సర్కస్‌లో స్టంట్ చేస్తూ యువకుడు మృతి

హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్కస్ చూపిస్తూ దీపక్(27) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సర్కస్ చివరి రోజున 'సజీవ సమాధి' అనే స్టంట్ కోసం దీపక్‌ను ఒక సంచిలో పెట్టి గొయ్యిలో పూడ్చారు. 24 గంటల తర్వాత అతన్ని బయటకు తీయాలి. కానీ ప్రేక్షకుల నుంచి రూ. 7,100 కలెక్షన్ వస్తేనే తీస్తామని నిర్వాహకులు చెప్పారట. దీంతో 36 గంటల పాటు దీపక్ లోపలే ఊపిరాడక చనిపోయాడు. చివరికి గొయ్యి తీసి చూస్తే శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.



