మత్తుమందు ఇచ్చి అత్యాచారం

AP: విజయవాడ సీతారాంపురానికి చెందిన ఓ యువతి(23) ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దేవినగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యాడు. తాను జిమ్ ట్రైనర్‌నని, లావు తగ్గించి సన్నబడేలా చేస్తానని నమ్మించాడు. సత్యనారాయణపురంలోని రాక్ ఫిట్‌నెస్ వరల్డ్ జిమ్‌కు రమ్మని చెప్పాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు కాజేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



