Latest

ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుంది: నితిన్ గడ్కరీ
20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వాడితే బండి మోడల్ బట్టి 2 నుంచి 6 శాతం దాకా మైలేజ్ తగ్గుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో చెప్పారు. అయితే ఇలా వాడటం వల్ల ఇంజిన్ పాడవ్వడం లాంటి సమస్యలు ఏమీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. మామూలు పెట్రోల్ కన్నా E20 వాడితే బండి పికప్ బాగుంటుందని. పొల్యూషన్ కూడా 30% తగ్గుతుందని తెలిపారు. టూ వీలర్, ఫోర్ వీలర్ బండ్లపై అన్ని రకాల టెస్టులు చేశాకే ఈ విషయాలు తెలిశాయి అని మంత్రి అన్నారు.

రైల్వే ఉద్యోగాల వేటలో ఉన్నారా? NHSRCL లో 237 పోస్టులు..
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి <a href="https://pratibha.eenadu.net/notifications/notification_article/government-jobs/nhsrcl-technician-vacancies/2-8-27-23070028985">ప్రకటన విడుదల</a> చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నలింగ్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతితో పాటు ITI/అప్రెంటిస్‌షిప్ లేదా డిప్లొమా ఉండి, రైల్వేస్ లేదా మెట్రో విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 05 ఆగస్టు 2026. సీబీటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఫారెన్ ఫండింగ్ ఆరోపణలపై- అభిజీత్ దిప్కే
CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే హోం మినిస్టర్ అమిత్ షాపై హాట్ కామెంట్స్ చేశారు. తమకు ఫారెన్ నుంచి ఫండింగ్ వస్తోందన్న ఆరోపణలపై రియాక్ట్ అవుతూ, ఒకవేళ అది నిజమైతే అది అమిత్ షా ఫెయిల్యూర్ అని అన్నారు. హోం మినిస్టర్‌గా ఉండి కూడా విదేశీ ఫండింగ్ రాకుండా ఆపలేకపోతే ఆయన వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. డెమోక్రసీని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన స్పందించారు.

ఆ కేసుపై నాంపల్లి కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ రేపు నాంపల్లి ACB స్పెషల్ కోర్టులో హాజరుకానున్నారు. కోర్టు జారీ చేసిన సమన్ల గురించి ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు అటెండ్ అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి ప్రజాధన వినియోగం, పరిపాలనా నిర్ణయాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ACB ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.

హాకీ జట్టుకు కాషాయ రంగు జెర్సీ..విపక్షాల మండిపాటు
భారత హాకీ జట్టుకు కొత్తగా కాషాయ రంగు జెర్సీ ప్రవేశపెట్టడంపై విపక్షాలు కేంద్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. FIH హాకీ వరల్డ్ కప్‌కు ముందు హాకీ ఇండియా పురుషులు, మహిళల జట్లకు కాషాయ రంగు జెర్సీని ఎంపిక చేయడంతో ఈ వివాదం మొదలైంది. దేశంలో క్రీడారంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారా అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇలాగే కొనసాగితే భారత సైన్యం యూనిఫాం కూడా కాషాయ రంగులోకి మారుతుందని అంటున్నారు. మాజీ భారత కెప్టెన్ విరెన్ రస్క్విన్హా కూడా దీనిపై విమర్శలు చేశారు.
అమిత్ షా రాజీనామా చేయాలి- మల్లికార్జున ఖర్గే
స్టూడెంట్స్ ప్రొటెస్ట్ పై పోలీసులు చేసిన దాడి, లాఠీఛార్జ్, పెల్లెట్ గన్స్ వాడకంపై కాంగ్రెస్ అధ్యక్షుడు <a href="https://x.com/kharge/status/2082783471077097680?s=20">మల్లికార్జున ఖర్గే</a> రాజ్యసభలో ఫైర్ అయ్యారు. 100 మందికి పైగా స్టూడెంట్స్ గాయపడి హాస్పిటల్లో చేరారని, బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారి వివరాలు చెప్పి, దాడికి ఆర్డర్స్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు.

ఈజిప్ట్‌లో పేలుళ్లు!
అమెరికా మరోసారి ఇరాన్‌లోని కొన్ని చోట్ల దాడులు చేసినట్లు తెలిపింది. అదే సమయంలో ఈజిప్ట్‌లోని డామియెట్టా పోర్ట్ దగ్గర డ్రోన్ దాడి జరగడంతో పరిస్థితి మరింత సీరియస్ అయింది. ఈ దాడిలో రెండు గ్యాస్ నౌకలకు మంటలు అంటుకున్నాయని అధికారులు చెప్పారు. అయితే ఈ దాడి చేసింది ఎవరో ఇప్పటికీ తెలియలేదు. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న గ్రూపులు చేసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

హర్షిత్ రెడ్డి ‘దీవానా’ ఓటీటీ లాక్..
హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ మూవీ ‘దీవానా’ థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ లవ్ స్టోరీని సాధారణ ప్రేక్షకులకు ఇప్పుడు ఆహా (Aha)ఓటీటీలో జూలై 31 నుంచి రానుంది.ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి సినిమాను నిర్మించారు. నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు ప్రధాన పాత్రలు పోషించారు.

