్లు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్‌తో బిజీగా ఉండే నటి రష్మిక, ఇటీవల తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్‌లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా, 'నేషనల్ క్రష్'గా వెలుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మోదీని మించిన నాయకుడు లేడు: పవన్ కల్యాణ్
AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అనంతరం నిర్వహించిన సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి కొందరు చెడ్డగా మాట్లాడటం తనకు బాధగా అనిపించిందన్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారన్నారు. ఆయన విదేశీ శత్రువులతోపాటు దేశంలో ఉండే శత్రువులతోనూ పోరాడాల్సి వస్తోందన్నారు. మోదీని మించిన నాయకుడు లేడు..రాబోడు అని పవన్ కల్యాణ్ పొగిడారు.