భర్తను చంపి ఆస్ట్రేలియా డ్రామా ఆడిన భార్య

గుజరాత్‌కు చెందిన 'జిగ్నేశ్' రెండేళ్లుగా కనిపించడం లేదు. అతనికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చిందని భార్య పృథ్వీ అందరినీ నమ్మించింది. కానీ నిజానికి ఆమె పెళ్లికి ముందే నిలేష్ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. భర్త అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ కలిసి జిగ్నేశ్ మద్యంలో సైనైడ్ కలిపి చంపేశారు. శవాన్ని ముక్కలుగా నరికి ఓ ఫ్యాక్టరీలో పాతేశారు. ఓ బంధువు ఆస్ట్రేలియా వెళ్తూ జిగ్నేశ్ ఫోన్ నెంబర్ అడగడంతో అనుమానం వచ్చింది. జిగ్నేశ్ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గట్టిగా అడిగేసరికి భార్య నేరాన్ని ఒప్పుకుంది.



