Latest

దేశంలోనే వైజాగ్ టాప్ ప్లేస్
AP: విశాఖపట్నం దేశంలోనే శ్రామికశక్తికి ప్రధాన కేంద్రంగా నిలిచిందని కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైయింది. ఈ నగరంలో ఉన్న జనాభాలో 52.8% మంది శ్రామికశక్తే. ఏదో ఒక పనిచేస్తున్న వారే. దేశవ్యాప్త సగటు (49.8%)తో పోలిస్తే విశాఖలోనే పని చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నగరంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్న జనాభా కూడా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల సగటుతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. విశాఖలో 56.2% మంది పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ క్యాజువల్ లేబర్ రోజువారీ వేతనం రూ.733 జాతీయ పట్టణ సగటు (రూ.624) కంటే ఎక్కువ.

భారీ ఖనిజ సంపద గుర్తింపు
AP: రాష్ట్రవ్యాప్తంగా 62,030 చదరపు కిలోమీటర్ల పరిధిలో మినరల్ మ్యాపింగ్ చేసినట్లు CM చంద్రబాబుకు గనుల శాఖ నివేదించింది. ఇందులో విలువైన 125 ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నాయని వివరించింది. ఈ నివేదికపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మినరల్ మ్యాపింగ్‌పై CMకు ఆ శాఖ నివేదిక సమర్పించింది. దీనిప్రకారం క్రిటికల్, స్ట్రాటజిక్ మినరల్స్‌కు సంబంధించి 48, అధికవిలువ కలిగిన బల్క్ మినరల్స్‌కు సంబంధించి 47, మరో 30 అతివిలువైన ఖనిజాలు లభ్యమయ్యే మినరల్ పొటెన్షియల్ ఏరియాలు ఉన్నాయి.

యువతకు రాష్ట్రపతి స్ట్రాంగ్ మెసేజ్
AP: గ్రామీణ ప్రజలు సులభంగా పనిచేసుకుని, ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారి జీవనోపాధుల మెరుగుదలకు యూనివర్సిటీలు వినూత్న ఆలోచనలు చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజన వర్సిటీలు ఆ ప్రాంత ప్రజల సాధికారతకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు.
దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?
YCP MLC దువ్వాడ శ్రీనివాస్ సడన్‌గా కనిపించకుండా పోవడం AP పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్ కేసుకు సంబంధించి, విచారణ కోసం ఆయన కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. కానీ మార్గమధ్యలోనే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయింది. పోలీసులు పక్కా ప్లాన్‌తో ఆయన్ను అరెస్ట్ చేశారని దివ్వెల మాధురి ఆరోపిస్తుంటే. ఆయన అసలు PSకే రాలేదని, ఈ మ్యాటర్‌తో మాకు ఎలాంటి కనెక్షన్ లేదని పోలీసులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ మిస్సింగ్ మిస్టరీ సస్పెన్స్‌గా మారింది.

బిడ్డ చనిపోయినా దేశం కోసం ఆడాడు!
ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఒక సాడ్ అండ్ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ జరిగింది. నెదర్లాండ్స్ ఫుట్‌బాలర్ కూడీ హాక్పో పుట్టబోయే బిడ్డ మ్యాచ్‌కి మూడు రోజుల ముందే చనిపోయింది. ఆ పుట్టెడు దుఃఖంలోనూ మేనేజ్‌మెంట్ లీవ్స్ ఇస్తానన్నా వద్దు అనుకుని, దేశం కోసం మొరాకోతో జరిగిన నాకౌట్ మ్యాచ్ ఆడాడు. మ్యాచ్‌లో తను గోల్ కొట్టాక సెలబ్రేట్ చేసుకోకుండా మైదానంలోనే ఏడ్చేశాడు. ఇది చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఓడిపోయింది.

డెలివరీ బాయ్ వివాదంపై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో వీడియో!
డెలివరీ బాయ్‌తో జరిగిన గొడవపై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చారు. అడ్రస్ మారి పక్కింటి పార్సిల్ తన ఇంటికి వచ్చిందని, దాన్ని తన అమ్మ ఓపెన్ చేసిందని చెప్పారు. అయితే ఆ డెలివరీ బాయ్ తాగి వచ్చి వాళ్ళ అమ్మను ‘ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అని తిట్టడంతోనే తనకు కోపం వచ్చిందన్నారు. ఎదురింటి వాళ్లు తప్పుడు అడ్రస్ పెట్టడం వల్లే ఈ కన్ఫ్యూజన్ జరిగిందని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ తప్పు అని చెప్తూ అఖిల్ క్లారిటీ ఇచ్చారు.
రైతు బంధు ఫండ్స్ రిలీజ్!
CM రేవంత్ రెడ్డి వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు బంధు ఫండ్స్‌ను రిలీజ్ చేశారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెన్స్‌ను ప్రభుత్వం దశల వారీగా అకౌంట్లలో డిపాజిట్ చేయనుంది. ఫస్ట్ ఫేజ్ కింద 2 ఎకరాల లోపు భూమి ఉన్న సుమారు 41.37 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల అకౌంట్లలోకి ఈ రోజే రూ.6,000 క్రెడిట్ అయ్యాయి. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే మనీ ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు.

