Latest

సానుభూతి కోసమే ట్రైనీ IPS నాటకం
TG· 21 Jul 2026

సానుభూతి కోసమే ట్రైనీ IPS నాటకం

TG: మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడన్న ప్రచారంలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతడు విషం తాగలేదని వైద్య పరీక్షల్లో తేలింది. అధిక మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను సానుభూతి కోసం ఆత్మహత్యాయత్నంగా చూపించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు ఈ కేసుపై అంతర్గత కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్తాపూర్ పోలీసులు CCTV ఫుటేజ్ సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు.

అమెరికాలో పల్నాడు యువకుడు మృతి
AP· 21 Jul 2026

అమెరికాలో పల్నాడు యువకుడు మృతి

AP: పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవితేజ (34) ఉన్నత చదువుల కోసం 2019లో అమెరికా వెళ్లి, అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. ఒహియో రాష్ట్రం కీవ్‌లాండ్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేసి, గృహప్రవేశానికి తల్లిదండ్రులను కూడా అమెరికాకు ఆహ్వానించాడు. రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. సంతోషంగా ఉన్న సమయంలో రవితేజకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.

ఛలో పార్లమెంట్ ఆందోళనలో
AP· 21 Jul 2026

ఛలో పార్లమెంట్ ఆందోళనలో

విద్యార్థులు, యువతను పోలీసులు తీవ్రస్థాయిలో అణచివేతకు గురిచేసిన ఛలో పార్లమెంట్ ఫోటోలివి. చూడటానికి రైట్ నుంచి లెఫ్ట్ కు స్వైప్ చెయ్యిండి 👆

టీచర్ బదిలీపై తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన
TG· 21 Jul 2026

టీచర్ బదిలీపై తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన

AP: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆనందపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోపాలకృష్ణ బదిలీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆయనను బదిలీ చేస్తే తమ పిల్లలకు TCలు తీసుకుని వేరే పాఠశాలల్లో చేర్పిస్తామని హెచ్చరించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ప్రోత్సహించిన గోపాలకృష్ణ వల్లే తమ పిల్లలు మంచి విద్య పొందుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా బదిలీ చేయడం అన్యాయమని ఫైరయ్యారు. గ్రామస్తుల వినతిపై స్పందించిన MEO చిన్నారావు, గోపాలకృష్ణను తిరిగి ఆనందపురం పాఠశాలలో బోధించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సమ్మెతో భారీగా నిలిచిన క్రయవిక్రయాలు
AP· 21 Jul 2026

సమ్మెతో భారీగా నిలిచిన క్రయవిక్రయాలు

AP: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో ఆస్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. సాధారణంగా రోజుకు సుమారు 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగి ప్రభుత్వానికి రూ.50-60 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే సోమవారం కేవలం 500 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగి, ఆదాయం రూ.4 కోట్లకు కూడా చేరలేదు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగిస్తే ఆస్తుల డేటా దుర్వినియోగం, భూముల కబ్జాలు, మోసాలు పెరిగే ప్రమాదం ఉందని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు ప్రారంభం
TG· 21 Jul 2026

ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు ప్రారంభం

TG: కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (CURE)‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధివిధానాలు, అర్హతలు, మార్గదర్శకాలను సచివాలయంలో క్యూర్‌ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన ప్రకటించారు. తొలి విడతగా ఇప్పటికే స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. ఇళ్ల కోసం దరఖాస్తులను ఈ నెల 21 నుంచి ఆగస్టు 10 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం
Crime· 21 Jul 2026

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

TG: సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం బాచుపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నాలుగేళ్ల పసికందుతో సహా మొత్తం ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Crime· 21 Jul 2026

మత్తుమందు ఇచ్చి అత్యాచారం

AP: విజయవాడ సీతారాంపురానికి చెందిన ఓ యువతి(23) ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దేవినగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యాడు. తాను జిమ్ ట్రైనర్‌నని, లావు తగ్గించి సన్నబడేలా చేస్తానని నమ్మించాడు. సత్యనారాయణపురంలోని రాక్ ఫిట్‌నెస్ వరల్డ్ జిమ్‌కు రమ్మని చెప్పాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు కాజేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్
TG· 21 Jul 2026

