Latest

సింప్లిసిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి హోమ్ !
రాబోయే భారీ బడ్జెట్ మూవీ 'రామాయణం'లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి, గ్లామర్ ప్రపంచానికి దూరంగా కోయంబత్తూరులో నివసిస్తున్నారు. సుమారు 8 కోట్ల విలువైన ఈ మల్టీ స్టోరీడ్ ఇల్లు మోడ్రన్ హంగులతో కాకుండా పూర్తి ట్రెడిషనల్ పద్ధతిలో కట్టారు., ఇందులో చేతితో చెక్కిన చెక్క ఊయల (Oonjal), టేకువుడ్ సోఫాలు, ప్రశాంతమైన పూజా గది ఉన్నాయి. పచ్చని మొక్కలతో కూడిన విశాలమైన బాల్కనీలు ప్రకృతికి దగ్గరగా ఉంటాయి.ఇక బెడ్ రూమ్స్ అయితే చెప్పనక్కరలేదు. అంత డీసెంట్ గా ఉన్నాయి. ఈ ఇల్లు ఆమె సింపుల్, సెన్సిటివ్ జీవన శైలికి అద్దం పడుతోంది.

తండ్రిని ఇనప రాడ్ తో కొట్టి చంపిన కొడుకు !
బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన తండ్రిని ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు. తండ్రీ, కొడుకులిద్దరూ వేర్వేరు అపార్టుమెంటుల్లో వాచ్ మన్లుగా పనిచేస్తున్నారు. తండ్రి చంద్ర కొత్త జాబ్ వెతుక్కుంటూ కొడుకు చేరిన అపార్టుమెంటుకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి.కోపం పట్టలేక కొడుకు ద్రోణ తండ్రిని ఇనుప రాడ్ తో కొట్టాడు. ఆ ముసలి తండ్రి ప్రాణం అక్కడే పోయింది. సమాచారం అందుకున్న లోకల్ పోలీస్ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీక్రెట్ గా ఐదు కీలక వ్యవస్థలను డెవలప్ చేసుకుంటున్న చైనా
చైనా తన నౌకాదళాన్ని, ముఖ్యంగా విమాన వాహక నౌకల (ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్) సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. కేవలం యుద్ధ నౌకలనే కాకుండా, వాటికి మద్దతుగా ఐదు కీలక భాగాల (5-Piece Set) వ్యూహాత్మక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇందులో అత్యాధునిక జెట్ విమానాలు, నిఘా వ్యవస్థలు ఉన్నాయి. ఈ స్పీడ్ తో సైనిక విస్తరణ ఇండియన్ ఓషన్ లో భారత్‌కు భద్రతాపరమైన సవాళ్లను విసురుతోంది. ఇదిఇండియన్ డిఫెన్స్ సెక్టర్ తక్షణమే అలెర్ట్ అవ్వాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

సెషన్స్ తొలిరోజే రాహుల్ పై మోడీ సెటైర్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్ వేశారు. శనివారం కక్ష్యలోకి చేరి రికార్డు సృష్టించిన విక్రమ్-1 ప్రైవేట్ రాకెట్ (స్కైరూట్ ఏరోస్పేస్) బృందం సగటు వయసు 28 ఏళ్లేనని మోదీ ప్రశంసించారు. తాను దేశంలో తిరుగుతున్న కొందరు "56 ఏళ్ల యువకుల" గురించి మాట్లాడటం లేదని, నిజమైన యంగ్ సైంటిస్టుల ప్రతిభను మెచ్చుకుంటున్నానని అనడంతో సభలో నవ్వులు పూశాయి.

డిమాండ్లు నెరవేరే వరకూ దీక్ష కొనసాగుతుంది- సోనమ్ వాంగ్చుక్
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకుల మధ్య చర్చలు విజయవంతం కావడంతో, ఆందోళనలను విరమించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అయితే, లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మాత్రం తన డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనలపై లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగం సరికాదని రాహుల్ గాంధీ విమర్శించగా, ఈ నిరసనలపై నిఘా ఉంచడంపై ఢిల్లీ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.

