Latest

ధర్మేంద్ర ప్రధాన్ ను కడిగి పారేసిన రేణుక !
News· 21 Jul 2026

ధర్మేంద్ర ప్రధాన్ ను కడిగి పారేసిన రేణుక !

నీట్ పేపర్ లీక్ విషయంలో అక్రమార్కుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ ఆవరణలో ఉండగా.. అక్కడికి రేణుకా చౌదరి వచ్చారు... పక్కనే నిలబడి మోదీ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు..! నిన్నటి కాక్రోచ్ ఆందోళన.. నేటి రైతుల ఆందోళనను ఉద్దేశించి తీవ్రంగా విరుచుకు పడ్డారు... యూజ్ లెస్ ఫెలోస్ అంటూ విమర్శలు చేశారు... రేణుక అలా గట్టిగా వాయిస్ పెంచి ఎటాక్ చేస్తుండడంతో బిత్తరపోయిన ప్రధాన్ అటూ ఇటూ చూస్తూ మెల్లిగా అక్కడినుండి జారుకునే ప్రయత్నం చేశారు.. అయినప్పటికీ ఆమె వదలకుండా అతనితో పాటు మెట్లు దిగుతూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

రాజస్థాన్ లో దళిత పూజారిపై పదే పదే దాడులు !
News· 21 Jul 2026

రాజస్థాన్ లో దళిత పూజారిపై పదే పదే దాడులు !

రాజస్థాన్‌లో ఒక దళిత పూజారిపై ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. తమను హిందువులుగా గుర్తించడం లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ వేధింపులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్‌ను సైతం ఆశ్రయించినా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా జరిగిన ఈ ఘటన సమాజంలో కుల వివక్ష, దళితులపై జరుగుతున్న వరుస దాడులు , శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

గ్లోబల్ మీడియా దృష్టికి CJP నిరసనలు- మోడీ సర్కార్ కి సవాల్ !
News· 21 Jul 2026

గ్లోబల్ మీడియా దృష్టికి CJP నిరసనలు- మోడీ సర్కార్ కి సవాల్ !

ఢిల్లీలో విద్యార్థులు, యూత్ చేపట్టిన క్రాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు మోదీ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా పెద్ద సవాల్‌గా మారాయి. NEET పేపర్ లీకేజీలు, అవినీతి, నిరుద్యోగంపై జూలై 2026లో మొదలైన ఈ ఉద్యమం జంతర్ మంతర్ నిరాహార దీక్షతో పీక్ స్టేజికి చేరింది.. ఇటీవల జరిగిన 'ఛలో సంసద్' మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. సోషల్ మీడియా మీమ్స్‌తో మొదలై వేలాది మందిని రోడ్లపైకి తెచ్చిన ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని, ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్న తీరును, గ్లోబల్ మీడియా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. ఈ వార్తని హైలైట్ చేస్తోంది.

ప్రధాని ఇంటి ముట్టడి- రాహుల్, ప్రియాంక అరెస్ట్ !
News· 21 Jul 2026

ప్రధాని ఇంటి ముట్టడి- రాహుల్, ప్రియాంక అరెస్ట్ !

ప్రధాని మోదీ ఇంటి దగ్గర ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ , అక్రమాల వ్యవహారంపై పార్లమెంట్ లోపల, బయట ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకొబోతే రాహుల్ రోడ్డుపై అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. రాహుల్ హై ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఉన్నా పోలీసులు బలప్రయోగం చేసి బలవంతంగా వ్యాన్లలో తరలించారు. ఈ అరెస్టులతో రాజధాని పరిసరాల్లో తీవ్ర టెన్షన్ ఏర్పడింది. ప్రతిపక్షాల ఆందోళనలు మరింత ముదిరాయి.

విద్యార్థి ఉద్యమాలతో దేశ రాజకీయాల్లో హీట్! 1974 వైబ్స్ మళ్లీనా?
Politics· 21 Jul 2026

విద్యార్థి ఉద్యమాలతో దేశ రాజకీయాల్లో హీట్! 1974 వైబ్స్ మళ్లీనా?

దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, నిరసనలు ఊపందుకోవడంతో 1974లో జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) నేతృత్వంలోని ఉద్యమం( సంపూర్ణ క్రాంతి ఉద్యమం) గుర్తుకొస్తోందన్న చర్చ పెరుగుతోంది. అప్పట్లో విద్యార్థుల పోరాటానికి జేపీ మద్దతు ఇవ్వగా, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత ఇందిరా గాంధీ ప్రభుత్వం 1977 ఎన్నికల్లో ఓడింది. ఇప్పటి ఉద్యమాలు కూడా అలాంటి రాజకీయ మలుపు తిప్పుతాయా? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఒకే కాన్పులో న‌లుగురు ఆడ‌పిల్ల‌ల‌ జ‌ననం
World· 21 Jul 2026

ఒకే కాన్పులో న‌లుగురు ఆడ‌పిల్ల‌ల‌ జ‌ననం

ఆస్ట్రేలియాకు చెందిన నామోనా అనే 34 ఏళ్ల మహిళ ఇటీవల నలుగురు ఆడపిల్లలకు ఒకే కాన్పులో జన్మనిచ్చారు. 1.5 కోట్ల కేసుల్లో ఒకరికి మాత్రమే సాధ్యమయ్యే అరుదైన ఈ ప్రసవంలో పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే ముగ్గురు పిల్లలున్న ఆ జంటకు ఇప్పుడు నలుగురు బేబీస్ తోడవ్వడంతో వాళ్ళ కుటుంబసభ్యుల సంఖ్య 9కి పెరిగింది. అయితే పిల్లల సంరక్షణకు అయ్యే ఖర్చులు తలుచుకుంటూ తల్లి ఆందోళన పడుతోంది.

కొలకత్తా ఎయిర్‌పోర్ట్ మసీదులో నమాజ్ బ్యాన్
News· 21 Jul 2026

కొలకత్తా ఎయిర్‌పోర్ట్ మసీదులో నమాజ్ బ్యాన్

కొలకత్తా ఎయిర్‌పోర్ట్‌లోని 136 సంవత్సరాల పురాతన మసీదులో ప్రవేశాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. సెక్యూరిటీ రీసన్స్, రన్‌వే విస్తరణ అవసరాలను కారణాలుగా చెప్పి ఈ నిర్ణయం తీసుకుంది. మసీదు రన్‌వేకు 165 మీటర్ల దూరంలో ఉండటం విమానాల రక్షణ సమస్యగా మారిందని తెలిపింది. మసీదును ఎయిర్‌పోర్ట్ బయటకు మార్చాలని, అక్కడ కొత్త మసీదు నిర్మించాలని చెప్పింది.

తెలంగాణ లోక్ భవన్ దగ్గర స్టూడెంట్స్ నిరసనలు
News· 21 Jul 2026

తెలంగాణ లోక్ భవన్ దగ్గర స్టూడెంట్స్ నిరసనలు

TG: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు తెలంగాణ లోక్‌భవన్ దగ్గర నిరసనలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాబివ్వాలని ఆగ్రహించారు. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

విజేత దహియాను పార్టీ నుంచి తీసేసిన CJP!
Politics· 21 Jul 2026

విజేత దహియాను పార్టీ నుంచి తీసేసిన CJP!

కాక్రోచ్ జనతా పార్టీ తమ Spokesperson విజేత దహియాను పదవి నుంచి తొలగించింది. శాంతియుత నిరసనకారులపై, తమ టీమ్‌పై తీవ్రమైన పోలీస్ దాడి జరుగుతున్న సమయంలో ఆయన ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన పార్టీ.. ఆయన ప్రవర్తన తమ మూవ్‌మెంట్ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకే విజేత దహియాను స్పోక్స్ పర్సన్ పదవితో పాటు అన్ని అధికారిక బాధ్యతల నుంచి తక్షణమే తప్పిస్తున్నట్లు ఎక్స్ (X) ద్వారా ప్రకటన విడుదల చేసింది.

