మన్మోహన్ మరణించిన రెండేళ్లకు సుప్రీం తీర్పు

కోల్ బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు 2015లో స్పెషల్ CBI కోర్టు జారీ చేసిన సమన్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ ముగింపు నివేదికను తిరస్కరించి ఆయనపై విచారణకు అనుమతించడం సమర్థనీయం కాదని పేర్కొంది. సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను అంగీకరిస్తూ మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. మరణించిన తరువాత కూడా మన్మోహన్ సింగ్ పేరుపై ఉన్న ట్రయల్ కోర్టు ప్రతికూల వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. చనిపోయిన రెండేళ్లకు ఈ కేసులో ఆయనకు క్లీన్ చిట్ లభించింది.