ఇకపై అయోధ్య విరాళాల లెక్కించేది SBI
అయోధ్య రామమందిర హుండీ నిధుల చోరీ వెలుగులోకి వచ్చాక విరాళాల లెక్కింపు బాధ్యతల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టింది. ఇంత కాలం రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ హుండీ విరాళాలు లెక్కించేది. భారీగా నిధులు చోరీ సిట్ 8 మందిని అరెస్ట్ చెయ్యడం తర్వాత హుండీ హుండీ మేనేజ్మెంట్ బాధ్యతను SBIకి అప్పగించారు. దీనిపైన ప్రకటన చేసిన ట్రస్ట్.. ఆలయ రద్దీ పెరగడం వల్ల హుండీలు త్వరగా నిండిపోతున్నాయి రోజూ 12 గంటలు, 2 షిఫ్టుల్లో కౌంటింగ్ జరుగుతోంది, SBI కౌంట్ చేసి టెంపుల్ ఖాతాలో డిపాజిట్ చేస్తోంది అని ప్రకటించింది.

ఏపీ జిల్లాలకు వర్షం హెచ్చరిక
AP: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రేపు(మంగళశారం) వర్షాలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల మార్పు వల్ల తీరప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు పిడుగుల సమయంలో చెట్లు, కరెంట్ స్తంభాల కింద నిలబడకూడదని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.

నిరసనలు విరమించి సహకరించండి: జేపీ నడ్డా
ప్రభుత్వంతో చర్చలు జరపాలని సీజేపీ నిరసనకారుల నుంచి ఈరోజు ఉదయం తనకు ప్రతిపాదన వచ్చిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఉదయం 11:50 గంటల నుంచి సీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వారితో ప్రాథమికంగా వివరంగా మౌఖిక చర్చ జరిపి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు తనకు లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారని వెల్లడించారు. నిరసనకారులందరూ తమ ధర్నాను విరమించి, పరిపాలనా యంత్రాంగానికి సహకరించాలని అభ్యర్థించారు.

గ్లాసులో నీటితో కరెంట్ తయారు చేసుకోవచ్చా?
గ్లాసులోని నీటితో మన ఇంట్లోకి కావాల్సిన కరెంట్ తయారు చేసుకోవచ్చా? అసాధ్యం అంటారా? భారత సంతతికి చెందిన ఒక శాస్త్రవేత్త ఇదంతా సాధ్యమేనని అంటున్నారు. తన ప్రయోగాలు గనుక ఆశించిన ఫలితాన్ని ఇస్తే అనంతమైన విద్యుత్తు మన సొంతమవుతుందని అంటున్నారు. ఆయన పేరు యోగేంద్ర నారాయణ్ శ్రీవాత్సవ. తన సిద్ధాంతాన్ని రుజువు చేసేందుకు సొంత ఖర్చులతో ప్రయోగాలకు కూడా ఆయన సిద్ధం అవుతున్నారు.
డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు
దేశంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ రూ.5.6 లక్షల కోట్ల ఖర్చుతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. వీటి వల్ల సౌండ్ పొల్యూషన్, వాటర్, కరెంట్ కొరత ఏర్పడుతుందని మహారాష్ట్రలో స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పర్యావరణానికి ముప్పు ఉందంటూ నిరసనలు తెలుపుతున్నారు.

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం?
దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా దూరం కానుందా? చిన్నతనంలోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, ఆన్‌లైన్ నేరాల బారిన పడటం వంటి దుష్ప్రభావాలను లోనవుతున్నారు. దీన్ని అరికట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో అమలు చేస్తున్న ఏజ్ లిమిట్ రూల్‌ను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం కింద తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.

మాతా–శిశు సంక్షేమానికి కొత్త అడుగు
AP: మాతా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు రవాణా సేవల్ని అందించేందుకు 'తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సీఎం చంద్రబాబునాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ వీరపాండ్యన్, ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు పాల్గొన్నారు.

కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. తరువాత ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. రాత్రి కొడంగల్‌లో బస చేసి మరుసటి రోజు (22న) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
బాన్సువాడ బాలింతలను నిమ్స్‌లో పరామర్శించిన హరీశ్ రావు
TG: బాన్సువాడ మాతా శిశు హాస్పిటల్లో బాలింతలకు చేసిన ఆపరేషన్ ఫెయిలవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు సోమవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి బాలింతలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.
దిల్లీ నిరసనలో యువతి కన్నీళ్లు
‘చలో సంసద్' మార్చ్ సందర్భంగా దిల్లీ పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. లాఠీఛార్జ్ చేయడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ‘నిరసన తెలుపుతున్న విద్యార్థుల స్థానంలో మీ బిడ్డలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని’ ఓ యువతి కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను వేడుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరీక్ష పేపర్ లీకేజీలపై పోరాడుతున్న తమపై పోలీసులు ఇలా దాడి చేయడం దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి 10 మందిలో 9 మందికి రక్తంలో కొవ్వు సమస్య: ICMR
భారతీయుల ఆరోగ్యంపై 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్-ఇండియా డయాబెటిస్' చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశంలో ప్రతి 10 మంది పెద్దవారిలో తొమ్మిది మంది 'డైస్లిపిడెమియా'(రక్తంలో కొవ్వుల అసాధారణ నిష్పత్తి) సమస్యతో బాధపడుతున్నారని తెలిపింది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం, మంచి కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ సమస్య సిటీలో 89%, గ్రామీణ ప్రాంతాల్లో 86.5% విస్తరించి ఉందని, పురుషుల కంటే మహిళల్లోనే దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
సీజేపీ నిరసనలో పోలీసులపై యువతి ఆగ్రహం
సీజేపీ నిరసన సందర్భంగా తమపై భౌతిక దాడి సరైంది కాదని ఒక యువతి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిరసనకు విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరించడం దారుణమని ధ్వజమెత్తింది. తమ మీద చెయ్యి వేసే హక్కు లేదంటూ పోలీసులపై విరుచుకుపడింది. పక్కనున్న తోటి నిరసనకారి ఆ యువతిని ఆపే ప్రయత్నం చేసింది.
ప్రభుత్వం నిద్రపోతోందా..యువతి సూటి ప్రశ్న
‘మా నాన్న, మా ఊరిలోని మనుషులంతా బీజేపీ వాళ్లు. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ బీజేపీ నేతలే. మా ఇంట్లో అందరితో యుద్ధం చేయాల్సి వస్తోంది. యూపీ..ఆగ్రా నుంచి పారిపోయి రావాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? పడుకుంటోందా?’ అంటూ ఓ యువతి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ అవకతవకలకు నిరసనగా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో మాస్క్ వేసుకుంది పాల్గొంది. ప్రభుత్వం నిద్రపోతోందా అని ఆక్రోశించింది.
రైల్వే టీసీ అవతారంలో యువతిపై వేధింపులు
బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ నుండి ఛప్రా వెళ్తున్న ఒంటరి యువతిని రైల్వే టీసీ పేరుతో ఒక వ్యక్తి వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వాష్‌రూమ్ వైపు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు పోలీసులకు చెప్పగా, పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకోకుండా వదిలేశారు. నిందితుడిపై నిర్లక్ష్యం వహించిన రైల్వే పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.

తండ్రి బాటలోనే సోనమ్ వాంగ్చుక్
లడాఖ్‌కు ఎస్టీ హోదా సాధించడం కోసం 1984లో సోనమ్ వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ ఐదు రోజులు నిరాహార దీక్ష చేశారు. ఉద్యమం పెద్దది కావడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా లేహ్‌కు వచ్చి ఆయనకు జ్యూస్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఎస్టీ హోదా ఇస్తామని ఇచ్చిన హామీని 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. తండ్రి బాటలోనే ప్రస్తుతం సోనమ్ వాంగ్చుక్ కూడా ప్రస్తుతం అదే రీతిలో సీజేపీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
సమస్యలను లేవనెత్తడానికి కాకపోతే పార్లమెంట్ దేనికోసం?
సీజేపీ నిరసనపై కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ స్పందించారు. అహింసాత్మక నిరసన జరుగుతుండగా లాఠీ చార్జ్ చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. లాఠీ చార్జ్ హింసాత్మక చర్య అని, దీని వెనుక కారణమేంటో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు తమ ఆందోళనలను వ్యక్తం చేసే స్థలం కావాలని, కనీసం పార్లమెంట్ అందుకు అవకాశం ఇవ్వాలన్నారు. పార్లమెంట్ ఈ సమస్యలను లేవనెత్తడానికి కాకపోతే మరి దేనికోసం అని ప్రశ్నించారు.