బండి సంజయ్‌పై కేసు కొట్టివేసిన నాంపల్లి కోర్టు!
బండి సంజయ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అప్పటి అధికార BRS పార్టీ ఓటుకు రూ.25 వేలు ఇస్తోందంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యాయి. దీనిపై హుజూరాబాద్ పోలీసులు బండి సంజయ్‌పై పలు IPC సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు, తాజాగా ఆయనపై ఉన్న ఆ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

థర్మల్ పవర్ యూనిట్‌ను మూసేసిన తెలంగాణ ప్రభుత్వం
TG: రాష్ట్రంలో బొగ్గు కొరత నేపథ్యంలో జెన్‌కో సన్సెషనల్ డిసిషన్ తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో రెండు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను మూసివేసింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)లో ఒక యూనిట్, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్(KTPS)లో మరో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా రెండు యూనిట్లను మూసివేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. సింగరేణి నుంచి జెన్‌కో యూనిట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోవడమే ఇందుకు కారణం. అయితే బొగ్గు సరఫరాకు సంబంధించి చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతోనే సింగరేణి సంస్థ సరఫరాను తగ్గించింది.
తుంగభద్ర నదిలో ఊహించని విషాదం!
కర్నూల్ కలెక్టరేట్ దగ్గర జరిగిన పౌర్ణమి వేడుకల్లో ఒక శాడ్ ఇన్సిడెంట్ జరిగింది. సురేష్ అనే రైతు తన ఎద్దులను తుంగభద్ర నదిలో స్నానం చేయిస్తుండగా, ఊహించని విధంగా ఆ రెండు ఎద్దులు నీటిలో మునిగిపోయాయి. కళ్లముందే ప్రాణం లాంటి ఎద్దులు చనిపోవడంతో ఆ రైతు ఫ్యామిలీ కన్నీరుమున్నీరైంది. వారి ఏడుపు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. దీనికి సంబంధించిన హార్ట్ బ్రేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జైపూర్‌లో భారీ ఎగ్జామ్ స్కామ్.. నలుగురు అరెస్ట్!
రాజస్థాన్ జైపూర్‌లో మరో ఎగ్జామ్ స్కామ్ బయటపడింది. పారామెడికల్ డిప్లొమా పరీక్షలో కాపీయింగ్ కొట్టించడానికి ఒక ముఠా పక్కా ప్లాన్ వేసింది. ఇన్విజిలేటర్ల హెల్ప్‌తో స్టూడెంట్స్‌ని పాస్ చేయించేందుకు కాలేజీ అడ్మినిస్ట్రేటర్ గ్యాంగ్ ట్రై చేసింది. దీనికోసం స్టూడెంట్స్ నుండి లక్షల్లో డబ్బులు కూడా వసూలు చేశారు. అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే పోలీసులు ఎంట్రీ ఇచ్చి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ భారీ మాస్ కాపీయింగ్ కుట్ర ఫెయిల్ అయింది.
హాస్పిటల్‌లో ఘోరం.. వైరల్ వీడియో!
రాయ్‌బరేలీలోని ఒక హాస్పిటల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓ మెంటల్లీ డిస్టర్బ్డ్ పర్సన్ ఫ్లోర్‌పై పడుకుని ఉంటే, అక్కడి ఫీమేల్ వార్డ్ ఇన్‌చార్జ్ తన కాళ్లతో అతని ముఖం, ఛాతీపై దారుణంగా తన్నింది. పైగా బూతులు తిడుతూ అవమానించింది. పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఉన్నా ఆపకుండా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాడు. ఈ దారుణమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "ఆ ఇన్‌ఛార్జ్‌ని వెంటనే సస్పెండ్ చేయాలి" అంటూ నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

పొలిటికల్ ఎంట్రీ రూమర్స్‌కి ఎండ్ కార్డ్: రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీ రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టారు. తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం బై-ఎలక్షన్ రేస్‌లో తాను లేనని క్లియర్ చేశారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని మీడియాకు వివరించారు. ప్రజెంట్ తన ఫోకస్ మొత్తం సోషల్ సర్వీస్, బ్యాక్ టు బ్యాక్ సినిమా ప్రాజెక్ట్స్‌పైనే ఉందని లారెన్స్ స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పొలిటికల్ సస్పెన్స్‌కి ఎండ్ కార్డ్ పడింది!

