← Back to news

గ్రీన్ స్క్రీన్ లేని రోజుల్లోనే అద్భుతం..

By Balakrishna· 1 Aug 2026
గ్రీన్ స్క్రీన్ లేని రోజుల్లోనే అద్భుతం..

రామానంద్ సాగర్ 1987లో చేసిన ఐకానిక్ సీరియల్ 'రామాయణ్' మేకింగ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్‌తో ఒక డాక్యుమెంటరీ రాబోతుంది. నితేష్ తివారీ తీస్తున్న కొత్త 'రామాయణ్' మూవీ రాకముందే, రామానంద్ సాగర్ మనవడు శివ్ సాగర్ దీన్ని మన ముందుకు తెస్తున్నారు. ఆ రోజుల్లో గ్రీన్ స్క్రీన్లు, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లేకపోయినా, పరిమిత టెక్నాలజీతోనే రామానంద్ సాగర్ విజువల్ మ్యాజిక్ ఎలా చేశారో ఇందులో చూపించబోతున్నారు. 36 ఏళ్లు దాటినా ఈ సీరియల్ క్రేజ్ ఇప్పటికీ తగ్గకపోవడం విశేషం.

More in Cinema