భారత జావలిన్ థ్రోయర్లు ముగ్గురు ఫైనల్‌కు క్వాలిఫై
గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెన్ జావలిన్ థ్రో క్వాలిఫైంగ్ రౌండ్‌లో భారతీయులు అద్భుత ప్రదర్శన చేశారు. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా 79.61 మీటర్లతో 5వ స్థానం సాధించగా, రోహిత్ యాదవ్ 78.37 మీటర్లు తో 9వ స్థానం, యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్లు 10వ స్థానంతో ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. శ్రీలంక రుమేష్ తరంగ పతిరాజ్ 82.84 మీటర్లతో టాప్‌లో ఉన్నాడు. ఫైనల్ జూలై 31న రాత్రి 10:15 ISTకి జరగనుంది.

జగన్‌కు జైలు అధికారులు అనుమతి క్యాన్సిల్
AP: YSRCP అధినేత వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిలయ్యింది. జగన్ సమయానికి జైలు వద్దకు చేరుకోకపోవడంతో అనుమతి ఇవ్వలేమని శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే ములాఖత్‌కు అనుమతి ఉంటుందని ఆయనకు స్పష్టం చేశారు. దింతో స్టేషన్ బయట అప్పలరాజు ఫామిలీతో మాట్లాడారు.

‘నీట్’ పేపర్ లీక్ ఉద్యమంపై బాలీవుడ్ మూవీ!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేసిన ఉద్యమంపై బాలీవుడ్‌లో ఒక చిత్రం తెరకెక్కనుంది.ఈ సినిమాకి ‘ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ’ (The Accidental Cockroach Party)అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. జైపూర్‌కు చెందిన గోవింద్ దేవ్ రీసెర్చ్, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027లో థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

జంతర్‌మంతర్ నిరసనల్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు: రామ్‌దేవ్
దేశం వీధుల్లో కాదు, పార్లమెంట్ ద్వారానే నడుస్తుందని యోగా గురు రామ్‌దేవ్ అన్నారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న కొందరు భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీశారని రామ్‌దేవ్ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ఎవరు అనేది ప్రధాని, పార్లమెంటే నిర్ణయిస్తుందన్నారు. బ్రాహ్మణవాదం, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతి అని, తల్లిదండ్రులు, గురువులు చూపిన మార్గంలో నడవాలని ఆయన సూచించారు.

భర్తను చంపి ఆస్ట్రేలియా డ్రామా ఆడిన భార్య
గుజరాత్‌కు చెందిన 'జిగ్నేశ్' రెండేళ్లుగా కనిపించడం లేదు. అతనికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చిందని భార్య పృథ్వీ అందరినీ నమ్మించింది. కానీ నిజానికి ఆమె పెళ్లికి ముందే నిలేష్ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. భర్త అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ కలిసి జిగ్నేశ్ మద్యంలో సైనైడ్ కలిపి చంపేశారు. శవాన్ని ముక్కలుగా నరికి ఓ ఫ్యాక్టరీలో పాతేశారు. ఓ బంధువు ఆస్ట్రేలియా వెళ్తూ జిగ్నేశ్ ఫోన్ నెంబర్ అడగడంతో అనుమానం వచ్చింది. జిగ్నేశ్ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గట్టిగా అడిగేసరికి భార్య నేరాన్ని ఒప్పుకుంది.

ఆరుగురు MPలు.. ఒకే ఫ్రేమ్!
తెలంగాణ BJP MP <a href="https://x.com/Arvindharmapuri/status/2082716347793084439?s=20">ధర్మపురి అర్వింద్</a> పార్లమెంట్ బిల్డింగ్ బయట మిగతా ఐదుగురు MPలతో కలసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "పవర్ ఆఫ్ టుగెదర్‌నెస్" అంటూ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ ఫోటో లో ఉన్న ఆరుగురు MPలూ వేరే పార్టీల నుంచి BJPలోకి వచ్చినవారే అనే కామెంట్స్ కనిపిస్తున్నాయి!