బంగారం దొరికిన పొలంపై కొత్త ట్విస్ట్
TG: వరంగల్ జిల్లా కోపాకులపాడులోని వ్యవసాయ భూమిలో బంగారు నగలు దొరకడం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఓ వ్యక్తి, కోపాకులపాడుకి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమిని ఈర్యతండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నాడు. గతంలో ఇక్కడ గుప్తనిధులు లభ్యమైనట్లు స్థానికులు చెపుతున్నారు. గతంలో ఈ భూమిని విక్రయించిన పాత యజమాని కుమారుడు PSలో ఫిర్యాదు చేశారు. తమ తాతలకాలం నాటి భూమిలో దొరికిన బంగారాన్ని తమకు అప్పగించాలని కోరారు. ప్రస్తుత యజమాని కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.

అత్తమామల స్కెచ్‌కి ప్రేమ జంట బలి!
రంగారెడ్డి జిల్లా జనవాడలో ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలసాయి, పద్మ దంపతులు అత్తమామల మోసానికి బలయ్యారు. ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ నమ్మించిన అత్తమామలు, పూజల కోసం బాలసాయి చేత ₹10 లక్షలు అప్పు చేయించారు. తీరా తవ్వితే ఏమీ దొరకలేదు. అప్పు ఇచ్చిన వారి ప్రెషర్ తట్టుకోలేక, మోసపోయామని గ్రహించిన ఈ జంట ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఐదు నెలల చిన్నారి అనాథగా మిగిలింది. బాలసాయి ఫోన్ మెసేజ్ ఆధారంగా పోలీసులు అత్తమామలను, బావను అరెస్ట్ చేశారు.

వాట్సాప్‌లో క్రేజీ అప్‌డేట్.. ఇక ఫోన్ నంబర్ దాచేయొచ్చు!
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' యూజర్ల ప్రైవసీ కోసం సూపర్ ఫీచర్ తెచ్చింది. ఇకపై కొత్తవారితో చాట్ చేయడానికి మీ ఫోన్ నంబర్ అక్కర్లేదు, జస్ట్ 'యూజర్‌నేమ్' ఉంటే చాలు. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో 3-35 అక్షరాల లోపు యూనిక్ యూజర్‌నేమ్ సెట్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోసం 'యూజర్‌నేమ్ కీ' కూడా ఉంటుంది. ప్రస్తుతానికి కొందరికే వచ్చిన ఈ ఫీచర్, త్వరలోనే అందరికీ రానుంది. మీ యాప్ అప్‌డేట్ చేసి చెక్ చేసుకోండి.

ఈరోజే రైతుల అకౌంట్లలోకి డబ్బులు!
తెలంగాణ రైతులకు నేటి నుంచే 'రైతు భరోసా' నిధులు విడుదల కానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా 2 ఎకరాల లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు రూ. 2,482 కోట్ల నిధులను నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు. మిగిలిన రైతులకు విడతల వారీగా ఈ అమౌంట్ అందుతుంది.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను నిర్వీర్యం చేయొద్దని BC సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. మంగళవారం జాతీయ BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త కళాశాలల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే విధానాలను వెనక్కి తీసుకోవాలన్నారు.

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ సీరియస్!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. అయితే, ఈ పోరాటం లో ఒక ఆందోళనకరమైన విషయం వెలుగుచూసింది. దీక్ష కారణంగా ఆయన షుగర్ లెవెల్స్ సాధారణం కంటే తక్కువగా (66 కి) పడిపోయాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ఆయన తన పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

రాఘవ లారెన్స్ ఏం చెప్పబోతున్నారు?
కొరియోగ్రాఫర్, హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన సోషల్ మీడియాలో ఒక సంచలన ట్వీట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలకు రెండు ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడబోతున్నట్లు అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్ వివాదంతో పాటు, తిరుచ్చి ఎలక్షన్ల గురించిన రూమర్స్‌పై ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. దీంతో లారెన్స్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారా లేదా అనే దానిపై అందరిలోనూ విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.

మద్యంమత్తులో డ్రైవర్ బీభత్సం.. కొడుకు ముందే తల్లి స్పాట్‌డెడ్
TG: మేడ్చల్ జిల్లా దుండిగల్ PS పరిధిలోని బహుదూర్‌పల్లి మెయిన్ రోడ్‌పై మద్యంమత్తులో బొలెరో డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. బైక్‌పై వెళ్తున్న తల్లీకొడుకును బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లతారెడ్డి(49) స్పాట్‌లోనే మృతిచెందగా.. కొడుకు వేదాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వేదాంత్‌ను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అలాగే లతారెడ్డి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.