Latest

మొదటి విజయమిదే.. ఉద్యమం విరమిస్తున్నాం: CJP
India· 26 Jul 2026

మొదటి విజయమిదే.. ఉద్యమం విరమిస్తున్నాం: CJP

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కొనసాగిన ఆందోళనను CJP విరమిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తొలి విజయం సాధించామని తెలిపింది. విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్రం అంగీకరించిందని, నీట్ పేపర్ లీక్ బాధిత కుటుంబాలకు పరిహారం అంశంపైన సానుకూల స్పందన లభించిందన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేసులు ఎత్తివేస్తామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

క్షణాల్లో అగ్నికి ఆహుతైన దుకాణాలు
TG· 26 Jul 2026

క్షణాల్లో అగ్నికి ఆహుతైన దుకాణాలు

TG: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని పుణ్యక్షేత్రం చెర్వుగట్టు గుట్టకింద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగడంతో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఉద్ధృతమయ్యాయి. గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించి కీలక దస్త్రాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.2.5 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక AI సేవలు
Health· 26 Jul 2026

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక AI సేవలు

AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కృత్రిమ మేధ (AI) డాక్టర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో సంజీవని పథకాన్ని ప్రారంభించిన ఆయన, ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఏఐ ఆధారిత వైద్యం, టెలిమెడిసిన్, రిమోట్ కేర్, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, అభా హెల్త్ ఐడీలతో వైద్యసేవలను మరింత ఆధునికీకరిస్తామని చెప్పారు. ఆధార్‌తో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా రోగి ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

21ఏళ్లు నిండితే ఎన్నికల్లో పోటీ.. CM సంచలన ప్రకటన
TG· 26 Jul 2026

21ఏళ్లు నిండితే ఎన్నికల్లో పోటీ.. CM సంచలన ప్రకటన

TG: 21 ఏళ్లు నిండిన యువతకు MLA, MPగా పోటీ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యాంగ సవరణ కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా శనివారం రాత్రి HYDలో నిర్వహించిన సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు తొలి వారంలో అసెంబ్లీలో చర్చించి తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. 30 శాతం యువ జనాభాకు అవకాశం దక్కితే దేశ భవిష్యత్ మరింత బలోపేతమవుతుందని, కీలక శాఖల్లో యువత మంత్రులైతే ప్రపంచంతో పోటీ పడగలమన్నారు.

చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు !
AP· 25 Jul 2026

చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు !

చిత్తూరు జిల్లా గుడిపల్లి మండల పరిధిలోని చిగురు గుంట, బి. సానత్తం ప్రాంతాల్లోని మైనింగ్ బ్లాక్ లలో సుమారు 22 లక్షల టన్నుల బంగరం ముడి ఖనిజం ఉన్నట్లు ప్రాధమిక సర్వేల్లో తేలింది. ఇక్కడి ముడిఖనిజాన్ని శుద్ధి చేస్తే సగటున 5.64 గ్రాముల మేలిమి బంగారం దొరికే వీలుంది.ఇది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారడేమ కాక, స్థానికులకు ఉపాధి కూడా కల్పిస్తుందని అధికారులు అంటున్నారు.దీనిని ఏపీ ఎండీసీకే దక్కేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.

అవుట్ లుక్ జర్నలిస్టుపై పెల్లెట్ల వర్షం
News· 25 Jul 2026

అవుట్ లుక్ జర్నలిస్టుపై పెల్లెట్ల వర్షం

జంతర్ మంతర్ ప్రొటెస్టులను కవర్ చేయడానికి వెళ్లిన అవుట్ లుక్ జర్నలిస్టు(28) ఒకరు పెల్లెట్ గన్స్ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఒంట్లో కనీసం 25 నుంచి 30 పెల్లెట్లు దిగబడ్డాయి. డాక్టర్లు వాటిని సర్జరీ చేసి మాత్రమే తీయగలమని, కానీ బయటకు తీస్తే ఇంకా డేంజర్ అనీ అంటున్నారు. ప్రస్తుతానికి వాటిని అతని బాడీలో అలా ఉండనివ్వడమే బెటర్ అని తేల్చారు.పెల్లెట్ గన్స్ వాడే పర్మిషన్ ఎవరిచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

స్పెయిన్, ఫ్రాన్స్ లలో  కార్చిచ్చు భీభత్సం !
World· 25 Jul 2026

స్పెయిన్, ఫ్రాన్స్ లలో కార్చిచ్చు భీభత్సం !