'పని చేశాం' అన్నా సరిపోదట.. లెక్క కూడా చూపించాలట!
"టైమ్‌కి పని చేశారా లేదా అన్నదే రూ.2 కోట్ల ఫైన్‌కు కారణమా?" ఇదే ఇప్పుడు Infosys companyపై చర్చ. ఫ్రాన్స్‌లో ఉద్యోగుల పని గంటలను రికార్డ్ చేసే సిస్టమ్ అక్కడి లేబర్ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా లేదని అధికారులు గుర్తించారు. దీంతో కంపెనీకి సుమారు ₹2 కోట్ల జరిమానా విధించారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఉద్యోగులతో ఎక్కువ గంటలు పని చేయించారని కాదు, అసలు ఇష్యూ టైమ్ రికార్డింగ్ సిస్టమ్ గురించే. ఈ నిర్ణయంపై ఏం చేయాలన్నది చూస్తున్నామని Infosys తెలిపింది.

పరుగు పందెంలో భారత్‌కు రెండు పతకాలు
మెన్ 100 మీటర్ల పరుగు పందెంలో మన ఇండియన్ పారా అథ్లెట్స్ దిలీప్ మహాదు గవిత్, మహమ్మద్ బాసిల్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలిచారు. గవిత్ 10.71 సెకన్లలో రేసు పూర్తి చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, బాసిల్ 10.83 సెకన్లతో సెకండ్ ప్లేస్ లో వచ్చాడు. ఈ గోల్డ్‌తో భారత్‌కు మూడు బంగారు పతకాలు వచ్చాయి. అంతకుముందు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో, షర్మిలా ధనకర్ షాట్‌పుట్‌లో గోల్డ్ మెడల్స్ గెలిచారు.

రేపు సాయంత్రం రావిశాస్త్రి కథా పురస్కారాల అందజేత
TG: ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి 104 వ జయంతి సందర్భంగా జులై 31న రావిశాస్త్రి కథాపురస్కారాలు అందించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నగరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఉదయిని’ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె’ పుస్తకానికి నరేష్కుమార్ సూఫీ, ‘గోడవతల’ పుస్తకానికి స్వర్ణకిలారి, ‘బొంబాయి పొట్టేలు’ పుస్తకానికి చరణ్ పరిమి, ‘ఒంటరితనపు కథలు’ పుస్తకానికి మహమ్మద్ గౌస్ ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

పీఎం మోడీ రిజైన్.. ఇది నిజమేనా!
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫేక్ రిజిగ్నేషన్ లెటర్‌ను ప్రభుత్వం గుర్తించి హెచ్చరించింది. 'ఈ లెటర్ ఫేక్ అని, ప్రధానమంత్రి అటువంటి లేఖను జారీ చేయలేదని, దానిపై ఆయన సంతకం చేయలేదని' స్పష్టం చేసింది. 'ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు అఫీషియల్ సోర్సులు ద్వారా సరిచూసుకోండి' అని PIB ఫ్యాక్ట్‌చెక్ 'X' లో పోస్ట్ చేసింది.

ఆరని బట్టలు వేసుకుంటున్నారా?
వర్షాకాలంలో తడి బట్టలు సరిగ్గా ఆరకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల స్కిన్ అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ 40% ఉంటుంది. ఈ సీజన్ లో జీన్స్, కాటన్ కాకుండా త్వరగా ఆరే పాలిస్టర్, నైలాన్ వాడటం బెటర్. బ్యాడ్ స్మెల్ పోవడానికి ఉతికే ముందు బేకింగ్ సోడా లేదా వెనిగర్ యూజ్ చేయాలి. బట్టలు ఆరిపోయాక ఐరన్ చేశాకే వేసుకోవడం, బీరువాలో కర్పూరం ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు.

100 కోట్ల క్లబ్‌లో అఖిల్ ‘లెనిన్’..
హీరో అక్కినేని అఖిల్ తన కెరీర్‌లో సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ఆయన నటించిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ సాధించి, అఖిల్ కెరీర్‌లోనే తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్-అన్నపూర్ణ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లింది.

సాయికృష్ణ కేసులో CI నాగరాజు విచారణ
AP: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో తన కొడుకు కోసం వేసిన పిటిషన్‌ను తన అనుమతి లేకుండానే వెనక్కి తీసుకునేందుకు తన లాయర్ ప్రయత్నించారని చెప్పడం సెన్సేషన్ అయ్యింది. ఆ లాయర్‌ను తీసేసి ఈ కేసును CBIకి అప్పగించాలని మరో లాయర్‌తో పిటిషన్ వేశారు. మరోవైపు జైలులో ఉన్న CI నాగరాజును SIT అధికారులు వారం పాటు విచారించనున్నారు. కోర్టు ఆదేశాలతో రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీసీ కెమెరాల మధ్య విచారణ జరపనున్నారు.