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్

TG: హైడ్రా కమిషనర్ AV రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ భూమిలోకి వెళ్లరాదన్న కోర్టు ఆదేశాలను మూడుసార్లు ఉల్లంఘించినందుకు అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. అయితే ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో ఆ ఆదేశాలను విరమించుకుని, ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. మల్కాజ్‌గిరి మండలం లోతుకుంట భూమి వివాదంలో హైడ్రా జోక్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, కోర్టు ధిక్కరణను తీవ్రంగా పరిగణించింది. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, కోర్టు ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయింది.

ఆక్వా రంగాన్ని కాపాడాలి
AP· 21 Jul 2026

ఆక్వా రంగాన్ని కాపాడాలి

AP: పొగాకు, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై CM చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. రొయ్యల మేత కొరత నివారణకు జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రిని కోరారు. ఫిష్ మీల్ ఎగుమతిని నియంత్రించాలని, ఆక్వా రంగాన్ని కాపాడాలని కేంద్ర వాణిజ్య శాఖను విజ్ఞప్తి చేశారు. FCV పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహం, ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై GST తగ్గింపు కోరారు. అలాగే అమరావతిలో జాతీయ మత్య్స అభివృద్ధి బోర్డ్ (NFDB) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం నెక్కల్లులో 7.89 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు.

ఉక్రెయిన్ లో కార్గొ నౌకపై దాడి- నలుగురు ఇండియన్స్ మృతి
World· 20 Jul 2026

ఉక్రెయిన్ లో కార్గొ నౌకపై దాడి- నలుగురు ఇండియన్స్ మృతి

ఉక్రెయిన్ లోని ఓడెస్సా తీరం నుంచి బయల్దేరిన కమర్షియల్ నౌకపై దాడి జరిగి నలుగురు ఇండియన్స్ చనిపోగా, మరొకరి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. గినియా బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో మొత్తం 17 మంది ఉండగా దాడి జరిగినప్పుడు నలుగురు ఇండియన్స్ మృ తి చెందారు. ఈ ఘటనపై కేంద్రం విచారం ప్రకటించింది. మృతుల వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాద్యత ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఉందని మన విదేశాంగ శాఖ ఎత్తి పొడిచింది.

అడుగు పెడితే  మట్టు పెడతాం-ఇరాన్
World· 20 Jul 2026

అడుగు పెడితే మట్టు పెడతాం-ఇరాన్

అమెరికా సైన్యం తమ దేశంపై భూతల దాడి చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సైనికుల రాక కోసం తాము "కౌంట్‌డౌన్ లెక్కిస్తూ ఎదురుచూస్తున్నామని", వారు అడుగుపెడితే వారిని మట్టుబెడతామని ఇరాన్ విదేశాంగ శాఖ , పార్లమెంట్ స్పీకర్ ఘాటుగా ప్రతిస్పందించారు. వ్యూహాత్మక చమురు కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా;ప్లాన్ చేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది.

అస్సాంలో వరదల బీభత్సం... సహాయ చర్యలు ముమ్మరం
News· 20 Jul 2026

అస్సాంలో వరదల బీభత్సం... సహాయ చర్యలు ముమ్మరం

అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద పరిస్థితి తీవ్రంగా మారింది. దీని ప్రభావంతో సిమలుగురి ప్రాంతంలో రైల్వే ట్రాక్‌లు మునిగిపోవడంతో ఇండియన్ రైల్వే అక్కడ రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడమో, లేదా ఇతర మార్గాల్లోకి మళ్లించడమో చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. రైల్వే శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు అప్‌డేట్లు అందిస్తోంది.