ఫ్రాన్స్, స్పెయిన్‌లలో దావానలం బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేగంగా వీచే గాలుల వల్ల అడవుల్లో మంటలు అదుపు తప్పి వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రమాదం పొంచి ఉండటంతో ఇప్పటివరకు 2,70,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నప్పటికీ, అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా, ఆందోళనకరంగా మారింది.

మేం రాజకీయాలకు దూరం- సీజేపీ
News· 25 Jul 2026

మేం రాజకీయాలకు దూరం- సీజేపీ

భవిష్యత్తులో తమ పార్టీ పొలిటికల్ పార్టీగా మారబోదని,తాము రాజకీయాల్లోకి రాం అని సీజేపి నేతలు క్లారిటీ ఇచ్చారు. విద్యార్ధుల హక్కులు, పరీక్షల నిర్వహణలో ట్రాన్స్ పరెన్సీ, విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవడం వరకే తమ పాత్ర అని స్పష్టం చేశారు. తమ ఉద్యమానికి ఎన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికినా, తమ ఉద్యమాలెప్పుడూ స్వతంత్రంగానే సాగుతాయని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

కాలం చెల్లినవి వాడకం నైతిక నియమాలకు విరుద్ధం !
News· 25 Jul 2026

కాలం చెల్లినవి వాడకం నైతిక నియమాలకు విరుద్ధం !

ప్రజాస్వామ్యంలో నిరసనకారులపై గడువు ముగిసిన టియర్ గ్యాస్ ప్రయోగించడం తీవ్ర నైతిక ఉల్లంఘన అని 'ది వైర్' పత్రిక కథనం పేర్కొంది. కాలం చెల్లిన రసాయనాలు విషపూరితంగా మారి శ్వాసకోశ, కంటి సమస్యలను కలిగిస్తాయి. ప్రజల హక్కులు పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ ఇలాంటి ప్రమాదకర చర్యలకు దిగడం ప్రజాస్వామ్య సూత్రాలకే పెద్ద ముప్పు.

ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లు !
News· 25 Jul 2026

ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లు !

జంతర్ మంతర్ నిరసనల కారణంగా మూసేసిన ఢిల్లీ మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, మెట్రో స్టేషన్లు తిరిగి ఓపెన్ అయ్యాయి. భద్రతా కారణాలతో నిర్వాహకులు వాటిని ముసేశారు. అయితే న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ ను మాత్రం మళ్లీ ఆదేశాలు వచ్చే వరకూ మూసే ఉంచుతారు. సేఫ్టీ రీజన్స్ వల్ల ఆంక్షలు అమల్లో ఉన్నాయని డీఎం రైల్వే తెలిపింది.

రాజీనామాలు కాదు , సంస్కరణలు కావాలి-వాంగ్చుక్
News· 25 Jul 2026

రాజీనామాలు కాదు , సంస్కరణలు కావాలి-వాంగ్చుక్

కేవలం రాజీనామాలతోనే దేశ నిర్మాణం జరగదని, విద్యా రంగంలో బలమైన సంస్కరణలు అత్యవసరమని సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ అన్నారు. 26 రోజుల నిరాహార దీక్ష విరమించిన ఆయన, ప్రజాస్వామ్య పోరాటంలో గెలిచిన యువతకు అభినందనలు తెలిపారు. భయం, అన్యాయం లేకుండా ప్రేమ, నిజాయితీలతో కూడిన పాలన సాగాలని ఆకాంక్షించారు.

కాలం చెల్లిన టియర్ గ్యాస్ షెల్స్ వాడారు !
News· 25 Jul 2026

కాలం చెల్లిన టియర్ గ్యాస్ షెల్స్ వాడారు !

చలో సంసద్ నిరసనల్లో పాల్గొన్న స్టూడెంట్స్ పై పోలీసులు కాలం చెల్లిన టియర్ గ్యాస్ షెల్స్ వాడారనే వార్తలు కలవరపెడుతున్నాయి. శివం పరాసర్ అనే ఇన్ స్టా అక్కౌంట్ హోల్డర్ ఒక వీడియో షేర్ చేస్తూ అక్కడున్న టియర్ గ్యాస్ షెల్ ను చూపించాడు. దానిపై ఆ టియర్ గ్యాస్ షెల్ 2022లో తయారయినదిగానూ, ఎక్స్ పైరీ డేట్ 2025తో ముగిసినట్లుగానూ ఉంది. వాడేసిన టియర్ గ్యాస్ షెల్స్ విడుదల చేసే టాక్సిన్స్ చాలా ప్రమాదకరమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కొత్త విద్యా మంత్రిగా ప్రహ్లాద్ జోషీ  !
News· 25 Jul 2026

కొత్త విద్యా మంత్రిగా ప్రహ్లాద్ జోషీ !

