Latest

జెన్ జీ ప్రొటెస్ట్స్- సింగిల్ FIR తో వేలమందిపై కేసులు
News· 29 Jul 2026

జెన్ జీ ప్రొటెస్ట్స్- సింగిల్ FIR తో వేలమందిపై కేసులు

పాట్నాలోని గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఒకే ఒక్క FIR‌లో 144 మంది నిరసనకారులు, మరొక 5,000 మంది అపరిచితులపై ఏకంగా 'హత్యాయత్నం' కేసులు మోపారు. వీరిలో దాదాపు 50 మంది మైనర్లు ఉన్నారు. పరీక్షా పేపర్ల లీకేజీలకు వ్యతిరేకంగా, ఉపాధి హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టడం వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెన్నై మెట్రోలో CM విజయ్ సందడి!
Politics· 29 Jul 2026

చెన్నై మెట్రోలో CM విజయ్ సందడి!

చెన్నై మెట్రో రైలులో తమిళనాడు CM విజయ్ హఠాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓమందూరార్ స్టేషన్ నుంచి నందనం వరకు సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుక్కొని మెట్రోలో ప్రయాణించారు. రైలులో ఉన్న తోటి ప్రయాణికులతో మాట్లాడి వారిని పలకరించారు. అంతకుముందు మెట్రో హెడ్‌క్వార్టర్స్‌ను విసిట్ చేసి, ఆఫీసర్స్ తో మాట్లాడారు. విజయ్ మెట్రోలో ప్రయాణించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

యూత్ ఉద్యమాలపై రిపబ్లిక్ టీవీ కాన్స్పిరసీ థియరీలు
News· 29 Jul 2026

యూత్ ఉద్యమాలపై రిపబ్లిక్ టీవీ కాన్స్పిరసీ థియరీలు

రిపబ్లిక్ టీవీ కేవలం ఒక్క వారంలోనే 25 బ్రాడ్‌కాస్ట్‌లు, 58,941 పదాల ద్వారా దేశంలోని యూత్ఉద్యమాలపై రకరకాల కాన్స్పిరసీ థియరీలను ప్రచారం చేసిందని ది వైర్ సెన్సేషనల్ రిపోర్ట్ ఇచ్చింది.. విదేశీ హస్తం, ప్రతిపక్షాల కుట్రలు ఉన్నాయంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నించిందని ఈ రిపోర్ట్ తెలిపింది. మీడియా బాధ్యతను పక్కనపెట్టి, ప్రజాస్వామ్య నిరసనలను లక్ష్యంగా చేసుకుని సంచలన కథనాలను సృష్టించారని ది వైర్కామెంట్ చేసింది.

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ !
Education· 29 Jul 2026

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ !

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి TSLPRB నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్స్ 3,697, AR 1,052, SPF కానిస్టేబుల్స్ 1,380, ఫైర్ ఫైటర్స్ 751 తో పాటు SI పోస్టులు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అప్లై చేసే కాండిడేట్స్ ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసుకున్న EWS, నాన్-క్రీమీ లేయర్ లాంటి సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకోవాలని బోర్డు అలర్ట్ చేసింది.

ఆటో డ్రైవర్.. పిక్ వైరల్!
Viral· 29 Jul 2026

ఆటో డ్రైవర్.. పిక్ వైరల్!

సోషల్ మీడియాలో ఒక ఆటో డ్రైవర్‌కి సంబంధించిన ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. తన ఆటో ఫ్రంట్ గ్లాస్‌పై హిందూ, క్రిస్టియన్, ముస్లిం మతాలకు చెందిన ఓం, క్రాస్, నక్షత్రం విత్ నెలవంక సింబల్స్‌ని పక్కపక్కనే స్టిక్కర్‌గా అంటించాడు. దేశంలో కులమతాల పేరుతో గొడవలు జరిగే ఈ రోజుల్లో, అందరూ కలిసిమెలిసి ఉండాలని మెసేజ్ ఇస్తున్న ఈ డ్రైవర్ ఆలోచనను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. రియల్ ఇండియా అంటే ఇదేనని, మనస్తత్వానికి మతం లేదని ఈ ఫోటో నిరూపిస్తోంది, మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో రాయండి.