ఏదైనా పోస్ట్ చేసేటపుడు బీ కేర్ ఫుల్ !
General· 20 Jul 2026

ఏదైనా పోస్ట్ చేసేటపుడు బీ కేర్ ఫుల్ !

ఇంటర్నెట్‌లో మనం పెట్టే ప్రతి పోస్ట్, ఫోటో లేదా కామెంట్ శాశ్వతంగా ఉండిపోతాయి. నేటి ఆధునిక సాంకేతికత (AI) సాయంతో పాత విషయాలను వెలికితీయడం చాలా సులభం. అందుకే ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించడం అవసరం. మన డిజిటల్ భద్రత , వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి "పోస్ట్ చేసే ముందే ఆలోచించండి" అనే హెచ్చరికను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

సంసద్ మార్చ్ పీస్ ఫుల్ - షబానా అజ్మీ
News· 20 Jul 2026

సంసద్ మార్చ్ పీస్ ఫుల్ - షబానా అజ్మీ

సంసద్ మార్చ్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు లేరన్న మీడియా ప్రశ్నలకు నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మీ మండి పడ్డారు. వై ఓన్లీ సెలబ్రిటీస్. ఇండస్ట్రియలిస్టులు ఒక్కళ్లు రాలేదు. అదెందుకు అడగరు? అని ఎదురు ప్రశ్నించారు. స్టూడెంట్స్ డిమాండ్స్ ను సపోర్ట్ చేయాల్సింది పోయి పక్క దారి పట్టించకండి అంటూ ఫైర్ అయ్యారు. సమస్యను అడ్రస్ చేయమని తాను, తన భర్త ప్రధానికి లేఖ రాశామని నాలుగు రోజుల్లో రిప్లయ్ వస్తుందని చెప్పారని కానీ ఏం రాలేదని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్టూడెంట్స్ తో చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని షబానా కోరారు.

సినిమాల్లోకి పివి సింధూ?- జక్కన్నను ఛాన్స్ కోరిన స్టార్ షట్లర్
News· 20 Jul 2026

సినిమాల్లోకి పివి సింధూ?- జక్కన్నను ఛాన్స్ కోరిన స్టార్ షట్లర్

మీరు తీసే ఏమూవీలోనైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ రోల్ ఏదైనా ఉంటే యాక్ట్ చేయడానికి సిద్ధమంటూ స్టార్ షట్లర్ పివి సింధూ దర్శక దిగ్గజం రాజమౌళికి రిప్లయ్ ఇచ్చారు. అంతకుముందు రాజమౌళి జపాన్ ఓపెన్ గెలిచిన్ ఫస్ట్ ఇండియన్ గా రికార్డు క్రియేట్ చేశావు. దేశం నిన్ను చూసి గర్వ పడుతోంది.మంచి కంబ్యాక్ ఇచ్చావంటూ సింధూని ఎక్స్ వేదికగా ప్రశంసలతో ముంచెత్తారు. దీనికి రిప్లయ్ ఇస్తూ సింధూ తన మనసులో కోరికను బయటపెట్టి ఓ రెండు ఫన్నీ ఎమెజీలు షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. వారణాసి మూవీ కోసం ఎదురు చూస్తున్నానని కూడా సింధూ మెసేజ్ చేసింది.

సింప్లిసిటీకి  బెస్ట్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి హోమ్ !
Cinema· 20 Jul 2026

సింప్లిసిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి హోమ్ !

రాబోయే భారీ బడ్జెట్ మూవీ 'రామాయణం'లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి, గ్లామర్ ప్రపంచానికి దూరంగా కోయంబత్తూరులో నివసిస్తున్నారు. సుమారు 8 కోట్ల విలువైన ఈ మల్టీ స్టోరీడ్ ఇల్లు మోడ్రన్ హంగులతో కాకుండా పూర్తి ట్రెడిషనల్ పద్ధతిలో కట్టారు., ఇందులో చేతితో చెక్కిన చెక్క ఊయల (Oonjal), టేకువుడ్ సోఫాలు, ప్రశాంతమైన పూజా గది ఉన్నాయి. పచ్చని మొక్కలతో కూడిన విశాలమైన బాల్కనీలు ప్రకృతికి దగ్గరగా ఉంటాయి.ఇక బెడ్ రూమ్స్ అయితే చెప్పనక్కరలేదు. అంత డీసెంట్ గా ఉన్నాయి. ఈ ఇల్లు ఆమె సింపుల్, సెన్సిటివ్ జీవన శైలికి అద్దం పడుతోంది.