రేవంత్ రెడ్డిని కలిసిన కిదాంబి శ్రీకాంత్
Sports· 21 Jul 2026

రేవంత్ రెడ్డిని కలిసిన కిదాంబి శ్రీకాంత్

TG: ఇటీవల అమెరికా కాలిఫోర్నియాలో ముగిసిన 'BWF ఓపెన్ సూపర్-300 యూఎస్' బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో శ్రీకాంత్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోటీలో ప్రతిభ చూపిన శ్రీకాంత్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు

తెలంగాణ ఉద్యమకారుల కమిటీపై కల్వకుంట్ల కవిత విమర్శలు
Politics· 21 Jul 2026

తెలంగాణ ఉద్యమకారుల కమిటీపై కల్వకుంట్ల కవిత విమర్శలు

TG : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీని ఆలస్యంగా ఏర్పాటు చేయడంపై కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత కమిటీని తీసుకురావడం విచారకరమని అన్నారు. ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి భిక్షాటనలు, ఆందోళనలు చేసిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు. ‘కేకే కమిటీ’ అంటేనే కాలయాపన చేసే కమిటీ అనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, ఆ భావన తప్పని ప్రభుత్వం తన చర్యల ద్వారా నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

ఎల్‌నినో గురించి ఆందోళన వద్దు: పొంగులేటి
News· 21 Jul 2026

ఎల్‌నినో గురించి ఆందోళన వద్దు: పొంగులేటి

TG: ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ కలెక్టరేట్‌ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైయింది. తాగునీరు, వ్యవసాయం, భూగర్భ జలాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా దేవసేన(ఐఏఎస్)ను నియమించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఎల్‌నినో గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు.

బైక్ మెకానిక్‌పై రూ.66 వేల ఫైన్
News· 21 Jul 2026

బైక్ మెకానిక్‌పై రూ.66 వేల ఫైన్

కేరళం రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన రెంజిత్ తన బైక్‌ను అనిల్‌కుమార్ మెకానిక్ షాప్‌లో రిపేర్ కోసం ఇచ్చాడు. అడ్వాన్స్ తీసుకున్న అతను లేటుగా రిపేర్ చేశాడు. బిల్లు ఇవ్వకుండానే బైక్ అప్పగించాడు. మూడు నెలల్లోనే ఇంజిన్ పాడైంది. పిస్టన్ తప్పుగా అమర్చడం వల్లే ఈ సమస్య వచ్చిందని గుర్తించిన రెంజిత్ కొల్లం కన్సూమర్ కమిషన్‌ను ఆశ్రయించాడు. బైక్ రిపేర్ సరిగ్గా చేయని మెకానిక్‌కు కమిషన్ రూ.66,752 జరిమానా విధించింది.

పులి-ఎలుగుబంట్ల ఫైటింగ్ వీడియో VIRAL
Viral· 21 Jul 2026

పులి-ఎలుగుబంట్ల ఫైటింగ్ వీడియో VIRAL

ఒక పులి, రెండు ఎలుగుబంట్ల మధ్య జరిగిన భీకర పోరాటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఒంటరిగా ఉన్న ఎలుగుబంటిపై పులి తీవ్రంగా దాడి చేసింది. అంతలోనే మరో ఎలుగుబంటి అక్కడికి చేరుకుని పులిపై విరుచుకుపడింది. రెండు ఎలుగుబంట్లు కలిసి చుట్టుముట్టడంతో పులి రక్షించుకునేందుకు ఎంత ప్రయత్నించినా చివరికి నేలపై పడిపోయింది. ఆ తర్వాత రెండు ఎలుగుబంట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అయితే ఇది AIతో క్రియేట్ చేసింది కావచ్చని కొందరు అంటున్నారు

ఢిల్లీ నిరసనలో ఖాకీ అరాచకం!
Politics· 21 Jul 2026

ఢిల్లీ నిరసనలో ఖాకీ అరాచకం!

ఢిల్లీలో నిన్న జరిగిన నిరసన ప్రదర్శనలో ఒక దారుణమైన వీడియో బయటకు వచ్చింది. ఆందోళన తెలుపుతున్న ఒక మహిళా ప్రొటెస్టర్ పై DCP సందీప్ లాంబా చేయి చేసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఉన్నత పోలీసు అధికారి మహిళ పట్ల ఇలా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో అందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఆ అధికారిని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ప్రజలు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

KSOUలో అడ్మిషన్లు ప్రారంభం
Education· 21 Jul 2026

KSOUలో అడ్మిషన్లు ప్రారంభం

కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి 65 యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. BA, BCom, BBA, BSc, MA, MSc, MCom, MBA, MSW, BEd వంటి కోర్సులతోపాటు 10 ఆన్‌ లైన్ కోర్సులకు కూడా అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏ.పీ. జ్ఞానప్రకాష్ తెలిపారు.