ఫోన్ ముందు కూర్చుంటే GenZ కనెక్ట్ అవ్వరు- రాహుల్ గాంధీ
Politics· 29 Jul 2026

ఫోన్ ముందు కూర్చుంటే GenZ కనెక్ట్ అవ్వరు- రాహుల్ గాంధీ

ఫోన్ ముందు కూర్చుని వీడియోలు చేస్తే GenZ కి కనెక్ట్ అయిపోలేరని ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ప్రాబ్లమ్ ఇమేజ్ గురించి కాదని, స్టూడెంట్స్ ఫ్యూచర్, ఎకానమీని డ్యామేజ్ చేయడమే అసలైన సమస్య అని రాహుల్ మండిపడ్డారు. ఈ సిట్యుయేషన్‌లో స్టూడెంట్స్ చూపించిన కరేజ్‌ చాలా గ్రేట్ అని, పేరెంట్స్‌కి కూడా లేని డేర్ చూపించి పోరాడిన స్టూడెంట్స్‌కి తాను రియల్‌గా థ్యాంక్స్ చెబుతున్నానని రాహుల్ గాంధీ ప్రశంసించారు.

కంగనా రనౌత్‌ కామెంట్స్‌పై సోనుసూద్ ఫైర్
Cinema· 29 Jul 2026

కంగనా రనౌత్‌ కామెంట్స్‌పై సోనుసూద్ ఫైర్

జంతర్ మంతర్‌లో నిరసన తెలుపుతున్న GenZ విద్యార్థులపై నటి, ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద ‘గట్టర్ జనరేషన్’ కామెంట్స్‌ని బాలీవుడ్ నటుడు సోనుసూద్ తీవ్రంగా విమర్శించారు. ఆ మాటల్ని ‘అవమానకరం’ అని ఆయన అన్నారు. యాక్టర్స్ సక్సెస్ యువత మీదే ఆధారపడి ఉందని, కంగనా ఇలాంటి కామెంట్స్ చేసే ముందు బాగా ఆలోచించాలని సలహా ఇచ్చారు.

లోక్‌సభలో నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు- రాహుల్ గాంధీ
Politics· 29 Jul 2026

లోక్‌సభలో నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు- రాహుల్ గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదంటూ రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సభను ఆర్డర్‌లో పెట్టి తనకు చాన్స్ ఇవ్వాలని స్పీకర్‌ను చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని చెప్పారు. అమిత్ షా గురించి మాట్లాడినందుకే తన వాయిస్ నొక్కేస్తున్నారని మండిపడ్డారు. క్షమాపణ చెప్తేనే మాట్లాడనిస్తామని అంటున్నారని, కానీ BJPకి కానీ RSSకి కానీ తాను లైఫ్‌లో సారీ చెప్పేదే లేదని రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్‌గా స్పష్టం చేశారు.

మళ్లీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తా- అభిజీత్ దీప్కే
Politics· 29 Jul 2026

మళ్లీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తా- అభిజీత్ దీప్కే

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 37 రోజులు ప్రొటెస్ట్ చేసిన CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఫైనల్‌గా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఇన్నాళ్లకు ప్రశాంతంగా నిద్రపోతున్నానని, నార్మల్ లైఫ్‌లోకి వెళ్తానని చెప్పారు. ఎగ్జామ్ రూల్స్ ఎన్ని మారినా మనుషుల ఆలోచనలు మారకపోతే వేస్ట్ అని, పేపర్ లీక్స్ కేసు ఫస్ట్ కోర్టు విచారణే వాయిదా పడటంపై ఆయన ఫైర్ అయ్యారు. స్టూడెంట్స్‌పై పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయకపోతే, నెక్స్ట్ టైమ్ ఇంకా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఇండియాలో లేడు.. కానీ కేసులో మాత్రం ఉన్నాడు! ఎలా?
News· 29 Jul 2026

ఇండియాలో లేడు.. కానీ కేసులో మాత్రం ఉన్నాడు! ఎలా?

"నేను రష్యాలో ఉంటే.. నిరసనకు ఎలా వస్తా?" అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నాడు బీహార్‌కు చెందిన మహ్మద్ సదాఖత్. "గత 4 నెలలుగా నేను రష్యాలోనే ఉన్నాను.. అయినా NEET నిరసన కేసులో నా పేరు పెట్టారు" అంటూ ఆయన వీడియో విడుదల చేశారు. దీంతో వీడియో వైరల్ కావడంతో "అసలు కేసు పెట్టే ముందు ఎవర్నైనా వెరిఫై చేస్తారా లేదా..?" అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, రష్యాలో ఉన్న వ్యక్తి పేరు కేసులో ఎలా చేరింది? అయితే సదాఖత్ చెప్పిన విషయాన్ని అధికారులు ఇంకా కన్‌ఫర్మ్ చేయలేదు.

పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న ప్రభుత్వ టీచర్
AP· 29 Jul 2026

పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న ప్రభుత్వ టీచర్

AP: శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట KGBV స్కూల్‌లో టీచర్ 'రూపరాణి' క్లాసులో పిల్లలకు పాఠాలు చెప్పవలసింది పోయి వాళ్లతో తల మసాజ్, కాళ్లు పాటించుకోడం వంటివి చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె తీరుపై మండిపడుతున్నారు. స్కూల్‌కు చెడ్డపేరు తెచ్చిన ఆ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పుతో సాగునీటి ప్రాజెక్టులకు బిగ్ రిలీఫ్
TG· 29 Jul 2026

సుప్రీంకోర్టు తీర్పుతో సాగునీటి ప్రాజెక్టులకు బిగ్ రిలీఫ్

TG: తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ లాంటి సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండాన్ని రద్దు చేసినా, దాని ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపింది. ఈ తీర్పు భవిష్యత్తు ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుందని, కొత్త ప్రాజెక్టులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని చెప్పింది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలకు చట్టపరమైన అడ్డు ఉండదనే స్పష్టత వచ్చింది.

మెడలోతు నీళ్లలో తండ్రి పోరాటం..
Viral· 29 Jul 2026

మెడలోతు నీళ్లలో తండ్రి పోరాటం..

అసోంలో వర్షాల వల్ల వరదలు రావడంతో ఊళ్లన్నీ నీళ్లలో మునిగిపోయాయి. ఈ టైమ్‌లో ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను కాపాడుకునేందుకు చేసిన సాహసం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మెడలోతు వాటర్‌లో కుండపోత వర్షం పడుతున్నా, పిల్లలను ఒక ప్లాస్టిక్ టబ్‌లో కూర్చోబెట్టి సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్లాడు. పిల్లలు భయంతో ఏడుస్తున్నా తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫాదర్స్ లవ్ అండ్ సాక్రిఫైస్‌కి ఈ వీడియో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

మెడికల్ షాపులకు డీమార్ట్ భారీ షాక్
Business· 29 Jul 2026

మెడికల్ షాపులకు డీమార్ట్ భారీ షాక్

సూపర్‌మార్కెట్ డీమార్ట్ ఇప్పుడు కొత్తగా మందుల బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్‌గా ముంబైలోని డీమార్ట్ స్టోర్లలో ఫస్ట్ టైమ్ ఫార్మసీ కౌంటర్లను స్టార్ట్ చేసింది. ఏకంగా 20% డిస్కౌంట్ ఇస్తూ జనాలను బాగా ఆకర్షిస్తోంది. త్వరలో అన్ని డీమార్ట్ బ్రాంచుల్లోనూ ఈ మందుల కౌంటర్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. సాధారణంగా బయట మెడికల్ షాపుల్లో మందులను MRP రేటుకే అమ్ముతారు. కానీ డీమార్ట్ ఇంత పెద్ద డిస్కౌంట్ ఇస్తుండటంతో మామూలు మెడికల్ షాపులపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది.

సర్కస్‌లో స్టంట్ చేస్తూ యువకుడు మృతి
Crime· 29 Jul 2026

సర్కస్‌లో స్టంట్ చేస్తూ యువకుడు మృతి

హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్కస్ చూపిస్తూ దీపక్(27) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సర్కస్ చివరి రోజున 'సజీవ సమాధి' అనే స్టంట్ కోసం దీపక్‌ను ఒక సంచిలో పెట్టి గొయ్యిలో పూడ్చారు. 24 గంటల తర్వాత అతన్ని బయటకు తీయాలి. కానీ ప్రేక్షకుల నుంచి రూ. 7,100 కలెక్షన్ వస్తేనే తీస్తామని నిర్వాహకులు చెప్పారట. దీంతో 36 గంటల పాటు దీపక్ లోపలే ఊపిరాడక చనిపోయాడు. చివరికి గొయ్యి తీసి చూస్తే శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
Education· 29 Jul 2026

మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

కాకినాడ జిల్లా పెద్దాపురం మహారాణి కళాశాలలో మహిళలు, చిన్నారుల భద్రత, శక్తి యాప్, సైబర్ నేరాల నివారణపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, లవ్ ట్రాప్స్, డ్రగ్స్ ప్రమాదాలు, రోడ్డు భద్రత, యాంటీ ర్యాగింగ్ అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 లేదా శక్తి యాప్ ద్వారా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇకపై ఈ దేశం మీ పోలీసులకు భయపడదు: అరవింద్ కేజ్రీవాల్
Viral· 29 Jul 2026

ఇకపై ఈ దేశం మీ పోలీసులకు భయపడదు: అరవింద్ కేజ్రీవాల్

'E20కి వ్యతిరేకంగా జాతీయ టౌన్‌హాల్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని APP అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులను మోహరించిందని విమర్శించారు. 'మోదీజీ, మీరు ఎలాగైనా E20 విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. ఈ దేశం ఇక మీ పోలీసులకు భయపడదు' అని కేజ్రీవాల్ 'ఎక్స్‌'లో అన్నారు.

'వందేమాతరం'ను డిస్టర్బ్ చేస్తే 3 ఏళ్లు జైలు..
News· 29 Jul 2026

'వందేమాతరం'ను డిస్టర్బ్ చేస్తే 3 ఏళ్లు జైలు..

జాతీయ గేయం 'వందేమాతరం'ను అవమానించినా లేదా పాడేటప్పుడు డిస్టర్బ్ చేసినా నేరంగా పరిగణించే కొత్త బిల్లుకు రాజ్యసభ ఓకే చెప్పింది. మన నేషనల్ యాంథమ్ 'జనగణమన'కి ఎలాంటి రెస్పెక్ట్ ఉందో.. 'వందేమాతరం'కి కూడా అదే లెవెల్ రెస్పెక్ట్ ఇవ్వడమే దీని మెయిన్ ఎయిమ్. రూల్స్ బ్రేక్ చేస్తే 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడేలా కొత్త చట్టంలో చేంజెస్ చేశారు. ఆపోజిషన్ లీడర్స్ గొడవ చేస్తున్నా ఈ బిల్లు పార్లమెంట్‌లో పాస్ అయిపోయింది.

మన్మోహన్ మరణించిన రెండేళ్లకు సుప్రీం తీర్పు
Legal· 29 Jul 2026

మన్మోహన్ మరణించిన రెండేళ్లకు సుప్రీం తీర్పు

కోల్ బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు 2015లో స్పెషల్ CBI కోర్టు జారీ చేసిన సమన్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ ముగింపు నివేదికను తిరస్కరించి ఆయనపై విచారణకు అనుమతించడం సమర్థనీయం కాదని పేర్కొంది. సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను అంగీకరిస్తూ మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. మరణించిన తరువాత కూడా మన్మోహన్ సింగ్ పేరుపై ఉన్న ట్రయల్ కోర్టు ప్రతికూల వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. చనిపోయిన రెండేళ్లకు ఈ కేసులో ఆయనకు క్లీన్ చిట్ లభించింది.

బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు షేక్ హసీనా రెడీ!
Politics· 29 Jul 2026

బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు షేక్ హసీనా రెడీ!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన సొంత దేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ తనను అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా లేదా చంపేసినా డిసెంబర్ నాటికి ఖచ్చితంగా వెళ్తానని స్పష్టం చేశారు. 2024 స్టూడెంట్స్ ప్రొటెస్ట్ టైమ్‌లో క్రైమ్స్ చేశారనే ఆరోపణలతో అక్కడి కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం ఇండియాలో ఉంటున్న 78 ఏళ్ల హసీనా, తనపై వచ్చిన కేసెస్ అన్నీ పొలిటికల్ రివేంజ్ అని, తన ప్రజల కోసమే రిస్క్ చేసి తిరిగి వెళ్తున్నానని స్పష్టం చేశారు.

తెలంగాణ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల
Education· 29 Jul 2026

తెలంగాణ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-SET-2026) నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 3 నుంచి 30 వరకు ఫైన్ లేకుండా <a href="http://www.telanganaset.org/">ఆన్‌లైన్‌</a>లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేట్ అయితే ₹3000 ఫైన్‌తో సెప్టెంబర్ 12 వరకు ఛాన్స్ ఉంది. అప్లికేషన్‌లో తప్పులుంటే సరిదిద్దుకోవడానికి సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు టైమ్ ఇచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.