తండ్రిని ఇనప రాడ్ తో కొట్టి చంపిన కొడుకు !
Crime· 20 Jul 2026

తండ్రిని ఇనప రాడ్ తో కొట్టి చంపిన కొడుకు !

బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన తండ్రిని ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు. తండ్రీ, కొడుకులిద్దరూ వేర్వేరు అపార్టుమెంటుల్లో వాచ్ మన్లుగా పనిచేస్తున్నారు. తండ్రి చంద్ర కొత్త జాబ్ వెతుక్కుంటూ కొడుకు చేరిన అపార్టుమెంటుకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి.కోపం పట్టలేక కొడుకు ద్రోణ తండ్రిని ఇనుప రాడ్ తో కొట్టాడు. ఆ ముసలి తండ్రి ప్రాణం అక్కడే పోయింది. సమాచారం అందుకున్న లోకల్ పోలీస్ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీక్రెట్ గా   ఐదు కీలక వ్యవస్థలను డెవలప్ చేసుకుంటున్న చైనా
World· 20 Jul 2026

సీక్రెట్ గా ఐదు కీలక వ్యవస్థలను డెవలప్ చేసుకుంటున్న చైనా

చైనా తన నౌకాదళాన్ని, ముఖ్యంగా విమాన వాహక నౌకల (ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్) సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. కేవలం యుద్ధ నౌకలనే కాకుండా, వాటికి మద్దతుగా ఐదు కీలక భాగాల (5-Piece Set) వ్యూహాత్మక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇందులో అత్యాధునిక జెట్ విమానాలు, నిఘా వ్యవస్థలు ఉన్నాయి. ఈ స్పీడ్ తో సైనిక విస్తరణ ఇండియన్ ఓషన్ లో భారత్‌కు భద్రతాపరమైన సవాళ్లను విసురుతోంది. ఇదిఇండియన్ డిఫెన్స్ సెక్టర్ తక్షణమే అలెర్ట్ అవ్వాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

సెషన్స్ తొలిరోజే రాహుల్ పై మోడీ సెటైర్
Science· 20 Jul 2026

సెషన్స్ తొలిరోజే రాహుల్ పై మోడీ సెటైర్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్ వేశారు. శనివారం కక్ష్యలోకి చేరి రికార్డు సృష్టించిన విక్రమ్-1 ప్రైవేట్ రాకెట్ (స్కైరూట్ ఏరోస్పేస్) బృందం సగటు వయసు 28 ఏళ్లేనని మోదీ ప్రశంసించారు. తాను దేశంలో తిరుగుతున్న కొందరు "56 ఏళ్ల యువకుల" గురించి మాట్లాడటం లేదని, నిజమైన యంగ్ సైంటిస్టుల ప్రతిభను మెచ్చుకుంటున్నానని అనడంతో సభలో నవ్వులు పూశాయి.

డిమాండ్లు నెరవేరే వరకూ దీక్ష కొనసాగుతుంది- సోనమ్ వాంగ్చుక్
News· 20 Jul 2026

డిమాండ్లు నెరవేరే వరకూ దీక్ష కొనసాగుతుంది- సోనమ్ వాంగ్చుక్

కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకుల మధ్య చర్చలు విజయవంతం కావడంతో, ఆందోళనలను విరమించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అయితే, లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మాత్రం తన డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనలపై లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగం సరికాదని రాహుల్ గాంధీ విమర్శించగా, ఈ నిరసనలపై నిఘా ఉంచడంపై ఢిల్లీ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.