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, కేంద్ర ప్రభుత్వం ప్రహ్లాద్ జోషిని కొత్త విద్యాశాఖ మంత్రిగా నియమించింది. నీట్ పరీక్షల వివాదం, వరుస నిరసనల నేపథ్యంలోనే ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. కీలక సమయంలో విద్యా రంగంలో సంస్కరణలు తేవడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రహ్లాద్ జోషికి ఈ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు.

ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి అమిత్ షా!
Politics· 25 Jul 2026

ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి అమిత్ షా!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని పరిస్థితులు, క్యాబినెట్‌లో మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అమిత్ షా.. ప్రధాన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దేశ విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆయన సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి ప్రశంసించారు.

గతంలో రాజీనామా చేసిన మంత్రులు వీరే!
Politics· 25 Jul 2026

గతంలో రాజీనామా చేసిన మంత్రులు వీరే!

నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో స్టూడెంట్స్ ఆందోళనల దృష్ట్యా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, దేశంలో ప్రమాదాలు, కుంభకోణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి, మమతా బెనర్జీ, సురేష్ ప్రభు, నితీష్ కుమార్ (రైల్వే), శివరాజ్ పాటిల్ (హోమ్), టీటీ కృష్ణమాచారి (ఆర్థిక), వీకే కృష్ణమేనన్ (రక్షణ) వంటి నేతలు కూడా పదవుల నుంచి వైదొలిగారు.

CJPకి విదేశీ నిధులు? విదేశాంగ శాఖ బిగ్ క్లారిటీ!
Politics· 25 Jul 2026

CJPకి విదేశీ నిధులు? విదేశాంగ శాఖ బిగ్ క్లారిటీ!

కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి విదేశాల నుంచి ఫండింగ్ అందుతోందనే ప్రచారంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలకు విదేశీ నిధులు మళ్లుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీంతో CJPపై వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లయింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేఏ పాల్ రియాక్షన్!
Politics· 25 Jul 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేఏ పాల్ రియాక్షన్!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ K.A పాల్ దేశ యువతకు అభినందనలు తెలిపారు. యువత అంతా ఒక్కటైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారని ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాను ఆమోదించి, విద్యార్థుల డిమాండ్లను విన్నందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, మంచి భవిష్యత్తు కోసం వేచి చూడాలని పిలుపునిచ్చారు.

Gen Zకి సోనాక్షి సిన్హా బిగ్ సెల్యూట్!
Politics· 25 Jul 2026

Gen Zకి సోనాక్షి సిన్హా బిగ్ సెల్యూట్!

స్టూడెంట్స్ నిరసనలపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రశంసల వర్షం కురిపించారు. Gen Z పవర్ ఏంటో స్టూడెంట్స్ నిరూపించారని, మొదట్లో వారిని కాస్త తేలికగా తీసుకున్నందుకు క్షమాపణలు చెబుతున్నానని సరదాగా కామెంట్ చేశారు. వీరికి బిగ్ సెల్యూట్ కొడుతూ, తాను కూడా Gen Z లా మారాలనుకుంటున్నట్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.

ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు పిల్లలకు గాయాలు
News· 25 Jul 2026

ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు పిల్లలకు గాయాలు

రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా నయా తలాబ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. భారీ కరెంట్ స్తంభాలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వాళ్లను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులపై చర్యలు తీసుకోవాలి: మాయావతి
Politics· 25 Jul 2026

పోలీసులపై చర్యలు తీసుకోవాలి: మాయావతి

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై BSP అధినేత మాయావతి స్పందించారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్, యూత్ చేసిన ఉద్యమం వల్ల వచ్చిన ఈ నిర్ణయం సరైనదేనని, ఇది ఇంకా ముందే జరిగి ఉండాల్సిందన్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్‌పై బలప్రయోగం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా నిరసనకారులతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో పరిశుభ్రత లోపాలు
TG· 25 Jul 2026

సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో పరిశుభ్రత లోపాలు

TG: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ సికింద్రాబాద్‌లోని గార్డెన్ రెస్టారెంట్‌ను చెక్ చేశారు. ఆ రెస్టారెంట్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత లోపాలను గుర్తించింది. అపరిశుభ్రమైన వంటశాల, ఈగల బెడద, నిబంధనలకు విరుద్ధంగా ఆహార నిల్వ, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 ప్రకారం చర్యలు చేపట్టినట్లు ఫుడ్ సేఫ్టీ శాఖ తెలిపింది.