పవర్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగుల నిరసన
News· 21 Jul 2026

పవర్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

TG : యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నిరసన మొదలుపెట్టారు. కరీంనగర్‌లోని ఎస్‌ఈ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Infotainment· 21 Jul 2026

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

గ్లోబల్ మార్కెట్‌లో మార్పులు, డాలర్ రేటు, బులియన్ మార్కెట్ ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సిటీల్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రేటు రూ.1,42,848కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.1,42,386గా ఉంది. ఇంకోవైపు కిలో వెండి రేటు రూ.2,19,200 దగ్గర ఉంది. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటం, దేశాల మధ్య గొడవల వల్ల బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

తెలంగాణ టెట్ (TET) నోటిఫికేషన్ విడుదల
Education· 21 Jul 2026

తెలంగాణ టెట్ (TET) నోటిఫికేషన్ విడుదల

TG: తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్ అభ్యర్థుల కోసం విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూలై 22 నుంచి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటారు. కంప్యూటర్ బేస్ టెస్ట్(CBT) ఎగ్జామ్స్ సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రెండు పేపర్లుగా జరుగుతాయి. టీచర్ ఉద్యోగాలు సాధించాలనుకునేవారికి టెట్ స్కోరు ఎంతో అవసరం. అఫీషియల్ వెబ్‌సైట్‌ https://tgtet.aptonline.in/

మీ PFను ఇలా క్లెయిమ్ చేసుకోవచ్చు
Infotainment· 21 Jul 2026

మీ PFను ఇలా క్లెయిమ్ చేసుకోవచ్చు

దేశవ్యాప్తంగా ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లలో వేల కోట్ల రూపాయలు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి. ఇందులో రూ.9,330 కోట్లు ఇన్ ఆపరేటివ్‌గా పీఎఫ్ అకౌంట్లలోనే ఉందని తేలింది. ఆన్‌లైన్ ద్వారా ఇన్ ఆపరేటివ్ పీఎఫ్ ఖాతాలో డబ్బును పొందేందుకు ముందుగా మెంబర్ ఐడీ, పీఎఫ్ అకౌంట్ నంబర్ UAN వివరాలు అందించాలి. తరువాత EPFO పోర్టల్ లోకి వెళ్లి ఫామ్-19, ఫామ్-10Cను సమర్పించాలి. ఒకవేళ అకౌంట్ ఏడు సంవత్సరాలు ఇన్ ఆపరేటివ్‌గా ఉంటే మరిన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. UAN లాగిన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేసి, తరువాత క్లెయిమ్‌ను డిజిటల్‌గా సబ్మిట్ చేయాలి.

మానసిక ఒత్తిడికి చెక్: సెన్సరీ బేస్‌లైన్ రీసెట్
Infotainment· 21 Jul 2026

మానసిక ఒత్తిడికి చెక్: సెన్సరీ బేస్‌లైన్ రీసెట్

రోజంతా ఫోన్ స్క్రీన్ చూడటం, వర్క్ స్ట్రెస్ వల్ల వచ్చే మెంటల్ స్ట్రెస్‌ని తగ్గించడానికి 'సెన్సరీ బేస్‌లైన్ రీసెట్' హెల్ప్ అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అంటే కళ్లు, చెవులకు బయట ప్రపంచం నుంచి విశ్రాంతి , మైండ్‌ను ప్రశాంతంగా ఉంచడం. గట్టి శబ్దాలు, రోజంతా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడటం వల్ల వచ్చే స్ట్రెస్‌ను తగ్గించి, బ్రెయిన్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది. రోజుకి 15 నుండి 20 నిమిషాలు ఫోన్, టీవీ దూరంగా పెట్టాలి. తక్కువ లైటింగ్‌లో కళ్లు మూసుకుని సైలెంట్‌గా కూర్చోవడం, పచ్చటి గడ్డిపై నడవడం, లాంగ్ బ్రీత్ తీసుకోవడం చేస్తే మైండ్ రీసెట్ అవుతుంది.